
హనుమాన్ మూవీతో తెలుగు ప్రేక్షకుల్లో చోటు సంపాదించుకున్న కోలీవుడ్ బ్యూటీ వరలక్ష్మీ శరత్‌కుమార్. టాలీవుడ్‌లో బాలయ్య మూవీ వీరసింహారెడ్డిలోనూ తనదైన నటనతో మెప్పించింది.

ప్రస్తుతం కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఈ నెల 5న ఆమె పుట్టినరోజు కావడంతో తన గొప్ప మనసును చాటుకున్నారు.

వరలక్ష్మి తన బర్త్ డే సందర్భంగా అనాథ చిన్నారుల్లో సంతోషం నింపారు. హైదరాబాద్‌లోని లెప్రా సోసైటీ అనాథాశ్రమానికి వెళ్లిన వరలక్ష్మీ తన భర్త నికోలయ్ సచ్‌దేవ్‌తో పాటు పుట్టిన రోజు వేడుకలు చేసుకుంది.

ఈ సందర్భంగా చిన్నారులకు బహుమతులు అందించారు

అంతేకాకుండా ఆశ్రమానికి తనవంతుగా ఆర్థికసాయం అందజేశారు. సెలబ్రిటీలు వస్తే అనాథాశ్రమం గురించి ప్రజలకు తెలుస్తుందనే మంచి ఉద్దేశంతోనే వచ్చానని వరలక్ష్మీ శరత్‌కుమార్ అన్నారు.











