
సాక్షి, అమరావతి: పవిత్రమైన బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాల’ని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలు ఈ పండుగను జరుపుకుంటారని తెలిపారు. ప్రజలందరికీ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ లభించాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ముస్లిం సోదరసోదరీమణులకు బక్రీద్ శుభాకాంక్షలంటూ ఆయన పేర్కొన్నారు.
గవర్నర్ శుభాకాంక్షలు
ముస్లిం ప్రజలకు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లామిక్ విశ్వాసంలో బక్రీద్ పర్వదినం ఎంతో ప్రాముఖ్యమైనదని గవర్నర్ పేర్కొన్నారు. భక్తికి, త్యాగానికి, దాతృత్వానికి ప్రతీకగా బక్రీద్ పండుగ నిలుస్తుందని ఆయన తెలిపారు.