Mahalaxmi
-
సరిహద్దుల్లో సాహసమే వెన్నెముకగా...
‘ఓ పక్షీ! నీ పాట ఇక్కడ పాడబోకు ఎగిరిపో... నీ వనాలెక్కడున్నాయో వెతుక్కుంటూ’ అనేది కవి వాక్యం. బీటెక్ చదువుతున్న మహాలక్ష్మి టెక్ దారిలో వెళ్లకుండా... బీఎస్ఎఫ్ (సరిహద్దు భద్రతా దళం)కు ఎంపికైంది. తెనాలి అయితానగర్ అమ్మాయి మహాలక్ష్మి ఇండో–బంగ్లాదేశ్ సరిహద్దుల్లో సగర్వంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తోంది..ఎన్సీసీలో చేరిన రోజుల్లో ఎంతోమంది సాహసికులైన సైనికుల గురించి తెలుసుకునే అవకాశం మహాలక్ష్మికి వచ్చింది. ఆ సమయంలోనే ‘నేను సైతం సైన్యంలోకి’ అనే లక్ష్యానికి బీజం మహాలక్ష్మి మదిలో పడింది. మహాలక్ష్మి తల్లి వెంకాయమ్మ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సు, తండ్రి రాజుది పెయింటింగ్ వృత్తి. చాలీచాలని సంపాదనైనా ఆ దంపతులు బిడ్డలిద్దరినీ చదివించారు. మహాలక్ష్మి చదువుతో పాటు ఆటపాటల్లోనూ ప్రతిభ చూపేది. ఎన్సీసీ మాస్టారు బెల్లంకొండ వెంకట్ ప్రోత్సాహంతో ఎన్సీసీలో చేరింది. రెండు జాతీయ శిబిరాలకు హాజరయ్యే అవకాశం వచ్చింది. కాలేజి గ్రౌండులో వ్యాయామం చేసేందుకు వస్తుండే బాలయ్య అన్నయ్య రన్నింగ్, హైజంప్‌లో అథ్లెటిక్స్‌లో సాధన చేయించాడు.జోనల్ అథ్లెటిక్ మీట్లో రన్నింగ్‌లో ఫస్ట్ వచ్చింది. చదువే లోకం అనుకునే అమ్మాయికి ఎన్సీసీ, ఆటలు పరిచయం కావడంతో కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లు అనిపించింది. తనలోని శక్తిసామర్థ్యాలకు పదును పెట్టుకునే అవకాశం వచ్చింది. టెన్త్ తర్వాత సెయింట్ మేరీస్ ఇంజినీరింగ్ కాలేజిలో పాలిటెక్నిక్‌లో చేరిన మహాలక్ష్మి, తర్వాత అదే కాలేజిలో బీటెక్ సెకండియర్‌లో చేరింది. ప్రస్తుతం ఫైనలియర్లో ఉండాల్సింది. ఈలోగా 2022లో సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) పరీక్షలు రాసి ఉత్తీర్ణురాలైంది. 2023లో బీఎస్ఎఫ్కు ఎంపికైంది. పశ్చిమబెంగాల్ బైకాంతపూర్‌లోని బీఎస్ఎఫ్ క్యాంపులో 11 నెలల శిక్షణ పూర్తి చేసుకుంది. గత అక్టోబరు 28న పశ్చిమబెంగాల్లోని బీఎస్ఎఫ్ 93 బెటాలియన్‌లో పోస్టింగ్ ఇచ్చారు. అదే రాష్ట్రంలో ఇండో–బంగ్లాదేశ్ బోర్డర్లోని జపర్సల వద్ద మహాలక్ష్మి సైనికురాలిగా ఉద్యోగ విధులు నిర్వహిస్తోంది.ప్రస్తుతం క్రిస్మస్ సెలవులకని సొంతూరు తెనాలికి వచ్చింది. శిక్షణ రోజుల గురించి ప్రస్తావించినప్పుడు ఇలా చెప్పింది.... ‘బైకాంతపూర్‌లోని క్యాంపులో శిక్షణ చాలా కఠినంగా ఉండేది. చిన్నప్పటి నుంచి ఆడిన ఆటలు, చేసిన వ్యాయామాల వల్ల కష్టం అనిపించేది కాదు. తెల్లవారుజాము నాలుగు గంటల్నుంచే రన్నింగ్, ఇతర వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. తర్వాత తరగతులు ఉంటాయి. ఏకే 47తో సహా రకరకాల వెపన్లు విడగొట్టటం, నిర్ణీత వ్యవధిలో అమర్చటం, బుల్లెట్లను లోడు చేయడం, ఫైరింగ్... మొదలైనవి ఎన్నో సాధన చేయించేవారు. సాయంత్రం 5 గంటల నుంచి సరిహద్దులో డ్యూటీ చేయాలి. కష్టమే అయినా ఇష్టంగా చేయగలిగాను’‘సైన్యంలో పనిచేస్తున్నావట కదా... మంచి విషయం అమ్మా’ అని అభినందించే వారే కాదు... ‘సరిహద్దుల్లో ఉద్యోగమా! అంత కష్టమెందుకమ్మా. ఇక్కడే ఏదో ఉద్యోగం చూసుకోవచ్చు కదా!’ అని సలహా ఇచ్చేవారు ఉన్నారు. సైన్యంలో జెండర్ బారియర్స్ తొలగిపోతున్న కాలం ఇది. పురుషులతో సమానంగా అమ్మాయిలు సత్తా చాటుతున్న కాలం ఇది. ఇలాంటి కాలంలో.... నిరాశపరిచే మాటలు వారి హృదయాలను చేరవు. దేశభక్తి ఉన్న హృదయాలకు భయాలతో పనేమిటి! కమాండర్ స్థాయికి చేరుకోవాలని...ఎన్సీసీలో ఉన్నప్పుడు ఎంతోమంది గొప్ప సైనికుల గురించి, వారి త్యాగాల గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. ఆ వీరులు, త్యాగధనుల గురించి వింటున్న క్రమంలో ‘ఏదో ఒకరోజు నేను కూడా సైన్యంలో పనిచేస్తాను’ అనుకునేదాన్ని.అయితే అదెంత కష్టమో నాకు తెలియంది కాదు. ప్రోత్సహించేవారి కంటే నిరూత్సాహపరిచేవారే ఎక్కువగా ఉంటారు. కష్టాన్ని ఇష్టపడేవారే విజేతలు అవుతారు. శిక్షణ కాలంలో బైకాంతపూర్ క్యాంప్‌లో ‘ఇంత కష్టమా’ అనిపించలేదు. ‘ఇన్ని విషయాలు తెలుసుకున్నాను కదా’ అనుకున్నాను. దేశభక్తి గురించి అధికారులు చెప్పిన మాటలు నాలో స్ఫూర్తిని కలించాయి. ఆ స్ఫూర్తితోనే దేశ సరిహద్దుల రక్షణకు అంకితమయ్యాను. బాగా కష్టపడి బీఎస్ఎఫ్లో కమాండర్ స్థాయికి చేరుకోవాలనేది నా కల.– వై.మహాలక్ష్మి – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
మహాలక్ష్మి నన్ను కొట్టింది!.. అందుకే ముక్కలు చేశా
బనశంకరి: ఐటీ నగరంలో వయ్యాలికావల్ మునేశ్వరనగరలో మహాలక్ష్మీ (29) అనే నేపాలీ యువతిని హత్య చేసి, ఖండాలుగా నరికి ఫ్రిజ్‌లో కుక్కి పారిపోయిన హంతకుడు ముక్తిరంజన్ రాయ్ కూడా కడతేరిపోయాడు. అతడు ఒడిశాలో ఆత్మహత్య చేసుకున్నాడు. హత్యకు కారణాలను డెత్‌నోట్‌లో రాశాడు. ఈ నెల 3వ తేదీన ప్రేయసి మహాలక్ష్మీని హత్యచేశానని అందులో తెలిపాడు. ఆమె ఇంటికి వెళ్లాను, వ్యక్తిగత విషయాలతో గొడవ జరిగింది, ఆమె నాపై దాడి చేసింది. సహనం కోల్పోయి ఆమెను హత్య చేశానని రాశాడు. శరీరాన్ని 59 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టాను. ఆమె ప్రవర్తనతో విరక్తిచెంది ఈ దారుణానికి పాల్పడ్డానని తెలిపాడు. ముందుగా ఆమెను గొంతు పిసికి చంపాను, తరువాత బాత్రూమ్లో ఆమె శరీరాన్ని హ్యాక్సా బ్లేడుతో ముక్కలుముక్కలుగా చేశాను. ఆపై ఫ్రిజ్‌లో పెట్టాను. బాత్రూమ్లో యాసిడ్ పోసి శుభ్రం చేశానని డెత్‌నోట్‌లో రాశాడు.సొంతూరికి వెళ్లి ఆత్మహత్య20 రోజులుగా మృతదేహం ఫ్రిజ్‌లో ఉండిపోయింది. నాలుగు రోజుల కిందట యువతి హత్య వెలుగులోకి వచ్చింది. ముక్తిరంజన్ రాయ్‌తో ఎక్కువసార్లు మాట్లాడినట్లు కాల్ డేటాలో తేలింది. ఇద్దరూ ఒకే మాల్లో పనిచేసేవారు. అలా ప్రేమాయణం ప్రారంభించారు. హత్య తరువాత దుండగుడు 23వ తేదీ ఒడిశాలో సొంతూరైన పండి గ్రామానికి వెళ్లిపోయాడు. ఇంట్లో గడిపి మరుసటి రోజు స్కూటర్, ల్యాప్‌టాప్ తీసుకుని సమీప శ్మశానానికి వెళ్లాడు. చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
వైభవంగా సోమాజిగూడ శ్రీ రేణుక మహాలక్ష్మి ఎల్లమ్మ కళ్యాణం దృశ్యాలు..
-
కుమార్తెకు రైలు పేరు పెట్టిన మహిళ
మహారాష్ట్రలో ఓ విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. నిండు గర్భిణిగా ఉన్న ఓ ముస్లిం మహిళ ఊహించని రీతిలో రైలులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇతర మహిళా ప్రయాణికులు ఆమెకు పురుడు పోశారు. రైలులో తనకు పుట్టిన బిడ్డకు ఆ తల్లి ఆ రైలు పేరునే పెట్టింది. ఇకపై తన బిడ్డను ఆ రైలు పేరుతోనే పిలుచుకుంటానని తెలిపింది. వివరాల్లోకి వెళితే జూన్ 6న ఉదయం కొల్హాపూర్-ముంబై మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న గర్భిణి ఫాతిమా ఖాతూన్ (31)కు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని ఆమె రైలు లోనావాలా స్టేషన్‌కు చేరుకుంటున్న సమయంలో భర్త తయ్యబ్‌కు తెలిపింది. తయ్యబ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫాతిమాకు వాంతులు అవుతుండటంతో ఆమె రైలులోని టాయిలెట్‌కు వెళ్లింది. ఎంతసేపటికీ ఫాతిమా తిరిగి రాలేదు. దీంతో తయ్యబ్ టాయిలెట్‌లోనికి వెళ్లి చూశాడు. ఫాతిమా ఆడబిడ్డకు జన్మనిచ్చిందని గుర్తించాడు. రైలులో ఉన్న ఇతర మహిళా ప్రయాణికులు ఈ సంగతి తెలిపాడు. దీంతో వారు ఫాతిమాకు సహాయం అందించారు.ఈ విషయాన్ని తయ్యబ్ రైల్వే పోలీసులకు తెలియజేశాడు. రైలు లోనావాలా స్టేషన్‌కు చేరుకోగానే అక్కడి రైల్వే సిబ్బంది ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు తల్లీబిడ్డకు చికిత్స అందించారు. వారి ఆరోగ్య పరిస్థితి కుదుటపడ్డాక వారిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు.ఈ సందర్భంగా తయ్యబ్ మీడియాతో మాట్లాడుతూ తన భార్య డెలివరీ తేదీ జూన్ 20 అని, అయితే ఇంతలోనే ఆమె రైలులో ఆడబిడ్డకు జన్మనిచ్చిందని తెలిపారు. తమకు ఇప్పటికే ముగ్గురు కుమారులు ఉన్నారన్నారు. తాము ఆ రైలులో ప్రయాణిస్తున్నప్పుడు తిరుపతి నుంచి మహాలక్ష్మి ఆలయానికి వెళ్తున్న కొందరు ప్రయాణికులు తమ బిడ్డను చూసి ‘మహాలక్షి ఎక్స్‌ప్రెస్’లో లక్ష్మీదేవి జన్మించిందని అన్నారని తయ్యబ్ పేర్కొన్నాడు. ఈ మాట విన్న తన భార్య తమ బిడ్డకు ‘మహాలక్ష్మి’ అనే పేరు పెట్టిందని ఆయన తెలిపాడు. -
ఇంటికొచ్చిన టీచర్
‘పిల్లలు ఎలా ఉన్నారో’ అని ఆ టీచర్‌కు బెంగ వచ్చింది. ‘వాళ్ళకు ధైర్యం చెప్పాలి’ అని కూడా అనిపించింది. ‘చదువు మీద ధ్యాస మళ్లించాలి’ అని నిశ్చయించుకుంది. తమిళనాడు కడలూరుకు పదిహేను కిలోమీటర్ల దూరంలోని నడువీరపట్టు అనే ఊరి హైస్కూల్లో తమిళ టీచరుగా పని చేస్తున్న వి.మహలక్ష్మి ఈ కరోనా కాలంలో తన విద్యార్థులే తనకు ముఖ్యం అనుకుంది. అనుకున్నదే తడవు వారి ఇళ్లకు బయలుదేరింది. ఆమె పని చేసే స్కూల్లో 700 మంది విద్యార్థులు ఉన్నారు. మహలక్ష్మి ప్రస్తుతం పదో క్లాసుకు వచ్చిన పిల్లలను కలవడం ముఖ్యం అనుకుంది. గత రెండు వారాలుగా రోజూ ఒక్కొక్కరి ఇంటికి వెళ్లి కలుస్తోంది. ‘వీరంతా తొమ్మిది పరీక్షలు రాయకుండానే పదికి ప్రమోట్ అయ్యారు. అయితే స్కూళ్లు నడవడం లేదు. ప్రయివేటు స్కూళ్ల ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి కాని మా గవర్నమెంట్ స్కూల్లో చదివే పేదపిల్లలకు టీవీ, స్మార్ట్ ఫోన్లు లేవు. వీరంతా డీలా పడిపోతారని నాకు అనిపించింది. పైగా పెద్దవాళ్లు వీళ్లను పనిలో పెడితే అసలుకే మోసం వస్తుంది. అందుకే వీరందరినీ ఇంటింటికీ వెళ్లి కలుస్తున్నాను’ అని చెప్పింది మహలక్ష్మి. మహలక్ష్మి గత రెండు వారాలుగా ఇంట్లో ఉదయం పూట పని ముగించుకుని ఊరిలోని పిల్లల ఇళ్లకు బయలుదేరుతోంది. పిల్లలతో తల్లిదండ్రులతో మాట్లాడుతోంది. ‘వారికి పనులు చెప్పకండి. చదువు వైపు ధ్యాస పెట్టేలా చేయండి’ అని వారికి హితవు చెబుతోంది. దాంతోపాటు కరోనా జాగ్రత్తలు కూడా. ‘నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను. కష్టపడి టీచర్ అయ్యాను. పేదపిల్లల కష్టాలు నాకు తెలుసు. అందుకే వారిని కలిసి చదువు మీద శ్రద్ధ నిలబడేలా చేస్తున్నాను. ఫోన్లు ఉన్నవారందరితో ఒక వాట్సప్ గ్రూప్ పెట్టి ఉత్సాహపరుస్తున్నాను. వాళ్లకు అవసరమైన విషయాలు యూట్యూబ్ చానెల్ ద్వారా ఎలా చూడాలో చెబుతున్నాను. చదువు కంటే ముందు పిల్లలతో బంధం ఏర్పడటం నాకు ముఖ్యం’ అంటోంది మహాలక్ష్మి. ఇలాంటి టీచర్లే దేశానికి సరస్వతి రక్ష. -
అత్యాచారాలకు వ్యతిరేకంగా నరివేట్టై
తమిళసినిమా: అత్యాచారాలకు వ్యతిరేకించే ఇతివృత్తంతో తెరపై ఆవిష్కరిస్తున్న చిత్రం నరివేట్టై అని ఆ చిత్ర దర్శకుడు ఆకాశ్ సుధాకర్ తెలిపారు. ఈయన హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని చానల్ ఆకాశ్ స్డూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. కథానాయకిగా మహాలక్ష్మి పరిచయం అవుతున్న ఇందులో నెల్లైశివ, బోండామణి, కింగ్‌కాంగ్, కిళిముక్కు రామచంద్రన్ ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. శరవణన్ సంగీతాన్ని, చార్లెల్తానా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల స్థానిక టీ.నగర్‌లోని ఎంఎం.థియేటర్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యల కోసం తనదైన శైలిలో పోరాడుతున్న ట్రాఫిక్ రామస్వామి అతిథిగా పాల్గొని ఆడియోను ఆవిష్కరించారు. నటులు నిజజీవితంలోనూ నటిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ఇప్పుడు కొందరు నటులు నిజజీవితంలోనూ నటిస్తున్నారని, తాను సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఒంటరిగా పోరాడుతున్నానని అన్నారు. అలా కాకుండా అందరూ కలిసి పోరాడాలని తాను చాలా కాలంగా ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తున్నట్లు అన్నారు. ఈ నరివేట్టై చిత్రం ఇలాంటి అంశంతోనే రూపొందించినట్లు చెప్పారు. మంచి సందేశంలో కూడిన నరివేట్టై చిత్రం ప్రేక్షకాదరణను పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన అన్నారు. అనంతరం చిత్ర దర్శక, కథానాయకుడి అశోక్సుధాకర్ చిత్ర వివరాలను తెలుపుతూ ఇది అత్యాచారాలను వ్యతిరేకించే ఇతి వృత్తంతో తెరకెక్కిస్తున్న చిత్రం అని తెలిపారు. నలుగురు కామాంధులు ఒక యువతిపై అత్యాచారానికి పాల్పడతారన్నారు. అలాంటి యువతి పరిస్థితి ఏమిటి. ఆ నలుగురు మానవ మృగాలేమయ్యారు? లాంటి ఆసక్తికర అంశాలతో రూపొందించిన చిత్రం నరివేట్టై అని తెలిపారు. చిత్ర షూటింగ్‌ను ఏలగిరి, కృష్ణగిరి, ధర్మవరం, తిరువళ్లూర్, కాంచీపురం, చెన్నై ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు తెలిపారు. ఇం దులో నాలుగు పాటలు చార్లెస్ తానా చక్కని బాణీలతో రూపొందించారని చెప్పారు. -
అనుమానమా..ఆటవికమా!?
► భార్యాపిల్లలపై కత్తితో ఉన్మాదిలా దాడి ► కత్తిపోట్లకు గర్భంలోని శిశువు మృతి ► భార్య, రెండేళ్ల కుమార్తె మత్యుపోరు ► దాడి తర్వాత ఆత్మహత్య చేసుకున్న భర్త ► బర్త్‌డే వేడుకవేళ ఆ ఇంట విషాదం సాక్షి ప్రతినిధి/ తిరుపతి క్రైం: అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య పుట్టిన రోజు. సందడిగా, సంతోషాలు వెల్లి విరియాల్సిన రోజు. ప్రేమ, ఆప్యాతలు పంచుకోవాల్సిన రోజు. పుట్టిన రోజు వేడుకలతో సరదాగా గడపాల్సిన రోజు. నెలలు నిండిన గర్భిణీ అయిన భార్యను మురి పెంగా దగ్గరకు తీసుకోవాల్సిన రోజు. అయితే.... సాత్విక్ కుమార్ ఇంట్లో ఇందుకు భిన్నమైన వాతావరణం నెలకొంది. ఊహించని దారుణం చోటు చేసుకుంది. భార్యతో పాటు మూడేళ్ల చిన్నారిని క్రూరంగా కత్తితో పొడిచిన భర్త అదే కత్తితో గొంతుకోసుకుని కన్నుమూసిన సంఘటన ఆ కుటుంబాన్నీ, బంధుగణాన్నీ తీరని విషాదంలో నింపింది. అనుమానమో, లేక ఆటవికత్వమో తెలి యదు గానీ...అగ్నిసాక్షిగా పెళ్లాడిన భా ర్యను కత్తితో పొడిచి తానూ రక్తపు మడుగులో విగతజీవుడైన సంఘటన అబ్బన్నకాలనీలో సంచలనం రేపింది. అటు పోలీసులు, ఇటు నగర ప్రజలు విస్మయా న్ని వ్యక్తం చేసే దారుణం జరిగి పోయిం ది. కట్టుకున్న భార్యపై అనుమానంతో తల నరికి వేరు చేసిన సంఘటన మరువక ముందే బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ సంఘటన పోలీసులను సైతం దిగ్బ్రాంతికి గురి చేసింది. అసలేం జరిగిందంటే... తిరుపతి ఈస్ట్ పోలీసులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం సేకరించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.తిరుపతి నగరానికి చెందిన కొత్తపల్లి సాత్విక్ కుమార్‌కి 2011లో తమిళనాడులోని పలసరవాకం పోలూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు, శ్యామలమ్మ కుమార్తె మహాలక్ష్మితో వివాహమైంది. వీరిద్దరిదీ ప్రేమ వివాహం కూడా. దగ్గర బంధువులు కావడంతో పెద్దలు ఇష్టపడి పెళ్లి చేశారు. వివాహం తరువాత తిరుపతి అబ్బన్న కాలనీలోని చిన్నారి ఆస్పత్రి సమీపంలో నివాస ముంటున్నారు. వీరికి మూడేళ్ల వయస్సున్న సాహితీ ఉంది. ప్రస్తుతం మహాలక్ష్మి 9 నెలల నిండు గర్భిణీ. కాగా సాత్విక్కుమార్ కొన్నాళ్ల పాటు ఓ ప్రయివేట్ కంపెనీలో ఆపరేటర్‌గా పనిచేసి మూడు నెలల కిందటే మానేశాడు. కుటుంబ పోషణ నిమిత్తం ప్రస్తుతం ఇంటీరియర్ డెకరేషన్ పనులు చేస్తున్నాడు. సీన్ కట్ చేస్తే... బుధవారం ఉదయం 10.30 గంటలకు కుమార్తె సాహితీని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన సాత్విక్ భార్యతో సంతోషంగానే గడిపాడు. మధ్యాహ్నం 12 తరువాత సాత్విక్ కుమార్ తన అత్త శ్యామలకు ఫోన్ ∙చేసి తిరుత్తణి నుంచి చిత్రాన్నం తెమ్మని చెప్పాడు. సరేనన్న శ్యామల హడావుడిగా తిరుపతి బస్‌లో బయలుదేరింది. సమయం ఒంటిగంట దాటాక సాత్విక్ కుమార్ ఇంట్లో ఏం జరిగిందో తెలియదుగానీ...రక్తపు చేతులతో రక్షించండంటూ మెట్లు దిగుతున్న మహాలక్ష్మిని పక్కనే ఉన్న డాక్టర్ రామకృష్ణ ఆస్పత్రిలో చేర్చారు. పక్కనే రక్తమోడుతున్న సాహితీని కూడా దగ్గర్లోని ఆస్పత్రిలో చేర్చారు. భార్యాపిల్లలపై కత్తితో దాడి చేసిన సాత్విక్ అదే కత్తితో తన గొంతు కోసుకుని వంట గదిలో మృతి చెందాడు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న మహాలక్ష్మి కడుపులోని శిశువును రుయా ఆస్పత్రి వైద్యులు బయటకు తీశారు. అయితే కత్తిపోట్ల కారణంగా బిడ్డ చనిపోయిందని వైద్యులు చెప్పారు. తల్లి పరిస్థితి విషమంగానే ఉంది. ఇటు సాహితీకి కూడా వైద్యం అందుతోంది. రేణిగుంట డీఎస్పీ నంజుండప్ప, సీఐ రామకిషోర్లు వీరిద్దరి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారు. ‘ఎంత డబ్బయినా పర్వాలేదు. పాపకు వైద్యం అందించండని’ డీఎస్పీ నంజుండప్ప తన పెద్ద మనసును చాటుకున్నారు. ఫోనే కీలకం... ఇదిలా ఉండగా ఈ కేసులో పూర్తి వివరాలు తెలియాలంటే...సాత్విక్ వాడే సెల్ ఫోనే కీలకం. క్లూస్ టీంను రంగంలోకి దింపిన పోలీసులు దీన్ని స్వాధీనపర్చుకుని విచారణ జరుపుతున్నారు. మధ్యాహ్నం వరకూ కుటుంబంతో బాగా గడిపిన సాత్విక్ అకస్మాత్తుగా ఎందుకిలా ఉన్మాదిగా మారాడు? అసలేం జరిగింది...అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఫోన్ సంభాషణలను విశ్లేషించాల్సిందేనని పోలీసులు భావిస్తున్నారు. చావుబతుకుల్లో భర్త గురించే... రుయా ఆస్పత్రిలో ఉన్న మహాలక్ష్మిని పలకరించాను. తనపై దాడి చేసింది భర్తేనని చెప్పింది. పైగా తన హస్బెండ్ ఎలాగున్నారని అడిగింది. ప్రస్తుతం ఆమెకు రుయాలో వైద్యం అందుతోంది. కేసును సీరియస్‌గా తీసుకున్నాం. అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నాం. హత్యోదంతానికి గల కారణాలను రెండు రోజుల్లోగా ఛేదిస్తాం. – పీవీఎస్ రామకిషోర్, సీఐ. -
బర్నింగ్ స్టార్ ‘సంపూ’ సందడి
విజయవాడ(చిట్టినగర్) : బర్నింగ్ స్టార్ సంపూ శనివారం చిట్టినగర్ సెంటర్లోని మహాలక్ష్మీ, పద్మావతి గోదాదేవి సమేత వేంకటేశ్వరస్వామి వార్లను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన సంపూర్ణేష్‌బాబుకు ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు. మహాలక్ష్మీ అమ్మవారిని, పద్మావతి, గోదాదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు రామరత్నమాచార్యులు ఆశీర్వచనం అందచేయగా, ఆలయ కమిటీ చైర్మన్ పోతిన బేసు, కమిటీ సభ్యులు పోతిన సాంబశివరావు దేవస్థాన జ్ఞాపికను అందజేశారు. సంపూర్ణేష్‌బాబు చిట్టినగర్‌కు విచ్చేశారని తెలుసుకున్న మహిళలు, యువతులు ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. సంపూతో సెల్ఫీలు, ఆటోగ్రాపులు తీసుకునేందుకు పోటీ పడ్డారు. గూడెల వెంకటరమణ, కత్తెర ప్రదీప్, భోగవల్లి సన్నయ్యపాత్రుడు, మద్ది సాంబశిరావు, భోగవల్లి శ్రీధర్, బీసీ నాయకులు పోతిన వెంకటమహేష్, శీరం వెంకట్రావులు ఆయన వెంట ఉన్నారు. -
కన్నతండ్రిని చంపిన కొడుకు, కూతురు
చెడు తిరుగుడు మానుకోమని పలు మార్లు చెప్పినా పెడచెవిన పెట్టిన కన్న తండ్రిని కొడుకు, కూతురు కలిసి హతమార్చారు. భార్య పిల్లల బాగోగులను పట్టించుకోకుండా.. వేరే మహిళలతో లైంగీక సంబంధాలు పెట్టుకొని సంపాదించిందంతా వారికే దోచిపెడుతున్నదనే కోపంతో తండ్రిపై దాడి చేశారు. ఈ దాడిలో తండ్రి మృతి చెందాడు. ఈ సంఘటన నగరంలోని కోరామండల్ 47వ వార్డు లేబర్ జంక్షన్లో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న అప్పలనాయుడు(50) కాంట్రాక్ట్ లేబర్‌గా పని చేస్తున్నాడు. ఈక్రమంలో వివాహేతర సంబంధాలు పెట్టుకొని భార్య బిడ్డలను నిర్లక్ష్యం చేశాడు. కొడుకు పైడిబాబు(30), కూతురు మహాల క్ష్మీ(28)లు తీరు మార్చుకోమని పలుసార్లు చెప్పిన లాభం లేకపోవడంతో కోపోద్రిక్తులై సోమవారం అర్ధరాత్రి ఆయనపై దాడి చేశారు. ఈక్రమంలో బండరాయితో తలపై బలంగా మోదడంతో అప్పలనాయుడు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పాము కాటుతో చిన్నారి మృతి
మహబూబాబాద్ రూరల్: పాముకాటుతో నాలుగేళ్ల చిన్నారి మృతిచెందింది. వరంగల్ జిల్లా మానుకోట మండలం సికింద్రాబాద్ తండాకు చెందిన ధర్మారపు సురేష్-సులోచన పెద్ద కుమార్తె మహాల క్ష్మి(4) గురువారం రాత్రి నానమ్మ పద్మ ఇంటికి వెళ్లింది. ఇంతలో అటువైపుగా వచ్చిన కట్లపాము వచ్చి చిన్నారిని కాటువేసింది. ఇది గమనించిన స్థానికులు చిన్నారిని హుటాహుటిన మానుకోట ఏరియూ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మహాలక్ష్మి మృతిచెందింది. -
ఆడపిల్ల అక్కడే పుట్టాలి..!
విదేశీయులు సైతం మెచ్చే సంస్కృతీ సంప్రదాయాలే కాదు... ప్రపంచంలో ఎక్కడా లేనన్ని మూఢాచారాలు కూడా ఉన్న దేశం మనది. వాటిని రూపుమాపడానికి ఏ మహానుభావుడో రావాలంటే కుదరదు. ఎవరికి వారే ముందడుగు వేయాలి. మంచిని పెంచాలి. చెడును తుంచాలి. అలా చేశారు కాబట్టే బీహార్ లోని ధర్హరా గ్రామస్థులు ఈరోజు అందరికీ ఆదర్శంగా నిలిచారు. తమ ఊరి స్వరూపాన్నే కాదు... తమ ఆడపిల్లల తలరాతనే మార్చేశారు. శతాబ్దాలుగా పాతుకుపోయిన ఓ మూఢాచారానికి ముగింపు పలుకుతున్నారు! ఆడపిల్లని మహాలక్ష్మి అంటారు. కానీ ఆ మహాలక్ష్మిని ఆనందంగా ఆహ్వానించేవాళ్లు ఎంతమంది ఉన్నారు! ఆడపిల్ల వద్దు అనుకునేవాళ్లు, కూతురు పుడితే మోయలేని భారం భుజాల మీద పడిందని బాధపడిపోయేవాళ్లు ఇప్పటికీ కోకొల్లలుగా ఉన్నారు. అలాంటివాళ్లందరినీ బీహార్‌లోని భాగల్పూర్ జిల్లాలో ఉన్న ధర్హరా గ్రామానికి తీసుకెళ్లాలి. ఆ గ్రామస్థులు ఆడపిల్ల పుడితే ఆనందంతో మురిసిపోతారు. మహాలక్ష్మి పుట్టిందంటూ సంబరాలు చేసుకుంటారు. అందరినీ పిలిచి విందులు ఇస్తారు. ఎందుకంటే వారికి ఆడపిల్ల భారం కాదు... ఆభరణం! ధర్హరాలో అడుగు పెడితే కన్నులు పచ్చరంగు పూసుకుంటాయి. ఎటుచూసినా పచ్చటి మొక్కలు, చల్లగా వీచే గాలి... ప్రకృతి రమణీయతతో, ప్రశాంతతతో అలరారుతూ ఉంటుంది ధర్హరా. నిజానికి ఒకప్పుడు ఆ ఊరు ఇలా ఉండేది కాదు. ఆ రాష్ట్రంలో ఉన్న అనేక వెనుకబడిన గ్రామాల్లాగే ఉండేది. బీడువారి మోడులా కనిపించేది. కానీ ఎప్పుడు మొదలైందో, ఎలా మొదలైందో తెలియదు కానీ... మెల్లమెల్లగా ధర్హరా తన స్వరూపాన్ని మార్చుకుంటూ వచ్చింది. ఎలా మొదలైందో తెలీదు కానీ... ఒకప్పుడు ధర్హరాలో ఆడపిల్లల పరిస్థితి ఎంతో దయ నీయంగా ఉండేది. వారికి పెళ్లి చేసి పంపలేక తల్లిదండ్రులు నానా అగచాట్లూ పడేవారు. కట్నపు బాకీలు సరిగ్గా చెల్లించలేకపోవడంతో అత్తమామలు ఆడపిల్లల ప్రాణాలు తీసేవారు. అలాంటి పరిస్థితి తమకు రాకూడదని కొందరు తల్లిదండ్రులు ఆడపిల్లల్ని పురిట్లోనే చంపేసేవారు. అలాంటి సమయంలో ఆ ఊరిలో ఒక సంప్రదాయం మొదలైంది. ఎవరు దానికి పునాది వేశారో తెలియదు కానీ... ఆడపిల్ల పుడితే ఆమె పేరు మీద ఒక పండ్ల మొక్క నాటాలి అనే నియమం ఏర్పడింది (అప్పట్లో ప్రధాన్‌గా ఉన్న వ్యక్తి దీన్ని అలవాటు చేశాడని అంటారు కానీ సరైన ఆధారాలైతే లభించడం లేదు. కొన్ని వందల యేళ్లుగా ఈ ఆచారం వస్తోందని చెబుతారు తప్ప ఎప్పుడు మొదలైందో గ్రామస్థులకు కూడా సరిగ్గా తెలియదు). పిల్ల పుట్టినప్పుడే మొక్క నాటితే అది తనతోపాటు పెరుగుతుంది, ఆ చెట్టు మీద వచ్చే ఆదాయంతో బిడ్డను పెంచవచ్చు, పెళ్లి చేయవచ్చు అన్న ఉద్దేశంతో ఈ పద్ధతిని మొదలు పెట్టారు. ఆ ఆలోచన నచ్చడంతో అందరూ దాన్ని పాటించడం మొదలు పెట్టారు. దాంతో ఆ ఊరు ఒక గ్రీన్ విలేజ్‌లా మారిపోయింది. తరతరాలుగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు ధర్హరా గ్రామస్తులు. మొదట్లో ఒక మొక్కను నాటేవారు కాస్తా ఇప్పుడు పది నుంచి ఇరవై మొక్కలను నాటుతున్నారు. దాంతో ఊరు ఊరంతా పండ్ల చెట్లతో పచ్చగా అలరారుతోంది. మామిడి, పనస, నేరేడు వంటి పది రకాల చెట్లు కొన్ని వందల ఎకరాల్లో విస్తరించాయి. ఆడపిల్లలు ఉన్నవారంతా వీటి మీద వచ్చే ఆదాయంతోనే బతుకుతున్నారు. ఆ సొమ్మును జాగ్రత్తగా దాచి పిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. ‘‘పండ్లతో పాటు కలప కూడా బాగా ధర పలుకుతుంది కాబట్టి ఎలాగైనా పిల్లల జీవితాలను చక్కబెట్టేయవచ్చు అన్న భరోసా పెరిగింది అందరిలో’’ అంటారు సుభాష్‌సింగ్. మామిడి చెట్ల మీద వచ్చిన ఆదాయంతోనే తన కూతురికి మంచి సంబంధం చూసి చేశారాయన. ఇలాంటి తండ్రులు ధర్హరాలో చాలామంది ఉన్నారు. పిల్లలకు కట్నా లిచ్చి పెళ్లిళ్లు చేశారు. కొందరైతే బిడ్డ పేరు మీద నాటిన చెట్లనే అల్లుళ్లకు రాసిచ్చారు. దాంతో వరకట్న చావులు లేకుండా పోయాయి. ఇంకా చెప్పు కోవాల్సిన విషయమేమిటంటే... ఆ గ్రామస్థుల ఆలోచనకు ముచ్చటపడి యువకులు ఆ ఊరి అమ్మాయిల్ని కట్నం తీసుకోకుండానే వివాహం చేసు కుంటున్నారు. దాంతో మెల్లగా వరకట్నం అన్న మాట వినబడకుండా పోయింది. ఆడపిల్లలు నవ్వుతూ, తుళ్లుతూ బతుకుతున్నారు. చదువు కుంటున్నారు. పెళ్లి చేసుకుని హాయిగా కాపురాలు చేసుకుంటున్నారు. బహుశా ప్రపంచంలో మరెక్కడా ఆడపిల్లలు ఇంత సంతోషంగా ఉండరేమో. ఆడపిల్లను ఆనందానికి ప్రతిరూపంగా మార్చిన ఘనత ధర్హరా గ్రామస్తులదే. వారిని ఆదర్శంగా తీసుకుంటే ఈ దేశంలో భ్రూణ హత్యలుండవు. వరకట్న చావులుండవు. అసలు ఏ ఆడపిల్ల కళ్ల నుండీ కన్నీళ్లన్నవే జాలువారవేమో! - సమీర నేలపూడి ఒకప్పుడు ధర్హరాలో ఓ దురాచారం ఉండేది. ఆడపిల్లని ముందు మామిడి చెట్టుకిచ్చి పెళ్లి చేసేవారు. తర్వాతే వరుడితో తాళి కట్టించేవారు. కానీ ఇప్పుడా ఆచారం లేదు. మామిడి చెట్టుతో కాదు, మామిడి చెట్ల సాయంతో పిల్లలకు మనువు జరిపిస్తున్నారు. తగిన సంబంధాలు చూసి చేయగలమన్న ధీమా రావడంతో ఆడపిల్లలను చక్కగా చదివిస్తున్నారు కూడా! దాంతో అక్కడ బాలికల అక్షరాస్యతా శాతం కూడా పెరుగుతోంది. -
మగ సంతానం లేదని ఆత్మహత్య
= మగ సంతానం లేదని ఆత్మహత్య = పెళ్లి రోజు వేడుకలో విషాదం = తల్లి ప్రేమకు దూరమైన ముగ్గురు చిన్నారులు = శోకసంద్రమైన గార్లదిన్నె ప్యాపిలి(కర్నూలు), న్యూస్‌లైన్: ఆడపిల్ల. ఇప్పటికీ ఆడ..పిల్లగానే మిగిలిపోతోంది. యుగాలు మారినా.. మానవ మేధస్సు దినదినాభివృద్ధి చెందినా.. ఆ ఒక్క విషయంలో వీరి దృక్పథం మారకపోవడం ఆడపిల్ల భవిష్యత్తుపై పెను ప్రభావం చూపుతోంది. అసలు పిల్లలే కలగలేదని ఎంతో మంది కనిపించని దేవుళ్లకు మొక్కుతూ.. హస్తవాసి కలిగిన వైద్యులంటూ వారి ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇదే సమయంలో కలిగినది ఆడపిల్ల అయితే మరో సమస్య. అత్తమామల ఎత్తిపొడుపులు.. తప్పు చేసిన దానిలా చూసే భర్తతో వేగలేక అదే ఆడపిల్ల నిత్యనరకం అనుభవిస్తోంది. ఈ కోవలో భర్త, అత్తమామల నుంచి ఎలాంటి వేధింపులు లేకపోయినా.. మగ సంతానం లేదనే బెంగతో ఓ మహిళ అర్ధాంతరంగా తనువు చాలించింది. అదీ పెళ్లి రోజునే ఆమె తీసుకున్న ఈ నిర్ణయం కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలో విషాదం నింపింది. ఆళ్లగడ్డ మండలం బాచ్చాపురం గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య, సుభద్రమ్మ దంపతుల పెద్ద కుమార్తె సురేఖ(22)కు ప్యాపిలి మండలం గార్లదిన్నె గ్రామానికి చెందిన మద్దిలేటిస్వామితో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. గోబి బండి నిర్వహణతో వీరి సంసారం సాఫీగా సాగిపోతోంది. పెళ్లయిన ఏడాదికే ఆడపిల్ల జన్మించడంతో మహాలక్ష్మి కలిగిందని సంతోషపడ్డారు. మొదటి కాన్పులో ఎవరు పుట్టినా.. ఆ తర్వాత మగ సంతానం కలుతుందిలే అనే బంధువుల మాటలు సురేఖ మనసులో బలంగా నాటుకుపోయాయి. మలి విడత గర్భం దాల్చగా.. ఆరు నెలల క్రితం కవలలు జన్మించారు. ఆమె ఆశలను తలకిందులు చేస్తూ రెండో విడతలోనూ ఇరువురూ ఆడపిల్లలే కలగడం తట్టుకోలేకపోయింది. భర్త తరపు నుంచి ఎలాంటి వేధింపులు లేకపోయినా.. ఇదేదో తప్పుగా భావించి ఆమె తనలో తనే కుమిలిపోసాగింది. తల్లికి కూడా ఇద్దరూ ఆడపిల్లలే కావడంతో.. తనకూ ఇకపై మగ పిల్లలు పుట్టరనే బెంగ పెట్టుకుంది. మంగళవారం పెళ్లి రోజు కావడంతో ఉదయం నుంచి ఆ ఇంట్లో హడావుడి నెలకొంది. సాయంత్రం వేళ పిల్లలతో కలసి వేడుక చేసుకునేందుకు భర్త మద్దిలేటి కేక్ తీసుకొస్తానంటూ డోన్‌కు బయలుదేరాడు. ఈ సమయంలోనే ఆమె మనసును ‘మగ’పురుగు తొలచింది. మగపిల్లలు కలగలేదనే దిగులుతో ఉరేసుకొని తనువు చాలించింది. రాత్రికి ఇంటికి చేరుకున్న భర్త జరిగిన ఘోరాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యాడు. ఈమె తీసుకున్న అనాలోచిత నిర్ణయానికి ముగ్గురు పిల్లలు తల్లి ప్రేమకు దూరమయ్యారు. ఒక పాపకు మూడేళ్లు.. మరో ఇద్దరు కవలలకు ఆరు నెలలు కావడంతో విగతజీవురాలైన తల్లిని బంధువులు వారికి చూపలేకపోయారు. పిల్లలను బంధువుల ఇంట్లో వదిలి మృతదేహానికి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. మృతురాలి తల్లి సుభద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జలదుర్గం ఎస్సై జయన్న తెలిపారు.