Upasana Konidela spotted with baby bump in Ram Charan's birthday party - Sakshi
Sakshi News home page

Upasana: ఉపాసన బేబీ బంప్‌ ఫొటోలు వైరల్‌

Published Tue, Mar 28 2023 12:06 PM | Last Updated on Tue, Mar 28 2023 12:22 PM

Upasana Konidela Spotted With Baby Bump in Ram Charan Birthday Party - Sakshi

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ త్వరలో తండ్రి కాబోతున్న సంగతి తెలిసిందే. ఆయన భార్య ఉపాసన ప్రస్తుతం 6 నెలల గర్భవతిగా ఉన్నారు. అయితే మొదట అంతా ఉపాసన సరోగసి ద్వారా తల్లి కాబోతుందా? అంటూ గాసిప్స్‌ వినిపించాయి. దీనికి కారణం ఆమె బేబీ బంప్‌తో కనిపించకపోవడమే. తల్లిదండ్రులు కాబోతున్నామంటూ ఈ ఏడాది ప్రారంభంలో చరణ్‌-ఉపాసనలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ఉపాసన షేర్‌ చేసిన ఏ ఫొటోల్లోనూ ఆమె బేబీ బంప్‌ కనిపించలేదు.

అంతేకాదు రీసెంట్‌గా ఆస్కార్‌ అవార్డు వేడుకలో పాల్గొన్న ఆమె సాధారణంగానే కనిపించారు. దీంతో ఉపాసన ప్రెగ్నెన్సీపై పుకార్లు మరోసారి గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆ రూమర్లకు చెక్‌ పడింది. సోమవారం రామ్‌ చరణ్‌ బర్త్‌డే పార్టీ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పార్టీలో ఉపాసన బ్లూ కలర్‌ సింగిల్‌ పీస్‌లో మెరిసారు. ఇందులో ఆమె బేబీ బంప్‌తో కనిపించి పుకార్లకు చెక్‌ పెట్టారు. భర్త చరణ్‌తో కలిసి బర్త్‌డే పార్టీలో ఫొటోలకు ఫోజులు ఇచ్చారు ఆమె. ఈ ఫొటోల ఉపాసన మొదటి బేబీ బంప్‌తో కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement