కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమైన సినీ ప్రముఖులు వారి వారి ఫ్యామిలీలతో జాలీగా గడుపుతున్నారు. అందుకు సంబంధించిన విశేషాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మాత్రం ఈ సమయంలో తన పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. తన కంశాలి వృత్తిని గుర్తుచేసుకున్నారు. అలాగే ఇంట్లో మిగిలి పోయిన గజ్జెలతో తన భార్య, పిల్లల కోసం.. మెట్టెలు, గజ్జెలు స్వయంగా ఆయన చేతులతో తయారు చేశారు. తనదైన శైలిలో ‘బి ది రియల్ మ్యాన్’ చాలెంజ్‌ను పూర్తి చేశాడు.
ఇందుకు సంబంధించిన వీడియోను సంపూర్ణేష్ బాబు ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘రాజు పేద తేడా లేదు. నీ ఆస్తి, డబ్బు.. నీ వెనక రావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మర్చిపోవద్దు, గుర్తుచేసుకుంటున్న సమయం ఇది. మా ఆవిడ కోసం, పిల్లల కోసం నా పాత "కంశాలి"వృత్తి ని గుర్తు చేసుకుంటూ ఇంట్లో మిగిలిన గజ్జెలతో, తనకి కాలి మెట్టెలు, పిల్లల కోసం గజ్జెలు చేయించి ఇచ్చాను’ అని సంపూ పేర్కొన్నారు. అలాగే లాక్‌డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ చారిటీ సంపూ రూ. లక్ష రూపాయలు విరాళం అందించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment