Upasana Says Ram Charan And I Decided To Freeze Eggs Early In Their Marriage, Deets Inside - Sakshi
Sakshi News home page

Upasana: ప్రెగ్నెన్సీ గురించి ఎవరూ ఊహించని విషయం చెప్పిన ఉపాసన!

Published Tue, May 16 2023 6:04 PM | Last Updated on Tue, May 16 2023 7:12 PM

Upasana Says Ram charan And I Decided To freeze Eggs Early In Their Marriage - Sakshi

సౌత్‌​ ఇండియన్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ గతేడాది చివరి నుంచి వరుసుగా శుభవార్తలే అభిమానులకు చెబుతున్నారు.  మొదటగా తన ఇంటికి మరో బుజ్జాయి అడుగుపెట్టబోతుందని వార్త చెబితే తర్వాత ఆర్‌ఆర్‌ఆర్‌ ద్వారా అస్కార్‌ అందుకున్నాడు. 2012లో కొణిదెల వారి ఇంటికి కోడలిగా వెల‍్లింది ఉపాసన. దశాబ్దం తర్వాత వారు తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. అటు వ్యాపార పనుల్లో బిజీగా ఉంటూనే ఎప్పుడూ సోషల్‌ మీడియాలో టచ్‌లో ఉంటారు ఉపాసన. ఓ ఇంటర్వ‍్యూలో తన ప్రెగ్నెన్సీ గురించి ఆసక్తికరమైన విషయం తెలిపారు.  

(చదవండి: స్టార్‌ హీరో ప్రేమ వ్యవహారంపై క్లారిటి ఇచ్చిన తల్లి )

పెళ్లికి ముందే చెర్రీతో మంచి స్నేహం ఉంది కాబట్టి పిల్లలను ఎప్పుడు ప్లాన్‌ చేసుకోవాలనే ఒక క్లారిటితోనే ఉన్నామని తెలిపింది.  తమ పెళ్లి ప్రారంభంలోనే తమ యొక్క ఎగ్స్‌ను ఫ్రీజ్‌​ చేసినట్లు తెలిపింది.   ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో కూడా ఆ ఇంటర్వ్యూలో ఉపాసన తెలిపింది.

(చదవండి: లావణ్య త్రిపాఠితో వరుణ్‌తేజ్‌ ఎంగేజ్‌మెంట్‌? )

 ‘చరణ్‌,  నేను మా వివాహంలో ఎగ్‌ నిల్వ చేయాలని  ముందుగానే నిర్ణయించుకున్నాం.  ఎందుకంటే  ఆ సమయంలో మా కెరీర్‌పై దృష్టి పెట్టాలని మేము భావించాము. జీవితంలో సరైన సంపాదన తర్వాతే పిల్లలకు స్వాగతం చెప్పాలనుకున్నాం. ఈ రోజు మేమిద్దరం స్తిరమైన స్థానంలో ఉన్నాం. ఈ రోజు మా సంపాదనతో పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలమనే నమ్మకం ఉంది’ అని ఉపాసన అన్నారు.  మరికొద్ది రోజుల్లో ఉపాసన-రామ్‌ చరణ్‌ జంట తమ మొదటి బిడ్డను స్వాగతించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement