Ram Charan And Wife Upasana Reveals His Reaction When She Was Pregnant, Deets Inside - Sakshi
Sakshi News home page

Upasana- Ram Charan: ప్రెగ్నెన్సీ అని చెర్రీకి చెప్పా.. అలా చేయొద్దన్నాడు: ఉపాసన

Published Thu, Jun 15 2023 1:22 PM | Last Updated on Fri, Jun 16 2023 4:50 PM

Ram Charan wife Upasana reveals his reaction when She was pregnant - Sakshi

గ్లోబల్‌ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్‌ కపుల్స్‌లో ఒకరు. ఈ జంటకు పెళ్లయిన 11 ఏళ్లకు మొదటి బిడ్డకు స్వాగతం పలకనున్నారు. త్వరలోనే ఉపాసన బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ సందర్భంగా చాలా ఏళ్ల తర్వాత మెగా ఇంట్లో సందడి నెలకొంటోంది. గతేడాది డిసెంబర్‌లో ఉపాసన గర్భం ధరించినట్లు అధికారికంగా వెల్లడించింది మెగా ఫ్యామిలీ. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన తన భర్త రామ్ చరణ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అంతే కాకుండా ప్రెగ్నెన్సీ గురించి చెప్పినప్పుడు చెర్రీ ఎలా రియాక్ట్ అయ్యాడో వెల్లడించింది. 

(ఇది చదవండి: తమన్నాతో డేటింగ్.. అందుకే బయటకు చెప్పలేదు: విజయ్ వర్మ)

ఉపాసన మాట్లాడుతూ.. 'నాకు ప్రెగ్నెన్నీ వచ్చిందని అనుకుంటున్నా అని చెర్రీతో చెప్పా. ఆ విషయం చెప్పగానే.. దీనిపై ఎక్కువగా ఎగ్జైట్‌ అవ్వకు, ప్రశాంతంగా ఉండు. ఒకసారి మనం పరీక్షలు చేయిద్దాం. ఆ తర్వాత అన్ని పరీక్షల్లో బాగానే ఉందని తెలిశాకే చెబుదాం. అప్పుడే సంబరాలు చేసుకుందామని చెప్పాడు. అందుకే నేను రామ్‌ని ఎక్కువగా ఆరాధిస్తా. అతని వల్లే నా జీవితంలో ఇంత ప్రశాంతంగా, మరింత ఉత్సాహంగా ఉన్నా. నా భావాలను వ్యక్తపరచడం నాకు చాలా ఇష్టం.చెర్రీ తనదైన శైలిలో ఏ పనైనా ప్రశాంతంగా చేస్తాడు.' అని అన్నారు.

ఆ తర్వాత ప్రెగ్నెన్సీ విషయాన్ని ఉపాసన, చెర్రీతో  చిరంజీవి కుటుంబ సభ్యులు డిసెంబర్‌లో రివీల్ చేశారు. అనంతరం హైదరాబాద్, దుబాయ్‌లలో ఉపాసనకు బేబీ షవర్‌ వేడుక నిర్వహించారు. కాగా.. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు గేమ్ ఛేంజర్‌ టైటిల్ ఖరారు చేయగా.. బాలీవుడ్ భామ కియారా అద్వానీ జంటగా కనిపించనుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.  
- కె.తారకరామ కుమార్‌

(ఇది చదవండి: స్టార్ హీరోయిన్‌కు మరోసారి ప్రెగ్నెన్సీ.. నటి కీలక నిర్ణయం!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement