సంపూర్ణేష్ బాబు
‘‘నువ్వెక్కడి నుంచి వచ్చావో అదే నీ నిజమైన స్థానం. నీ ఆస్తి, నీ డబ్బు నీ వెనుక రావు’’ అంటున్నారు సంపూర్ణేష్ బాబు. ‘çహృదయ కాలేయం, కొబ్బరి మట్ట’ సినిమాలతో కామెడీ స్టార్‌గా పాపులర్ అయ్యారుఆయన. ఇటీవల పాపులర్‌గా మారిన ‘ది రియల్ మేన్’ ఛాలెంజ్ లో పాల్గొన్నారు. ఈ లాక్ డౌన్ లో ఆయన తన గతాన్ని గుర్తు చేసుకున్నారు. హీరో కాకముందు కంసాలి పని చేసేవారు సంపూ. ఈ లాక్ డౌన్ సమయంలో తన భార్య, పిల్లలకు వెండి ఆభరణాలు తయారు చేశారాయన. ఆ వీడియోను షేర్ చేసి ‘‘రాజు.. పేద తేడా లేదు. నీ ఆస్తి, డబ్బు నీ వెనుక రావు. నువ్వెక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు అని నా నిజమైన స్థానం గుర్తు చేసుకుంటూ మా ఆవిడ కోసం, నా పాత ‘కంసాలి’ వృత్తిని గుర్తు చేసుకుంటూ ఇంట్లో మిగిలిన గజ్జెలతో తనకి కాలి మెట్టెలు, పిల్లల కోసం గజ్జెలు చేసి ఇచ్చాను’’ అని పేర్కొన్నారు సంపూర్ణేష్.
Comments
Please login to add a commentAdd a comment