సాక్షి, హైదరాబాద్: బక్రీద్ పర్వదినం సందర్భంగా గవర్నర్ తమిళిసై ముస్లింలకు శుభాకాంక్షలు తెలియ జేశారు. ఇచ్చి పుచ్చు కోవడం, దాతృత్వం, అవసరమైన వారికి సహాయం చేయడం వంటి సుగుణాలకు ఈ పండుగ స్ఫూర్తి కలిగిస్తుందన్నారు. ఈ వేడు కలతో సోదరభావం, సేవాతత్వం, త్యాగ గుణాలు మరింత బలపడతాయన్న ఆశాభా వాన్ని ఆమె వ్యక్తం చేశారు. శాంతి, సామ రస్యం, స్నేహ భావాలను ప్రోత్సహించడమే బక్రీద్ పండుగ పరమార్థమని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment