goldsmith
-
ప్రముఖ నగల వ్యాపారి కాల్చివేత
శ్రీనగర్: నూతన సంవత్సరం తొలి రోజే శ్రీనగర్‌లో దారుణం చోటు చేసుకుంది. స్థానిక బిజీ మార్కెట్లో వ్యాపారి సత్పాల్ సింగ్ (62) పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. సారాయ్ బాలా వద్ద గురువారం ఈ సంఘటన జరిగిందని పోలీసు అధికారి వెల్లడించారు. ఎందుకు కాల్పులకు తెగబడ్డారనే దానిపై ఇంతవరకు ఎలాంటి స్పష్టతలేదు. సింగ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
త్వరలో సీఎం జగన్‌కు చెన్నై వాసి అరుదైన కానుక
సాక్షి, చెన్నై: బక్రీద్ పండుగను పురస్కరించుకుని తిరుపత్తూరు జిల్లా ఆంబూరుకు చెందిన బంగారు తయారీ కార్మికుడు దేవన్ బంగారం, వెండితో మసీదు నమూనాను తయారు చేశారు. 35 గ్రాముల వెండి, 6.5 గ్రాముల బంగారంతో ఐదున్నర ఇంచుల ఎత్తుతో ఒకరోజులోనే దీన్ని తయారు చేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే పొంగల్ కుండ బంగారంతో చేసినట్లు తెలిపారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ మ్యాప్‌ను బంగారంతో చేసి సంక్షేమ పథకాలతో ప్రజల మన్ననలు పొందుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందజేయనున్నట్లు తెలిపారు. -
ఏదీ మీ వెనుక రాదు
‘‘నువ్వెక్కడి నుంచి వచ్చావో అదే నీ నిజమైన స్థానం. నీ ఆస్తి, నీ డబ్బు నీ వెనుక రావు’’ అంటున్నారు సంపూర్ణేష్ బాబు. ‘çహృదయ కాలేయం, కొబ్బరి మట్ట’ సినిమాలతో కామెడీ స్టార్‌గా పాపులర్ అయ్యారుఆయన. ఇటీవల పాపులర్‌గా మారిన ‘ది రియల్ మేన్’ ఛాలెంజ్ లో పాల్గొన్నారు. ఈ లాక్ డౌన్ లో ఆయన తన గతాన్ని గుర్తు చేసుకున్నారు. హీరో కాకముందు కంసాలి పని చేసేవారు సంపూ. ఈ లాక్ డౌన్ సమయంలో తన భార్య, పిల్లలకు వెండి ఆభరణాలు తయారు చేశారాయన. ఆ వీడియోను షేర్ చేసి ‘‘రాజు.. పేద తేడా లేదు. నీ ఆస్తి, డబ్బు నీ వెనుక రావు. నువ్వెక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు అని నా నిజమైన స్థానం గుర్తు చేసుకుంటూ మా ఆవిడ కోసం, నా పాత ‘కంసాలి’ వృత్తిని గుర్తు చేసుకుంటూ ఇంట్లో మిగిలిన గజ్జెలతో తనకి కాలి మెట్టెలు, పిల్లల కోసం గజ్జెలు చేసి ఇచ్చాను’’ అని పేర్కొన్నారు సంపూర్ణేష్. -
ఎక్కడి నుంచి వచ్చావో మర్చిపోవద్దు: సంపూ
కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమైన సినీ ప్రముఖులు వారి వారి ఫ్యామిలీలతో జాలీగా గడుపుతున్నారు. అందుకు సంబంధించిన విశేషాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మాత్రం ఈ సమయంలో తన పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. తన కంశాలి వృత్తిని గుర్తుచేసుకున్నారు. అలాగే ఇంట్లో మిగిలి పోయిన గజ్జెలతో తన భార్య, పిల్లల కోసం.. మెట్టెలు, గజ్జెలు స్వయంగా ఆయన చేతులతో తయారు చేశారు. తనదైన శైలిలో ‘బి ది రియల్ మ్యాన్’ చాలెంజ్‌ను పూర్తి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సంపూర్ణేష్ బాబు ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘రాజు పేద తేడా లేదు. నీ ఆస్తి, డబ్బు.. నీ వెనక రావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మర్చిపోవద్దు, గుర్తుచేసుకుంటున్న సమయం ఇది. మా ఆవిడ కోసం, పిల్లల కోసం నా పాత "కంశాలి"వృత్తి ని గుర్తు చేసుకుంటూ ఇంట్లో మిగిలిన గజ్జెలతో, తనకి కాలి మెట్టెలు, పిల్లల కోసం గజ్జెలు చేయించి ఇచ్చాను’ అని సంపూ పేర్కొన్నారు. అలాగే లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ చారిటీ సంపూ రూ. లక్ష రూపాయలు విరాళం అందించిన సంగతి తెలిసిందే. -
డబ్బు సంగతి చూడు
ఆంగ్ల రచయిత ఆలివర్ గోల్డ్‌స్మిత్ (1728–74) ఒక్కపూట కడుపు నింపుకోవడానికి చిన్న చిన్న ఆర్టికల్స్ రాసేవాడు. ఒకసారి తానున్న గదికి అద్దె కట్టలేకుండా పోతున్నాననీ, ఇంటి యజమానురాలు తనపై అరెస్ట్ వారంటు తేవడానికి ప్రయత్నాలు చేస్తోందనీ కవి, నిఘంటుకారుడు శామ్యూల్ జాన్సన్‌కు ఉత్తరం పంపించాడు. జాన్సన్ కొంత డబ్బు పంపించాడు. తరువాత మిత్రుని పరిస్థితి ఎలావుందో చూద్దామని వచ్చాడు జాన్సన్. తను పంపిన డబ్బుతో వైన్ సేవిస్తూ ఇంటి యజమానురాలికి ధర్మోపన్యాసాలు ఇస్తున్న గోల్డ్‌స్మిత్ కనిపించాడు. ‘‘నీ ఉపన్యాసాలకేంగానీ, డబ్బు సంపాయించే మార్గాలేమైనా ఉన్నాయా?’’ అని కొంత కటువుగానే అన్నాడు జాన్సన్. అప్పుడు గోల్డ్‌స్మిత్ తన కాగితాల్లోంచి ఓ రాతప్రతిని తీసి చేతిలో పెట్టాడు. దాన్ని జాన్సన్ ఓ ప్రచురణకర్తకు 60 పౌండ్లకు అమ్మాడు. అదే ‘ద వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్’ నవల (1766). అయినాల కనకరత్నాచారి -
స్వర్ణకారుడిపై వన్‌టౌన్ ఎస్సై దాడి
-
4 కిలోల బంగారం దొంగ అరెస్టు
సాక్షి, నిజామాబాద్ క్రైం(నిజామాబాద్‌అర్బన్): వారం రోజుల క్రితం నాలుగు కిలోల బంగారంతో ఉడాయించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 3.05 కిలోల బంగారం, 6 డైమండ్లు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్‌బెంగాల్ హుగ్లీ జిల్లా కుల్లత్ గ్రామానికి చెందిన భూపాల్ మన్నా ఆర్మూర్‌లో స్థిరపడ్డాడు. బంగారు అభరణాలు తయారు చేస్తూ, నమ్మకంగా ఉండడంతో బంగారు వ్యాపారులు కిలోల కొద్ది బంగారం ఇచ్చి అభరణాలు చేయించుకునే వారు. ఇలా ఆర్మూర్, నందిపేట్, నిర్మల్ ప్రాంతాలకు చెందిన బంగారు వ్యాపారులు కలిసి నాలుగు కిలోల బంగారాన్ని ఇచ్చారు. పెద్ద మొత్తంలో బంగారం అతని వద్ద ఉండటంతో భూపాల్‌కు దురాలోచన కలిగింది. దీంతో నాలుగు రోజుల క్రితం బంగారంతో ఉడాయించాడు. అయితే, ఆభరణాలు చేయాలని బంగారం ఇచ్చిన జక్రాన్‌పల్లి మండలం మునిపల్లికి చెందిన వ్యాపారి ఆరే శివకుమార్ ఈ నెల 23న వెళ్లగా షాప్ మూసి ఉంది. మిగతా వ్యాపారులు కూడా అక్కడకు చేరుకోవడంతో భూపాల్ ఉడాయించినట్లు తేలింది. శివకుమార్ ఫిర్యాదుతో పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఆర్మూర్ ఏసీపీ శివకుమార్ పర్యవేక్షణలో టౌన్ సీఐ సీతారాం, ఎస్సై గోపీ ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ రాములు, కానిస్టేబుల్ మల్లేశ్ నాగ్‌పూర్ వెళ్లారు. నిందితుడు కటక్ వెళ్లినట్లు గుర్తించి అతడ్ని పట్టుకున్నారు. పోలీసుల ఎదుట తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఇతడ్ని అరెస్టు చేసే ముందు ఆర్మూర్ పోలీసులు కటక్ మేజిస్ట్రేట్ ఎదుట శుక్రవారం హాజరు పరిచారు. అనంతరం అరెస్టు చేసి శనివారం ఆర్మూర్‌కు తీసుకువచ్చారు. నిందితుడి నుంచి 3.05 కిలో బంగారు అభరణాలు, 6 డైమండ్లు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
అరచేతిలో నగల డిజైన్
‘గోల్డ్‌స్మిత్’ యాప్ ఆభరణాలంటే ఎవరికి మక్కువుడదు చెప్పండి? కానీ వాటి ఎంపికలోనే సవాలక్ష సందేహాలు. ఏ ట్రెండ్ నడుస్తుందో.. ఏ ఆభరణాలకు ఏ డిజైన్స్ నప్పుతాయో తెలుసుకోవటం ఒకింత కష్టమే. దీన్ని ఈజీ చెయ్యటానికంటూ అందుబాటులోకి వచ్చింది ‘గోల్డ్‌స్మిత్’ యాప్. దీంతో ఆభరణాల డిజైన్లను అరచేతిలో చూసేయొచ్చు. ఈ ఆండ్రారుుడ్ యాప్ గురించి మరిన్ని వివరాలు ఫౌండర్ ప్రసాద్ ఆకిన మాటల్లోనే... వృత్తి పరంగా నేను గోల్డ్‌స్మిత్‌ను కావటంతో డిజైన్ల రూపకల్పనలో తయారీదారులు, ఎంపికలో కస్టమర్లు పడే గందరగోళం నాకు తెలుసు. ఒక తయారీదారుడు చేసిన డిజైన్ కంటే మరో డిజైన్ అద్భుతంగా ఉండొచ్చు. అసలు ఆభరణాల పరిశ్రమలో తయారీదారులు చేస్తున్న డిజైన్స తెలుసుకోవటమెలా? అనే ప్రశ్నలోంచి పుట్టిందే గోల్డ్ స్మిత్ యాప్. లక్షన్నర పెట్టుబడితో ఈ యాప్‌ను అభివృద్ధి చేశాం. ⇔ స్థానిక ఆభరణాల తయారీదారులు చేసిన నగలు, ఉంగరాలు, వడ్డాణం, చెవి దిద్దుల వంటి అన్ని రకాల ఆభరణాల డిజైన్లూ ఈ యాప్‌లో ఉంటారుు. అన్నీ 916 కేడీఎం ఆభరణాలే. ⇔ప్రస్తుతం యాప్‌లో విజయవాడ, హైదరాబాద్, నెల్లూరు, విశాఖపట్నం వంటి నగరాల నుంచి సుమారు 2,000 మంది యారీదారులు, వారి డిజైన్స సుమారు 1,500లకు పైగా ఉన్నారుు. ⇔ తయారీదారులు తమ డిజైన్సను అప్లోడ్ చేయాలంటే ముందు యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని సంబంధిత ఆభరణం, డిజైన్ పేరు నమోదు చేసి ఆ తర్వాత ధర, తయారీదారుడి ఫోన్ నంబరు ఇతర వివరాలు ఇవ్వాలి. ⇔ కస్టమర్లు తమకు కావాల్సిన డిజైన్లను ఎంచుకోవచ్చు. ఒక తయారీదారుడి దగ్గర కస్టమర్ కోరుకునే డిజైన్ లేకపోతే... ఆ డిజైన్‌ను ఈ యాప్‌లో ఎంటర్ చేస్తే.. అది ఎక్కడుందో, ఎవరు తయారు చేశారో వెంటనే తెలిసిపోతుంది. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... గమనిక: స్టార్టప్ మెయిల్‌కు పలువురు వారి వ్యాపారాల వివరాలను పంపిస్తున్నారు. వీటిని పరిశీలించి, అర్హమైనవి ప్రచురిస్తున్నాం. ఎక్కువ వస్తుండటం వల్ల ప్రచురణలో కొంత ఆలస్యం జరగవచ్చు. -
స్వర్ణకారుడు ఆత్మహత్య
నంద్యాల: అప్పుల భారంతో నంద్యాలకు చెందిన స్వర్ణకారుడు రామాయణం రాజు(40) ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజు స్థానిక బైర్మల్వీధిలోని పాత బాలికోన్నత పాఠశాల ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. రెడీమెడ్ నగల రాకతో సరిగ్గా పనులు జరగక కుటుంబ పోషణ భారమైంది. చేసిన అప్పులు సుమారు రూ. 8లక్షలు తీర్చే దారి లేకపోవడం.. రుణదాత ఒత్తిళ్ల నేపథ్యంలో మూడు నెలల క్రితం అదశ్యమయ్యాడు. అయితే శనివారం రాత్రి ఇంటికి చేరుకొని కొద్దిసేపు భార్య, కుటుంబ సభ్యులతో గడిపాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతనికి భార్య పుణ్యవతి, ముగ్గురు పిల్లలు సంతానం. ప్రియశ్రీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, హారిక 10వ తరగతి, కుమారుడు జయసింహ 10వ తరగతి చదువుతున్నారు. వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
లండన్ ఎన్నికల్లోనూ మోదీ కార్డ్!
ఎక్కడ లండన్.. ఎక్కడ మోదీ! చాలా దూరం ఉంది కదూ.. కానీ లండన్‌లో జరుగుతున్న మేయర్ ఎన్నికల్లో ఓ అభ్యర్థి మోదీ కార్డును వాడుతున్నాడట. అవును.. తన ప్రత్యర్థి మీద పైచేయి సాధించడం కోసం అక్కడ కన్సర్వేటివ్ పార్టీ తరఫున పోటీచేస్తున్న జాక్ గోల్డ్‌స్మిత్ ఇప్పుడు మోదీ జపం చేస్తూ.. ఆ కార్డునే ఉపయోగిస్తున్నాడు. దానికి కారణం లేకపోలేదు.. అతడి మీద పోటీ చేస్తున్న పాకిస్థానీ మూలాలున్న సాదిక్ ఖాన్ ప్రస్తుతం కొంత ముందంజలో ఉన్నారు. దాంతో లండన్ నగరంలో ఉన్న హిందూ, సిక్కు ఓటర్ల మనసు గెలుచుకుని, వాళ్ల ఓట్లతో కొంత ముందడుగు వేద్దామని చూస్తున్న గోల్డ్‌స్మిత్ మోదీ జపం అందుకున్నాడు. ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్ నగరాల్లో ఇప్పుడు మేయర్ ఎన్నికలు జరుగుతున్నాయి. వాటితో పాటే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. వీటన్నింటిలో లండన్ మేయర్ పదవికే ఎక్కువ క్రేజ్ ఉంది. ప్రస్తుత ట్రెండును బట్టి 2005 నుంచి టూటింగ్ ఎంపీగా వ్యవహరిస్తున్న ఖాన్ విజేత అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయన తండ్రి మాజీ బస్సు డ్రైవర్. 2009-10 సంవత్సరాల మధ్య నాటి ప్రధాని గార్డన్ బ్రౌన్ మంత్రివర్గంలో ఖాన్ రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు. కేబినెట్ సమావేశాలకు హాజరైన తొలి ముస్లిం మంత్రిగా కూడా ఆయన పేరుపొందారు. ఎన్నికలకు ముందు నిర్వహించిన సర్వేలలో ఖాన్‌కు 48 శాతం మంది మద్దతు లభించగా, గోల్డ్‌స్మిత్‌కు మాత్రం 32 శాతమే వచ్చింది. దాంతో ఎలాగోలా హిందూ, సిక్కు ఓట్లను పొందితే ఈ మార్జిన్ కొంతవరకు తగ్గుతుందన్న ఆశతో గోల్డ్‌స్మిత్ ఇప్పుడు మోదీ మంత్రం జపిస్తూ.. భారతీయులకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడట!! -
ఈగకు.. పసిడి హెల్మెట్
హైదరాబాద్ : రాజమౌళి 'ఈగ' సినిమాలో గ్రాఫిక్‌తో ఈగ ముఖానికి రక్షణ కవచం తయారు చేస్తే ..దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన స్వర్ణకారుడు బంగారంతో హెల్మెట్ రూపొందించారు. నల్గొండ జిల్లాకు చెందిన రాచకొండ రాజు సూక్ష వస్తువుల తయారీలో దిట్ట. చిన్న జాగ్రత్తతో ప్రాణాలను కాపాడుకోవచ్చన్న సందేశంతో 0.040 మిల్లీగ్రాముల బంగారం వినియోగించి ఈగ తలకు సరిపోయే హెల్మెట్‌ను తయారు చేశారు. సూక్ష్మ వస్తువులు తయారు చేసిన రాజు గతంలో పలు రికార్డులు సాధించారు.