jewelry design
-
పెయింట్ పట్టు
చీరకు ప్రాణం వస్తే అది రవివర్మ చిత్రం!చీరపై చిత్రాన్ని గీస్తే అది రవివర్మకే విచిత్రం! స్త్రీని, ప్రకృతిని కలిపి అలా గీసినఈ హ్యాడ్ పెయింట్..ప్లెయిన్ పట్టు చీరలు పెళ్లిళ్లలో.. ఫంక్షన్లలో..రిసెప్షన్.. సంగీత్..ఇంకా కాక్టైల్ పార్టీలలో మీకు తెలియకుండానేమీ చేత క్యాట్‌వాక్ చేయిస్తాయి.మిమ్మల్ని స్పెషల్ గెస్ట్గానిలబెడతాయి. చీరే కాన్వాస్ స్పెషల్‌గా కనిపించాలంటే అందరూ ఎంచుకునేవి, ట్రెండ్‌లో ఉన్నవి, రెగ్యులర్ మార్కెట్లో ఉన్నవి పక్కన పెట్టేయాలి. ‘కళ’కు ఎప్పుడూ ఓ ప్రత్యేకత ఉంటుంది. ఒకే ఒక పీస్ ఉంటుంది. ఇప్పటి వరకు మనం కాటన్, ఆర్గంజా చీరల మీద ఫ్యాబ్రిక్ పెయింట్ చూశాం. అలాంటి చీరలు కట్టుకున్నాం. అదే తరహాలో పూర్తి ప్లెయిన్ పట్టు చీరను ఎంచుకొని దాని మీద చేత్తో పెయింట్ వేయడంతో ఇలా సరికొత్తగా ఆకట్టుకునేలా రెడీ అయ్యాయి. పక్షులు, లతలు, పువ్వులు.. ఇలా అభిరుచిని బట్టి వేసుకున్న లేదా వేయించిన పెయింటింగ్ శారీని కట్టుకుంటే వందమందిలో ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు. ప్యూర్ ప్లెయిన్ పట్టు చీరలు నాలుగైదు వేల రూపాయల్లో లభిస్తాయి. వీటిపై చేసిన హ్యాండ్ పెయింటింగ్‌ని బట్టి ధర వేలల్లో ఉంటుంది ►ప్రింట్ హెవీగా ఉన్నప్పుడు బ్లౌజ్ ప్లెయిన్‌గా ఉండాలి. కొంత డిజైన్ కావాలనుకుంటే లేస్ ఫ్యాబ్రిక్‌ని ఎంచుకోవచ్చు ►చీర ప్రత్యేకత తగ్గకూడదు కాబట్టి ఇలాంటి స్పెషల్ వేర్కి బంగారు ఆభరణాలు పూసల హారాలను ఎంచుకోవాలి. వాటిలో ముత్యాలు, కెంపులు, పచ్చలు.. వంటి బీడ్స్ హారాలు తీసుకోవాలి ►చేతులకు గాజులు కాకుండా ఒక చేతికి బ్రేస్లెట్, మరో చేతికి మంచి వాచీ ధరించాలి. మోడ్రన్ క్లచ్ చేత్తో పట్టుకోవాలి ►కేశాలంకరణకు వస్తే జుట్టును ముడివేయకుండా వదిలేయాలి. లేదంటే, ప్రెంచ్ ప్లాట్ వంటి పాశ్చాత్య హెయిర్‌స్టైల్స్‌ను మరింత స్టైలిష్‌గా కనిపిస్తారు ►ఫ్రింట్‌ని హైలైట్ చేయాలనుకుంటే మిగతా మన అలంకరణ అంతా సింపుల్‌గా ఉండాలి మేకప్‌తో సహా! -
వజ్రాభరణమా? ధర్మాభరణమా?ర్మాభరణమా?
రాజ్యం, అధికారం, సంపదల కంటె సత్యం, ధర్మం ఎంతో విలువైనవిగా ఎంచి బుద్ధుడు అన్నిటినీ త్యజించి భిక్షువుగా మారాడు. భిక్షుసంఘాన్ని స్థాపించి ధర్మప్రబోధాలు చేస్తూ దేశదేశాలు తిరుగుతున్నాడు.శాక్యవంశానికి చెందిన యువరాజులు అనిరుత్థుడు, భిద్ధయుడు, ఆనందుడు, కింబిలుడు, దేవదత్తుడు అనే ఐదుగురు భిక్షువులుగా మారాలని నిర్ణయించుకున్నారు. ఒకరోజున వారు తమ ఇంట్లోని వారికి చెప్పకుండా బయలుదేరారు. వారు తమకు తోడుగా ఆస్థాన క్షురకుడైన ఉపాలిని వెంటతీసుకుని వెళ్లారు. నగర పొలిమేరలు దాటాక, వారు తాము ధరించిన విలువైన వస్త్రాల్ని, ఆభరణాల్ని తీసి మూటగట్టారు. నారబట్టలు ధరించారు. ఉపాలితో కేశఖండనం చేయించుకుని, ‘‘ఓ ఉపాలీ! విలువైన మా వస్త్రాలూ, ఆభరణాలూ నీవు తీసుకో: వాటితో జీవితాంతం హాయిగా జీవించు’’అని వెళ్లిపోయారు. ఆ మూటలు తీసుకుని వెనుదిరిగాడు ఉపాలి. కొంతదూరం పోయాక ఉపాలికి ఒక ఆలోచన వచ్చింది. ‘రాకుమారులు ఇంత విలువైన ఆభరణాలు త్యజించి, వాటిని గడ్డిపోచగా ఎంచి నాకు ఇచ్చేశారు. అంటే... వారు ఈ ఆభరణాల కంటె విలువైనదాన్ని పొందడం కోసమే ఈ పని చేసి ఉంటారు. మరి నాకెందుకూ ఈ ఆభరణాలు? నేను కూడా వారితోనే పోయి ఆ వెలలేని ఆభరణాల్ని పొందాలి’ అనుకుని ఆ వస్త్రాల్ని, మూటల్ని అక్కడే పడేసి, పరుగు పరుగున వచ్చి, వారిని కలిశాడు. ‘‘ఆ విలువైన ఆభరణాల్ని నీవు కూడా అందుకుందువుగాని రా’’ అని చెప్పి వారు తమ వెంట తీసుకుపోయారు. బుద్ధుడు ఆ ఆరుగురిలో ముందుగా ఉపాలికి దీక్ష ఇచ్చాడు. న వరత్నాలు పొదిగిన ఆభరణాల కంటె బుద్ధుడు ప్రవచించిన ధర్మం అనే ఆభరణమే విలువైనదని గ్రహించిన ఉపాలి, అతి తొందరలోనే అగ్రభిక్షువు కాగలిగాడు. ఉపాలికి బౌద్ధసంఘంలో ఎంతటి గౌరవం దక్కిందంటే... బుద్ధుడు నిర్వాణం పొందిన మూడు నెలలకి జరిగిన మొదటి బౌద్ధ సంగీతికి అతడే అధ్యక్షుడు. త్రిపిటకాలలో భిక్షు నియమావళిని బోధించే వినయపిటకం కూర్పుకు సారథి. రత్నాభరణాల్ని వదిలి ధర్మాభరణాన్ని ధరించిన ఉపాలి బౌద్ధసంఘంలో ఒక వజ్రంలా ప్రకాశించాడు. -
భేరుండ బ్రహ్మాండ
గండ భేరుండం అంటే చాలా పెద్దది.. గొప్పది అని అర్థం.పట్టు, డిజైనర్ చీరల మీద.. ఆభరణాల మీదగండభేరుండ చిహ్నం గొప్ప లుక్‌ని, గ్రాండ్‌నెస్‌ని తీసుకొస్తుంది.రాచరికపు హంగు ఈ చిహ్నం సొంతం. అందుకే ఇప్పుడు ఫ్యాషన్ ఆకాశంలో గండభేరుండం ఎగురుతోంది.కొన్నిసార్లు జీవితంలో అంతగా పట్టింపులేని, పట్టించుకోని అంశాల వెనుక ఓ పెద్ద చరిత్ర ఉంటుంది. వాటి పూర్వాపరాలు తెలుసుకునే ప్రయత్నంలో కళాకారుల సృష్టి వెనక దాగున్న ఎన్నో నిజాలు తెలుస్తాయి. ఆ కోవకి చెందినదే గండభేరుండ. వస్త్రాల మీద, ఆభరణాల పైనా గ్రాండ్‌గా కొలువు దీరుతోంది. ఒక శరీరం రెండుతలలు గండభేరుండ అనేది రెండుతలల పక్షి. ఈ పక్షి ప్రాచీనకాలంలో ఉన్నట్లు రుజువులు లేవు. ఇదొక పౌరాణిక గాధ అని చెబుతారు. వేల ఏళ్ల క్రితం గండభేరుండకు సంబంధించి కథనాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో– రాక్షసుడైన హిరణ్యకశిపుడిని సంహరించిన నరసింహస్వామిని శాంతింపజేయడానికి శివుడు శరభ మృగ రూపం ధరించాడని, దానిని ఎదిరించేందుకు నరసింహస్వామి అయిన విష్ణువు రెండుతలలతో, విశాలమైన రెక్కలతో, పదునైన కోరలతో, నల్లని రూపంతో గండభేరుండంలా అవతరించాడని.. అది గరుత్మంతునికన్నా బలమైనదని కథనాలు ఉన్నాయి. కర్నాటకలోని బేలూర్‌లో గల చెన్నకేశవాలయంలో గల గండభేరుండ శిల్పాకృతి ప్రకృతిలోని జీవులన్నింటిలో గండభేరుండం బలమైనదని చాటుతుంది. గ్రాండ్‌గా ఆవిష్కరించారు దక్షిణభారతదేశంలో గండభేరుండకు గల ఘనమైన ఖ్యాతి చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. దేవాలయాల మీద, చారిత్రక కట్టడాల మీద రాచరికానికి హంగుగా ఉన్న భేరుండాన్ని పట్టుదారాలతో చీరల మీద చిత్రించారు నేతకారులు. అపారమైన దైవశక్తికి ప్రతీకగా ఉండే గండభేరుండం డిజైన్‌తో పల్లూ మొత్తం నింపేశారు. మోటిఫ్స్‌గా చిన్న చిన్న భేరుండ బొమ్మలను తీసుకున్నారు. ఆభరణాలలో భేరుండం స్వర్ణకారుల ఆభరణాలలోనూ గండభేరుండం అందంగా అమరింది. ముత్యాలు, రత్నాలతో ముచ్చటైన రూపం సంతరించుకుంది. ఘన చరిత గల గండభేరుండ డిజైన్ ఉన్న చీర ఒక్కటైనా∙వార్డ్‌రోబ్‌లో ఉండాలని, తమ ఆభరణాలలో చిన్న రూపుగా అయినా కావాలని కోరుకుంటున్నారు. ప్రాచీన కళలోని గ్రాండ్‌నెస్‌ను ఇష్టపడుతున్నారు కనుకే గండభేరుండ గ్రాండ్‌గా వెలిగిపోతోంది. రాచరికపు హంగు కర్నాటకలోని వొడయార్ రాజుల పాలనలో తమ రాజ్యశక్తికి గండభేరుండ చిహ్నాన్ని వాడేవారు. స్వాతంత్య్రానంతరం కర్నాటక ప్రభుత్వం గండభేరుండ పక్షిని తమ రాష్ట్ర అధికారిక చిహ్నంగా తీసుకుంది. మైసూర్ప్యాలెస్ ద్వారం మీదా ఈ పక్షి రూపం చూడచ్చు. తెలుగునాట కాకతీయుల చారిత్రక కట్టడాల మీద, రామేశ్వరం, బృహదీశ్వరం వంటి ప్రాచీన దేవాలయాల మీదా ఈ పక్షి రూపాన్ని తిలకించవచ్చు. విజయనగర సామ్రాజ్యాధీశులు 500 ఏళ్లక్రితమే భేరండ చిహ్నాన్ని తమ అధికారక నాణేల మీద వాడినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. - నిర్వహణ: ఎన్.ఆర్. -
బెంట్లీ కారు..ఇటాలియన్ సూటు
సాక్షి నాలెడ్జ్ సెంటర్: దేశంలోని బ్యాంకుల్లో దాదాపు రూ.4,500 కోట్ల మేర అప్పులు చేసి, పంజాబ్ నేషనల్ బ్యాంకుకు ఎల్ఓయూల పేరిట రూ.11,400 కోట్ల కుచ్చుటోపీ పెట్టి దేశాన్ని దాటేసిన నీరవ్ దీపక్ మోదీ.. అమెరికాలో తలదాచుకున్నట్టు వార్తలొస్తున్నాయి. అక్కడ కూడా ఆయన విలాసాలకు కొదవేం లేదని తెలుస్తోంది. న్యూయార్క్‌లోని అత్యంత ఖరీదైన హోటల్లో రోజుకు రూ.75 వేల అద్దె ఉండే సూట్‌ను ఏకంగా 90 రోజుల పాటు బుక్ చేసుకున్నట్లు ఓ ఆంగ్ల పత్రిక శనివారం వెల్లడించింది. అంటే.. కేవలం మూడు నెలల అద్దె దాదాపు రూ.70 లక్షలు! ఇక భార్య అమీ, ముగ్గురు పిల్లలతో ఉంటారు కనక మిగతా ఖర్చుల్ని ఊహించలేం. అయినా ఖర్చెంతయితే ఏంటి చెప్పండి!! ఆయనకు రుణాలివ్వటానికి, ఎగ్గొడితే వాటిని ఎన్పీఏలుగా మార్చి మన నెత్తిన రుద్దటానికి మన బ్యాంకులు సిద్ధంగానే ఉన్నాయి కదా! బెల్జియంలో పుట్టుక.. భారత్‌లో వ్యాపారం అంతర్జాతీయ డైమండ్స్ కేంద్రం బెల్జియంలోని ఆంట్వర్ప్లో 1971లో పుట్టిన నీరవ్ మోదీ... అక్కడే పెరిగి పాఠశాల విద్యను పూర్తి చేసుకున్నాడు. అపర కుబేరుల పిల్లలు వ్యాపార రహస్యాలు తెలుసుకునే అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా వార్టన్ బిజినెస్ స్కూల్లో చేరినా... మధ్యలోనే చదువు ఆపేశాడు. భారత ఆర్థిక రాజధాని ముంబై చేరుకున్నాడు. అప్పటికే నీరవ్ మేనమామలు మెహుల్ చోక్సీ తదితరులు వజ్రాల వ్యాపారంలో ఉన్నారు. వారు గీతాంజలి జెమ్స్‌ను నడిపిస్తున్నారు. వారి వద్దే వజ్రాల వ్యాపారంలో ఓనమాలు దిద్దుకున్నాడు నీరవ్. తొమ్మిదేళ్లపాటు అక్కడే కొనసాగాడు. దశ మార్చిన ఆమె చెవి రింగులు మొదట్లో నీరవ్‌కు సంగీతంపై విపరీతమైన ఆసక్తి ఉండేది. చదువుకునే రోజుల్లో మ్యూజిక్ (ఆర్కెస్ట్రా) కండక్టర్ కావాలనేది ఆయన కోరిక. హైఫై సంగీత సాధనాలపై మోజుతో రణంగా బాంగ్, ఒలూఫ్సన్ వంటి ప్రఖ్యాత కంపెనీలకు పబ్లిసిటీ కూడా చేశాడు. అయితే అనుకోకుండా తన 37వ ఏట ఓ స్నేహితురాలి కోరిక మేరకు నీరవ్ ఆమె చెవి రింగుల్ని డిజైన్ చేశాడు. అవి తనకు నచ్చటంతో... నీరవ్ మోదీ బ్రాండ్ శకం మొదలైంది. అదే పేరుతో అత్యంత ఖరీదైన ఫ్యాషన్ వజ్రాభరణాల వ్యాపారంలోకి దిగాడు నీరవ్. ఫైర్‌స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ పేరిట సొంత కంపెనీని ఏర్పాటు చేశాడు. 2009లో ఆరంభమైన ఆభరణాల డిజైనింగ్.. నీరవ్‌కు ఊహించని స్థాయిలో ఆదాయాన్ని, పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చిపెట్టింది. అమెరికాలో ప్రఖ్యాత నగల కంపెనీ ఫ్రెడరిక్ గోల్డ్మన్లో భారీ వాటాను కొనుగోలు చేయడం నీరవ్ వ్యాపారాన్ని కొత్త మలుపు తిప్పింది. తన కంపెనీకన్నా ఏడు రెట్లు పెద్దదైన గోల్డ్‌మన్ కొనుగోలుతో ఆ దేశంలోని జేసీ పెనీ, సియర్స్, వాల్‌మార్ట్‌లో నీరవ్ మోదీ బ్రాండ్ ఆభరణాల అమ్మకాలు ఆరంభమయ్యాయి. హాంకాంగ్‌లో అంతర్జాతీయ ఖ్యాతి! లండన్ ప్రఖ్యాత వేలం సంస్థ క్రిస్టీస్ వేలం వస్తువుల కేటలాగ్ మొదటి పేజీలో నీరవ్ ఫొటోను ప్రచురించింది. ఈ అదృష్టం దక్కిన తొలి భారతీయుడు ఇతడే! ఆయన రూపొందించిన గోల్కొండ నెక్లెస్‌కు 2010లో హాంకాంగ్‌లో నిర్వహించిన ఈ వేలంలో దాదాపు 35 లక్షల డాలర్ల ధర పలికింది. 2012 అక్టోబర్‌లో మరో ప్రఖ్యాత వేలం సంస్థ సతబీజ్ హాంకాంగ్‌లోనే జరిపిన వేలంలో నీరవ్ డిజైన్ చేసిన రివియెరీ డైమండ్ నెక్లెస్ ఏకంగా 51 లక్షల డాలర్లకు అమ్ముడుపోయింది. దీంతో మరుసటేడాదే (2013లో) ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో తొలిసారి నీరవ్ పేరు చేరింది. నీరవ్ మోదీ, ఎ.జఫే పేరుతో నీరవ్ ఆభరణాల బ్రాండ్లు ప్రపంచ ప్రసిద్ధికెక్కాయి. ఈ రెండు బ్రాండ్లనూ వందేళ్ల చరిత్ర ఉన్న వాన్ క్లీఫ్, ఆర్పెల్స్, రిచ్‌మాంట్ ఎస్యేస్ కార్టియర్ వంటి ప్రఖ్యాత వజ్రాభరణాల బ్రాండ్లతో పోటీపడే స్థాయికి తీసుకెళ్లాడు నీరవ్. బ్రాండ్లేని ఆభరణాలను తయారు చేయించి అమెరికాలోని ఇతర కంపెనీలకు సరఫరా చేసేవాడు. ప్రముఖ హాలీవుడ్ తార కేట్ విన్స్లెట్... నీరవ్ రూపొందించిన డైమండ్ నెక్లెస్ ధరించి 2016 ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి హాజరైంది. ట్రంప్ చేతుల మీదుగా న్యూయార్క్ షోరూం 2013లో భారత బిలియనీర్ల జాబితాలో చోటుతో నీరవ్ పేరు ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. 2015లో న్యూయార్క్ లోని మాడిసన్ అవెన్యూలో నీరవ్ డైమండ్స్ షోరూమ్‌ను అప్పటి రియల్ ఎసేŠట్ట్ వ్యాపారి, ఇప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించడంతో మోదీ జీవనశైలి ఒక్కసారిగా మారిపోయింది. ఆయన విలాసవంత జీవితం అప్పట్నుంచే వెలుగులోకి వచ్చింది. కళ్లు చెదిరే పార్టీలు వ్యాపారవృద్ధి ప్రయత్నాల్లో భాగంగా అనేక ప్రపంచ నగరాల్లో నీరవ్ ఇచ్చిన అత్యంత ఖరీదైన విందుల గురించి వింటే కళ్లు బైర్లు కమ్ముతాయి. వాటి వివరాలన్నీ అగ్ర శ్రేణి పత్రికలు, మేగజీన్లలో వచ్చేవి. నీరవ్ మోదీ వజ్రాభరణాలకు ప్రియాంకా చోప్రా, రోసీ హటింగ్టన్ వైట్లీ, ఆండ్రియా దియాకొను వంటి అగ్రశేణి తారలు, మోడల్స్ ప్రచారకర్తలుగా ఉండటంతో ఆయన పార్టీలకు ఆహ్వానం అందటమే గొప్ప విషయంగా మారింది. కిందటి నవంబర్‌లో ముంబైలోని ఫోర్‌సీజన్స్ హోటల్లో నీరవ్ ఇచ్చిన విందు గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. ఎందుకంటే స్టార్ షెఫ్ మసీమో బొతూరా ఆధ్వర్యంలో ఈ పార్టీ అతి«థుల కోసం ప్రత్యేక వంటకాలు తయారు చేశారు. ఇటలీకి చెందిన బొతూరా సొంత రెస్టారెంట్ మోడెనా ఇటీవల ప్రపంచంలోనే 50 అత్యుత్తమ రెస్టారెంట్లలో ఒకటిగా ఎన్నికైంది. అక్కడ సీటును మూడు నెలల ముందే రిజర్వు చేసుకోవాలంటే ఆయనకున్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. మోడల్ లీసా కోసం ప్రత్యేక విందు! తన బ్రాండ్ అంబాసిడర్లకు అట్టహాసంగా విందులు, విలువైన బహుమతులు ఇవ్వటం నీరవ్‌కు అలవాటే. టాప్ మోడల్, హాలీవుడ్ నటి లీసా హేడన్ కిందటేడాది మగబిడ్డను ప్రసవించిన కొన్ని నెలలకు ఆయన ఆమెకు పారిస్‌లో మంచి పార్టీ ఇచ్చారు. ఈ విందులో నీరవ్ డిజైన్ చేసిన పియర్ ఎమరాల్డ్ గొలుసును ధరించారు లీసా. అత్యంత ఖరీదైన బెంట్లీ కార్లలో తిరగడంతోపాటు ఇటాలియన్ సూట్లు ధరించడం ఈ వజ్రాల వ్యాపారికి చాలా ఇష్టం. ముంబై కాలా ఘోడా ప్రాంతంలో 70 ఏళ్లపాటు సాగిన మ్యూజిక్ స్టోర్ రిదమ్ హౌస్‌ను కిందటేడాది రూ.25 కోట్లకు కొనుగోలు చేసి కొత్త వజ్రాల షోరూం ప్రారంభించాడు నీరవ్. 2017 ఫోర్బ్స్ జాబితాలో... నీరవ్‌కు 2017 ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 1,234వ ర్యాంక్ లభించింది. భారత అపర కుబేరుల లిస్టులో ఈయనది 85వ స్థానం. వజ్రాభరణాల డిజైనింగ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న జువెలరీ రిటైల్ వ్యాపారాల ద్వారా ఆయనకున్న ఆర్థిక సంపద రూ.లక్ష కోట్లపైనేనని అంచనా వేశారు. లండన్, న్యూయార్క్, పారిస్ నగరాల్లో జరిగే ఆభరణాల ప్రదర్శనల్లో ప్రఖ్యాత అంతర్జాతీయ తారలు, మోడల్స్ నీరవ్ బ్రాండ్ నగలు ధరించి చేసిన క్యాట్‌వాక్‌లు అమ్మకాలు విపరీతంగా పెరగడానికి దోహదం చేశాయి. -
అరచేతిలో నగల డిజైన్
‘గోల్డ్‌స్మిత్’ యాప్ ఆభరణాలంటే ఎవరికి మక్కువుడదు చెప్పండి? కానీ వాటి ఎంపికలోనే సవాలక్ష సందేహాలు. ఏ ట్రెండ్ నడుస్తుందో.. ఏ ఆభరణాలకు ఏ డిజైన్స్ నప్పుతాయో తెలుసుకోవటం ఒకింత కష్టమే. దీన్ని ఈజీ చెయ్యటానికంటూ అందుబాటులోకి వచ్చింది ‘గోల్డ్‌స్మిత్’ యాప్. దీంతో ఆభరణాల డిజైన్లను అరచేతిలో చూసేయొచ్చు. ఈ ఆండ్రారుుడ్ యాప్ గురించి మరిన్ని వివరాలు ఫౌండర్ ప్రసాద్ ఆకిన మాటల్లోనే... వృత్తి పరంగా నేను గోల్డ్‌స్మిత్‌ను కావటంతో డిజైన్ల రూపకల్పనలో తయారీదారులు, ఎంపికలో కస్టమర్లు పడే గందరగోళం నాకు తెలుసు. ఒక తయారీదారుడు చేసిన డిజైన్ కంటే మరో డిజైన్ అద్భుతంగా ఉండొచ్చు. అసలు ఆభరణాల పరిశ్రమలో తయారీదారులు చేస్తున్న డిజైన్స తెలుసుకోవటమెలా? అనే ప్రశ్నలోంచి పుట్టిందే గోల్డ్ స్మిత్ యాప్. లక్షన్నర పెట్టుబడితో ఈ యాప్‌ను అభివృద్ధి చేశాం. ⇔ స్థానిక ఆభరణాల తయారీదారులు చేసిన నగలు, ఉంగరాలు, వడ్డాణం, చెవి దిద్దుల వంటి అన్ని రకాల ఆభరణాల డిజైన్లూ ఈ యాప్‌లో ఉంటారుు. అన్నీ 916 కేడీఎం ఆభరణాలే. ⇔ప్రస్తుతం యాప్‌లో విజయవాడ, హైదరాబాద్, నెల్లూరు, విశాఖపట్నం వంటి నగరాల నుంచి సుమారు 2,000 మంది యారీదారులు, వారి డిజైన్స సుమారు 1,500లకు పైగా ఉన్నారుు. ⇔ తయారీదారులు తమ డిజైన్సను అప్లోడ్ చేయాలంటే ముందు యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని సంబంధిత ఆభరణం, డిజైన్ పేరు నమోదు చేసి ఆ తర్వాత ధర, తయారీదారుడి ఫోన్ నంబరు ఇతర వివరాలు ఇవ్వాలి. ⇔ కస్టమర్లు తమకు కావాల్సిన డిజైన్లను ఎంచుకోవచ్చు. ఒక తయారీదారుడి దగ్గర కస్టమర్ కోరుకునే డిజైన్ లేకపోతే... ఆ డిజైన్‌ను ఈ యాప్‌లో ఎంటర్ చేస్తే.. అది ఎక్కడుందో, ఎవరు తయారు చేశారో వెంటనే తెలిసిపోతుంది. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... గమనిక: స్టార్టప్ మెయిల్‌కు పలువురు వారి వ్యాపారాల వివరాలను పంపిస్తున్నారు. వీటిని పరిశీలించి, అర్హమైనవి ప్రచురిస్తున్నాం. ఎక్కువ వస్తుండటం వల్ల ప్రచురణలో కొంత ఆలస్యం జరగవచ్చు.