sampurnesh babu
-
నన్ను చూసినావే పిల్ల!
సంపూర్ణేష్ బాబు, సంజోష్,ప్రాచీ బంసాల్, ఆర్తి గుప్తా ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం ‘సోదరా’. మన్మోహన్ మేనంపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. క్యాన్స్ ఎంటర్టైన్మెంట్స్, మాంక్ ఫిల్మ్స్‌పై చంద్ర చగంలా నిర్మిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘నన్ను చూసినావే పిల్ల.. నా కలలే నిజమయ్యేలా...’ అంటూ సాగే రెండో పాటని విడుదల చేశారు మేకర్స్. ‘‘సోదరా’ నుంచి ఇప్పటికే రిలీజైన ‘అన్నంటే దోస్తే సోదరా..’ అనే తొలి పాటకి మంచి స్పందన వచ్చింది. ‘నన్ను చూసినావే పిల్ల..’ పాట ఫ్రెష్ ఫీల్‌తో మంచి లవ్ రొమాంటిక్‌గా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: జాన్. -
అన్నదమ్ముల అనుబంధం
సంపూర్ణేష్ బాబు, సంజోష్, ్ర΄ాచీ బన్సాల్, ఆర్తీ గు΄్తా కీలక ΄ాత్రల్లో నటించిన చిత్రం ‘సోదరా’. మన్మోహన్ మేనంపల్లి దర్శకత్వం వహించారు. చంద్ర చంగళ్ల నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని నిర్మాత వివేక్ కూచిభొట్ల రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో వినోదాత్మకంగా ‘సోదరా’ను రూ΄÷ందించాం. ఇటీవలే విడుదలైన మోషన్ ΄ోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాని త్వరలోనే విడుదల చేయనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: జాన్. -
మేడమ్ అని కాకుండా సార్ అని పిలిచారు
సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలో వీకే నరేశ్, శరణ్య కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’. పూజా కొల్లూరు దర్శకత్వంలో వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకర్ల సమావేశంలో పూజా కొల్లూరు మాట్లాడుతూ– ‘‘సైంటిస్ట్ లేదా ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నప్పటికీ సినిమాతో సమాజాన్ని ప్రభావితం చేయవచ్చని సినిమా రంగాన్ని కెరీర్‌గా ఎంచుకున్నాను. తెలుగులో ‘మార్టిన్ లూథర్ కింగ్’ నా తొలి సినిమా. కానీ ఈ చిత్రం కంటే ముందు కొన్ని హాలీవుడ్ ్రపాజెక్ట్స్తో అసోసియేషన్ ఉంది. కొన్ని డాక్యుమెంటరీలు తీశాను. ఇక ‘మార్టిన్ లూథర్ కింగ్’ విషయానికి వస్తే.. వై నాట్ స్టూడియోస్ సంస్థ తమిళ చిత్రం ‘మండేలా’ కథను తెలుగులో చె΄్పాలనుకుని, వెంకటేశ్ మహాగారిని సంప్రదించారు. అయితే నిర్మాణంలో భాగమౌతానని, దర్శకత్వం వహించలేనని ఆయన చె΄్పారు. దీంతో నేను దర్శకత్వం వహిస్తానని వెంకటేశ్ మహాగారికి చెప్పడంతో ఆయన వారికి చె΄్పారు. ఓటర్లు వారి ఓటు హక్కును ఎందుకు వినియోగించుకోవాలన్నది ఈ సినిమా థీమ్. ఓ సామాన్యుడు నటిస్తే ఎలా ఉంటుందో అలా ఉండాలని సంపూర్ణేష్ని హీరోగా తీసుకోవడం జరిగింది. వెంకటేశ్ మహా ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ ఇచ్చారు. నేను ఎడిటింగ్ కూడా చేశాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘ఏ భాషలోనైనా మహిళలకు అవకాశాలు తక్కువగానే ఉంటున్నాయి. నేను లేడీ డైరెక్టర్ని అయినా సెట్స్‌లో చాలాసార్లు ఓకే సార్ అన్నారు కానీ మేడమ్ అనలేదు. అంటే లింగ వివక్ష ఎంతలా నాటుకు΄ోయిందో అర్థం చేసుకోవచ్చు. సమస్యలున్నప్పటికీ మన పట్టుదలే మనల్ని ముందుకు నడిపిస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. -
నరేశ్ అంటే ఎవరు అన్నారు
సంపూర్ణేష్ బాబు హీరోగా వీకే నరేష్, శరణ్య ప్రదీప్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’. వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పిస్తున్న ఈ చిత్రంలో దర్శకుడు వెంకటేశ్ మహా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అదించడంతో పాటు క్రియేటివ్ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. పూజా కొల్లూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించిన వీకే నరేశ్ మాట్లాడుతూ– ‘‘వినోదం, సందేశం... ఈ రెండు అంశాలు మిళితమై ఉన్న సినిమాలు తక్కువగా వస్తుంటాయి. ‘మార్టిన్ లూథర్ కింగ్’లో ఈ రెండూ ఉన్నాయి. ఓ గ్రామంలోని రాజకీయ వర్గానికి నాయకుడిగా నటించాను. తమిళ ‘మండేలా’ సినిమాకు ‘మార్టిన్..’ చిత్రం స్ఫూర్తి మాత్రమే. పూర్తి స్థాయి రీమేక్ కాదు. ఈ సినిమా సంపూర్ణేష్‌కు సెకండ్ ఇన్నింగ్స్‌లా ఉంటుంది. 30 మంది నటీనటులు ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘కొంతకాలం రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నాను. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేస్తున్నాను. జీవితంలో ఎత్తుపల్లాలు చూశాను. రాజకీయాల నుంచి ఇండస్ట్రీకి తిరిగొచ్చిన ప్పుడు నరేశ్ అంటే ఎవరు? అని కొందరు అన్నారు. ఎస్వీ రంగారావుగారిని స్ఫూర్తిగా తీసుకుని విభిన్నమైన పాత్రలు చేస్తున్నాను. ఈ తరం దర్శకులు నాకోసం పాత్రలు రాయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు. -
సంపూ బర్త్‌డే: క్యాలీఫ్లవర్ ఫస్ట్‌లుక్ రిలీజ్
సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘క్యాలీఫ్లవర్’. ‘శీలో రక్షతి రక్షితః’ అనేది ఉపశీర్షిక. ఆర్కే మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వాసంతి హీరోయిన్ . గుడూరు శ్రీధర్ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్‌పై ఆశా జ్యోతి గోగినేని నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే మొదలైంది. మే 9 సంపూర్ణేష్ బర్త్ డేకి ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ‘‘ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు వచ్చిన వ్యక్తిగా సంపూ లుక్ అదిరిపోయింది. సంపూ స్టైల్ కామెడీతో సినిమా ఉంటుంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: దీప్ ప్రజ్వల్ క్రిష్, కెమెరా: ముజీర్ మాలిక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: కోల నాగేశ్వరరావు, హరిబాబు జెట్టి. -
‘బజార్ రౌడీ’.. సంపూ ఎంట్రీ మూములుగా లేదుగా..
‘హృదయ కాలేయం’, ‘సింగం 123’,‘కొబ్బరి మట్ట’ చిత్రాల తర్వాత బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మళ్లీ తెరపై కనిపించలేదు. సుదీర్ఘ విరామం తర్వాత సంపూ ‘బజార్ రౌడీ’తో మళ్లీ ప్రేక్షకులను నవ్వించేందుకు వస్తున్నాడు. దర్శకుడు వసంత నాగేశ్వర్ రూపొందించిన ఈ చిత్రాన్ని కేఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై సందిరెడ్డి శ్రీనివాస్ రావు నిర్మిస్తున్నారు. ఇటీవల క్లైమాక్స్ సీన్ల చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ బుధవారం మూవీ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. పోస్టర్ విషయానికి వస్తే.. చార్మినార్ సిటీ, హైదరాబాద్ మెట్రో రైలు సీన్లతో మొదలై... రసూల్ పూర సిటీకి రౌడీలు జీపులో వచ్చి హల్చల్ చేస్తున్నట్లు కనిపించారు. అక్కడే పక్కన నడిరోడ్డులో మంచంపై పడుకుని స్టైల్‌గా సిగరేట్ వెలిగిస్తూ బర్నింగ్ స్టార్ రౌడీ లుక్‌తో ఎంట్రీ ఇచ్చాడు. ఈ పోస్టర్ చూస్తూంటే మరోసారి సంపూ సీరియస్ కామెడీతో ప్రేక్షకులను అలరించనున్నట్లు తెలుస్తోంది. ఇక పెద్ద పెద్ద హీరోలకు పనిచేసిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ‘బజార్ రౌడీ’కి కొరియోగ్రఫీ అందించడం విశేషం. First Look & Motion Poster of BURNING STAR sampoornesh's #BazarRowdy #SandhireddySrinivasaRao #VasantaNageswaraRao #SekharAlvalapati #SaiKarthik pic.twitter.com/yV042wYDja — Movie Updates (@popcorn553) February 10, 2021 -
ఔదార్యం చాటుకున్న నటుడు సంపూర్ణేష్ బాబు
సాక్షి, సిద్ధిపేట : గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరబాద్ నగరం అతలాకుతలం అయింది. పలు కాలనీలు ఇంకా జలదిగ్భంధంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వరద బాధితులకు తన వంతు సహాయంగా సినీ నటుడు సంపూర్ణేష్ బాబు 50వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కి అందజేశాడు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావుకు సంబంధిత చెక్కును అందించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. అకాల వర్షాల కారణంగా హైదరాబాద్ ప్రజలు ఎంతో నష్టపోయారని వారికి తన వంతు సహాయం అందించానని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు సంపూర్ణేష్ బాబును అభినందించారు.సిద్దిపేట బిడ్డగా, సినీ ఆర్టిస్టుగా మానవత్వం చాటుకున్నారని ప్రశంసించారు. (హైదరాబాద్ వరదలు : ప్రభాస్ భారీ విరాళం ) గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు కాలనీలు నీట మునిగాయి. ఈ భారీ వర్షాల కారణంగా నగరవాసులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వందల్లో కాలనీలు జలదిగ్బంధం కావడంతో ప్రజలు భయట అడుగు పెట్టలేని పరిస్థితి నేలకొంది. వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయం కింద రూ. 550 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ ప్రభాస్ సహా పలువురు ప్రముఖులు సీఎం రిలీఫ్ ఫండ్‌కి భారీ విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. (హైదరాబాద్ వరదలు: నాగార్జున విరాళం) -
ఏదీ మీ వెనుక రాదు
‘‘నువ్వెక్కడి నుంచి వచ్చావో అదే నీ నిజమైన స్థానం. నీ ఆస్తి, నీ డబ్బు నీ వెనుక రావు’’ అంటున్నారు సంపూర్ణేష్ బాబు. ‘çహృదయ కాలేయం, కొబ్బరి మట్ట’ సినిమాలతో కామెడీ స్టార్‌గా పాపులర్ అయ్యారుఆయన. ఇటీవల పాపులర్‌గా మారిన ‘ది రియల్ మేన్’ ఛాలెంజ్ లో పాల్గొన్నారు. ఈ లాక్ డౌన్ లో ఆయన తన గతాన్ని గుర్తు చేసుకున్నారు. హీరో కాకముందు కంసాలి పని చేసేవారు సంపూ. ఈ లాక్ డౌన్ సమయంలో తన భార్య, పిల్లలకు వెండి ఆభరణాలు తయారు చేశారాయన. ఆ వీడియోను షేర్ చేసి ‘‘రాజు.. పేద తేడా లేదు. నీ ఆస్తి, డబ్బు నీ వెనుక రావు. నువ్వెక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు అని నా నిజమైన స్థానం గుర్తు చేసుకుంటూ మా ఆవిడ కోసం, నా పాత ‘కంసాలి’ వృత్తిని గుర్తు చేసుకుంటూ ఇంట్లో మిగిలిన గజ్జెలతో తనకి కాలి మెట్టెలు, పిల్లల కోసం గజ్జెలు చేసి ఇచ్చాను’’ అని పేర్కొన్నారు సంపూర్ణేష్. -
కొబ్బరి మట్టకు ఐదేళ్లు పట్టలేదు
‘‘ఒక వ్యక్తికి సినిమా పట్ల ఎంత ప్యాషన్ ఉంటుందో సాయి రాజేష్‌ని చూసి తెలుసుకోవచ్చు. మట్టి నుండి తెచ్చిన వినాయకుడి విగ్రహాన్ని మనం పూజిస్తామో.. అలా మట్టిలో నుంచి సంపూని తెచ్చి ఒక స్టార్‌ని చేయడానికి చాలా కష్టపడుతున్నారు. సంపూ ఎంత పెద్ద నటుడు అనేది ఆల్రెడీ ప్రూవ్ అయింది’’ అని డైరెక్టర్ మారుతి అన్నారు. సంపూర్ణేష్ బాబు హీరోగా రూపక్ రొనాల్డ్ సన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొబ్బరిమట్ట’. సాయి రాజేష్ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నిర్మాత ‘మధుర’ శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘సంపూర్ణేష్ సినిమాలంటే చాలా ఇష్టం. ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూశాక మళ్లీ మళ్లీ చూడాలనిపించే కథ అనిపించింది. అందుకే ఉదయం 8:45 గంటల ఆటకి టికెట్ బుక్ చేసుకున్నాను’’ అన్నారు. ‘‘జంధ్యాల, ఈవీవీగార్ల వినోదం తర్వాత సాయిరాజేశ్ కామెడీ నాకు నచ్చుతుంది. రాజేష్, సంపూగారివల్లే ఈ సినిమా చేశాను’’ అన్నారు రూపక్ రొనాల్డ్ సన్. ‘‘ఈ సినిమా కోసం నేను, సంపు, రూపక్.. మా కెరీర్లను వదులుకుని మరీ చేశాం. ‘కొబ్బరిమట్ట’ ఐదేళ్లు చేశామని అంటున్నారు, కానీ మేం షూటింగ్ చేసింది 39 రోజులు మాత్రమే’’ అన్నారు సాయి రాజేశ్. ‘‘నిజాయతీతో సినిమా చేసిన టీమ్ ఇది. తప్పకుండా సినిమా చూడండి’’ అన్నారు హీరో సందీప్ కిషన్. ‘‘ఈ సినిమాలో భాగం అయినందుకు గర్వంగా ఉంది’’ అన్నారు నటి షకీలా. సంపూర్ణేశ్ బాబు, నటులు శివ బాలాజీ, సమీర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏంట్రా ఈ హింస అనుకున్నాను!
‘‘కొబ్బరిమట్ట’ సినిమా రిలీజ్ విషయంలో చాలా ఆందోళనకు గురయ్యాను. చాలామంది అసలు ఈ సినిమా విడుదల అవుతుందా? అన్నారు. చాలా బాధగా అనిపించింది. ఇప్పుడు వాళ్లే ఫోన్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పాలని చూస్తున్నారు. నేను వాళ్ల ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు’’ అన్నారు సంపూర్ణేష్‌బాబు. రూపర్ రోనాల్డ్ దర్శకత్వంలో సంపూర్ణేష్ హీరోగా సాయి రాజేష్ (స్టీవెన్ శంకర్) నిర్మించిన ‘కొబ్బరిమట్ట’ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా సంపూర్ణేష్ పంచుకున్న విశేషాలు. ► మాది మిట్టపల్లి. మా నాన్నగారు గోల్డ్‌స్మిత్ వ్యాపారి. నాకు చిన్నతనం నుంచే సినిమాలపై ఆసక్తి. నాటకాల్లో నటించాను. వెండితెరపై నన్ను నేను చూసుకోవాలనుకుంటున్న సమయంలో ‘హృదయ కాలేయం’ దర్శకుడు స్టీవెన్ శంకర్ పరిచయం అయ్యాడు. ‘నేనొక చెత్త హీరో కోసం వెతుకుతున్నా’ అన్నాడు. అలా నరసింహాచారి హీరో సంపూర్ణేష్ బాబుగా మారాడు. ఆ తర్వాత ‘సింగం 123, వైరస్’ సినిమాలు చేశా. ‘హృదయ కాలేయం’ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు బాధించాయి. ► ‘కొబ్బరిమట్ట’ చిత్రంలో పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయిడ్ అనే మూడు పాత్రల్లో నటించాను. ఈ సినిమాలో నాకు ఆరుగురు భార్యలు, ముగ్గురు చెల్లెళ్లు ఉంటారు. ► ‘హృదయ కాలేయం’ తర్వాత ‘కొబ్బరిమట్ట’ పోస్టర్ రిలీజ్ చేశాం. ఈ సినిమా బాగా ఆలస్యం కావడానికి కారణం మేం అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ కావడమే. మధ్యలో నేను బిగ్‌బాస్ షోకు వెళ్లాల్సి రావడం ఒక కారణం. చాలామంది ఆర్టిస్టులు నటించడం వల్ల వారి కాంబినేషన్ సీన్స్ తీయడానికి కష్టపడ్డాం. ఈ సినిమా జర్నీ మూడేళ్ల పాటు సాగింది. నా మొదటి సినిమా దర్శకుడు స్టీవెన్ ఈ సినిమా నిర్మించినందుకు ఆయనకు థ్యాంక్స్. ► ఈ సినిమాలో నేను మూడున్నర నిమిషాల డైలాగ్స్ చెప్పడం కోసం చాలా కష్టపడ్డాను. చదువుకోవడానికే రెండు రోజులు పట్టింది. రాయడం, వినడం, చదవడం ఇలా చాలా ప్రాక్టీస్ చేసి చెప్పాను. మంచి స్పందన లభించింది. డైలాగ్ కింగ్ మోహన్‌బాబుగారు ఫోన్ చేసి అభినందించడం హ్యాపీ. అయితే ఈ డైలాగ్ ఫస్ట్ టైమ్ నా దగ్గరకు వచ్చినప్పుడు ‘ఏంట్రా ఈ హింస’ అనుకున్నా. ► నేను హైదరాబాద్‌కు ఇంకా షిఫ్ట్ కాలేదు. నాకు ఇద్దరు కుమార్తెలు. మా ఊర్లోనే ఉందామని మా ఆవిడ చెప్పారు. అయితే నరసింహాచారి కన్నా సంపూర్ణేష్ బాబు లైఫ్ బాగుందని చెప్పగలను. సంపూర్ణేష్ బాబుగా నాకు వచ్చిన క్రేజ్‌నే వినియోగించుకోలేకపోతున్నాను. ఇక బర్నింగ్‌స్టార్ అనే ట్యాగ్‌ను నేనేం చేసుకోను. ► ఇటీవల రెండు సినిమాలకు అడ్వాన్స్ తీసుకున్నాను. కానీ ‘కొబ్బరి మట్ట’ విడుదలపై క్లారిటీ లేకపోవడంతో ఆ సినిమాలు ఆగిపోయే పరిస్థితి. ఈ సినిమాపై నా కెరీర్ ఆధారపడి ఉంది. సన్నీ లియోన్ తెలియదు మనోజ్ ‘కరెంట్‌తీగ’ సినిమాలో సన్నీ లియోన్‌తో నటించబోతున్నానగానే అందరూ అవాక్కయ్యారు. అప్పటివరకూ సన్నీ లియోన్ ఎవరో నాకు తెలియదు. సెట్లో ఆమెను చూశాను. నన్ను మనోజ్ ఆమెకు పరిచయం చేశారు. మేం పెద్దగా ఏం మాట్లాడుకోలేదు. నాకు ఇంగ్లీష్ రాదు.. సన్నీకి తెలుగు రాదు. -
సినీహీరో ‘సంపూ’ జన్మదిన వేడుకలు
సిద్దిపేటజోన్ : బర్నింగ్ స్టార్, వర్ధమాన నటుడు సంపూర్ణేష్‌బాబు జన్మదిన వేడుకలను ఆయన నివాసంలో సిద్దిపేట కళాకారుల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంపూర్ణేష్ మాట్లాడుతూ సిద్దిపేటలో కళాకారులు మెండుగా ఉన్నారని , కష్టపడితే ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయన్నారు. పుట్టినరోజు వేడుకలు కళాకారులు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సినీ కళాకారులు గౌటి రాజు, గుండు రవితేజ, కరాటె బాలు, క్రాంతి, స్వామి, వెంకట్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఫస్ట్ మేమేనండీ...
...అంటున్నారు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. అవును..మెట్రో ట్రైన్‌ను ప్రారంభించిన తర్వాత షూటింగ్ జరుపుకున్న ఫస్ట్ టీమ్ వీళ్లదే. నాగార్జున, నాని కాంబినేషన్లో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వైజయంతి మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ ఓ సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పది రోజుల క్రితం ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా షూటింగ్ చేస్తున్నారు. సినిమాలో ట్రైన్ సీన్స్ కొన్ని ఉన్నాయట. ఆ సన్నివేశాలను మెట్రో ట్రైన్లో షూట్ చేశారు. మెట్రో ట్రైన్లో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు సినిమా మాదే అని ఆనందంగా తెలిపింది చిత్రబృందం. హీరో నాని, హీరోయిన్ రష్మిక మండన్నలతో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు పాల్గొన్న సన్నివేశాలను ట్రైన్లో చిత్రీకరించారు. ట్రైన్లో తీసిన సీన్స్‌తో ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఈ చిత్రంలో నాగార్జున మాజీ డాన్ పాత్రలో, నాని డాక్టర్ క్యారెక్టర్లో కనిపించనున్నారని సమాచారమ్. -
మూడోదీ హిట్టే!
‘‘చిత్ర పరిశ్రమలోకి రాక ముందు ప్రేక్షకుల్లో ఒకడిగా ఉండేవాణ్ణి. ఇప్పుడు స్క్రీన్‌పై కనిపిస్తున్నా. అందుకు కారణం స్టార్ హీరోల అభిమానులే. వాళ్లు నన్ను ఆదరించారు’’ అని హీరో సంపూర్ణేష్ బాబు అన్నారు. సంపూర్ణేష్ బాబు హీరోగా, విదిశా రెడ్డి, దీక్ష హీరోయిన్లుగా ఎస్.ఆర్. కృష్ణ దర్శకత్వంలో పుల్లరేవు రామచంద్రా రెడ్డి సమర్పణలో సలీమ్, శ్రీనివాస్ వంగ నిర్మించిన చిత్రం ‘వైరస్’. మీనాక్షి భుజంగ్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలను నిర్మాత మల్కాపురం శివకుమార్ ఆవిష్కరించారు. సంపూర్ణేష్ మాట్లాడుతూ–‘‘నా మొదటి సినిమా ‘హృదయ కాలేయం’, రెండో సినిమా ‘సింగం 123’ నాకు మంచి పేరు తెచ్చాయి. నేను చేసిన మూడో సినిమా ‘వైరస్’ కూడా హిట్టవుతుందనే నమ్మకం ఉంది. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. ‘వెన్నెల’ కిశోర్ చేసిన విలన్ పాత్ర అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా బాగా రావడానికి కారణం నిర్మాతలే. సంపూర్ణేష్ సహకారం మరువలేనిది’’ అని కృష్ణ అన్నారు. ‘‘ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాతలు. -
నాది తెలంగాణైనా హోదాకు మద్దతు: సంపూర్ణేష్
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఉద్యమానికి హీరో సంపూర్ణేష్ బాబు మద్దతు ప్రకటించారు. ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమానికి తన మద్దతు పూర్తిగా ఉంటుందని స్పష్టం చేశారు. తాను తెలంగాణ రాష్ట్రానికి చెందినవాడినే అయినప్పటికీ ఏపీ ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతిస్తున్నానని, హోదా వల్ల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుందని, తెలుగువారంతా సంతోషంగా ఉంటారని అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ అంటే బిచ్చం అని.. హోదా అనేది స్థాయిని చూపించేది కావున ఆ స్టేటస్ కోసమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ పౌరులు, యువత తీవ్రంగా శ్రమిస్తున్నారని, శాంతియుత పోరాటం చేస్తున్నారని దానికి తన మద్దతు ఉందన్నారు. ఎక్కడ చూసినా పోలీసులు మోహరించి ప్రతి ఒక్కరినీ అరెస్టు చేస్తున్నారని, రిపబ్లిక్ డే రోజు కూడా బయటకు రానివ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మరోపక్క, తమ్మారెడ్డి భరద్వాజ కూడా హోదా ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఆర్కే బీచ్‌లో హోదా ఉద్యమానికి మద్దతుగా శాంతియుత దీక్ష చేస్తున్న వారికి మద్దతిచ్చేందుకు తాము వస్తే పోలీసులు అడ్డుకున్నారని, అక్కడికి వెళ్లలేకపోతున్నందుకు బాధగా ఉందన్నారు. పోలీసులు అడ్డుకోవడం అంటే కార్యక్రమం విజయవంతమైనట్లేనని తెలిపారు. ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో శాంతియుత ఆందోళనకు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు సమరోత్సాహంతో సన్నద్ధమైన విషయం తెలిసిందే. తమిళనాడులో విజయవంతమైన జల్లికట్టు ఉద్యమం స్ఫూర్తితో ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్‌లోనూ గణతంత్ర దినోత్సవం రోజు జిల్లా కేంద్రాల్లో శాంతియుత ఆందోళన చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు యువజన సంఘాలు పిలుపునిచ్చాయి. పాలకుల కళ్లు తెరిపించేలా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పేర్కొన్నాయి. కాంగ్రెస్, వామపక్షాలు, లోక్‌సత్తా తదితర పార్టీలు, బీసీ సంఘాలు, ఇతర ప్రజాసంఘాలు కూడా ప్రత్యేక హోదా సాధన కోసం పోరుబాట పట్టాలని నిర్ణయించాయి. అలాగే, విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నారు. -
సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ముఖ్యం
డెరైక్టర్ భీమ్‌సింగ్, ఆయన పిల్లలు కణ్ణన్, లోక్‌సింగ్ (ఛాయాగ్రాహకులు) మాకు చుట్టాలు. డిగ్రీ అయిపోయాక ఏం చేయాలని అయోమయంలో ఉన్నప్పుడు నాన్నగారు ఛాయాగ్రాహకు రాలిగా వెళ్లమని దారి చూపారు. తెలుగులో నా మొదటి చిత్రం ‘సుబ్బు’. తెలుగు, హిందీ, తమిళం, జపనీస్, ఇంగ్లీష్ భాషల్లో 20 చిత్రాలకు పనిచేశా. ప్రస్తుతం సంపూర్ణేశ్బాబుతో ‘వైరస్’ చేస్తున్నా. మహిళలు ఎక్కువగా నటన, దర్శకత్వం రంగాలవైపే ఆసక్తి చూపుతున్నారు. కానీ కెమేరా రంగం వైపు రావడం లేదు. ఇక్కడికి వచ్చేవారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ముఖ్యం. ఏ రంగంలోనైనా చేసే పనిని ప్రేమిస్తే విజయం వరిస్తుంది. - విజయశ్రీ, కెమేరా ఉమన్ (‘సుబ్బు’ ఫేమ్) -
'కొబ్బరి మట్ట'తో మరింత దగ్గరవుతా: సంపు
హైదరాబాద్: దసరా పండక్కి రాబోతున్న 'కొబ్బరిమట్ట' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతానని హృదయ కాలేయం సినిమా హీరో సంపూర్ణేష్ బాబు అన్నారు. సికింద్రాబాద్ సోమసుందరం వీధిలోని కొత్త ఎల్లయ్య మెమోరియల్ హైస్కూల్లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి హాజరైన ఆయన కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. 'కొబ్బరిమట్ట' చిత్రంలో త్రిపాత్రాభినం చేస్తున్నానని ఇందులో తాను పాపారాయుడు, పెద్ద రాయుడు, ఆండ్రాయుడు పాత్రలతో అలరించనున్నట్లు చెప్పారు. ఏడుగురు హీరోయిన్లు ఇందులో ఉండటం ప్రత్యేకత అన్నారు. ఉమ్మడి కుటుంబంలో ఉండే బంధాలు, అనుబంధాలతో పాటు కామెడీ కూడా ప్రధానంగా కనిపిస్తుందని చెప్పారు. హృదయ కాలేయం, సింగం 123 చిత్రాలతో చాలా మంది అభిమానుల్ని సంపాదించుకున్నానని.. ఇప్పుడు ఈ చిత్రాన్ని ప్రేక్షకులు మరింత ఆదరిస్తారనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. దసరా పండుగకు ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఒకేసారి మూడు పాత్రల్లో కనిపించడం తనకు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉందని అన్నారు. -
'ప్రేమిస్తే.. పోయేకాలం' ఆడియో ఆవిష్కరణ
-
సంపూబాబు రెండో సినిమా కొబ్బరిమట్ట
సోషల్ మీడియా సైట్స్ ద్వారా వెలుగులోకొచ్చిన నటుడు సంపూర్ణేష్‌బాబు. విడుదలకు ముందే ‘హృదయ కాలేయం’తో సంచలనం సృష్టించాడు తను. త్వరలోనే ఆ సినిమా విడుదల కానుంది. ఇదిలావుంటే... సంపుబాబు హీరోగా మరో సినిమా కూడా తెరకెక్కనుంది. సినిమా పేరు ‘కొబ్బరిమట్ట’. ఇందులో సంపూబాబు త్రిపాత్రాభినయం చేయబోతున్నట్లు సమాచారం. ‘హృదయ కాలేయం’ దర్శకుడు స్టీవెన్ శంక రే ఈ చిత్రానికి కూడా దర్శకుడని వినికిడి.