![TRS MLAs Are Angry On RS Praveen Kumar Comments - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/9/gadari-kishour.gif.webp?itok=CdUaOr1l)
హైదరాబాద్: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని ఎమ్మెల్యే గాదరి కిశోర్ హెచ్చరించారు. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఏ అభివృద్ధి అయినా చేసేది ప్రభుత్వమేనని.. వ్యక్తులు కాదన్నారు. దళితుల కోసం రాజీనామా చేశానని ప్రవీణ్‌కుమార్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దందళిత బంధుకు ప్రవీణ్‌కుమార్ వ్యతిరేకమా? అని గాదరి కిశోర్ ప్రశ్నించారు.
కాగా దళిత బంధు కోసం రూ.1000 కోట్లు ఖర్చు పెడుతున్నామని అంటున్నారు.. ఆ డబ్బులు ఎవరివని సీఎం కేసీఆర్‌ని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దళితులపై ప్రేమ ఉంటే కేసీఆర్ తన ఆస్తులు అమ్మి దళితబంధు అమలు చేయాలి, తెలంగాణలో ఇప్పటివరకు సీఎం కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. ఇన్నేళ్లలో తెలంగాణలో ఎన్ని ఆస్పత్రులు కట్టారు? ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఎందుకు ఉండకూడదు? అని ఆయన నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment