![Sampu Birthday Celebrations - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/10/sampooo.jpg.webp?itok=MjafjyiB)
సంపూర్ణేశ్ బాబు
సిద్దిపేటజోన్ : బర్నింగ్ స్టార్, వర్ధమాన నటుడు సంపూర్ణేష్‌బాబు జన్మదిన వేడుకలను ఆయన నివాసంలో సిద్దిపేట కళాకారుల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంపూర్ణేష్ మాట్లాడుతూ సిద్దిపేటలో కళాకారులు మెండుగా ఉన్నారని , కష్టపడితే ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయన్నారు. పుట్టినరోజు వేడుకలు కళాకారులు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సినీ కళాకారులు గౌటి రాజు, గుండు రవితేజ, కరాటె బాలు, క్రాంతి, స్వామి, వెంకట్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
![1](https://www.sakshi.com/gallery_images/2018/05/10/7990-0.jpg)
కేక్ కట్ చేస్తున్న సంపూర్ణేష్‌బాబు
Comments
Please login to add a commentAdd a comment