భక్తిశ్రద్ధలతో  బక్రీద్‌ | Bakrid Festival In Adilabad | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో  బక్రీద్‌

Published Thu, Aug 23 2018 11:22 AM | Last Updated on Tue, Oct 16 2018 6:01 PM

Bakrid Festival In Adilabad - Sakshi

సందేశం ఇస్తున్న మతగురువు, ప్రార్థన చేస్తున్న ముస్లింలు

ఎదులాపురం(ఆదిలాబాద్‌): బక్రీద్‌ పండుగను ముస్లింలు ఘనంగా నిర్వహించారు. బుధవారం బక్రీద్‌ సందర్భంగా జిల్లాలో అన్ని చోట్ల ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వేకువ జామునే స్నానాలు ఆచరించి, కొత్త బట్టలు ధరించి మసీదుల వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నా పెద్ద అందరూ ఉల్లాసంగా పండుగను జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న ఈద్గా వద్దకు ముస్లింలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రార్థనలు నిర్వహించారు.

అనంతరం మత పెద్ద సందేశం ఇచ్చారు. పలువురు నేతలు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ ముడుపు దామోదర్‌రెడ్డి, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.అనిల్‌కుమార్, టీఆర్‌ఎస్‌ నాయకులు రంగినేని పవన్‌రావ్, తదితరులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. కాంగ్రెస్‌ మైనార్టీ సెల్‌ నాయకులు సాజిద్‌ఖాన్, టీఆర్‌ఎస్‌ నాయకులు యూనీస్‌ అక్బానీ, ఖయ్యుం, సలీం పాషా తదితరులు పలువురు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, పండుగ నేపథ్యంలో పట్టణమంతా సందడి కనిపించింది. ఉదయం పట్టణంలో ట్రాఫిక్‌ రద్దీ కనిపిచింది. దీంతో పోలీసులు రోడ్లపై ట్రాఫిక్‌ను సరిదిద్దుతూ కనిపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

ఆదిలాబాద్‌లో టీఆర్‌ఎస్‌ నాయకుడు సలీంపాషాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజ్జంకి అనిల్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement