Ram Charan To Take 3-Month Break From May To Welcome First Child - Sakshi
Sakshi News home page

Ram Charan : తొలి సంతానం.. బిడ్డ కోసం అలాంటి నిర్ణయం తీసుకున్న రామ్‌చరణ్‌!

Published Wed, Apr 19 2023 6:55 PM | Last Updated on Wed, Apr 19 2023 7:19 PM

Ram Charan To Take 3 Month Break From Shooting To Welcome First Child - Sakshi

టాలీవుడ్‌ బెస్ట్‌ కపుల్స్‌లో ఒకరైన రామ్‌చరణ్‌-ఉపాసన త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉపాసన  గర్బవతిగా ఉన్నారు. దాదాపు పెళ్లైన 11 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఈ జంట పేరేంట్స్ కాబోతున్నారు. దీంతో మెగా ఫ్యామిలీ సహా అభిమానులు పుట్టబోయే బిడ్డ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ మధుర క్షణాలను ఆస్వాదిస్తున్నారు రామ్‌చరణ్‌-ఉపానస.

ఈ క్రమంలో కడుపులో బిడ్డతో వెకేషన్‌ పేరిట ప్రపంచాన్ని చుట్టొస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్‌చరణ్‌ శంకర్‌ దర్శకత్వంలో RC15 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షరవేగంగా సాగుతున్న ఈ మూవీ షూటింగ్‌ ఇప్పుడు ముగింపు దశకు వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో ఈ వారం చివర్లో లేదా వచ్చే వారంలోగా షెడ్యూల్‌ను పూర్తి చేసి సుమారు 3 నెలల వరకు రామ్‌చరణ్‌ షూటింగ్‌ నుంచి బ్రేక్‌ తీసుకోనున్నట్లు సమాచారం. 

తమ మొదటి సంతానం కావడంతో ప్రెగ్నెన్సీ సమయంలో షూటింగ్‌కి బ్రేక్‌ ఇచ్చి ఉపాసనతో ఉండేందుకు రామ్‌చరణ్‌ ప్లాన్‌ చేస్తున్నారట. డెలీవరీకి సమయం దగ్గర పడుతుండటంతో పుట్టబోయే బిడ్డ కోసం చరణ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement