Bewars Movie Actor Sanjosh Latest Movie Update - Sakshi
Sakshi News home page

సంజోష్‌ హీరోగా కొత్త చిత్రం

Published Thu, Jul 13 2023 2:04 PM | Last Updated on Thu, Jul 13 2023 2:53 PM

Bewars Movie Fame Sanjosh Latest Movie Update - Sakshi

బేవర్స్ చిత్రంతో హీరోగా తెరకు పరిచయం అయ్యాడు సంజోష్. రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో నటించిన ఆ చిత్రంలో సంజోష్ తన నటనతో అందరినీ మెప్పించాడు. ప్రస్తుతం ఆయన కౌముది సినిమాస్, కేన్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం.2గా చంద్ర నిర్మిస్తోన్న సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరో సంజోష్ బర్త్ డే సందర్భంగా చిత్రయూనిట్ ప్రత్యేకంగా విషెస్ చెబుతూ, పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

(చదవండి: జులై 13 నాకు చాలా స్పెషల్‌ : సమంత)

ఈ పోస్టర్‌లో సంజోష్ కూల్‌గా కనిపిస్తున్నాడు. పక్కింటి అబ్బాయిలా సహజంగా కనిపిస్తున్నాడు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్  పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతం అందించిన సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలు మేకర్లు త్వరలోనే ప్రకటించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement