Sanjosh
-
ఉపేంద్రలాంటి పాత్ర చేయాలని ఉంది : సంపూర్ణేష్ బాబు
సంపూర్ణేష్ బాబు, సంజోష్ హీరోలుగా మన్మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో చంద్ర చగంలా నిర్మించిన చిత్రం ‘సోదరా’. ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ– ‘‘అన్నదమ్ముల అనుబంధాన్ని ‘సోదరా’ గొప్పగా చూపించనుంది. మంచి కుటుంబ కథా చిత్రం ఇది. మన జీవితాల్లోని సంఘటనలు గుర్తుకు వస్తాయి. నేను నరసింహాచారి (సంపూర్ణేష్ బాబు అసలు పేరు)లా ఎలా ఉంటానో ఈ సినిమాలో అలా చేశాను. ఈ సినిమాలో భావోద్వేగాలతో పాటు హాస్యం కూడా ఉంది. ప్రస్తుతం కొన్ని సినిమాలతో పాటు ‘సూపర్ సుబ్బు’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాను. ఇక నాకైతే ‘ఏ’ సినిమాలో ఉపేంద్రలాంటి పాత్ర చేయాలని ఉంది’’ అని తెలిపారు. సంజోష్ మాట్లాడుతూ – ‘‘సోదరా’లో అమాయకుడైన అన్నగా సంపూర్ణేష్ బాబు, అప్డేటెడ్ తమ్ముడు పాత్రలో నేను నటించాం. ఈ సినిమాతో ప్రేక్షకులను నవ్విస్తాం... ఏడిపిస్తాం. ఇక నేను హీరోగా జూన్‌లో ఓ కొత్త సినిమా ప్రారంభం కానుంది. ఇందులో ఇగోయిస్ట్ ΄పోలీసాఫీసర్‌గా కనిపిస్తా. ఇగోయిస్ట్ ΄పోలీసాఫీసర్‌కి, ఓ కామన్‌మ్యాన్‌కి మధ్య జరిగే పోరే ఈ సినిమా’’ అన్నారు. -
వేసవిలో సోదరా
సంపూర్ణేష్ బాబు, సంజోష్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సోదరా’. ప్రాచీ బంసాల్, ఆరతి గుప్తా, బాబా భాస్కర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో చంద్ర చగంలా నిర్మించారు. ఈ సినిమాను ఏప్రిల్ 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ– ‘‘అన్నదమ్ముల అనుబంధం ఎంత గొప్పదో అందరికీ తెలుసు. అలాంటి అన్నదమ్ముల అనుబంధాన్ని వెండితెరపై ఆవిష్కరించనున్న సినిమాయే ‘సోదరా’. ఈ వేసవికి ఈ సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘సంపూర్ణేష్‌బాబు నుంచి ప్రేక్షకులు ఆశిస్తున్న ఎంటర్టైన్మెంట్తో పాటు ఆయనలోని మరో కోణాన్ని ప్రేక్షకులు ఈ చిత్రంలో చూడబోతున్నారు’’ అని తెలిపారు చంద్ర చగంలా. ఈ సినిమాకు సంగీతం: సునీల్ కశ్యప్. -
నన్ను చూసినావే పిల్ల!
సంపూర్ణేష్ బాబు, సంజోష్,ప్రాచీ బంసాల్, ఆర్తి గుప్తా ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం ‘సోదరా’. మన్మోహన్ మేనంపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. క్యాన్స్ ఎంటర్టైన్మెంట్స్, మాంక్ ఫిల్మ్స్‌పై చంద్ర చగంలా నిర్మిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘నన్ను చూసినావే పిల్ల.. నా కలలే నిజమయ్యేలా...’ అంటూ సాగే రెండో పాటని విడుదల చేశారు మేకర్స్. ‘‘సోదరా’ నుంచి ఇప్పటికే రిలీజైన ‘అన్నంటే దోస్తే సోదరా..’ అనే తొలి పాటకి మంచి స్పందన వచ్చింది. ‘నన్ను చూసినావే పిల్ల..’ పాట ఫ్రెష్ ఫీల్‌తో మంచి లవ్ రొమాంటిక్‌గా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: జాన్. -
అన్నదమ్ముల అనుబంధం
సంపూర్ణేష్ బాబు, సంజోష్, ్ర΄ాచీ బన్సాల్, ఆర్తీ గు΄్తా కీలక ΄ాత్రల్లో నటించిన చిత్రం ‘సోదరా’. మన్మోహన్ మేనంపల్లి దర్శకత్వం వహించారు. చంద్ర చంగళ్ల నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని నిర్మాత వివేక్ కూచిభొట్ల రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో వినోదాత్మకంగా ‘సోదరా’ను రూ΄÷ందించాం. ఇటీవలే విడుదలైన మోషన్ ΄ోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాని త్వరలోనే విడుదల చేయనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: జాన్. -
సంజోష్ హీరోగా కొత్త చిత్రం
బేవర్స్ చిత్రంతో హీరోగా తెరకు పరిచయం అయ్యాడు సంజోష్. రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో నటించిన ఆ చిత్రంలో సంజోష్ తన నటనతో అందరినీ మెప్పించాడు. ప్రస్తుతం ఆయన కౌముది సినిమాస్, కేన్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.2గా చంద్ర నిర్మిస్తోన్న సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరో సంజోష్ బర్త్ డే సందర్భంగా చిత్రయూనిట్ ప్రత్యేకంగా విషెస్ చెబుతూ, పోస్టర్‌ను రిలీజ్ చేసింది. (చదవండి: జులై 13 నాకు చాలా స్పెషల్ : సమంత) ఈ పోస్టర్లో సంజోష్ కూల్‌గా కనిపిస్తున్నాడు. పక్కింటి అబ్బాయిలా సహజంగా కనిపిస్తున్నాడు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతం అందించిన సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలు మేకర్లు త్వరలోనే ప్రకటించనున్నారు.