birthday celebratations
-
దేశ, విదేశాల్లో ఘనంగా జగనన్న జన్మదిన వేడుకలు..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం దేశ, విదేశాల్లో ఘనంగా జరిగాయి. పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు. అమెరికా నార్త్ కరోలినా, సెయింట్ లూయిస్, కెనడా, ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్, బ్రిస్బేన్, సిడ్నీ, ఖతార్‌లోని దోహా, కువైట్, న్యూజిలాండ్ దేశాల్లో అభిమానులు కేక్‌లు కట్ చేసి, సామాజిక మాధ్యమాల్లో ఫొటోలను షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. కాగా, వైఎస్ జగన్ పుట్టిన రోజును పురస్కరించుకొని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విటర్)లో ‘హ్యాపీ బర్త్‌డే వైఎస్ జగన్’ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో రికార్డు సృష్టించింది. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్ డే వేడుకలు ఆస్ట్రేలియాలోని ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు.. సిడ్నీ మెల్బోర్న్ బ్రిస్బేన్ లలో జరిగిన కార్యక్రమాల్లో ఆయా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్నారైలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..ఈ సందర్భంగా పలువురు… pic.twitter.com/AKWOid47tq— Jagananna Connects (@JaganannaCNCTS) December 20, 2024దోహా ఖతార్ లో ఎన్నారైలు పెద్ద ఎత్తున పాల్గొని మన ప్రియతమ నేత మాజీ ముఖ్య మంత్రివర్యులు శ్రీ @ysjagan గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.#HBDYSJagan #YSJaganMohanReddy #JaganannaConnects pic.twitter.com/LA3niEnfUC— Jagananna Connects (@JaganannaCNCTS) December 20, 2024ఆస్ట్రేలియాలోని , సిడ్నీలో మన ప్రియతమ నేత శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించిన ఎన్నారైలు..ఈ సందర్భంగా వారు జగనన్న చేసిన గొప్ప కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు.#HBDYSJagan #YSJaganMohanReddy #JaganannaConnects pic.twitter.com/yPskG9grXo— Jagananna Connects (@JaganannaCNCTS) December 20, 2024అమెరికాలోని చార్లోట్టే, నార్త్ కారోలినలో తెలుగు ఎన్నారైలు, కేక్ కట్ చేసి జగనన్న పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ మాజీ సలహా దారులు శ్రీ పొతిరెడ్డి నాగార్జున రెడ్డి హాజరయ్యారు.… pic.twitter.com/mJbMzMvTt0— Jagananna Connects (@JaganannaCNCTS) December 21, 2024అమెరికాలోని సెయింట్ లూయిస్ లో జగనన్న పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన @YSRCParty నాయకులు మరియు అభిమానులు.ఈ కార్యక్రమానికి జూమ్ ద్వారా తమ సందేశాలను పంచుకున్న వైస్సార్సీపీ ఎంపీ @MithunReddyYSRC గారు, మాజీ మంత్రి @AmbatiRambabu గారు .#HBDYSJagan #YSJagan… pic.twitter.com/kLutnIxDjW— Jagananna Connects (@JaganannaCNCTS) December 21, 2024ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో జరిగిన జగనన్న పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన వైఎస్సార్సీపీ నాయకులు మరియు అభిమానులుఈ కార్యక్రమానికి జూమ్ ద్వారా తన సందేశాన్ని పంచుకున్న నంద్యాల మాజీ ఎమ్మెల్యే @SilpaRaviReddy గారు.#HBDYSJagan #YSJagan #JaganannaConnects pic.twitter.com/jyKNd7uJnN— Jagananna Connects (@JaganannaCNCTS) December 21, 2024డిసెంబర్ 20వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ఇండియా టాప్ ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం 24 గంటల్లో 18 గంటలకుపైగా టాప్ వన్ పొజిషన్లో నిలిచింది. ఎక్స్ వేదికగా వైఎస్ జగన్‌కు ఏకంగా 37 లక్షల మందికిపైగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘వైఎస్ జగన్మోహన్రెడ్డికి హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు. దేవుడు మీకు మంచి ఆరోగ్యం, సంతోషం, దీర్ఘాయుష్షు ఇవ్వాలి. ప్రజా సేవలో సుదీర్ఘకాలం ఉండాలి’ అంటూ ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. కెనడాలో జగనన్న పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన వైఎస్సార్సీపీ నాయకులు మరియు అభిమానులుఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అనేక మేలు చేసినటువంటి వైఎస్ జగన్ గారి వెంట ఎల్లవేళలా ఉంటామని, ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఆయన మార్గాన్ని విడువబోమని పునరుద్ఘాటించారు.#HBDYSJagan #YSJagan… pic.twitter.com/NDWJ3ykVqj— Jagananna Connects (@JaganannaCNCTS) December 21, 2024 -
జనరంజక పాలనకు కేరాఫ్ వైఎస్ జగన్
-
జిల్లాల వారీగా ఘనంగా YS జగన్ పుట్టినరోజు వేడుకలు
-
జగన్ జన్మదిన వేడుకలు నిర్వహిస్తే కఠిన చర్యలే!: కుప్పం పోలీసులు
సాక్షి, కుప్పం: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలపై చిత్తూరు జిల్లా కుప్పంలో పోలీసు శాఖ ఆంక్షలు విధించింది. కుప్పంలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకల నిర్వహణకు అనుమతివ్వాలంటూ వైఎస్సార్సీపీ నేతలు ముందస్తుగా పోలీసులకు వినతిపత్రం అందజేశారు.ఈ క్రమంలో.. వినతి పత్రంపై కుప్పం డీఎస్పీ అభ్యంతరం వ్యక్తంచేస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ భరత్ పీఏ మురుగేష్‌కు లేఖను అందజేశారు. సీఎం చంద్రబాబు భార్య భువనేశ్వరి ఈ నెల 19 నుంచి 22 వరకు కుప్పంలో పర్యటిస్తున్నారని, ఆ సమయంలో ప్రతిపక్ష పార్టీ సంబరాలు చేయకూడదని లేఖలో పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో వైఎస్ జగన్ జన్మదిన సంబరాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. -
ఆ 35 నిమిషాలు : సాధారణమా? రాజకీయమా?
సాక్షి, ముంబై: ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ జన్మదినోత్సవాలను ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు కార్యకర్తలు ఘనంగా జరుపు కున్నారు. పవార్ 85వ జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం ముంబైతోపాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు అనేక మంది ప్రముఖులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా జన్మదినోత్సవం రోజున శరద్ పవార్ ఢిల్లీలోనే ఉండటంతో ఎన్సీపీ నేతలు, కార్యకర్తలతోపాటు అనేక పార్టీల నేతలు ఢిల్లీలోని ఆయన నివాసంలో స్వయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్వయంగా కలిసి..శుభాకాంక్షలు శరద్ పవార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వెంట అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్, కుమారుడు పార్థ్ పవార్‌లతోపాటు ఎన్సీపీ (ఏపీ) సీనియర్ నేతలు ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్, సునీల్ తట్కరే తదితరులున్నారు. వీరందరూ పవార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సమయంలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే కూడా అక్కడే ఉన్నారు. ఎన్సీపీ రెండుపార్టీలుగా చీలిపోయిన తర్వాత శరద్ పవార్‌తో అజిత్‌పవార్ భేటీ కావడం ఇదే తొలిసారి. మంచి చెడులు మాత్రమే చర్చించాం: అజిత్‌పవార్ అజిత్ పవార్‌తోపాటు అనేక మంది ఎన్సీపీ (ఏపీ) సీనియర్ నేతలు శరద్ పవార్‌తో భేటీ కావడం అనేక చర్చలకు ఊతమిచ్చింది మళ్లీ వీరిద్దరూ ఒకటికానున్నారా అనే అంశంపై పెద్ద ఎత్తున ఊహాగానాలు కొనసాగుతున్నాయి. అయితే అలాంటిదేమిలేదని తమ కుటుంబ పెద్ద అయిన శరద్‌పవార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకే వెళ్లామని మంచిచెడులు, బాగోగుల గురించి మాత్రమే మాట్లాడుకున్నామని చెప్పారు. అయితే సుమారు 35 నిమిషాలపాటు అజిత్ పవార్, శరద్ పవార్ల మధ్య చర్చలు కొనసాగాయని, ఈ చర్చల్లో రాజకీయ అంశాలతోపాటు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కూడా చర్చలు జరిగి ఉండవచ్చని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా అయిదు దశాబ్దాలకుపైగా రాజకీయ అనుభవంతో రాజకీయ చాణక్యుడిగా గుర్తింపుపొందిన శరద్ పవార్ జీవిత విశేషాలను గురించి క్లుప్తంగా..... తల్లినుంచే రాజకీయ వారసత్వం పవార్, ఆయన కుటుంబీకులు రెండుతరాలుగా రాజకీయాల్లో కొన సాగుతున్నారు. ప్రస్తుతం మూడో తరం కూడా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ ప్రజాదరణతో రాజకీయాలను కొనసాగిస్తున్నారు. మొదటగా శరద్ పవార్ తల్లి శారదాబాయి పవార్ పుణే జిల్లా లోకల్బోర్డ్ సభ్యురాలుగా ఎన్నికవ్వడంతో పవార్ కుటుంబ రాజకీయ ప్రస్థానం ఆరంభమైంది. ఆ విధంగా తల్లి నుంచే శరద్‌పవార్‌కు రాజకీయ వారసత్వం లభించింది. అనంతరం ఇంతింతై అన్నట్లుగా పవార్ రాష్ట్రంతో పాటు దేశ రాజకీయాలలో కీలకపాత్ర పోషించే స్థాయికి ఎదిగారు. బారామతి ఎంపీగా ఏడు సార్లు...శరద్‌పవార్ బారామతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఏడుసార్లు విజయం సాధించారు. దీంతో ఆయనకు ఈ నియోజకవర్గం కంచుకోటలా మారింది. 1984 నుంచి 1991, 1995, 1997, 1998, 1999తో పాటు 2004లోనూ ఈ నియోజకవర్గంలో పవార్‌దే విజయం. దీంతో ఆయన ఈ లోక్‌సభ నియోజకవర్గానికి మకుటంలేని మహారాజుగా మారారు. కాగా 2009లో పవార్ తన కుమార్తై సుప్రియా సూలేను బారామతి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయించారు. ఆయన మాడా లోక్‌సభ సెగ్మెంట్ నుంచి పోటీచేసి విజయం సాధించారు. కేంద్రరాజకీయాల్లోకి... పవార్ 1991లో రాష్ట్ర రాజకీయాల నుంచి కేంద్ర రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇటు రాష్ట్ర రాజకీయాలలో కీలకపాత్ర పోషిస్తూనే అటు కేంద్రంలో ఒక్కో మెట్టు ఎక్కసాగారు. ఈ నేపథ్యంలో 1993లో మరోమారు ఆయన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి వరించింది. తదనంతరం 1995లో మరోసారి అసెంబ్లీలో ప్రతిపక్షనాయకుని పాత్రను పోషించారు. ఆ తరువాత కేంద్రరాజకీయాలలో చురుకుగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. 1998 మార్చి 22న లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుని పాత్ర పోషించే అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో మరోసారి కాంగ్రెస్‌పై తిరుగుబాటు ప్రకటించి 1999 మే 20న పార్టీని వీడారు. నెలరోజుల్లోనే 1999 జూన్‌లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని స్థాపించారు. అనంతరం 1999 అక్టోబరు ఏడవ తేదీన మరోసారి ఎంపీగా విజయం సాధించారు. 2004 ఎన్నికల అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. లక్ష మెజార్టీతో అజిత్ పవార్ గెలుపు... ఎన్సీపీ రెండుగా చీలిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగిన లోకసభ ఎన్నికల్లో ఎన్సీపీ(ఎస్పీ)తరపున బారామతి ఎంపీగా సుప్రియా సూలే గెలిచారు. ఎరద్పవార్ కుమార్తై ఎన్సీపీ (ఎస్పీ) పార్టీ నుంచి విజయం సాధించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీ రాష్ట్రవ్యాప్తంగా మంచి ఫలితాలు సాధించింది. ముఖ్యంగా అజిత్‌పవార్ లక్షకుపైగా ఓట్లతో విజయం సాధించి బారామతి అసెంబ్లీ నియోజకవర్గంలో శరద్‌పవార్ ప్రాభవానికి చెక్‌పెట్టారు. 50 ఏళ్లకుపైగా రాజకీయాల్లో.. మొట్టమొదటిసారిగా 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బారామతి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అప్పటినుంచి వెనుతిరిగి చూడలేదు. తరువాత తరువాత అసెంబ్లీతో పాటు లోక్‌సభ నియోజకవర్గంపై కూడా పట్టుసాధించారు. 1972లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు. ఇదే సంవత్సరం ఆయనకు మంత్రి మండలిలో స్థానం లభించింది. 1978 జూలై 12వ తేదీన నలుగురు మంత్రులతో కలసి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. జూలై 17వ తేదీన మంత్రి పదవికి రాజీనామా చేసి ఇతర పార్టీలతో కలిసి ‘పురోగామి లోక్‌షాహీ ఆఘాడీ’(పులోద్)ను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో అతి పిన్నవయసు ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు. రెండేళ్ల అనంతరం 1980లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మళ్లీ విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో ఓటమి పాలై 1981 జులై 31 వరకు ప్రతిపక్షనాయకుని పాత్రకు పరిమితమయ్యారు. 1984లో మొట్టమొదటి సారిగా బారామతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1986లో మరోసారి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో చేరిన అనంతరం 1988లో జూన్ 25వ తేదీన రెండోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 1991 జూన్ వరకూ ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. -
హ్యాపీయెస్ట్ బర్త్‌డే మై బడ్డీ : గాయని బర్త్‌డే విషెస్ వైరల్ (ఫోటోలు)
-
శ్రీలంకలో పూజా హెగ్డే బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
హీరో విజయ్ బర్త్‌డే వేడుకల్లో అపశృతి.. కాలిపోయిన బాలుడి చేయి!
దళపతి విజయ్ పుట్టినరోజు వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. అభిమానుల అత్యుత్యాహం ప్రమాదానికి దారి తీసింది. విజయ్ 50వ బర్త్‌డే సెలెబ్రేషన్స్‌లో భాగంగా చెన్నై విజయ్ అభిమానుల సంఘం అధ్యక్షుడు ఈసీఆర్ శరవణన్ ఫ్యాన్స్ కోసం ఒక ట్రిక్రీ షోను ఏర్పాటు చేశారు. చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ షోలో ఓ యువకుడు కిరోసిన్ ఉపయోగించి స్టంట్ చేస్తున్నాడు. చేతికి మంటలు అంటించుకొని టైల్స్‌ను పగలగొట్టే ప్రయత్నం చేశాడు. ఈ కమ్రంలో ప్రమాదం జరిగింది. టైల్స్ పగలగొట్టిన తర్వాత యువకుడి చేతి మంటలు ఆరిపోలేదు. అది కాస్త ఎక్కువై చేయి మొత్తం కాలిపోయింది. ఈవెంట్లో పక్కనే ఉన్నవారు త్వరగా స్పందించి.. మంటలు ఆర్పేశారు. అనంతరం అంబులెన్స్‌లో యువకుడిని ఆస్పత్రికి తరలించారు. -
Klin Kaara Photos: మెగా మనవరాలు క్లీంకార ఫస్ట్ బర్త్ డే.. క్యూట్ ఫొటోలు
-
రామ్‌చరణ్ బర్త్‌డే.. 500 మందికి సురేఖ అన్నదానం (ఫోటోలు)
-
బర్త్‌డేకి బంగారపు కేకు కట్ చేసిన హీరోయిన్.. ఫోటోలు వైరల్
సినీ సెలెబ్రిటీలు ఏ పని చేసినా కాస్త డిఫరెంట్‌గానే ఉంటుంది. వాళ్లు ధరించే దుస్తులు, మాట్లాడే తీరు.. వ్యవహార శైలీ అన్ని ఇతరుల కంటే కాస్త భిన్నంగానే ఉంటాయి. అయితే కొంతమంది మాత్రం తమ జీవనాన్ని సాదాసీదాగా కొనసాగిస్తే.. మరికొంత మంది మాత్రం చాలా రిచ్‌గా గడుపుతారు. రిచ్ లైఫ్‌ని ఎంజాయ్ చేసే వాళ్లలో ఊర్వశీ రౌతేలా ఒకరు. (Image Courtesy:Instagram) ఈ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులకు ఆమె ఎవరో గుర్తుకు రాకపోవచ్చు కానీ.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’లోని ‘బాస్ పార్టీ’ పాటకు స్టెప్పులేసిన భామ అనగానే అందరికి గుర్తొస్తుంది. ఆ పాటకు తనదైన స్టెప్పులేని అందరిని ఆకట్టుకుంది ఈ భామ. నేడు(ఫిబ్రవరి 25) ఊర్వశి బర్త్‌డే. ఈ సందర్భంగా గొల్డెన్ కేక్ కట్ చేసి వార్తల్లో నిలిచింది ఈ బాలీవుడ్ భామ. (Image Courtesy:Instagram) ప్రతి ఏడాది తన పుట్టిన రోజు వేడుకను చాలా గ్రాండ్‌గా జరుపుకోవడం ఊర్వశికీ అలవాటు. అలా ఈ ఏడాది కూడా తన బర్త్‌డేని స్నేహితుల సమక్షంగా గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకుంది. 24 క్యారెట్ల బంగారపు పూత పూసిన కేకును కట్ చేసి.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడా ఫోటోలు వైరల్‌గా మారాయి. తినే కేకుకు బంగారపు పూత పూయడం అవసరమా? ఎంత డబ్బులు ఉన్నా.. బంగారంతో కేకును తయారు చేస్తారా? అవి డబ్బులా మంచి నీళ్లా? అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. (Image Courtesy:Instagram) -
ఆనంద్ పండిట్ 60వ పుట్టినరోజు వేడుకలో బాలీవుడ్ తారల సందడి (ఫొటోలు)
-
#HBDYSJagan : భారీ కేక్‌తో జననేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు (ఫొటోలు)
-
జెయింట్ 7-టైర్ కేక్‌తో ధర్మేంద్ర 88వ పుట్టినరోజు వేడుకలు (ఫోటోలు)
-
Happy Birthday S Thaman: హ్యాపీ బర్త్‌డే సంగీత దర్శకుడు ఎస్ తమన్ (ఫోటోలు)
-
Mehreen Pirzada Birthday: మెహరీన్ బర్త్ డే సందర్భంగా ఇంట్లో గ్రాండ్ పార్టీ
-
తొలిసారి బేబీ బంప్‌తో ఉపాసన.. ఫొటోలు వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో తండ్రి కాబోతున్న సంగతి తెలిసిందే. ఆయన భార్య ఉపాసన ప్రస్తుతం 6 నెలల గర్భవతిగా ఉన్నారు. అయితే మొదట అంతా ఉపాసన సరోగసి ద్వారా తల్లి కాబోతుందా? అంటూ గాసిప్స్ వినిపించాయి. దీనికి కారణం ఆమె బేబీ బంప్‌తో కనిపించకపోవడమే. తల్లిదండ్రులు కాబోతున్నామంటూ ఈ ఏడాది ప్రారంభంలో చరణ్-ఉపాసనలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ఉపాసన షేర్ చేసిన ఏ ఫొటోల్లోనూ ఆమె బేబీ బంప్ కనిపించలేదు. అంతేకాదు రీసెంట్గా ఆస్కార్ అవార్డు వేడుకలో పాల్గొన్న ఆమె సాధారణంగానే కనిపించారు. దీంతో ఉపాసన ప్రెగ్నెన్సీపై పుకార్లు మరోసారి గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆ రూమర్లకు చెక్ పడింది. సోమవారం రామ్ చరణ్ బర్త్‌డే పార్టీ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పార్టీలో ఉపాసన బ్లూ కలర్ సింగిల్ పీస్‌లో మెరిసారు. ఇందులో ఆమె బేబీ బంప్‌తో కనిపించి పుకార్లకు చెక్ పెట్టారు. భర్త చరణ్‌తో కలిసి బర్త్‌డే పార్టీలో ఫొటోలకు ఫోజులు ఇచ్చారు ఆమె. ఈ ఫొటోల ఉపాసన మొదటి బేబీ బంప్‌తో కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. -
వరంగల్ లో ఘనంగా కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు
-
చాలా మిస్ అవుతున్నాను.. కూతుర్ని తలచుకుంటూ కల్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ పేరు ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. దానికి కారణం అతని పర్సనల్ లైఫ్‌లో విభేదాలు వచ్చేయనే పుకార్లు రావడమే. గతంలో ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లాడిన శ్రీజ.. కొన్నాళ్లకే అతనితో విడిపోయి కల్యాణ్ దేవ్‌ని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరు కూడా దూరంగా ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వీరిద్దరు పెట్టే పోస్టులు కూడా పలు అనుమానాలకు తావు ఇస్తున్నాయి. తాజాగా కూతురు నవిష్కను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు కల్యాణ్ దేవ్. ఫిబ్రవరి 11న కల్యాణ్ దేవ్ బర్త్‌డే. ఈ సందర్భంగా గతంలో కూతురితో కలిసి బర్త్‌డే సెలబ్రేషన్స్ జరుపుకున్న వీడియోని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘నీతో కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం ఇది నాలుగోసారి. నా బర్త్‌డేను ఇంతకంటే గొప్పగా స్టార్ట్ చేయలేను. ప్రతిరోజూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. ఇప్పటికే నిన్ను మిస్ అవుతున్నా’అంటూ కల్యాణ్ దేవ్ రాసుకొచ్చాడు. ఇటీవల జరిగిన కూతురి బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో కల్యాణ్ దేవ్ కనపడలేదు. అప్పుడు కూడా నవిష్కను తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. View this post on Instagram A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) -
మాజీ దంపతులు ఐశ్వర్య-ధనుష్ తనయులతో సరదాగా రజనీ, ఫొటో వైరల్
సూపర్‌స్టార్ రజనీకాంత్ 72వ పుట్టిన రోజు వేడుకలను ఆయన అభిమానులు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఆయన సతీమణి లత రజనీకాంత్ కూడా అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. అయితే రజనీకాంత్ మాత్రం ఈ వేడుకల్లో ఎక్కడా కనిపించలేదు. అనేకమంది అభిమానులు రజనీకాంత్‌ను చూడడానికి ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే గంటలపాటు పడిగాపులు కాసినా రజనీకాంత్ కనిపించకపోవడంతో అభిమానులు నిరాశతో వెనుదిరిగారు. మరికొందరైతే ఎంతో ఆశతో వచ్చినా తమ అభిమాన నటుడిని చూడలేకపోయామంటూ కంటతడి పెట్టుకున్నారు. చదవండి: బిగ్‌బాస్ 6: బయటకు రాగానే సూర్యను కలిసిన ఇనయా, ఫొటో వైరల్ కాగా రజనీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు రాజకీయ సినీ ప్రముఖులు శుభాకాంక్షలు అందించిన విషయం తెలిసిందే. దీంతో వారందరికీ పేరుపేరునా రజనీ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ రవి, మిత్రుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. అదే విధంగా మరో ప్రకటనలో ఎడపాడి పళనిసామి, ఓ.పన్నీర్ సెల్వం, అన్నామలై, టీకే.రంగరాజన్, వైగో, అన్బుమణి రామదాస్, జీకే వాసన్, తిరుమావళన్.. చదవండి: విజయ్ సేతుపతి షాకింగ్ లుక్ వైరల్, అవాక్కవుతున్న ఫ్యాన్స్ ఏసీ షణ్ముగం, తిరువుక్కరసు, సీమాన్ తదితర నాయకులకు, నటుడు కమలహాసన్, సంగీత దర్శకుడు ఇళయరాజా, షారూఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మమ్ముట్టి, శివరాజ్ కుమార్, శరత్ కుమార్, ఉదయనిధి స్టాలిన్, ధను, వైరముత్తు తదితర సినీ ప్రముఖులకు ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా ప్రజలకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా రజనీకాంత్ తన మనవళ్ల (నటుడు ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్ కొడుకులు)తో ఉత్సాహంగా గడుపుతున్న ఫొటోను ఆమె పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ మీడియాకు విడుదల చేశారు. అందులో పుట్టినరోజు వేడుక తరువాత అని పేర్కొనడం గమనార్హం. Cannot capture something more beautiful.. Cannot caption some such bonds .. My birthday boy with my boys ! #grandfatherlove❤️ #grandsonsrock💙 pic.twitter.com/iCWLZ6b6n7 — Aishwarya Rajinikanth (@ash_rajinikanth) December 12, 2022 -
పవన్ ఫ్యాన్స్ బీభత్సం.. బీర్ బాటిల్స్‌తో థియేటర్లో అరాచకం
పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విశాఖలో పవన్ అభిమానులు బీభత్సం సృష్టించారు. నేడు(శుక్రవారం)పవన్ పుట్టినరోజు సందర్భంగా వైజాగ్‌లోని లీలా మహల్ థియేటర్లో జల్సా సినిమా ఫస్ట్ అండ్ సెకండ్ షోను ప్రదర్శించారు. అయితే థియేటర్లో హంగామా సృష్టించిన పవన్ ఫ్యాన్స్ బీర్ బాటిల్స్ పగలకొట్టి స్క్రీన్ చించేశారు. సీట్లు ధ్వంసం చేయడంతో పాటు సీలింగ్ కూడా డామేజ్ చేశారు. పేపర్ ముక్కలు, గాజు పెంకులతో ప్రస్తుతం థియేటర్ పరిస్థితి అధ్వానంగా తయారైంది. దీంతో థియేటర్ యాజమాన్యం గగ్గోలు పెడుతోంది. పవన్ అభిమానులు చేసిన ఈ అరాచకానికి సుమారు రూ. 20 లక్షల నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. -
స్మశానంలో పుట్టినరోజును జరుపుకున్న హీరోయిన్.. ఎందుకో తెలుసా?
సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో పుట్టినరోజు చాలా స్పెషల్. తమ పుట్టినరోజుని ఎంతో సంతోషంగా జరుకుంటారు. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే స్టార్ హోటల్స్, రిసార్ట్స్,పబ్స్‌లో బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఇందుకు విభిన్నంగా ఓ హీరోయిన్ మాత్రం తన పుట్టినరోజుని స్మశానవాటికలో జరుపుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ నటి ఆర్యా ఘారే మంగళవారం తన పుట్టినరోజు వేడులను స్నేహితులతో కలిసి స్మశానంలో జరుపుకంది. స్మశానవాటికలోనే కేక్ కట్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇలా బర్త్‌డేను స్మశనాంలో జరుపుకోవడంపై నటి ఆర్యా ఘారే స్పందిస్తూ.. మూఢనమ్మకాలపై వ్యతిరేక ప్రచారంలో భాగంగా ఇలా పుట్టినరోజును జరుపుకున్నట్లు తెలిపింది. కాగా ఈ బర్త్‌డే వేడుకలకు ఆమె తల్లి కూడా హాజరుకావడం విశేషం. ఇక సినిమాల విషయానికి వస్తే డ్యూల్ బంద్, భిర్గీత్, అబా, బ్యాక్ టూ స్కూల్ వంటి చిత్రాలతో హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమల్లో ఆర్య ఘారే తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. -
విజయ్ బర్త్‌డే సెలబ్రేట్ చేసిన సమంత
విజయ్ దేవరకొండ బర్త్‌డే సందర్భంగా సమంత అతడికి సర్ప్రైజ్ ఇచ్చింది. సోమవారం(మే 9) విజయ్ పుట్టిన రోజు కావడంతో ఆదివారం రాత్రి అతడితో కేక్ కట్ చేయించింది సమంత. కాగా వీరిద్దరు ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సెట్‌పైకి వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం కశ్మీర్లో షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో నేడు విజయ్ బర్త్‌డే కావడంతో సామ్ సెట్స్‌లో అతడి పుట్టినరోజును సెలబ్రేట్ చేయడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా స్పెషల్ విషెస్ తెలిపింది. చదవండి: అశును వరస్ట్ కంటెస్టెంట్ అన్న రవి, షో మధ్యలో నుంచి వెళ్లిపోయిన నటి కాగా మొన్నామధ్య సమంత బర్త్‌డే రోజు విజయ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. షూటింగ్ చేసినట్టే చేసి సమంత బర్త్‌డేని సెలబ్రేట్ చేశాడు. తాజాగా ఇప్పుడు సమంత వంతు వచ్చింది. విజయ్‌కు తెలియకుండానే సెట్లోనే అతడి బర్త్‌డే వేడుకకు అన్ని ఏర్పాట్లు చేసింది సామ్. ఇందుకోసం ఓ రూం అంతా డెకరేట్ చేసి, మూవీ టీంతో స్పెషల్‌గా కేక్ తెప్పించింది. ఆదివారం అర్థరాత్రి సమంత, మూవీ టీం కలిసి విజయ్‌తో కేక్ కట్ చేయించారు. కాగా ఈ పార్టీలో డైరెక్టర్ శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు కూడా పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
ఎన్టీఆర్ ఇంట్లో రామ్‌చరణ్ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు లీక్
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 'ఆర్ఆర్ఆర్' మేనియా నడుస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తుంది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబడుతోంది. సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను చూపించిన తీరుకు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న రామ్‌చరణ్‌కి ఆర్ఆర్ఆర్ బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆదివారం(మార్చి27)న రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో పాటు సెలబ్రిటీల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా చరణ్‌కి తారక్ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. తన ఇంట్లో చెర్రీ కోసం గ్రాండ్‌గా బర్త్‌డే పార్టీని నిర్వహించాడు. ఈ వేడుకకి రాజమౌళి, అఖిల్ అక్కినేనితో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా రామ్‌చరణ్- ఎన్టీఆర్ మధ్య ఎన్నో ఏళ్లుగా స్నేహబంధం ఉన్న సంగతి తెలిసిందే. -
ఎన్నో రకాలుగా మోసపోయాను: మోహన్ బాబు భావోద్వేగం
విలక్షణ నటుడు మోహన్ బాబు బర్త్‌డే వేడుకలు శనివారం తిరుపతిలో ఘనంగా జరిగాయి. మార్చి 19న మోహన్ బాబు బర్త్‌డే. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఆయన 70వ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, జీఆర్ గ్రూప్స్ అధినేత అమరనాథ రెడ్డి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు పండిట్ రవి శంకర్ ముఖ్య అతిథిలుఉ హజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన నటుడిగా, నిర్మాతగా, విద్యాసంస్థల అధినేతగా ఎదగడం వెనక ఎన్నో కష్టాలు ఉన్నాయన్నారు. చదవండి: రెండున్నర నెలల వరకు గర్భవతిని అనే విషయం తెలియదు: నటి స్టేజ్ మీద ఏం మాట్లాడాలో తెలియడం లేదు గురువు గారు అంటూ దాసరి నారాయణను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు మోహన్ బాబు ‘జీవితమంత కష్టాలమమైంది. దాదాపు 7 సంవత్సారాలు తిండిలేక, రెండు జతల బట్టలతో.. కారు షెడ్లో ఉంటూ.. ఎదో సాధించాలని పొట్ట చేత పట్టుకుని తిరుపతి నుంచి మద్రాసుకు వెళ్లాను. దేవుని ఆశీస్సులతో దాసరి గారు మోహన్ బాబుగా నన్ను పరిచయం చేశారు. ప్రతి క్షణం నా జీవితం ముల్ల బాటగా ఉండేది’ అంటూ ఎమోషనల్ అయ్యారు. అలాగే ‘నేను ఎంతో మంది ఉపయోగపడ్డాను. కానీ వారెవరు కూడా నాకు ఉపయోగపడలేదు. ఎన్నో రకాలుగా మోసపోయాను. ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నా. జీవితం అంటే ఏంటో ఇప్పుడు తెలుస్తోంది’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: ఫీజులో రాయితీ.. సినీ కార్మికుల పిల్లలకు ఆఫర్: మోహన్ బాబు ఇక 30 ఏళ్ల క్రితం తాను స్థాపించిన శ్రీవిద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నేడు యూనివర్సిటీ స్థాయికి ఎదగడం వెనక ఎంతో శ్రమ ఉందని మోహన్‌బాబు అన్నారు. ఇక పండిట్ రవిశంకర్ మాట్లాడుతూ.. మోహన్‌బాబు త్వరలో ప్రారంభించబోయే యాక్టింగ్ స్కూలుకు అంతర్జాతీయ గుర్తింపు రావాలని ఆకాంక్షించారు. మోహన్‌బాబు ముక్కుసూటి మనిషని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశంసించారు. దీని వల్ల ఆయన ఎన్నో కోల్పోయారని అయితే, మరికొన్నింటిని మాత్రం ఆయన సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంచు విష్ణు, మనోజ్, లక్ష్మీప్రసన్న, నరేష్, అలీ తదితరులు పాల్గొన్నారు.