Gadari Kishore
-
వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచారం
-
తుంగతుర్తి నియోజక వర్గం బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ టుడేస్ లీడర్
-
కేంద్రంలో హంగ్ వస్తుంది.. రాష్ట్రంలో కాదు: గాదరి కిషోర్
-
తుంగతుర్తి నియోజకవర్గంలో నెక్స్ట్ లీడర్ ఎవరు..?
తుంగతుర్తి నియోజకవర్గం తుంగతుర్తి రిజర్వుడు నియోజకవర్గంలో విద్యార్ది నేత గాదరి కిషోర్ రెండోసారి విజయం సాదించారు. ఆయన కాంగ్రెస్ ఐ అభ్యర్ది అద్దంకి దయాకర్ ను ఓడిరచారు. దయాకర్ కూడా తెలంగాణ ఉద్యమంలో జెఎసిలో ప్రముఖ పాత్ర పోషించినవారిలో ఒకరుగా ఉన్నారు. కిషోర్ కు 1847 ఓట్ల ఆదిక్యత వచ్చింది.కిషోర్ కు 90857 ఓట్లు రాగా,అద్దంకి దయాకర్ కు 87010 ఓట్లు వచ్చాయి.ఇక్కడ ఎస్.ఎప్ బి తరపున పోటీచేసిన అనిల్ కు 3700 పైచిలుకు ఓట్లు వచ్చాయి. 2014లో కూడా కిషోర్, దయాకర్ ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది.కిషోర్ 2379 ఓట్ల ఆధిక్యతతో దయాకర్ పై గెలుపొందారు. ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్ నేత,2009లో తుంగతుర్తిలో గెలిచిన మోత్కుపల్లి నర్శింహులు 2014లో తుంగతుర్తిలో పోటీచేయకుండా ఖమ్మం జిల్లా మధిర నుంచి పోటీచేసి ఓటమి చెందారు. మోత్కుపల్లి ఆలేరులో ఐదుసార్లు, తుంగతుర్తిలో ఒకసారి గెలుపొందారు. నర్శింహులు నాలుగుసార్లు టిడిపి పక్షాన, ఒకసారి కాంగ్రెస్ ఐ తరుపున, మరోసారి ఇండిపెండెంటుగా గెలిచారు. ఈయన గతంలో ఎన్.టి.ఆర్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. తుంగతుర్తిలో సిపిఎం మూడుసార్లు, కాంగ్రెస్ఐ మూడుసార్లు, టిడిపి రెండుసార్లు టిఆర్ఎస్ రెండుసార్లు విజయం సాధించగా ఇండిపెండెంట్లు రెండుసార్లు గెలిచారు. భీమ్‌రెడ్డి నరసింహారెడ్డి తుంగతుర్తిలో ఒకసారి సూర్యాపేటలో మరోసారి గెలిచారు. మిర్యాలగూడ నుంచి ఈయన మూడుసార్లు లోక్‌సభకు గెలిచారు. తర్వాత కాలంలో సిపిఎం వదలి సొంతపార్టీని ఏర్పాటుచేసుకున్నారు. సిపిఎం నేత, భీమ్‌రెడ్డి సోదరి మల్లు స్వరాజ్యం రెండుసార్లు గెలిచారు. ఇక్కడ నుంచి నాలుగుసార్లు గెలుపొందిన రామిరెడ్డి దామోదరరెడ్డి 2009లో సూర్యాపేటలో విజయం సాధించారు. కాని 2014, 2018లలో అక్కడే ఓటమి చెందారు. దామోదరరెడ్డి 1992లో నేదురుమల్లి క్యాబినెట్లో, 2009 వరకు డాక్టర్ రాజశేఖరరెడ్డి క్యాబినెట్‌లోను ఉన్నారు ఈయన సోదరుడు రామిరెడ్డి వెంకటరెడ్డి ఖమ్మం జిల్లా నుంచి ఐదుసార్లు శాసనసభకు గెలుపొందారు. ఆయన కూడా 2009-2014 మద్య మూడు క్యాబినెట్లలో మంత్రిగా ఉన్నారు. తుంగతుర్తి రిజర్వుడ్ కాకముందు ఎనిమిదిసార్లు రెడ్లు, ఒకసారి వెలమ, ఒకసారి ఇతరులు గెలుపొందారు. తుంగతుర్తి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
MLA Gadari Kishor: మీటింగ్‌కు వచ్చినవారికే పింఛన్‌కార్డులు ఇవ్వాలి
శాలిగౌరారం: రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నూతన ఆసరా పింఛన్ల కార్డులను మీటింగ్‌కు వచ్చినవారికి మాత్రమే పంపిణీ చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ అధికారులను ఆదేశించారు. శనివారం నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో పర్యటించిన కిశోర్.. మొదట వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రారంభ శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం నూతన ఆసరా పింఛన్ల మంజూరు కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ప్రభుత్వం ప్రజల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, అమలుచేస్తుంటే.. లబ్ధిదారులు కనీసం కార్డుల పంపిణీ రోజున కూడా సమావేశాలకు హాజరుకాకపోతే ఎలా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక పంచాయతీ కార్యదర్శి వెంకన్నపై పరుషపదజాలంతో వ్యాఖ్యలు చేశారు. గ్రామానికి కొత్తగా 152 ఆసరా పింఛన్లు మంజూరైతే మీటింగ్‌కు లబ్ధిదారులందరూ రాలేదని, మీటింగ్‌కు రాని లబ్ధిదారులకు కొత్తపింఛన్ కార్డులను ఇవ్వవద్దని ఎమ్మెల్యే, పంచాయతీ కార్యదర్శిని హెచ్చరించారు. తాను చెప్పిన తర్వాత కూడా కార్డులు పంపిణీ చేస్తే ‘నీ లాగు పగులుద్ది’అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలపై అటు ప్రభుత్వ ఉద్యోగులు, ఇటు ప్రజలు పెదవివిరుస్తున్నారు. -
మానవత్వం చాటుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే
అర్వపల్లి (నల్గొండ): రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని అటుగా వెళ్తున్న తుంగతుర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ గమనించి అప్పటికప్పుడు కారు, ఆటో ఏర్పాటు చేసి ఆస్పత్రికి పంపించి మానవత్వం చాటుకున్నారు. వివరాలు.. సూర్యాపేట–జనగామ 365బీ జాతీయ రహదారిపై జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం వద్ద బుధవారం సూర్యాపేట నుంచి అర్వపల్లి వైపు వస్తున్న ఆటో, అర్వపల్లి నుంచి కుంచమర్తికి వెళ్తున్న బైక్ ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై, ఆటోలో ప్రయాణిస్తున్న మేడి వినయ్, ఆకారపు మహేష్, మనుబోతుల నాగరాజు, కల్లెం సంతోష్, పత్తెపురం ముత్తమ్మ గాయపడ్డారు. కాగా మండల పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అదే సమయంలో ఆ రోడ్డు గుండా వెళ్తూ క్షతగాత్రులకు చూసి వెంటనే ఆగారు. తన వాహన శ్రేణిలోని కారుతో పాటు మరో ఆటోలో క్షతగాత్రులను సూర్యాపేట జిల్లా జనరల్ ఆస్పత్రికి పంపించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫోన్ చేసి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అర్వపల్లి ఎస్సై మహేష్ తెలిపారు. ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ -
వైరల్: స్వేరోస్ పేరుతో ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కి బెదిరింపులు
-
టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు స్వేరోస్ సభ్యుడి స్ట్రాంగ్ వార్నింగ్
సాక్షి, నల్గొండ: మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రజలకు సేవ చేస్తానంటూ తన పదవికి రాజీనామా చేసి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగస్టు 8న బీఎస్పీలో చేరారు. అనంతరం ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దళిత బంధు కోసం రూ.1000 కోట్లు ఖర్చు పెడుతున్నామని అంటున్నారు.. ఆ డబ్బులు ఎవరివని ప్రవీణ్ కుమార్ సీఎం కేసీఆర్‌ని ప్రశ్నించారు. మరోవైపు టీఆర్ఎస్ ఎమెల్యే గ్యాదరి కిషోర్, మరికొందరు అధికారం పార్టీ నేతలు సోమవారం .. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తే ఊరుకోమని కౌంటర్ ఇచ్చారు. దీంతో తమ నాయకుడు ప్రవీణ్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని స్వేరోస్ సభ్యులు తీవ్ర స్థాయిలో ప్రతి విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్వేరోస్ సభ్యుడు సంపత్ అనే వ్యక్తి పేరుతో ఓ ఆడియో కాల్ వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్‌కు ఫోన్ చేసిన సంపత్..‘నీది ప్రవీణ్ కుమార్‌ను విమర్శించే స్థాయా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరోసారి ప్రవీణ్ కుమార్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చాడు. పద్ధతి మార్చుకోవాలని హితవు పలికాడు. ఏడేళ్లు గడిచిన తర్వాత ఇప్పుడు దళిత బంధు గుర్తుకువచ్చిందా మీకు అని ప్రశ్నించాడు. -
ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం
హైదరాబాద్: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని ఎమ్మెల్యే గాదరి కిశోర్ హెచ్చరించారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఏ అభివృద్ధి అయినా చేసేది ప్రభుత్వమేనని.. వ్యక్తులు కాదన్నారు. దళితుల కోసం రాజీనామా చేశానని ప్రవీణ్‌కుమార్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దందళిత బంధుకు ప్రవీణ్‌కుమార్ వ్యతిరేకమా? అని గాదరి కిశోర్ ప్రశ్నించారు. కాగా దళిత బంధు కోసం రూ.1000 కోట్లు ఖర్చు పెడుతున్నామని అంటున్నారు.. ఆ డబ్బులు ఎవరివని సీఎం కేసీఆర్‌ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దళితులపై ప్రేమ ఉంటే కేసీఆర్ తన ఆస్తులు అమ్మి దళితబంధు అమలు చేయాలి, తెలంగాణలో ఇప్పటివరకు సీఎం కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. ఇన్నేళ్లలో తెలంగాణలో ఎన్ని ఆస్పత్రులు కట్టారు? ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఎందుకు ఉండకూడదు? అని ఆయన నిలదీశారు. -
గాదరి కిషోర్ లీడర్‌తో
-
ఎమ్మెల్యే అదిరే స్టెప్పులు.. వైరల్ వీడియో
-
ఎమ్మెల్యే అదిరే స్టెప్పులు.. వైరల్ వీడియో
సాక్షి, సూర్యాపేట : తెలంగాణ ప్రజల సంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ సంబరాల్లో సామాన్యులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు అనే భేదాలు లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లాలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ నేను సైతం అంటూ స్టెప్పులేసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న వారిలో ఉత్సాహాన్ని రెట్టింపుచేశారు. శాలిగౌరారంలో జరిగిన మహా బతుకమ్మ వేడుకల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ పాటలు ప్లే అవుతుండగా ఆయన రెట్టించిన ఉత్సాహంతో కాలు కదిపారు. ఎమ్మెల్యే ఉత్సాహంగా స్టెప్పులేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రజాప్రతినిధులు.. పండుగలు, సంస్కృతికి ఎప్పుడూ సామాన్యులే అన్న తరహాలో బతుకమ్మ వేడుకల్లో పాటలకు డ్యాన్స్ చేస్తూ అందర్నీ గాదరి కిషోర్ అలరించారు. ఎమ్మెల్యే డ్యాన్స్ చేస్తున్నంతసేపు అక్కడున్నవారు ఈలలువేస్తూ ఆయనకు మద్ధతు తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలు.. సామాన్యులు, సెలబ్రిటీలు అందర్నీ ఏకం చేస్తాయంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. -
'రాష్ట్ర బడ్జెట్లో సంక్షేమానికి పెద్ద పీట'
హైదరాబాద్ : పేదల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ స్పష్టం చేశారు. శనివారం తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక బడ్జెట్‌పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాదరి కిషోర్ మాట్లాడుతూ... రాష్ట్ర బడ్జెట్లో సంక్షేమానికి పెద్ద పీట వేసినట్లు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బంగారు తెలంగాణకు బాటలు వేసే విధంగా ఉందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత ఆలోచనలతో ముందుకు సాగుతున్నారని గాదరి కిషోర్ పేర్కొన్నారు. సాగునీటి రంగానికి కూడా ఈ బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు గాదరి కిషోర్ గుర్తు చేశారు. -
మళ్లీ అదే గొడవ
హుజూర్నగర్ టీఆర్ఎస్లో ఒడవని పంచాయితీ దూతగా వచ్చిన గాదరి కిషోర్ సమక్షంలోనూ ఆందోళనలు అన్ని విషయాలను కేసీఆర్‌కు చెపుతానన్న పార్లమెంటరీ కార్యదర్శి హుజూర్నగర్ టీఆర్ఎస్ నేతల మధ్య సయోధ్య కుదరడం లేదు. హుజూర్నగర్ నియోజకవర్గంలోని పార్టీ నాయకులు ఎవరికి వారే యమునాతీరే అనే రీతిలో వెళుతున్నారు. మొన్న ఫ్లెక్సీల పంచాయితీ జరిగిన నేపథ్యంలో వాస్తవమేంటో తెలుసుకునేందుకు శుక్ర వారం పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిషోర్ హుజూర్నగర్ వచ్చారు. నియోజకవర్గంలో గ్రూపులుగా వ్యవహరిస్తున్న శంకరమ్మ, సాముల శివారెడ్డి, అల్లం ప్రభాకర్రెడ్డిలను పిలిపించి ఆర్అండ్బీ అతిథి గృహంలో సమావేశమయ్యారు. అదే సమయంలో కొందరు టీ ఆర్ఎస్ నాయకులు సమావేశం జరుగుతున్న అతిథిగృహం వద్ద ఆందోళనకు దిగారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న తమను పట్టించుకోకుండా, మధ్యలో వచ్చి పార్టీలో చేరిన వారితో సమావేశం కావడమేంటని వారు నిరసన వ్యక్తం చేశారు. జిల్లా టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు చిలకరాజు నర్సయ్య, కొణతం లచ్చిరెడ్డి, హుజూర్నగర్ పట్టణ, మండల అధ్యక్షులు దొడ్డా నర్సింహారావు, చిలకరాజు అజయ్‌కుమార్, మేళ్లచెరువు, గరిడేపల్లి మండల అధ్యక్షులు రెంటోజు ఉమాకాంత్, కారింగుల లింగయ్యగౌడ్ల ఆధ్వర్యంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాలలో పాల్గొని 14 ఏళ్లపాటు పార్టీ జెండా మోసిన తెలంగాణ ఉద్యమకారులమైన తమకు టీఆర్ఎస్లో గుర్తింపు లేదా అని వారు ప్రశ్నించారు. రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిని జైలు జీవితం గడిపిన తమను కాదని షో రాజకీయాలు చేసేవారితో చీకటి గదులలో సమావేశాలు నిర్వహించడం తెలంగాణ ఉద్యమకారుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడమేనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. దీంతో ఆర్అండ్బీ ప్రాంగణంలో గందరగోళం నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన చేస్తున్న వారిని బయటకు పంపించే ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో గాదరి కిషోర్ బయటకు వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం తాను నియోజకవర్గ నాయకులను సమన్వయం చేసేందుకు సమావేశమైనట్లు ఆందోళనకారులకు వివరించారు. పార్టీలో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే... నివేదిక రూపంలో ముఖ్యమంత్రికి అందజేస్తానన్నారు. ముం దుగా ముఖ్యులతో సమావేశం పూర్తి కాగానే నియోజకవర్గంలోని ఐదు మండలాల నేతలతో మాట్లాడుతానని, మీడియా ముందు హల్చల్ చేస్తూ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లయితే సహించేది లేదని, అవసరమైతే సస్పెండ్ చేసేందుకు వెనుకాడేది లేదన్నారు. దీనికి స్పందించిన ఆందోళనకారులు కొత్తగా వచ్చిన వారిని అందలం ఎక్కిస్తూ పార్టీ కోసం పని చేసిన వారిని పక్కన పెడితే ఊరుకునేదిలేదని ఎమ్మెల్యే కిషోర్‌కు సూచించారు. అనంతరం ఆందోళన సద్దుమనగడంతో మండలాల వారీగా ఎమ్మెల్యే కిషోర్ నాయకులతో సమీక్ష నిర్వహించి వెళ్లిపోయారు -
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే గాదరి కిషోర్
-
త్యాగానికి ప్రతీక బక్రీద్
సూర్యాపేట : అల్లాపై భక్తికి రంజాన్ ప్రతిరూపమైతే త్యాగానికి ప్రతీక బక్రీద్ అని రాష్ట్ర విద్యాశాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. బుధవారం బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని మైనార్టీ నాయకుడు అక్బర్ అలీ నివాసానికి చేరుకొని సేమీయాలు తీసుకున్నారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ అన్నిమతాలవారు ఐకమత్యంగా ఉండి స్నేహపూర్వకంగా పండగలను జరుపుకోవాలని కోరారు. ముస్లింల అభివృద్ధికి నిరంతరం తాను కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో తుంగతుర్తి, నకిరేకల్ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, వేముల వీరేశం, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, నాయకులు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, గండూరి ప్రకాష్, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, నాతి సవీం దర్, ఆకుల లవకుశ, పుట్ట శ్రీనివాస్‌గౌడ్, డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, శనగాని రాంబాబుగౌడ్, నెమ్మాది భిక్షం, నగేష్ పాల్గొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్‌తోనే సాధ్యం తెలంగాణ పునర్నిర్మాణం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని రాష్ట్ర విద్యాశాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ఆయన నివాసంలో ఆత్మకూర్.ఎస్ మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన ఎంపీటీసీ కన్నోజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు సోమవారం మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులయ్యే వివిధ పార్టీల నేతలు టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. మిగతా వారు కూడా ఆంధ్రా పార్టీలను విడిచి టీఆర్ఎస్లో చేరాలని పిలుపునిచ్చారు. చేరిన వారిలో టీడీపీకి చెందిన నారగాని కన్నయ్య, రాచకొండ సైదులు, మల్లేష్, శనగాని వెంకన్న, మడ్డి మల్లేష్, చవగాని దుర్గయ్య, సత్తయ్య కార్యకర్తలు ఉన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ఆత్మకూర్.ఎస్ మం డల అధ్యక్షుడు కాకి కృపాకర్‌రెడ్డి, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, బత్తుల ప్రసాద్ పాల్గొన్నారు.