
సంపూర్ణేష్ బాబు, సంజోష్ హీరోలుగా మన్‌మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో చంద్ర చగంలా నిర్మించిన చిత్రం ‘సోదరా’. ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ– ‘‘అన్నదమ్ముల అనుబంధాన్ని ‘సోదరా’ గొప్పగా చూపించనుంది. మంచి కుటుంబ కథా చిత్రం ఇది. మన జీవితాల్లోని సంఘటనలు గుర్తుకు వస్తాయి.
నేను నరసింహాచారి (సంపూర్ణేష్ బాబు అసలు పేరు)లా ఎలా ఉంటానో ఈ సినిమాలో అలా చేశాను. ఈ సినిమాలో భావోద్వేగాలతో పాటు హాస్యం కూడా ఉంది. ప్రస్తుతం కొన్ని సినిమాలతో పాటు ‘సూపర్ సుబ్బు’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాను. ఇక నాకైతే ‘ఏ’ సినిమాలో ఉపేంద్రలాంటి పాత్ర చేయాలని ఉంది’’ అని తెలిపారు.
సంజోష్ మాట్లాడుతూ – ‘‘సోదరా’లో అమాయకుడైన అన్నగా సంపూర్ణేష్ బాబు, అప్‌డేటెడ్ తమ్ముడు పాత్రలో నేను నటించాం. ఈ సినిమాతో ప్రేక్షకులను నవ్విస్తాం... ఏడిపిస్తాం. ఇక నేను హీరోగా జూన్‌లో ఓ కొత్త సినిమా ప్రారంభం కానుంది. ఇందులో ఇగోయిస్ట్ ΄పోలీసాఫీసర్‌గా కనిపిస్తా. ఇగోయిస్ట్ ΄పోలీసాఫీసర్‌కి, ఓ కామన్‌మ్యాన్‌కి మధ్య జరిగే పోరే ఈ సినిమా’’ అన్నారు.