Superstar Rajinikanth Celebrated His 72nd Birthday With His Grandsons Yatra And Linga - Sakshi
Sakshi News home page

Super Star Rajinikanth: మాజీ దంపతులు ఐశ్వర్య-ధనుష్‌ తనయులతో సరదాగా రజనీ, ఫొటో వైరల్‌

Published Wed, Dec 14 2022 8:50 AM | Last Updated on Wed, Dec 14 2022 9:40 AM

Super Star Rajinikanth Spend Time With Grandson After Birthday Celebration - Sakshi

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 72వ పుట్టిన రోజు వేడుకలను ఆయన అభిమానులు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఆయన సతీమణి లత రజనీకాంత్‌ కూడా అభిమానులతో కలిసి కేక్‌ కట్‌ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. అయితే రజనీకాంత్‌ మాత్రం ఈ వేడుకల్లో ఎక్కడా కనిపించలేదు. అనేకమంది అభిమానులు రజనీకాంత్‌ను చూడడానికి ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే గంటలపాటు పడిగాపులు కాసినా రజనీకాంత్‌ కనిపించకపోవడంతో అభిమానులు నిరాశతో వెనుదిరిగారు. మరికొందరైతే ఎంతో ఆశతో వచ్చినా తమ అభిమాన నటుడిని చూడలేకపోయామంటూ కంటతడి పెట్టుకున్నారు.

చదవండి: బిగ్‌బాస్‌ 6: బయటకు రాగానే సూర్యను కలిసిన ఇనయా, ఫొటో వైరల్‌

కాగా రజనీకాంత్‌ పుట్టిన రోజు సందర్భంగా పలువురు రాజకీయ సినీ ప్రముఖులు శుభాకాంక్షలు అందించిన విషయం తెలిసిందే. దీంతో వారందరికీ పేరుపేరునా రజనీ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌ రవి, మిత్రుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. అదే విధంగా మరో ప్రకటనలో ఎడపాడి పళనిసామి, ఓ.పన్నీర్‌ సెల్వం, అన్నామలై, టీకే.రంగరాజన్, వైగో, అన్బుమణి రామదాస్, జీకే వాసన్, తిరుమావళన్..

చదవండి: విజయ్‌ సేతుపతి షాకింగ్‌ లుక్‌ వైరల్‌, అవాక్కవుతున్న ఫ్యాన్స్‌

ఏసీ షణ్ముగం, తిరువుక్కరసు, సీమాన్‌ తదితర నాయకులకు, నటుడు కమలహాసన్, సంగీత దర్శకుడు ఇళయరాజా, షారూఖ్‌ ఖాన్, అక్షయ్‌ కుమార్, మోహన్‌ లాల్, మమ్ముట్టి, శివరాజ్‌ కుమార్, శరత్‌ కుమార్, ఉదయనిధి స్టాలిన్, ధను, వైరముత్తు తదితర సినీ ప్రముఖులకు ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా ప్రజలకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా రజనీకాంత్‌ తన మనవళ్ల (నటుడు ధనుష్‌ ఐశ్వర్య రజనీకాంత్‌ కొడుకులు)తో ఉత్సాహంగా గడుపుతున్న ఫొటోను ఆమె పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్‌ మీడియాకు విడుదల చేశారు. అందులో పుట్టినరోజు వేడుక తరువాత అని పేర్కొనడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement