Bakrid festival
-
బక్రీద్ : భక్తిశ్రద్ధలతో ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు (ఫొటోలు)
-
దేశవ్యాప్తంగా మొదలైన బక్రీద్ పండగ
-
Eid ul-Adha 2024: పరిపూర్ణ ఆరాధన హజ్జ్
ఇస్లామ్ ధర్మం ఐదు మౌలిక సూత్రాలపై ఆధారపడి ఉంది. ఇందులో ఏ ఒక్కదాన్ని విస్మరించినా విశ్వాసం పరిపూర్ణం కాదు. మొట్టమొదటిది సృష్టికర్త ఒక్కడే అన్న విశ్వాసం. రెండవది నమాజ్, మూడవది రోజా, నాల్గవది జకాత్, ఐదవది హజ్జ్. దైవ విశ్వాస ప్రకటనకు ఇవి ఆచరణాత్మక సాక్ష్యాలు. ఒక మనిషి విశ్వాసి/ ముస్లిమ్ అనడానికి రుజువులు. అన్ని ఆరాధనలకూ ‘హజ్జ్’ ఆత్మ వంటిది. ఆర్ధిక స్థోమత కలిగిన ప్రతి ముస్లింపై హజ్ విధిగా నిర్ణయించడం జరిగింది. అందుకని ఆర్థిక స్థోమత కలిగినవారు జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా కాబా సందర్శన యాత్ర చేయడం తప్పనిసరి. ఈ‘హజ్’ జిల్ హజ్ మాసం పదవ తేదీన అరేబియా దేశంలోని మక్కా నగరంలో జరుగుతుంది. ఆ రోజే ప్రపంచంలోని ముస్లింలంతా పండుగ జరుపుకుంటారు. అదే ‘ఈదుల్ అజ్ హా’. దీన్ని బక్రీద్ పండుగ అని, ఈదె ఖుర్బాన్ అని కూడా అంటారు. ‘హజ్జ్ ’ఒక విశ్వజనీన, విశ్వవ్యాపిత ఆరాధన. ఇందులో శ్రీమంతులు, నిరుపేదలు, తెల్లవారు, నల్లవారు, అరబ్బులు, అరబ్బేతరులు అన్న భేద భావం మచ్చుకు కూడా కనిపించదు. ‘మానవులంతా ఒక్కటే’ అన్న విశ్వమానవతా భావంతో అందరూ ముక్తకంఠంతో అల్లాహ్‌ను కీర్తిస్తూ, ఆయన ఘనతను, ఔన్నత్యాన్ని కొనియాడుతూ భక్తిపారవశ్యంతో తాదాత్మ్యం చెందడమే హజ్ యాత్రలోని పరమార్థం. మక్కా నగర ఆవిర్భావంమక్కానగర ఆవిర్భావం దాదాపు ఐదువేల సంవత్సరాలకు పూర్వం జరిగింది. కొండలూ కోనల నడుమ, ఎలాంటి వనరులూ లేకుండా నిర్మానుష్యంగా పడి ఉన్న ఎడారి ్రపాంతంలో మహనీయ హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తన ధర్మపత్ని హజ్రత్ హాజిరా అలైహిస్సలాంను, తనయుడు ఇస్మాయీల్ అలైహిస్సలాంను వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు, శ్రీమతి హాజిరా, ’అదేమిటీ.. నన్నూ, నాబిడ్డను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నారేమిటీ.?’అని ప్రశ్నించగా..,’ఇది దైవాజ్ఞ.’ అని మాత్రమే చెప్పి, అల్లాహ్‌పై అచంచల విశ్వాసంతో కనీసం వెనుదిరిగైనా చూడకుండా వెళ్ళిపోతారు హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం.కనీసం నాలుక తడుపుకోడానికి సైతం చుక్క నీరులేని ఆఎడారి ప్రదేశంలో చిన్నారి ఇబ్రాహీం దాహానికి తాళలేక గుక్కపట్టి ఏడుస్తున్న క్రమంలో ఆయన కాలి మడమలు రాసుకుపోయిన చోట అల్లాహ్ ఆజ్ఞతో అద్భుతమైన నీటి ఊట ఉబికింది. ‘జమ్ జమ్ ’అనే పేరుగల ఆ పవిత్ర జలంతో తల్లీ తనయులు తమ దాహం తీర్చుకున్నారు. ఆ నీరే ‘ఆబెజమ్ జమ్’ పేరుతో ప్రసిద్ధి గాంచింది. ఆనాడు కేవలం రెండు ్రపాణాలకోసం వెలసిన ఆ జలం ఈనాడు హజ్ యాత్ర నిమిత్తం మక్కావెళ్ళే లక్షలాదిమంది ప్రజలతోపాటు, స్థానికులకూ నిరంతరం సమృద్ధి్ధగా సరఫరా అవుతూ, యాత్రికులందరూ తమ తమ స్వస్థలాలకు తీసుకు వెళుతున్నా ఏమాత్రం కొరత రాకుండా తన మట్టాన్ని యథాతథంగా ఉంచుకోవడం అల్లాహ్ ప్రత్యక్ష మహిమకు నిదర్శనం. ఆ నాటి ఆ నిర్జీవ ఎడారి ్రపాంతమే ఈనాడు అత్యద్భుత సుందర మక్కానగరంగా రూపుదిద్దుకొని విశ్వవ్యాప్త ముస్లిం ప్రజానీకానికి పవిత్ర పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. తరువాత కొంతకాలానికి అల్లాహ్ ఆదేశం మేరకు హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం మక్కాకు తిరిగొచ్చి కుటుంబాన్ని కలుసుకొని, తనయుడు ఇస్మాయీల్ సహాయంతో ‘కాబా’ ను నిర్మించారు. చతుస్రాకారంలో ఉన్న ఆ రాతికట్టడాన్ని హజ్రత్ ఇబ్రాహీం, హజ్రత్ ఇస్మాయీల్ అలైహిముస్సలాంలు అల్లాహ్‌కు సమర్పించుకున్నారు. దీంతో కాబా దైవగృహంగా పేరు΄÷ందింది.అలౌకికానందంమక్కా చేరగానే ప్రతి హాజీ (యాత్రికుడు) కాబావైపు పరుగులు తీస్తాడు. పవిత్ర కాబాను చూడగానే భక్తులు ΄÷ందే ఆనంద పారవశ్యాలు వర్ణనాతీతం. ఒకానొక అలౌకిక ఆనందంతో, భక్తిపారవశ్యంతో కాబా చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణ చేస్తారు. దీన్ని’తవాఫ్’ అంటారు. ప్రతి తవాఫ్ లోనూ హాజీలు కాబాగోడలో అమరి ఉన్న ’హజ్రె అస్వద్ ’ (నల్లనిశిల) ను ముద్దాడడానికి ప్రయత్నిస్తారు. దైవ గృహమైన కాబాకు సమీపంలో క్రీ. శ. 570 లో ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించారు. కనుక భక్తులు ఆ జ్ఞాపకాలనూ నెమరు వేసుకుంటారు. ’జమ్ జమ్ ’బావిలోని పవిత్ర జలాన్ని తనివి తీరా సేవిస్తారు. తరువాత సఫా, మర్వా కొండల మధ్య ’సయీ’చేస్తారు. దీని తరువాత కొన్నిరోజులు ఎవరి నివాసాల్లో వారు దైవచింతన, నమాజులతో కాలం గడిపి, ’జిల్ హజ్ ’మాసం ఎనిమిదవ తేదీన ’మినా’ గ్రామం వెళ్ళి ఒక రోజంతా అక్కడ ఉంటారు. తొమ్మిదవ తేదీన ప్రపంచం నలుమూలలనుండీ వచ్చిన హాజీలంతా ‘అరఫాత్ ’మైదానంలో గుమిగూడి దైవకారుణ్యాన్ని అభిలషిస్తూ ్రపార్ధనలు చేస్తారు. ఈ సందర్భంలోనే ఆనాడు ముహమ్మద్ ప్రవక్త (స) అశేష భక్తజనాన్ని ఉద్దేశించి తమ అంతిమ సందేశం వినిపించారు. అందుకని భక్తులు ఆ మహనీయుడు నిలిచిన ప్రదేశాన్ని కూడా దర్శించి పులకించి పోతారు. సూర్యాస్తమయానికి తిరుగు ప్రయాణం ్రపారంభించి’ముజ్దలఫా’ దగ్గర రాత్రి మజిలీ చేస్తారు. అక్కడే మగ్రిబ్, ఇషా నమాజులు కలిపి సామూహికంగా చేస్తారు. మదీనాసాధారణంగా మక్కాను దర్శించుకున్న యాత్రికులు మదీనాను కూడా సందర్శిస్తారు. మదీనా మక్కాకు రెండువందల మైళ్ళ దూరంలో ఉంది. ముహమ్మద్ ప్రవక్త (స) మక్కా నుండి మదీనాకు వలసవెళ్ళి అంతిమ దినాలు అక్కడే గడిపారు. మస్జిదెనబవి సందర్శనకు, హజ్జ్ కు ఎలాంటి సంబంధం లేకపోయినా అది ఇస్లామీయ జగత్తుకు జీవనాడి లాంటిది. ప్రవక్త మసీదు సందర్శన సున్నత్. కనుక దూరతీరాలనుండి వచ్చిన భక్తులు మస్జిదె నబవిని కూడా సందర్శించి, నమాజులు చేసి తమ యాత్ర సఫలమైందని భావిస్తారు. ఈ విధంగా ఒకహాజీ అన్ని నియమాలను పాటిస్తూ, అల్లాహ్ ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన పవిత్రకాబా గహాన్ని సందర్శిస్తాడు. యాత్రాక్రమంలో అతనికి అడుగడుగునా హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం, హజ్రత్ ఇస్మాయీల్ అలైహిస్సలాం గార్ల సహనశీలత, త్యాగనిరతి, పాపభీతి, వాగ్దానపాలన, దైవాదేశపాలన లాంటి అనేక సుగుణాలను ఒంటబట్టించుకుంటాడు. అంతేకాదు, ఇంకా మరెన్నో సుగుణాలను మానవుల్లో జనింపజేసి మానవ సమానత్వానికి, విశ్వమానవ సౌభ్రాతృత్వానికి పూలబాటలుపరిచి, వారి ఇహపర సాఫల్యానికి హామీగా నిలుస్తుంది హజ్జ్ . ఇదే కాబా గృహ సందర్శనాయాత్ర అసలు పరమార్థం. అల్లాహ్ మనందరికీ ఈ విషయాలను అర్థం చేసుకొని, ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. తఖ్వా ప్రధానందేవుని ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన హజ్జ్‌ను సకల ఉపాసనా రీతులు ఇముడ్చుకున్న పరిపూర్ణ దైవారాధన అని కూడా చెప్పుకోవచ్చు. హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తన కుమారుడు ఇస్మాయీల్ (అ)తో కలిసి నిర్మించిన కాబా గృహ సందర్శనలో ఉపాసనా, ఆరాధనా రీతులన్నీ పరిపూర్ణతను సంతరించు కున్నాయి. యాత్ర, నిరాడంబర సాధు వస్త్రధారణ, దైవ్రపార్థన, వ్రతనిష్ఠ, ఖుర్బానీ ఇవన్నీ సమన్వయం చెంది, ఒకేచోట కేంద్రీకృతమై, ఏకైక ప్రభువు సన్నిధిలో, హజ్ ఆరాధనలో ప్రదర్శితమవుతాయి. అందుకని కాబా గృహ సందర్శనార్ధం చేసే హజ్జ్ వల్ల ఉపాసనా రీతులన్నిటినీ ఆచరించి దైవానుగ్రహం ΄÷ందినట్లే అవుతుంది. ఈ కారణంగానే ముస్లిం స్త్రీ పురుషులందరూ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా హజ్ చేయాలని అభిలషిస్తారు. ఆ మహాభాగ్యంకోసం ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. – యండి. ఉస్మాన్ ఖాన్ -
నా కొడుకు తప్పు చేయలేదు.. బక్రీద్ వేళ బోధన్ ఎంఐఎం నేత తండ్రి రోదన
-
దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో బక్రీద్ ప్రార్థనలు (ఫొటోలు)
-
విజయవాడలో బక్రీద్ వేడుకలు
-
దేశ వ్యాప్తంగా బక్రీద్ వేడుకలు
-
రేపు బక్రీద్ సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపులు
హైదరాబాద్: బక్రీద్ పండుగను పురస్కరించుకుని ఈనెల 29న మీరాలం ఈద్గాలో నిర్వహించనున్న సామూహిక ప్రార్థనల నేపథ్యంలో పాతబస్తీలో ట్రాఫిక్ నిబంధనలు అమలులో ఉంటాయని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మీరాలం ఈద్గా వైపు వచ్చే వాహనాలను ప్రార్థనలు ముగిసేంత వరకు దారి మళ్లించనున్నట్లు తెలిపారు. ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. పురానాపూల్, కామాటిపురా, కిషన్‌బాగ్ నుంచి ప్రార్థనల కోసం మీరాలం ఈద్గాకు వచ్చే వాహనాలను బహదూర్‌ఫురా ఎక్స్ రోడ్డు మీదుగా అనుమతిస్తామన్నారు. వీరు తమ వాహనాలను జూపార్కు ప్రాంతం, ఓపెన్ స్పేస్ ఎదురుగా మసీదు అల్లాహో అక్బర్ వద్ద పార్క్ చేయాలన్నారు. ఈ సమయంలో సాధారణ వాహనాల రాకపోకలు అనుమతి ఉండదన్నారు. వీరిని బహదూర్‌పురా ఎక్స్ రోడ్డు వద్ద కిషన్‌బాగ్, కామాటిపురా, పురానాపూల్ వైపు దారి మళ్లించనున్నారు. శివరాంపల్లి, దానమ్మ హట్స్ నుంచి ప్రార్థనల కోసం వచ్చే వాహనాలను దాన్నమ్మ హట్స్ ఎక్స్ రోడ్డు మీదుగా ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు అనుమతిస్తారు. వీరు తమ వాహనాలను ఈద్గా ప్రధాన రహదారి ముందు, మోడ్రన్ సా మిల్ పార్కింగ్తో పాటు మీరాలం ఫిల్టర్ బెడ్, మీరాలం బెడ్ పక్కన ఖాళీ స్థలం, సూఫీ కార్లు (నాలుగు చక్రాల వాహనాల కోసం), యాదవ్ పార్కింగ్ (నాలుగు చక్రాల వాహనాలకు) పక్కన పార్క్ చేయాలన్నారు. ఈ సమయంలో సాధారణ వాహనాల రాకపోకలను ఈద్గా వైపు అనుమతించమన్నారు. వీరిని దానమ్మ హట్స్ ఎక్స్ రోడ్డు వద్ద శాస్త్రిపురం, నవాబ్‌సాబ్‌కుంట తదితర ప్రాంతాల నుంచి దారి మళ్లించనున్నట్లు తెలిపారు. కాలాపత్తర్, మీరాలం ట్యాంక్ వైపు నుంచి వాహనాలను కాలాపత్తర్ పోలీస్‌స్టేషన్ (లా అండ్ ఆర్డర్) మీదుగా ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు అనుమతించమన్నారు. వీరు తమ వాహనాలను భయ్యా పార్కింగ్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద వాహనాలను పార్క్ చేయాలన్నారు. ఈ సమయంలో సాధారణ వాహనాలను కాలాపత్తర్ పోలీస్‌స్టేషన్ (లా అండ్ ఆర్డర్) వద్ద మోచీ కాలనీ, బహదూర్‌పురా, షంషీర్గంజ్, నవాబ్‌సాబ్‌కుంట వైపు మళ్లిస్తారు. పురానాపూల్, బహదూర్‌పురా వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులతో పాటు భారీ వాహనాలను పురానాపూల్ దర్వాజా వద్ద జియగూడ, సిటీ కాలేజీ వైపు దారి మళ్లించనున్నారన్నారు. ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు శంషాబాద్, రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి నుంచి బహదూర్‌పురా వైపు వచ్చే ఆర్టీసీ బస్సులతో సహా భారీ వాహనాలను ఆరాంఘర్ జంక్షన్ వద్ద శంషాబాద్ లేదా రాజేంద్రనగర్ లేదా మైలార్‌దేవ్‌పల్లి వైపు దారి మళ్లిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో వాహనదారులు ట్రాఫిక్ హెల్ఫ్‌లైన్ నంబర్ 9010203626లో సంప్రదించాలన్నారు. -
ఈద్ ముబారక్
రాయచోట, రాయచోటి టౌన్: ముస్లింలకు అత్యంత పవిత్రమైన పండుగ బక్రీద్‌ను ఆదివారం జిల్లావ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జిల్లాలోని రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, మదనపల్లె, తంబళ్లపల్లె.పీలేరులో భక్తులు తమ సమీపంలోని మసీదుల్లో జరిగే ప్రార్థనల్లో పాల్గొనగా, అధికశాతం మంది ఈద్గాలకు వెళ్లి ప్రార్థనలు నిర్వహించారు. ప్రవక్త ఇబ్రహీం త్యాగం ఆదర్శనీయం త్యాగానికి ప్రతి రూపం బక్రీద్ పండుగ అని మత గురువు సర్కాజీ అన్నారు. ప్రతి ఒక్కరూ దయ, త్యాగగుణం అలవర్చుకోవాలని సూచించారు. ఇస్లాం శాంతిని బోధిస్తుందని చెప్పారు. పవక్త హజరత్ ఇబ్రహీం త్యాగం ఆదర్శనీయమని అన్నారు.దైవాజ్ఞను పాటిస్తూ తన ఏకైక కుమారుడైన హజరత్ ఇస్మాయిల్‌ను దైవమార్గంలో త్యాగం చేయడానికి సిద్ధపడిన వైనాన్ని వివరించారు. ఇబ్రహీం త్యాగనిరతియే బక్రీద్ పరమార్థమని తెలిపారు. ఆయన సూచించిన మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని స్వార్థాన్ని వీడి, సమసమాజ నిర్మాణం కోసం అందరూ పాటుపడాలన్నారు. అనంతరం విశ్వమాసవాళి సంక్షేమం కోసం దువా చేశారు. మదనపల్లెలో మతగురువు హాఫీజ్ జలాలుద్దీన్‌సాహెబ్ ధార్మికోపన్యాసం చేశారు పాత రాయచోటి సమీపంలోని ఈద్గాలో నిర్వహించిన సామూహిక ప్రార్థనల్లో ముస్లిం సోదరులు, అన్నమయ్య జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కలెక్టర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ భక్తిశ్రద్ధలతో,ఆనందోత్సవాల మధ్య పండుగ నిర్వహించుకోవాలని సూచించారు. మైనార్టీల సంక్షేమానికి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. అనంతరం ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా ఇంటిలో అల్ఫాహార విందులో పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు జమాల్ ఖాన్, హబీబుల్లాఖాన్,బేపారి మహమ్మద్‌ఖాన్,ఆసీఫ్ ఆలీఖాన్,జాకీర్, ఫయాజ్ అహమ్మద్, రౌనక్, ఎస్పీఎస్ రిజ్వాన్,ఎస్పీఎస్ జబివుల్లా, ఝాఫర్ ఆలీఖాన్, ఇర్షాద్. షబ్బీర్, అల్తాప్, తబ్రేజ్, సున్నా, కో – ఆఫ్షన్ ఆసీఫ్ ఆలీఖాన్, కొత్తపల్లె ఇంతియాజ్ పాల్గొన్నారు. మదన పలెలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఎం.నవాజ్‌బాషా అందరినీ అలింగనం చేసి శుభాకాంక్షలు తెలిపారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతూ సందేశాన్ని పంపారు. భద్రతా ఏర్పాట్ల పరిశీలన: బక్రీద్ పండుగ ప్రశాంత వాతారణంలో నిర్వహించుకు నేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు వైఎస్సార్ జిల్లా ఎస్పీ, అన్నమయ్యజిల్లా ఇన్చార్జి ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తెలిపారు. ఆదివారం ఉదయం ఠానా, మజీద్ సర్కిల్లో భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. రాయచోటి డీఎస్సీ శ్రీధర్, డీఎస్సీ రవికుమార్, సీఐ సుధాకరరెడ్డి, ఎస్సైలు పాల్గొన్నారు. ఎస్పీ బక్రీద్ శుభాకాంక్షలు రాయచోటి: ముస్లిం సోదరులకు అన్నమయ్య జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. జిల్లాలోని అన్ని ప్రార్థన మందిరాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. -
ముబారక్.. బక్రీద్ (ఫొటోలు)
-
దేశ వ్యాప్తంగా ఘనంగా బక్రీద్ వేడుకలు
-
త్యాగ నిరతికి ప్రతీక బక్రీద్
సాక్షి, హైదరాబాద్: బక్రీద్ పర్వదినం సందర్భంగా గవర్నర్ తమిళిసై ముస్లింలకు శుభాకాంక్షలు తెలియ జేశారు. ఇచ్చి పుచ్చు కోవడం, దాతృత్వం, అవసరమైన వారికి సహాయం చేయడం వంటి సుగుణాలకు ఈ పండుగ స్ఫూర్తి కలిగిస్తుందన్నారు. ఈ వేడు కలతో సోదరభావం, సేవాతత్వం, త్యాగ గుణాలు మరింత బలపడతాయన్న ఆశాభా వాన్ని ఆమె వ్యక్తం చేశారు. శాంతి, సామ రస్యం, స్నేహ భావాలను ప్రోత్సహించడమే బక్రీద్ పండుగ పరమార్థమని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. -
దాతృత్వ స్ఫూర్తి బక్రీద్
సాక్షి, హైదరాబాద్: భక్తి, త్యాగగుణాలకు బక్రీద్ స్ఫూర్తి కలిగి స్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఆయన ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వెరవకుండా, దేవునిపై విశ్వాసాన్ని కలిగి, సన్మార్గంలో జీవనాన్ని సాగించాలనే గొప్ప సందేశాన్ని ఈ పండుగ ఇస్తుందని తెలిపారు. తమకున్న దాట్లో నుంచే ఇతరులకు పంచిపెట్టడానికి మించిన దాతృత్వం మరొకటి లేదనే స్ఫూర్తిని కూడా కలిగిస్తుందని సీఎం పేర్కొన్నారు. -
పండగపూట విషాదం; కుమారుడి పుట్టినరోజు కేక్ కోసమని వెళ్లి
ఓ వైపు బక్రీద్ పర్వదినం.. మరో వైపు కుమారుడి పుట్టినరోజు వేడుక.. రెండు విశేషాలు ఒకే రోజు రావడంతో ఆ ఇంట ఆనందోత్సవాలు వెల్లివిరిసాయి. తొలుత పర్విదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు.. సమీప బంధువుల రాకతో ఆ ఇంట్లో సందడి నెలకొంది. తదనంతరం కుమారుడి పుట్టిన రోజు వేడుక నిర్వహణకు కేక్ తెచ్చేందుకు సమీప బంధువుతో కలిసి వెళ్లిన తండ్రిని సిమెంట్ ట్యాంకర్ రూపంలో వచ్చిన మృత్యువు కబళించడంతో పండుగ పూట ఆ ఇంట పెను విషాదం అలుముకుంది. జుపెన్‌పహాడ్ : మండల కేంద్రానికి చెందిన షేక్ జమాల్(33)కు భార్య, కుమారుడు, కుమార్తె సంతానం. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం బక్రీద్ పర్వదినంతో పాటు కుమారుడి పుట్టినరోజు కూడా కలిసి రావడంతో సంతోషించాడు. వేడుకకు సమీపం బంధువులను కూడా ఆహ్వానించాడు. ఉదయం మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కేక్ తెచ్చేందుకు వెళ్తుండగా.. మధ్యాహ్నం వరకు జమాల్ సంతోషంగా ఇంట్లోనే గడిపాడు. అనంతరం కుమారుడి పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించేందుకు, అందుకు అవసరమైన కేక్ తదితర సామగ్రి తీసుకువచ్చేందుకు బంధువు లతీఫ్‌తో కలిసి బైక్‌పై సూర్యాపేటకు బయలుదేరాడు. మార్గమధ్యలో సింగారెడ్డిపాలెం గ్రామ శివారుకు చేరుకోగానే సూర్యాపేట నుంచి గరిడేపల్లి వైపు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్ ఢీకొట్టడంతో షేక్ జమాల్ అక్కడికక్కడే మృతిచెందగా షేక్ లతీఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం మేరకు పో లీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుని తండ్రి యాకూబ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ వెంకటరత్నం తెలిపారు. ఇనుప బోర్డును ఢీకొట్టి ఒకరు.. కోదాడ రూరల్ : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని దోరకుంట సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బలుసుపాడు గ్రామానికి చెందిన షేక్ బషీర్ (35) బైక్‌పై కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్డు వద్దకు వచ్చాడు. బక్రీదు పండుగ సందర్భంగా చికెన్ తీసుకుని తిరిగి ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యలో గ్రామశివారులోని పెట్రోలు బంకు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన ఇనుప బోర్డును ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన బషీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య శంషాద్ భేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ వై.సైదులు తెలిపారు. -
కరోనా కాలంలో ఆంక్షలు సడలిస్తారా?: సుప్రీంకోర్టు సీరియస్
న్యూఢిల్లీ: బక్రీద్ పండుగ పేరుతో కేరళ ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా ఆంక్షలను మూడు రోజులపాటు సడలించడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకవైపు కరోనా విజృంభణ కొనసాగుతూ అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండగా, మరోవైపు అదే ప్రాంతంలో సడలింపులు ఇవ్వడం ఎంతమాత్రం తగదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారుల ఒత్తిడికి తలొగ్గినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ప్రజల ప్రాణాల పట్ల జాగ్రత్త వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద జీవించే హక్కును కాపాడాల్సిన బాధ్యత సర్కారుపై ఉందని తేల్చి చెప్పింది. ఆంక్షల సడలింపు వ్యవహారం ఒకవేళ కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదలకు దారితీస్తే తాము కచ్చితంగా చర్యలు తీసుకుంటామని కేరళ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు హెచ్చరించింది. బక్రీద్ సందర్భంగా కేరళలో కరోనా ఆంక్షలను సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న దాఖలైన పిటిషన్‌సై జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్, జస్టిస్ బి.ఆర్.గవాయిల ధర్మాసనం తొలుత సోమవారం విచారణ చేపట్టింది. అఫిడవిట్ దాఖలు చేయాలని కేరళ సర్కారును ఆదేశించింది. దీంతో కేరళ సర్కారు మంగళవారం అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులోని అంశాల పట్ల న్యాయస్థానం అభ్యంతరం తెలిపింది. వ్యాపారుల వద్ద సరుకులు మిగిలిపోతాయన్న కారణంతో కరోనా ఆంక్షలను సడలించడం ఏమిటని నిలదీసింది. ఉత్తరప్రదేశ్‌లో కరోనా ఉధృతి కొనసాగుతుండగానే కన్వర్ యాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా సుప్రీంకోర్టు గత వారం సుమోటోగా విచారణ జరిపిన సంగతి తెలిసిందే. -
అలా చేస్తే... మహమ్మారికే పండుగ!
అప్రమత్తతతో వివేకంగా వ్యవహరించాల్సిన సమయంలో విస్మయపరిచేలా ప్రవర్తిస్తే ఏమనాలి? అవును. కొన్నిసార్లు... కొన్ని ప్రభుత్వాల నిర్ణయాలు చూస్తే అవాక్కవుతాం. పవిత్రమైన బక్రీద్ పండుగ సందర్భంగా కేరళ సర్కార్ మూడు రోజుల పాటు లాక్డౌన్ సడలించి, వివిధ దుకాణాల్లో వ్యాపారాలకూ, ప్రార్థనలకూ ఇచ్చిన అనుమతులు చూసి, సాక్షాత్తూ సుప్రీంకోర్టే ఇప్పుడు నోరు నొక్కుకుంది. వ్యాపారుల ఒత్తిడికి తలొగ్గి, ఇలాంటి పని చేయడం దారుణమని వ్యాఖ్యానించింది. కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ ముందు ప్రాణాలతో జీవించి ఉంటే, తరువాతే వ్యాపారం, జీవనోపాధి. అందుకే, రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రసాదించిన ‘జీవించే హక్కు’కు తలొగ్గా లంటూ సుప్రీంకోర్టు మంగళవారం కేరళ సర్కార్‌కి గట్టిగానే చెప్పాల్సి వచ్చింది. ఉత్తరాదిలో కావడ్ (కావడి) యాత్ర వివాదం, అనేక ప్రభుత్వాలు దీన్ని రద్దు చేసినప్పటికీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 25 నుంచి యాత్రను కొనసాగించాలనుకోవడం, సుప్రీం తనకు తానుగా జోక్యం చేసుకొని అడ్డుకట్ట వేయడం... ఇవన్నీ కొద్దిరోజులుగా చూస్తూనే ఉన్నాం. ఇంతలోనే దక్షిణాదిన కేరళ ఇలా బక్రీద్ పండుగ పేరుతో కరోనా జాగ్రత్తలకు నీళ్ళొదలడం ఎలా చూసినా అభ్యంతరకరమే! ముస్లింలకు ఎంతో ముఖ్యమైన బక్రీద్ పండుగను జరుపుకోవడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కాకపోతే, కరోనా జాగ్రత్తలన్నీ అందరూ పాటించేలా ప్రభుత్వాలు కల్పించాలంటారు. కానీ, ఏదో ఒక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికి పరిస్థితులను వాడుకోవాలని చూస్తేనే ఇబ్బంది. రాష్ట్ర జనాభాలో దాదాపు 27 శాతం మంది ముస్లిములున్న కేరళలోని పాలక ‘వామపక్ష ప్రజాస్వామ్య కూటమి’ (ఎల్డీఎఫ్) ప్రభుత్వం చేసింది అదే అన్నది తాజా విమర్శ. దేశంలోని పది అగ్రశ్రేణి కరోనా బాధిత రాష్ట్రాల్లో కేరళ రెండో స్థానంలో ఉంది. దేశంలో తొలి కరోనా కేసు నమోదైందీ అక్కడే. అదే వ్యక్తి ఇటీవలే రెండోసారీ కరోనా బారినపడ్డారు. అవన్నీ తెలిసి కూడా కరోనా అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో పండుగ కొనుగోళ్ళ కోసమంటూ దుస్తులు, చెప్పులు, ఆభరణాలు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ పరికరాల దుకాణాలకు 3 రోజుల పాటు కేరళ సర్కార్ ఎలా అనుమతించిందన్నది ప్రశ్న. కేరళ, మహారాష్ట్రల్లో ఇప్పటికే థర్డ్‌వేవ్ వచ్చేసిందా అని కూడా అనుమానిస్తున్నారు. అందుకే, మహారాష్ట్ర ఏమో షరతులు పెట్టి, ప్రతీకాత్మకంగా ఈ ‘త్యాగాల పండుగ’ను ఇళ్ళల్లోనే జరుపు కోవాలని చెబుతోంది. కానీ, కేరళ అందుకు పూర్తి భిన్నమైన మార్గం ఎంచుకోవడం విచిత్రం. అయిదేళ్ళకోసారి యూడీఎఫ్, ఎల్డీఎఫ్ల మధ్య అధికారం మారిపోవడం ఆనవాయితీ అయిన కేరళలో ఆ మధ్య శబరిమల వివాదం లాంటివి చూశాం. బీజేపీ పుంజుకోవడమూ గమనించాం. వాటన్నిటినీ తట్టుకొని, ఈ ఏప్రిల్‌లో కేరళలో వరుసగా రెండోసారి అధికారం దక్కించుకున్నారు సీఎం పినరయి విజయన్. ఆయన తన లౌకికవాద ప్రమాణాల ప్రదర్శనకు బక్రీద్ పండుగ వేళను ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. కానీ, కరోనా మహమ్మారికి ఆచారం, పండుగ ఏముంటుంది! గత ఏడాది నాటి తబ్లిగీల సమావేశమైనా, ఈ ఏడాది మొదట్లో లక్షలాది మంది ఒక్కచోట చేరిన కుంభ మేళా అయినా, నిన్నగాక మొన్న యూపీ సర్కార్ అనుమతించాలని చూసిన వేలాది శివభక్తుల ‘కావడ్ యాత్ర’ అయినా, ఇప్పుడు మసీదుల్లో గణనీయ సంఖ్యలో చేరి జరుపుకొనే బక్రీద్ అయినా... కరోనా కోరల వ్యాప్తికి ఒకటే! హిందూ, ముస్లిం తేడా లేకుండా గుమిగూడిన జనం ఆసరాగా విస్తరించడమే దాని లక్షణం. ఆ ప్రాథమిక అంశాన్ని పాలకులు విస్మరించి, నిబంధనలకు తూట్లు పొడిస్తే, ఎవరికి నష్టం? ఆ తరువాత ఎవరి ప్రాణానికి ఎవరు పూచీ? కరోనా జాగ్రత్తలు పాటించేలా చూస్తామని పాలకులు చెబుతున్నారు. కానీ, ఒడిశా రథయాత్ర మొదలు తెలంగాణలో బోనాల దాకా జనం మాస్కులు, భౌతికదూరం లేకుండా ఎలా వ్యవహరిస్తున్నారో అందరికీ తెలుసు. నిరక్షరాస్యత, ధార్మిక పిడివాదం ఎక్కువగా కనిపించే పలు ఉత్తరాది రాష్ట్రాల బాటలోనే అక్షరాస్యత, అభ్యుదయం తొణికిసలాడే కేరళ ప్రయాణించడం నిజంగా విచిత్రం, విషాదం. ఎవరి భక్తి విశ్వాసాలు వారివి. సాటి మనుషులకు సమస్యలు తేనంత వరకు ఎవరి ధర్మం మీదనైనా వేరెవరికీ అభ్యంతరం ఉండాల్సిన పనిలేదు. కానీ, ఆ ధార్మికతను రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలకు అనువుగా వాడుకోవాలని చూస్తేనే అసలు చిక్కు. బక్రీద్ వేళ... కేరళ సర్కార్ వ్యవహరించిన తీరు అంతే బాధ్యతారాహిత్యంగా ఉందనేది విమర్శకుల మాట. దైవభూమిగా పేరున్న కేరళలో కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ 15 శాతం దాకా కరోనా పాజిటివిటీ రేటు ఉంది. అలాగే జికా వైరస్ కేసులు మళ్ళీ తలెత్తాయి. మూడున్నర కోట్ల జనాభా ఉన్న ఆ రాష్ట్రంలో ఇప్పటికి పూర్తిగా టీకా పడింది 45 లక్షల మందికే. అలాగే, 1.2 కోట్లమందికే, అంటే రాష్ట్ర జనాభాలో మూడోవంతు మందికి మాత్రమే తొలి డోసు టీకా పడింది. ఉన్నట్టుండి ఇప్పుడు షరతుల గేట్లు ఎత్తేయడం సరి కాదనడానికి ఈ గణాంకాలే సాక్ష్యం. అందుకే, థర్డ్‌వేవ్ ప్రమాదాన్ని హెచ్చరిస్తున్న ‘ఇండియన్ మెడికల్ అసోసియేషన్’ ఫిర్యాదుతో కేరళ సర్కారును కోర్టు నిలదీయాల్సి వచ్చింది. కరోనా పూర్తిగా దూరం కాకముందే జాగ్రత్తలు గాలికొదిలేయడం, ఆర్థికవ్యవస్థను దృష్టిలో పెట్టుకొని అనేక రాష్ట్రాలు ఇస్తున్న నిబంధనల సడలింపు ఇప్పుడు కేరళ సహా అన్నిచోట్లా భయపెడుతున్నాయి. ఇవి మరిన్ని విపరిణామాలకు దారితీస్తే, అప్పుడు ఏ కోర్టులొచ్చి ఎవరిని నిలదీసినా ప్రయోజనం ఉండదు. జరిగిన తప్పులకు ప్రజలు, పాలకులు తమను తామే నిలదీసుకోవాల్సి వస్తుంది. -
త్వరలో సీఎం జగన్‌కు చెన్నై వాసి అరుదైన కానుక
సాక్షి, చెన్నై: బక్రీద్ పండుగను పురస్కరించుకుని తిరుపత్తూరు జిల్లా ఆంబూరుకు చెందిన బంగారు తయారీ కార్మికుడు దేవన్ బంగారం, వెండితో మసీదు నమూనాను తయారు చేశారు. 35 గ్రాముల వెండి, 6.5 గ్రాముల బంగారంతో ఐదున్నర ఇంచుల ఎత్తుతో ఒకరోజులోనే దీన్ని తయారు చేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే పొంగల్ కుండ బంగారంతో చేసినట్లు తెలిపారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ మ్యాప్‌ను బంగారంతో చేసి సంక్షేమ పథకాలతో ప్రజల మన్ననలు పొందుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందజేయనున్నట్లు తెలిపారు. -
అందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలి
చార్మినార్: రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకొని ఖురేషి సామాజిక వర్గానికి చెందిన ముస్లిం వ్యాపారులందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. కరోనా పరీక్షలు చేయించుకోవడం ద్వారా తమను తాము కాపాడుకోవడమే కాకుండా సమాజాన్ని కాపాడినట్లు అవుతుందన్నారు. మంగళవారం యాకుత్‌పురా ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీతో కలిసి ఆయన చార్మినార్ యునానీ ఆసుపత్రిలోని కరోనా పరీక్షల కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ ఖురేషి సామాజిక వర్గానికి జరుగుతున్న కరోనా పరీక్షలను ఆయన పరిశీలించారు. బక్రీద్ పండుగ సందర్భంగా జరిగే మాంసం విక్రయాల్లో ఖురేషి సామాజిక వర్గానికి చెందిన వ్యాపారుల ప్రాధాన్యత ఎంతో ఉంటుందన్నారు. వీరందరూ ముందస్తుగా కరోనా పరీక్షలు చేయించుకుంటే ఆశించిన ఫలితాలు ఉంటాయన్నారు. Barrister @asadowaisi oversaw arrangements for covid-19 testing of meat traders of Charminar. In light of approaching Baqr Eid, it is important that meat traders are well protected https://t.co/9HVXr4cpgH — AIMIM (@aimim_national) July 21, 2020 -
ఆగస్టు 1న బక్రీద్
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం నెలవంక కనిపించలేదని, దీంతో ఆగస్టు 1న బక్రీద్ జరుపుకోవాలని రుహియతే హిలాల్ కమిటీ (నెలవంక నిర్ధారణ కమిటీ) అధ్యక్షుడు మౌలానా సయ్యద్ ఖుబ్బుల్ పాషా ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా నెలవంక కనిపించలేదని తమకు సమాచారం వచ్చిందన్నారు. ఇస్లామీ కేలండర్ ప్రకారం గురువారం నుంచి జిల్‌హజ్ నెల ప్రారంభమవుతోందని, ఇదే నెల పదో తేదీన ముస్లింలు బక్రీద్ జరుపుకుంటారన్నారు. -
పండుగకు పిలిచి మరీ చంపారు
సాక్షి, ఆదిలాబాద్ : కట్టుకున్న భార్య, బావమరుదులే కాలయములై ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్న సంఘటన ఆదిలాబాద్ పట్టణంలోని బొక్కగూడలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. బావను పండగ కోసం ఇంటికి పిలిచి హతమార్చారు. అంతవరకు బక్రీద్ ఆనందోత్సహాల్లో మునిగి తేలుతున్న కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆదిలాబాద్ టౌన్ సీఐ సురేష్ తెలిపిన వివరాలు ఆదిలాబాద్ పట్టణంలోని బొక్కలగూడలో నివాసం ఉంటున్న షేక్ ఆసీఫ్ (26)కు ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్య సదాది కిన్వట్. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. అనంతరం ఫిర్దోస్‌ను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కూతురు ఉంది. ఫిర్దోస్, ఆసీఫ్ మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. మొదటి భార్యను వదిలిపెట్టి తనతో ఉండాలని ఫిర్దోస్ ఆసీఫ్‌తో గొడవ పడుతుండేది. పట్టణ మహిళా పోలీస్‌స్టేషన్‌లో సైతం ఈ విషయంలో గతంలో కేసు నమోదయింది. సోమవారం బక్రీద్‌ను పురస్కరించుకుని రాత్రి 8.30 గంటల ప్రాంతంలో షేక్ ఆసీఫ్ బావమరుదులు సలీం, షారూఖ్ ఇంటికి పిలిచారు. మొదటి భార్యను వదిలేసి తమ సోదరితో కలిసి ఉండాలని కోరారు. ఈ తరుణంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగి గొడవకు దారి తీసింది. దీంతో ఇరువురు బావమరుదులు ఆసీఫ్‌ను తీవ్రంగా కొట్టి, కత్తెరతో గుండెలో పొడిచారు. రక్తం మడుగులో ఆసీఫ్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండడాన్ని గమనించిన స్థానికులు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. రిమ్స్ వైద్యులు పరిశీలించి ఆసీఫ్ మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌లో భార్య ఫిర్దోస్, బావమరుదులు సలీం, షారూఖ్, మామ అజీం, అత్త హలీమా, మరదళ్లు నసీమ, హీనాలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
కశ్మీర్ ప్రశాంతం.. పాక్ కుట్ర బట్టబయలు!
శ్రీనగర్: ఆర్టికల్ 370 రద్దు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్ విభజన నేపథ్యంలో కశ్మీర్ లోయలో కీలక బక్రీద్ పండుగ శాంతియుతంగా జరిగింది. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని లోయలో ముస్లిం ప్రజలు పెద్ద ఎత్తున ప్రార్థనల్లో పాల్గొన్నారు. పండుగ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అధికార యంత్రాంగం, భారత సైన్యం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. కశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లో నిషేధాజ్ఞలను సడలించి.. పండుగపూట జనజీవనం సాఫీగా సాగేవిధంగా చర్యలు తీసుకున్నారు. అనేక ప్రాంతాల్లో ముస్లిం ప్రజల ప్రార్థనల నిర్వహణలో భారత బలగాలు సహకరించాయి. జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో పర్యటించి.. స్థానికంగా పరిస్థితులను బేరిజు వేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లోయలో ఇంతవరకు ఒక్క బుల్లెట్ కూడా ప్రయోగించలేదని, బక్రీద్ పర్వదినం సందర్భంగా అంతా ప్రశాంతంగా ఉందని కశ్మీర్ ఐజీ ఎస్పీ పాణి స్పష్టం చేశారు. పాక్ కుట్ర బట్టబయలు..! కశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిలో చీలిక తెచ్చేందుకు దాయాది పాకిస్తాన్ చౌకబారు ఎత్తుగడలు వస్తోంది. భారత్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పాపగాండ మొదలుపెట్టింది. ఆ దేశానికి చెందిన వెరీఫైడ్ ట్విటర్ అకౌంట్ల నుంచి ఈ దుష్ప్రచారం జరుగుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో దాయాది కుట్రను భారత సైన్యం బయటపెట్టింది. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో కశ్మీర్లో బందోబస్తు నిర్వహిస్తున్న భారత సైన్యంలో విభేదాలు బయటపడ్డాయని ఓ పాకిస్థానీ నెటిజన్ ట్వీట్ చేశారు. వాజ్‌ఎస్ ఖాన్ (WSK @WajSKhan) అనే వ్యక్తి తన వెరీఫైడ్ ట్విటర్ ఖాతాలో భారత్‌కు వ్యతిరేకంగా కుట్రపూరిత ప్రచారానికి పునుకున్నాడు. కశ్మీర్లో గర్భవతిని చెక్‌పాయింట్ వద్ద బలగాలు అడ్డుకోవడంతో ఓ కశ్మీరీ పోలీసు.. ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లను కాల్చిచంపాడని అతను ట్వీట్ చేశాడు. ‘కశ్మీర్లో పనిచేస్తున్న భారత బలగాల్లో విభేదాలు తలెత్తాయి. ఓ ముస్లిం కశ్మీరీ పోలీసు ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లను కాల్చిచంపాడు. కర్ఫ్యూ పాస్ లేకపోవడంతో ఓ గర్భవతిని చెక్‌పాయింట్ దాటి వెళ్లేందుకు భద్రతా బలగాలు అడ్డుకోవడంతో.. వారితో గొడవకు దిగిన పోలీసులు కాల్పులు జరిపాడు. ఈ ఘటనతో కశ్మీర్ లోయ ఉద్రిక్తంగా మారిపోయింది’ అంటూ అతను ట్వీట్ చేశాడు. ఈ ఘటనపై స్పందించిన సీఆర్పీఎఫ్.. ఇది పూర్తి ఫేక్ ట్వీట్‌ని స్పష్టం చేసింది. ఇది కావాలని చేస్తున్న విషపూరిత దుష్ప్రచారమని, భారత బలగాలు అత్యంత సామరస్యంగా పనిచేస్తున్నాయని, తమ యూనిఫామ్ రంగులు వేరైనా... దేశభక్తి, మువన్నెల పతాకం పట్ల గౌరవ తమ హృదయాల్లో ఎప్పటికీ చెక్కుచెదరకుడా ఉంటుందని సీఆర్పీఎఫ్ తన అధికారిక ఖాతాలో ట్వీట్ చేసింది. కశ్మీర్ పోలీసులు కూడా ఈ దుష్ప్రచారంపై స్పందించారు. దుష్ప్రచారానికి పాల్పడిన సదరు వ్యక్తికి వ్యతిరేకంగా ట్విటక్ కంపెనీకి ఫిర్యాదు చేసినట్టు కశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. -
ప్రతీకారం తీర్చుకునే వరకు ఈద్ జరుపుకోను!
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో మాజీ ఐఏఎస్ అధికారి, జమ్మూకశ్మీర్ రాజకీయ నాయకుడు షా ఫైజల్ బక్రీద్ పండుగను ఉద్దేశించి ట్విటర్లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతి అవమానానికి ప్రతీకారం తీర్చుకొని బదులు ఇచ్చేవరకు ఈద్ జరుపుకోబోనని ఆయన హెచ్చరించారు. ‘ఈద్ అనేది లేదు. తమ భూభాగాన్ని లాక్కోవడంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న కశ్మీరీలు ఆవేదన చెందుతున్నారు. 1947 నుంచి దొంగలించి లాక్కున్నదంతా వెనక్కి తీసుకునే వరకు ఈద్ జరుపుకునే ప్రసక్తే లేదు. చివరి అవమానానికీ ప్రతీకారం తీర్చుకునే వరకు ఈద్ జరుపుకోబోను’అని ఆయన ట్వీట్ చేశారు. 2009లో సివిల్స్‌లో టాప్ ర్యాంక్ సాధించిన తొలి కశ్మీరీగా రికార్డు నెలకొల్పిన షా ఫైజల్.. గత జనవరిలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. రాజకీయ పార్టీని స్థాపించారు. జమ్మూకశ్మీర్‌లో ప్రశాంతంగా బక్రీద్ పర్వదిన సాగుతున్న సమయంలో రెచ్చగొట్టే రీతిలో ట్వీట్ చేసిన ఫైజల్ తీరుపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ మాజీ అధికారి అయి ఉండి ప్రభుత్వాన్ని దుయ్యబడుతూ వ్యాఖ్యలు చేస్తున్నారని, కేవలం ముస్లింలను మాత్రమే కశ్మీరీలుగా ఈ రాజకీయ నాయకుడు చూస్తున్నట్టు కనిపిస్తోంది, ఐఏఎస్ అధికారిగా పనిచేసిన ఓ వ్యక్తి ఇలా ప్రతీకార భాష మాట్లాడటం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు. -
అల్లా ఆశీస్సులు ప్రజలందరికీ లభించాలి: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: పవిత్రమైన బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాల’ని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలు ఈ పండుగను జరుపుకుంటారని తెలిపారు. ప్రజలందరికీ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ లభించాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ముస్లిం సోదరసోదరీమణులకు బక్రీద్ శుభాకాంక్షలంటూ ఆయన పేర్కొన్నారు. గవర్నర్ శుభాకాంక్షలు ముస్లిం ప్రజలకు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లామిక్ విశ్వాసంలో బక్రీద్ పర్వదినం ఎంతో ప్రాముఖ్యమైనదని గవర్నర్ పేర్కొన్నారు. భక్తికి, త్యాగానికి, దాతృత్వానికి ప్రతీకగా బక్రీద్ పండుగ నిలుస్తుందని ఆయన తెలిపారు. -
గోవధ జరగకుండా పటిష్ట చర్యలు
సాక్షి, గుంటూరు: గుంటూరు రేంజ్ పరిధిలో బక్రీద్ పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని గోవధ జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని నేపాల్, భారత్ అంతర్జాతీయ గోరక్షా అభియాన్ జాతీయ ప్రధాన కార్యదర్శి జాస్తి వీరాంజనేయులు కోరారు. ఈ మేరకు శుక్రవారం ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్‌ను ఆయన కార్యాలయంలో కలసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వీరాంజనేయులు మాట్లాడుతూ హిందువులకు గోమాత అంటే ఎనలేని భక్తి అన్నారు. వారి భక్తిని గౌరవించి ముస్లింలు గోవధకు దూరంగా ఉండాలని కోరారు. మతాలు వేరైనా అందరం ఒక్కటే అని జీవించే ఏకైక దేశం మనది కావడంతో అందరం గర్వించాల్సిన విషయమని చెప్పారు. గోవధ జరగకుండా ముస్లింలు సహకరించాలన్నారు. అలాంటివి ఎక్కడైనా జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే సమీపంలోని పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. పాత గుంటూరులో అక్రమంగా ఉంచిన 50 గోవులను గుర్తించి వాటిని గోరక్షణ కేంద్రానికి తరలించామని తెలిపారు. గోవధకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐజీ కోరామన్నారు. -
త్యాగం, సహకారంతో ప్రశాంత జీవనం
కడప కల్చరల్ : ముస్లింలకు ఆరాధనీయమైన పండుగ బక్రీద్‌ను బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ప్రత్యేక ప్రార్థనలు 12 గంటల వరకు కొనసాగాయి. కడపలోని బిల్టప్ వద్దగల ఈద్గాలో నగర వాసులతోపాటు సమీప గ్రామాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మత గురువు ముఫ్తీ మహమ్మద్ న్యామతుల్లా సందేశమిస్తూ మనుషుల్లో త్యాగ గుణం పెరగాలని, సాటి మనుషులతో పరస్పరం సహకరించుకుంటూ ఉన్నప్పుడే ప్రశాంత జీవనం, ప్రపంచ శాంతి సాధ్యమవుతాయన్నారు. ప్రజలంతా తా ము శుభ్రంగా ఉండటమే కాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దైవం సూచించారన్నారు. కేరళలో జల విలయం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిని అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన బా«ధ్యత సాటి మనుషులుగా మనపై ఉందని పేర్కొన్నారు. అనంతరం పెద్దదర్గా పీఠాధిపతి హజరత్ ఖ్వాజా సయ్యద్ షా ఆరిఫుల్లా హుసేని సాహెబ్ భక్తులతో సామూహిక ప్రార్థనలు చేయించారు. భక్తులు ఒకరినొకరు హత్తుకుని ‘ఈద్ ముబారక్ హో’అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆరీఫుల్లా, డీసీసీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వాసు, హరిప్రసాద్, నగర ముస్లిం ప్రముఖులు అమీర్‌బాబు, సుభాన్‌బాష, నాసర్ అలీ, పెద్దదర్గా ప్రతినిధి నయీంతోపాటు నగర వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రార్థనలకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసుశాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. ఓఎస్డీ అద్నాన్ నయీమ్ అస్మీ పర్యవేక్షణలో పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు రక్షణ చర్యలు చేపట్టారు.