burning star
-
ఏదీ మీ వెనుక రాదు
‘‘నువ్వెక్కడి నుంచి వచ్చావో అదే నీ నిజమైన స్థానం. నీ ఆస్తి, నీ డబ్బు నీ వెనుక రావు’’ అంటున్నారు సంపూర్ణేష్ బాబు. ‘çహృదయ కాలేయం, కొబ్బరి మట్ట’ సినిమాలతో కామెడీ స్టార్‌గా పాపులర్ అయ్యారుఆయన. ఇటీవల పాపులర్‌గా మారిన ‘ది రియల్ మేన్’ ఛాలెంజ్ లో పాల్గొన్నారు. ఈ లాక్ డౌన్ లో ఆయన తన గతాన్ని గుర్తు చేసుకున్నారు. హీరో కాకముందు కంసాలి పని చేసేవారు సంపూ. ఈ లాక్ డౌన్ సమయంలో తన భార్య, పిల్లలకు వెండి ఆభరణాలు తయారు చేశారాయన. ఆ వీడియోను షేర్ చేసి ‘‘రాజు.. పేద తేడా లేదు. నీ ఆస్తి, డబ్బు నీ వెనుక రావు. నువ్వెక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు అని నా నిజమైన స్థానం గుర్తు చేసుకుంటూ మా ఆవిడ కోసం, నా పాత ‘కంసాలి’ వృత్తిని గుర్తు చేసుకుంటూ ఇంట్లో మిగిలిన గజ్జెలతో తనకి కాలి మెట్టెలు, పిల్లల కోసం గజ్జెలు చేసి ఇచ్చాను’’ అని పేర్కొన్నారు సంపూర్ణేష్. -
సంపూ రికార్డ్
‘హుృదయకాలేయం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచి, ‘బర్నింగ్ స్టార్’గా పేరు తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘కొబ్బరిమట్ట’. రూపక్ రొనాల్డ్ సన్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సాయి రాజేష్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 10న విడుదలకానుంది. ఈ సందర్భంగా – ‘‘ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారిగా 3.30 నిమిషాల సింగిల్ షాట్ డైలాగ్ ఉన్న సినిమా ‘కొబ్బరిమట్ట’’ అంటూ పెద్ద డైలాగ్ ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్రబృందం. ‘‘ఏరా పెదరాయుడు.. త్రికాలాత్రక.. ఓరీ ఓరోరీ ఆపరా..’ అంటూ మొదలైన సంపూర్ణేష్ డైలాగ్.. ‘పెదరాయుడు టైమ్ ఈజ్ ఓవర్.. ఆండ్రాయుడు టైమ్ స్టార్ట్స్ నౌ..’ అనే డైలాగ్‌తో ముగుస్తుంది.3.30 నిమిషాలపాటు సంపూ చెప్పిన ఈ డైలాగ్‌కి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో పాపారాయుడు, పెదరాయుడు, ఆండ్రాయుడు.. లాంటి మూడు పాత్రలతో సంపూ మెప్పించబోతున్నారు. అత్యంత భారీ డైలాగ్‌లు చెప్పి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుని నెలకొల్పాడు. ఇటీవల విడుదల చేసిన ‘అఆ.. ఇఈ...’ అనే పాటకి యూట్యూబ్‌లో 24 గంటల్లో రెండు లక్షల వ్యూస్ వచ్చాయంటే మా సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ తెలియజేస్తోంది. ఈ చిత్రం నైజాం, ఓవర్సీస్ హక్కులని ‘నో బారియర్స్ ఎంటర్టైన్మెంట్’ వారు సొంతం చేసుకున్నారు’’ అన్నారు. -
బర్నింగ్ స్టార్ ‘సంపూ’ సందడి
విజయవాడ(చిట్టినగర్) : బర్నింగ్ స్టార్ సంపూ శనివారం చిట్టినగర్ సెంటర్లోని మహాలక్ష్మీ, పద్మావతి గోదాదేవి సమేత వేంకటేశ్వరస్వామి వార్లను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన సంపూర్ణేష్‌బాబుకు ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు. మహాలక్ష్మీ అమ్మవారిని, పద్మావతి, గోదాదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు రామరత్నమాచార్యులు ఆశీర్వచనం అందచేయగా, ఆలయ కమిటీ చైర్మన్ పోతిన బేసు, కమిటీ సభ్యులు పోతిన సాంబశివరావు దేవస్థాన జ్ఞాపికను అందజేశారు. సంపూర్ణేష్‌బాబు చిట్టినగర్‌కు విచ్చేశారని తెలుసుకున్న మహిళలు, యువతులు ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. సంపూతో సెల్ఫీలు, ఆటోగ్రాపులు తీసుకునేందుకు పోటీ పడ్డారు. గూడెల వెంకటరమణ, కత్తెర ప్రదీప్, భోగవల్లి సన్నయ్యపాత్రుడు, మద్ది సాంబశిరావు, భోగవల్లి శ్రీధర్, బీసీ నాయకులు పోతిన వెంకటమహేష్, శీరం వెంకట్రావులు ఆయన వెంట ఉన్నారు. -
వైరస్‌లా మారిన సంపూ
హృదయకాలేయం సినిమా సక్సెస్ తరువాత టాలీవుడ్ టాప్ స్టార్లకు ధీటుగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు సంపూర్ణేష్ బాబు. సోషల్ మీడియా స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఈ బర్నింగ్ స్టార్, ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో కూడా స్పెషల్ క్యారెక్టర్లు చేస్తూ తన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. స్పెషల్ క్యారెక్టర్లతో పాటు హీరోగానూ కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే కొబ్బరి మట్ట సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంపూర్ణేష్ బాబు, మరో ఇంట్రస్టింగ్ టైటిల్‌తో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.వైరస్.కామ్ పేరుతో ఓ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్‌ను రెడీ చేస్తున్నాడు సంపూర్ణేష్ బాబు. సిహెచ్ రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గీతాషా హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. హృదయకాలేయం సినిమాతో సెన్సేషనల్ సక్సెస్ అందుకున్న సంపూ మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి. -
‘బందిపోటు’... ఓ గొప్ప అనుభవం!
ఒక్క సినిమాతోనే బర్నింగ్ స్టార్ అనిపించుకున్నారు సంపూర్ణేశ్‌బాబు. ‘అల్లరి’ నరేశ్ హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈవీవీ సినిమా పతాకంపై రాజేశ్ ఈదర నిర్మించిన ‘బందిపోటు’లో సంపూర్ణేశ్‌బాబు ముఖ్య పాత్ర పోషించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా తన కెరీర్లో మంచి మలుపని సంపూ ఆనందం వెలిబుచ్చారు. ‘సాక్షి’తో సంపూర్ణేశ్‌బాబు ప్రత్యేకంగా చెప్పిన ముచ్చట్లు... ‘‘నరేశ్ పక్కన అదీ ఈవీవీ గారి సంస్థలో నటించడం చెప్పలేనంత ఆనందాన్నిచ్చింది. ‘బందిపోటు’లో నటించడం ఓ గొప్ప అనుభవం. సెట్లో గడిపిన ప్రతీ క్షణాన్నీ నేను ఆస్వాదించాను. ఈ సినిమా వల్ల ‘అల్లరి’ నరేశ్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, సయాజీ షిండే తదితర గొప్ప నటులతో కలిసి తెరను పంచుకొనే అవకాశం కలిగింది. వీళ్లందరితో కలిసి నటించాలని తెలిసి మొదట్లో కాస్త టెన్షన్ పడ్డాను. కానీ సెట్లోకి అడుగుపెట్టగానే వాతావారణం అంతా మారి పోయింది. అందరూ చాలా సరదాగా... ఆద్యంతం నవ్వుతూ, నవ్విస్తూ నన్ను కలుపుకొన్నారు. ఆర్యన్ రాజేశ్ గారికి, ‘అల్లరి’ నరేశ్ గారికి నేనంటే చాలా ఇష్టం. వాళ్లు నన్నెంత బాగా చూసుకున్నారో మాటల్లో చెప్పలేను. ఆర్యన్ రాజేశ్ గారి ప్రత్యేకమైన ఆసక్తి వల్లే నేను ఈ సినిమాలో నటించాను.’’ టైమింగ్ తెలిసింది! ‘‘ఈ సినిమాలో నా పాత్ర పేరు తెల్లబ్బాయ్. చిన్న పిల్లల మనస్తత్వం అన్నమాట. ఎదుటివారి ఎత్తుల్ని, పైఎత్తుల్ని, లాజిక్కుల్ని పసిగట్టలేక పోతుంటాను. అందుకే ‘నీ తెల్లటి మనసుకు తెలియలేదురా తెల్లబ్బాయ్’ అని డైలాగ్ చెబుతాడు అల్లరి నరేశ్. ఆయనకి స్నేహితుడిగా సినిమా మొత్తం కనిపిస్తాను. నరేశ్‌తో కలిసి చేసిన ఈ సినిమా ప్రయాణం నా జీవితాంతం గుర్తుండి పోతుంది. కామెడీ టైమింగ్ అంటే ఏంటో ఆయన నుంచి బాగా తెలుసుకున్నాను. ఆయనతో కలిసి మళ్లీ మళ్లీ నటించాలని ఉంది.’’ ఇంట్రడక్షన్ మిస్ కావద్దు! ‘‘సినిమాలో సన్నివేశాలన్నీ ఒకెత్తయితే... నా ఇంట్రడక్షన్ మరో ఎత్తు. గురువుగారు మోహనకృష్ణ ఇంద్రగంటి అద్భుతమైన ఇంట్రడక్షన్‌తో నన్ను తెరపై చూపించారు. అందుకే ఆ సన్నివేశాలను అస్సలు మిస్ కావద్దని చెబుతున్నా. సడన్ స్టార్, బర్నింగ్ స్టార్ కలిస్తే థియేటర్ నవ్వులతో మార్మోగిపోవాల్సిందే అని ఈ సినిమా నిరూపించింది.’’ రాజమౌళి గారిని అడుగుతా..! ‘‘ ‘బందిపోటు’ ఆడియో వేడుకలో రాజమౌళి గారిని కలిశాను. ‘బాహుబలి’ విడుదలయ్యాక రాజమౌళిగారిని కలిసి.. ‘తదుపరి మీరు చేయ బోయే సినిమాలో కనీసం రెండు నిమిషాలైనా కనిపించాలనుంది’ అని అడుగుతా. ప్రస్తుతం ‘కొబ్బరిమట్ట’, ‘సింగం 123’ చిత్రాల్లో కథానాయకుడిగా నటిస్తున్నా. వాటితో పాటు ఇంకో మూడు చిత్రాల్లోనూ సోలోగా నటించడానికి ఒప్పుకొన్నా.’’ -
నా తీరే ‘బర్నింగ్ స్టార్’ని చేసింది
దోసకాయలపల్లిలో ‘సంపూ’ దోసకాయలపల్లి (మధురపూడి) : ఆయన హీరోగా నటించింది కేవలం ఒకే ఒక్క సినిమా (హృదయకాలేయం). 25 సినిమాలలో నటించినంత గుర్తింపు పొందారు. ప్రస్తుతం రెండు సినిమాలలో హీరోగా నటిస్తూ..మరో ఆరు సినిమాలలో కేరక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా మారిపోయారు. ఆయనే ‘బర్నింగ్‌స్టార్’ సంపూర్ణేష్‌బాబు. ఇ.వి.వి. సినిమా బ్యానర్ పై ఆయన వారసులు ఆర్యాన్ రాజేష్ నిర్మాతగా,‘అల్లరి’ నరేష్ హీరోగా నిర్మిస్తున్న ‘బందిపోటు’ సినిమా షూటింగ్ కోరుకొండ మండలం దోసకాయలపల్లిలోని బొమ్మనరాజ్‌కుమార్ తోటలో నిర్విరామంగా జరుగుతోంది. ఈ సినిమాలో నరేష్‌కు స్నేహితుడిగా సంపూ నటిస్తున్నారు. ఆయనతో చిట్‌చాట్... ప్ర: హలో...సంపూర్ణేష్బాబూ...ఎలా వున్నారు ? జ: చాలా బాగున్నాను..సార్.... ప్ర : ఒకే ఒక్క సినిమాతో స్టార్ అయిపోయారు..? ఇది ఎలా సాధ్యమైంది.? జ: నేను చిన్నప్పటి నుంచి ప్రత్యేకంగా వుండాలని కోరుకునేవాడ్ని. ఆ స్వభావమే నన్నీస్థాయికి తీసుకొచ్చింది. ప్ర : సినిమాలో అవకాశం ఎలా వచ్చింది? జ : సోషల్ మీడియా ద్వారా అందరికీ సుపరిచితుడ్ని. చిన్నప్పటి నుంచి సినిమాలంటే విపరీతమైన పిచ్చి. ‘హృదయకాలేయం’ సినిమా దర్శకుడు స్టీవెన్‌శంకర్ పరిచయంతో ఆ సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. జన్మనిచ్చింది..స్టీవెన్‌శంకర్ అయితే..జీవం పోసింది..మీడియా సోదరులే. ఆ సినిమా ఆడియో వేడుకలో నేను మాట్లాడిన తీరు చిత్రపరిశ్రమను,ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్ర : మీ స్వస్థలం ఎక్కడ.. జ: మెదక్ జిల్లా సిద్దిపేట మండలం మిట్టపల్లి.. హైదరాబాద్‌లో స్థిరపడ్డాను. ప్ర : ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు.. ప్రస్తుతం ఏ చిత్రాలు చేస్తున్నారు.? జ: హీరోగానే కాకుండా ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తా. మంచి నటుడిగా స్థిరపడాలనుంది. త్వరలో ‘కొబ్బరిమట్ట’ సినిమాలో హీరోగా చేస్తున్నాను. మరో ఆరు సినిమాలు ఒప్పుకున్నాను. బందిపోటులో అల్లరి నరేష్ స్నేహితుడిగా గుర్తింపు ఉన్న పాత్రలో నటిస్తున్నాను. ప్ర : నటనలో మీకు ఎవరు స్ఫూర్తి? జ : మొదటి నుంచి మోహన్బాబుగారంటే చాలా ఇష్టం.అలాగే పవన్‌కళ్యాణ్, కన్నడ హీరో ఉపేంద్ర. వీరి నటన,స్టైల్ చాలా ఇష్టం. ప్ర: ఈ జిల్లా వాతావరణం...షూటింగ్ అనుభవాలు..? జ: గోదావరి జిల్లాలంటే నాకు ప్రాణం. ఇక్కడున్న పచ్చదనం... ప్రశాంతత...ప్రజల ఆదరాభిమానాలు జీవితంలో మరవలేను.