కన్నతండ్రిని చంపిన కొడుకు, కూతురు | Son and daughter killed father | Sakshi
Sakshi News home page

కన్నతండ్రిని చంపిన కొడుకు, కూతురు

Published Tue, Feb 9 2016 9:17 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

చెడు తిరుగుడు మానుకోమని పలు మార్లు చెప్పినా పెడచెవిన పెట్టిన కన్న తండ్రిని కొడుకు, కూతురు కలిసి హతమార్చారు.

చెడు తిరుగుడు మానుకోమని పలు మార్లు చెప్పినా పెడచెవిన పెట్టిన కన్న తండ్రిని కొడుకు, కూతురు కలిసి హతమార్చారు. భార్య పిల్లల బాగోగులను పట్టించుకోకుండా.. వేరే మహిళలతో లైంగీక సంబంధాలు పెట్టుకొని సంపాదించిందంతా వారికే దోచిపెడుతున్నదనే కోపంతో తండ్రిపై దాడి చేశారు. ఈ దాడిలో తండ్రి మృతి చెందాడు.


ఈ సంఘటన నగరంలోని కోరామండల్ 47వ వార్డు లేబర్ జంక్షన్‌లో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న అప్పలనాయుడు(50) కాంట్రాక్ట్ లేబర్‌గా పని చేస్తున్నాడు. ఈక్రమంలో వివాహేతర సంబంధాలు పెట్టుకొని భార్య బిడ్డలను నిర్లక్ష్యం చేశాడు.

కొడుకు పైడిబాబు(30), కూతురు మహాల క్ష్మీ(28)లు తీరు మార్చుకోమని పలుసార్లు చెప్పిన లాభం లేకపోవడంతో కోపోద్రిక్తులై సోమవారం అర్ధరాత్రి ఆయనపై దాడి చేశారు. ఈక్రమంలో బండరాయితో తలపై బలంగా మోదడంతో అప్పలనాయుడు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement