సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో పుట్టినరోజు చాలా స్పెషల్. తమ పుట్టినరోజుని ఎంతో సంతోషంగా జరుకుంటారు. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే స్టార్ హోటల్స్, రిసార్ట్స్,పబ్స్‌లో బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఇందుకు విభిన్నంగా ఓ హీరోయిన్ మాత్రం తన పుట్టినరోజుని స్మశానవాటికలో జరుపుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ నటి ఆర్యా ఘారే మంగళవారం తన పుట్టినరోజు వేడులను స్నేహితులతో కలిసి స్మశానంలో జరుపుకంది.
స్మశానవాటికలోనే కేక్ కట్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇలా బర్త్‌డేను స్మశనాంలో జరుపుకోవడంపై నటి ఆర్యా ఘారే స్పందిస్తూ.. మూఢనమ్మకాలపై వ్యతిరేక ప్రచారంలో భాగంగా ఇలా పుట్టినరోజును జరుపుకున్నట్లు తెలిపింది. కాగా ఈ బర్త్‌డే వేడుకలకు ఆమె తల్లి కూడా హాజరుకావడం విశేషం.
ఇక సినిమాల విషయానికి వస్తే డ్యూల్ బంద్, భిర్గీత్, అబా, బ్యాక్ టూ స్కూల్ వంటి చిత్రాలతో హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమల్లో ఆర్య ఘారే తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment