
మెగాస్టార్ తనయుడు, మెగా హీరో రామ్ చరణ్ చెఫ్ అవతారమెత్తారు. ఉమెన్స్ డే సందర్భంగా సరికొత్తగా వంటలు చేస్తూ కనిపించారు. ఉమెన్స్ డే సందర్భంగా అమ్మ సురేఖతో కలిసి ఇంట్లో వంటలు చేస్తున్న వీడియోను ఉపాసన పోస్ట్ చేసింది. ఉమెన్స్ డే స్పెషల్ అంటూ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఇది చూసిన అభిమానులు ఏంటి? మన చరణ్ అన్నయ్య ఇలా మారిపోయాడంటూ కామెంట్స్ పెడుతున్నారు.
వీడియోలో ఉపాసన మాట్లాడుతూ..' అత్తమ్మగారు.. ఈ రోజు మీ కిచెన్‌లో ఏం చేస్తున్నారు? రామ్ చరణ్ గారు మీరు ఏం వంటలు చేస్తున్నారు' అంటూ ఫన్నీగా ప్రశ్నలు అడిగింది. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా కనిపించనుంది.
Comments
Please login to add a commentAdd a comment