Hero Ram Charan Wife Upasana Baby Bump Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Upasana Baby Bump Photos: సరోగసి రూమర్స్‌కు చెక్‌, బేబీ బంప్‌తో దర్శనమిచ్చిన ఉపాసన

Published Mon, Dec 19 2022 4:37 PM | Last Updated on Mon, Dec 19 2022 6:42 PM

Ram Charan Wife Upasana Flaunts Her Baby Bump, Photos Viral - Sakshi

టాలీవుడ్‌ స్టార్‌ దంపతులు రామ్‌చరణ్‌-ఉపాసన త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే! ఈ గుడ్‌న్యూస్‌ను మొదట చిరంజీవి సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించగా మెగా ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అయ్యారు. త్వరలో జూనియర్‌ రామ్‌చరణ్‌ రాబోతున్నాడోచ్‌ అని పండగ చేసుకుంటున్నారు. 

ఈ ఆనందకర సమయంలో ఉపాసన సరోగసి ద్వారా బిడ్డను కనబోతుందంటూ కొన్ని పుకార్లు పుట్టుకొచ్చాయి. దీనిపై చరణ్‌-ఉపాసన నేరుగా స్పందించనప్పటికీ తాజాగా షేర్‌ చేసిన ఫోటోలతో వాటికి గట్టి సమాధానమిచ్చినట్లైంది. ఫ్యామిలీ పార్టీ ఉండటంతో చెర్రీ దంపతులు థాయ్‌లాండ్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో అప్‌లోడ్‌ చేసింది. ఇందులో ఆమె బేబీ బంప్‌తో దర్శనమివ్వడంతో సరోగసి అంటూ వచ్చిన వార్తలకు చెక్‌ పెట్టినట్లైంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

చదవండి: సీరియల్‌ నటి వివాహం, పెళ్లి వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement