ఆంగ్ల రచయిత ఆలివర్ గోల్డ్‌స్మిత్ (1728–74) ఒక్కపూట కడుపు నింపుకోవడానికి చిన్న చిన్న ఆర్టికల్స్ రాసేవాడు. ఒకసారి తానున్న గదికి అద్దె కట్టలేకుండా పోతున్నాననీ, ఇంటి యజమానురాలు తనపై అరెస్ట్ వారంటు తేవడానికి ప్రయత్నాలు చేస్తోందనీ కవి, నిఘంటుకారుడు శామ్యూల్ జాన్సన్‌కు ఉత్తరం పంపించాడు. జాన్సన్ కొంత డబ్బు పంపించాడు. తరువాత మిత్రుని పరిస్థితి ఎలావుందో చూద్దామని వచ్చాడు జాన్సన్. తను పంపిన డబ్బుతో వైన్ సేవిస్తూ ఇంటి యజమానురాలికి ధర్మోపన్యాసాలు ఇస్తున్న గోల్డ్‌స్మిత్ కనిపించాడు. ‘‘నీ ఉపన్యాసాలకేంగానీ, డబ్బు సంపాయించే మార్గాలేమైనా ఉన్నాయా?’’ అని కొంత కటువుగానే అన్నాడు జాన్సన్. అప్పుడు గోల్డ్‌స్మిత్ తన కాగితాల్లోంచి ఓ రాతప్రతిని తీసి చేతిలో పెట్టాడు. దాన్ని జాన్సన్ ఓ ప్రచురణకర్తకు 60 పౌండ్లకు అమ్మాడు. అదే ‘ద వికార్ ఆఫ్ వేక్‌ఫీల్డ్’ నవల (1766).
అయినాల కనకరత్నాచారి
డబ్బు సంగతి చూడు
Published Mon, Sep 16 2019 1:14 AM | Last Updated on Mon, Sep 16 2019 1:14 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment