అరచేతిలో నగల డిజైన్
‘గోల్డ్‌స్మిత్’ యాప్
ఆభరణాలంటే ఎవరికి మక్కువుడదు చెప్పండి? కానీ వాటి ఎంపికలోనే సవాలక్ష సందేహాలు. ఏ ట్రెండ్ నడుస్తుందో.. ఏ ఆభరణాలకు ఏ డిజైన్స్ నప్పుతాయో తెలుసుకోవటం ఒకింత కష్టమే. దీన్ని ఈజీ చెయ్యటానికంటూ అందుబాటులోకి వచ్చింది ‘గోల్డ్‌స్మిత్’ యాప్. దీంతో ఆభరణాల డిజైన్లను అరచేతిలో చూసేయొచ్చు. ఈ ఆండ్రారుుడ్ యాప్ గురించి మరిన్ని వివరాలు ఫౌండర్ ప్రసాద్ ఆకిన మాటల్లోనే...
వృత్తి పరంగా నేను గోల్డ్‌స్మిత్‌ను కావటంతో డిజైన్ల రూపకల్పనలో తయారీదారులు, ఎంపికలో కస్టమర్లు పడే గందరగోళం నాకు తెలుసు. ఒక తయారీదారుడు చేసిన డిజైన్ కంటే మరో డిజైన్ అద్భుతంగా ఉండొచ్చు. అసలు ఆభరణాల పరిశ్రమలో తయారీదారులు చేస్తున్న డిజైన్‌స తెలుసుకోవటమెలా? అనే ప్రశ్నలోంచి పుట్టిందే గోల్డ్ స్మిత్ యాప్. లక్షన్నర పెట్టుబడితో ఈ యాప్‌ను అభివృద్ధి చేశాం.
⇔ స్థానిక ఆభరణాల తయారీదారులు చేసిన నగలు, ఉంగరాలు, వడ్డాణం, చెవి దిద్దుల వంటి అన్ని రకాల ఆభరణాల డిజైన్లూ ఈ యాప్‌లో ఉంటారుు. అన్నీ 916 కేడీఎం ఆభరణాలే.
⇔ప్రస్తుతం యాప్‌లో విజయవాడ, హైదరాబాద్, నెల్లూరు, విశాఖపట్నం వంటి నగరాల నుంచి సుమారు 2,000 మంది యారీదారులు, వారి డిజైన్‌స సుమారు 1,500లకు పైగా ఉన్నారుు.
⇔ తయారీదారులు తమ డిజైన్‌సను అప్‌లోడ్ చేయాలంటే ముందు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని సంబంధిత ఆభరణం, డిజైన్ పేరు నమోదు చేసి ఆ తర్వాత ధర, తయారీదారుడి ఫోన్ నంబరు ఇతర వివరాలు ఇవ్వాలి.
⇔ కస్టమర్లు తమకు కావాల్సిన డిజైన్లను ఎంచుకోవచ్చు. ఒక తయారీదారుడి దగ్గర కస్టమర్ కోరుకునే డిజైన్ లేకపోతే... ఆ డిజైన్‌ను ఈ యాప్‌లో ఎంటర్ చేస్తే.. అది ఎక్కడుందో, ఎవరు తయారు చేశారో వెంటనే తెలిసిపోతుంది.
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...
గమనిక: స్టార్టప్ మెయిల్‌కు పలువురు వారి వ్యాపారాల వివరాలను పంపిస్తున్నారు. వీటిని పరిశీలించి, అర్హమైనవి ప్రచురిస్తున్నాం. ఎక్కువ వస్తుండటం వల్ల ప్రచురణలో కొంత ఆలస్యం జరగవచ్చు.