సాక్షి, సూర్యాపేట : తెలంగాణ ప్రజల సంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ సంబరాల్లో సామాన్యులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు అనే భేదాలు లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లాలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ నేను సైతం అంటూ స్టెప్పులేసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న వారిలో ఉత్సాహాన్ని రెట్టింపుచేశారు. శాలిగౌరారంలో జరిగిన మహా బతుకమ్మ వేడుకల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ పాటలు ప్లే అవుతుండగా ఆయన రెట్టించిన ఉత్సాహంతో కాలు కదిపారు.
ఎమ్మెల్యే ఉత్సాహంగా స్టెప్పులేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రజాప్రతినిధులు.. పండుగలు, సంస్కృతికి ఎప్పుడూ సామాన్యులే అన్న తరహాలో బతుకమ్మ వేడుకల్లో పాటలకు డ్యాన్స్ చేస్తూ అందర్నీ గాదరి కిషోర్ అలరించారు. ఎమ్మెల్యే డ్యాన్స్ చేస్తున్నంతసేపు అక్కడున్నవారు ఈలలువేస్తూ ఆయనకు మద్ధతు తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలు.. సామాన్యులు, సెలబ్రిటీలు అందర్నీ ఏకం చేస్తాయంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.