
హైదరాబాద్, సాక్షి: సభలో ఎప్పుడూ హుందాగా ప్రవర్తించాలని తమ పార్టీ అధినేత కేసీఆర్(KCR) చెబుతుండేవారని, ఆ మాటను తాము తూచా తప్పకుండా పాటిస్తున్నామని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) అంటున్నారు. శనివారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. తమ పార్టీ నేత జగదీష్‌రెడ్డిపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కోరారాయన.
‘‘స్పీకర్ అంటే జగదీష్‌రెడ్డికి, మాకు ఎంతో గౌరవం ఉంది. సభలో హుందాగా ఉండాలని మా అధినేత చెబుతుండేవారు. మేం అలాగే ఉంటున్నాం. స్పీకర్ పట్ల ఆయన అమర్యాదగా ప్రవర్తించలేదు. జగదీష్‌రెడ్డికి మైక్ ఇచ్చి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది. అయినా ఆయన స్పీకర్‌ను ఏకవచనంతో పిలవలేదు. కాబట్టి జగదీష్‌రెడ్డి(jagadish Reddy)పై సస్పెన్షన్ వేటు ఎత్తేయాలి’’ అని హరీష్ రావు స్పీకర్‌ను కోరారు.
అంతకు ముందు.. సభ ప్రారంభానికి ముందు స్పీకర్‌ను ఆయన ఛాంబర్‌లో బీఆర్‌ఎస్ శాసనసభా పక్షం కలిసిసింది. జగదీష్‌రెడ్డి సస్పెన్షన్ అక్రమం, అన్యాయన్న బీఆర్‌ఎస్ సభ్యులు.. సస్పెన్షన్‌పై ఫ్లోర్ లీడర్ల అభిప్రాయం కానీ, బీఆర్ఎస్ పార్టీ తరపున వివరణ కానీ, చివరకు సస్పెన్షన్‌కు గురైన సభ్యుడు జగదీశ్ రెడ్డి నుంచి వివరణ కూడా తీసుకోలేదని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. కాబట్టి.. నిర్ణయాన్ని పునఃపరిశీలించి సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు.


Comments
Please login to add a commentAdd a comment