Upasana Konidela Shares Baby Bump Experience In Pregnancy Time, Deets Inside - Sakshi
Sakshi News home page

Upasana On Pregnancy Journey: ప్రత్యేకంగా అలాంటి దుస్తులు వేసుకోను.. బేబీ బంప్‌పై ఉపాసన!

Published Mon, Apr 17 2023 10:52 AM | Last Updated on Mon, Apr 17 2023 11:23 AM

Upasana Shares Baby Bump Experience In Pregnancy Time - Sakshi

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన టాలీవుడ్‌ మోస్ట్ బ్యూటీఫుల్‌ కపుల్స్‌లో ఒకరు. త్వరలోనే మెగా ఇంట సందడి మొదలు కానుంది. చెర్రీ-ఉపాసన దంపతులు తమ మొదటి బిడ్డకు వెల్‌కమ్‌ చెప్పనున్నారు. ఇటీవల దుబాయ్‌ వెళ్లిన జంట అక్కడే సన్నిహితుల సమక్షంలో సీమంతం కూడా జరుపుకున్నారు. వేకేషన్ పూర్తి చేసుకున్న ఈ జంట తాజాగా హైదరాబాద్‌కు తిరిగొచ్చింది. తాము ప్రెగ్నెన్సీని పక్కా ప్లాన్‌ చేసుకున్నట్లు గతంలోనే వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన తన ప్రెగ్నెన్సీ లుక్‌పై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.  

ప్రస్తుతం గర్భవతిగా ఉన్న ఉపాసనకు డెలివరీ సమయం దగ్గరపడుతోంది. అయినప్పటికీ సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటోంది. సాధారణంగా గర్భంతో ఉన్నప్పుడు తన ప్రొఫెషనల్‌ లైఫ్‌కు దూరంగా ఉంటారు. ఎలాంటి ప్రయాణాలు కూడా చేయడానికి సాహసం చేయరు. కానీ తన కెరీర్‌కు ఇలాంటివేమీ అడ్డు కావని చెబుతోంది మెగా కోడలు. ప్రెగ్నెన్సీ కోసం ప్రత్యకంగా ఎలాంటి దుస్తులు ధరించడం లేదని హైదరాబాద్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో వెల్లడించింది.  

ఉపాసన మాట్లాడుతూ.. 'ప్రెగ్నెన్సీ ఓ వేడుకలా ఉండాలని కోరుకుంటా. ప్రస్తుతం ఈ జర్నీని ఆస్వాదిస్తున్నా. అందుకే ప్రపంచ దేశాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా చుట్టేసి వచ్చా. నా ఫుడ్, పోషకాహారం గురించి డాక్టర్ సలహాలు ఇచ్చారు . అంతే కాకుండా నార్మల్ దుస్తుల్లోనే నేను ఫిట్‌గా ఉన్నా. అందుకే ప్రత్యేకంగా మెటర్నిటీ క్లాత్స్ ధరించడం లేదు. నార్మల్ దుస్తుల్లో కనిపించడాన్ని గొప్పగా భావిస్తున్నా. నిజానికి ఇదొక గొప్ప ప్రయాణం.' అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. రామ్‌ చరణ్‌ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలో నటిస్తున్నాడు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ  నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement