బర్నింగ్ స్టార్ ‘సంపూ’ సందడి
విజయవాడ(చిట్టినగర్) :
బర్నింగ్ స్టార్ సంపూ శనివారం చిట్టినగర్ సెంటర్‌లోని మహాలక్ష్మీ, పద్మావతి గోదాదేవి సమేత వేంకటేశ్వరస్వామి వార్లను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన సంపూర్ణేష్‌బాబుకు ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు. మహాలక్ష్మీ అమ్మవారిని, పద్మావతి, గోదాదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు రామరత్నమాచార్యులు ఆశీర్వచనం అందచేయగా, ఆలయ కమిటీ చైర్మన్ పోతిన బేసు, కమిటీ సభ్యులు పోతిన సాంబశివరావు దేవస్థాన జ్ఞాపికను అందజేశారు. సంపూర్ణేష్‌బాబు చిట్టినగర్‌కు విచ్చేశారని తెలుసుకున్న మహిళలు, యువతులు ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. సంపూతో సెల్ఫీలు, ఆటోగ్రాపులు తీసుకునేందుకు పోటీ పడ్డారు. గూడెల వెంకటరమణ, కత్తెర ప్రదీప్, భోగవల్లి సన్నయ్యపాత్రుడు, మద్ది సాంబశిరావు, భోగవల్లి శ్రీధర్, బీసీ నాయకులు పోతిన వెంకటమహేష్, శీరం వెంకట్రావులు ఆయన వెంట ఉన్నారు.