త్యాగానికి ప్రతీక బక్రీద్ | bakrid festival | Sakshi
Sakshi News home page

త్యాగానికి ప్రతీక బక్రీద్

Published Tue, Oct 7 2014 12:47 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 PM

bakrid festival

సూర్యాపేట : అల్లాపై భక్తికి రంజాన్ ప్రతిరూపమైతే త్యాగానికి ప్రతీక బక్రీద్ అని రాష్ట్ర విద్యాశాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. బుధవారం బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని మైనార్టీ నాయకుడు అక్బర్ అలీ నివాసానికి చేరుకొని సేమీయాలు తీసుకున్నారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ అన్నిమతాలవారు ఐకమత్యంగా ఉండి స్నేహపూర్వకంగా పండగలను జరుపుకోవాలని కోరారు. ముస్లింల అభివృద్ధికి నిరంతరం తాను కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో తుంగతుర్తి, నకిరేకల్ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, వేముల వీరేశం, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, నాయకులు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, గండూరి ప్రకాష్, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, నాతి సవీం దర్, ఆకుల లవకుశ, పుట్ట శ్రీనివాస్‌గౌడ్, డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, శనగాని రాంబాబుగౌడ్, నెమ్మాది భిక్షం, నగేష్ పాల్గొన్నారు.
 
 తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్‌తోనే సాధ్యం
 తెలంగాణ పునర్నిర్మాణం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని రాష్ట్ర విద్యాశాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు.  పట్టణంలోని ఆయన నివాసంలో ఆత్మకూర్.ఎస్ మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన ఎంపీటీసీ కన్నోజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు సోమవారం మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులయ్యే వివిధ పార్టీల నేతలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు.  మిగతా వారు కూడా ఆంధ్రా పార్టీలను విడిచి టీఆర్‌ఎస్‌లో చేరాలని పిలుపునిచ్చారు. చేరిన వారిలో టీడీపీకి చెందిన నారగాని కన్నయ్య, రాచకొండ సైదులు, మల్లేష్, శనగాని వెంకన్న, మడ్డి మల్లేష్, చవగాని దుర్గయ్య, సత్తయ్య కార్యకర్తలు ఉన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ఆత్మకూర్.ఎస్ మం డల అధ్యక్షుడు కాకి కృపాకర్‌రెడ్డి,  మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, బత్తుల ప్రసాద్ పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement