రాయచోటిలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ముస్లింలు
రాయచోట, రాయచోటి టౌన్: ముస్లింలకు అత్యంత పవిత్రమైన పండుగ బక్రీద్‌ను ఆదివారం జిల్లావ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జిల్లాలోని రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, మదనపల్లె, తంబళ్లపల్లె.పీలేరులో భక్తులు తమ సమీపంలోని మసీదుల్లో జరిగే ప్రార్థనల్లో పాల్గొనగా, అధికశాతం మంది ఈద్గాలకు వెళ్లి ప్రార్థనలు నిర్వహించారు.
ప్రవక్త ఇబ్రహీం త్యాగం ఆదర్శనీయం
త్యాగానికి ప్రతి రూపం బక్రీద్ పండుగ అని మత గురువు సర్కాజీ అన్నారు. ప్రతి ఒక్కరూ దయ, త్యాగగుణం అలవర్చుకోవాలని సూచించారు. ఇస్లాం శాంతిని బోధిస్తుందని చెప్పారు. పవక్త హజరత్ ఇబ్రహీం త్యాగం ఆదర్శనీయమని అన్నారు.దైవాజ్ఞను పాటిస్తూ తన ఏకైక కుమారుడైన హజరత్ ఇస్మాయిల్‌ను దైవమార్గంలో త్యాగం చేయడానికి సిద్ధపడిన వైనాన్ని వివరించారు. ఇబ్రహీం త్యాగనిరతియే బక్రీద్ పరమార్థమని తెలిపారు. ఆయన సూచించిన మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని స్వార్థాన్ని వీడి, సమసమాజ నిర్మాణం కోసం అందరూ పాటుపడాలన్నారు.
అనంతరం విశ్వమాసవాళి సంక్షేమం కోసం దువా చేశారు. మదనపల్లెలో మతగురువు హాఫీజ్ జలాలుద్దీన్‌సాహెబ్ ధార్మికోపన్యాసం చేశారు పాత రాయచోటి సమీపంలోని ఈద్గాలో నిర్వహించిన సామూహిక ప్రార్థనల్లో ముస్లిం సోదరులు, అన్నమయ్య జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కలెక్టర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ భక్తిశ్రద్ధలతో,ఆనందోత్సవాల మధ్య పండుగ నిర్వహించుకోవాలని సూచించారు.
మైనార్టీల సంక్షేమానికి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. అనంతరం ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా ఇంటిలో అల్ఫాహార విందులో పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు జమాల్ ఖాన్, హబీబుల్లాఖాన్,బేపారి మహమ్మద్‌ఖాన్,ఆసీఫ్ ఆలీఖాన్,జాకీర్, ఫయాజ్ అహమ్మద్, రౌనక్, ఎస్‌పీఎస్ రిజ్వాన్,ఎస్‌పీఎస్ జబివుల్లా, ఝాఫర్ ఆలీఖాన్, ఇర్షాద్. షబ్బీర్, అల్తాప్, తబ్రేజ్, సున్నా, కో – ఆఫ్షన్ ఆసీఫ్ ఆలీఖాన్, కొత్తపల్లె ఇంతియాజ్ పాల్గొన్నారు.
మదన పలెలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఎం.నవాజ్‌బాషా అందరినీ అలింగనం చేసి శుభాకాంక్షలు తెలిపారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతూ సందేశాన్ని పంపారు.
భద్రతా ఏర్పాట్ల పరిశీలన: బక్రీద్ పండుగ ప్రశాంత వాతారణంలో నిర్వహించుకు నేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు వైఎస్సార్ జిల్లా ఎస్పీ, అన్నమయ్యజిల్లా ఇన్‌చార్జి ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తెలిపారు. ఆదివారం ఉదయం ఠానా, మజీద్ సర్కిల్‌లో భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. రాయచోటి డీఎస్సీ శ్రీధర్, డీఎస్సీ రవికుమార్, సీఐ సుధాకరరెడ్డి, ఎస్సైలు పాల్గొన్నారు.
ఎస్పీ బక్రీద్ శుభాకాంక్షలు
రాయచోటి: ముస్లిం సోదరులకు అన్నమయ్య జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. జిల్లాలోని అన్ని ప్రార్థన మందిరాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment