
సాక్షి, చెన్నై: బక్రీద్ పండుగను పురస్కరించుకుని తిరుపత్తూరు జిల్లా ఆంబూరుకు చెందిన బంగారు తయారీ కార్మికుడు దేవన్ బంగారం, వెండితో మసీదు నమూనాను తయారు చేశారు. 35 గ్రాముల వెండి, 6.5 గ్రాముల బంగారంతో ఐదున్నర ఇంచుల ఎత్తుతో ఒకరోజులోనే దీన్ని తయారు చేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే పొంగల్ కుండ బంగారంతో చేసినట్లు తెలిపారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ మ్యాప్‌ను బంగారంతో చేసి సంక్షేమ పథకాలతో ప్రజల మన్ననలు పొందుతున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అందజేయనున్నట్లు తెలిపారు.