appalanaidu
-
జనసేన ఎన్ని కోట్లు ఖర్చుపెట్టిన గెలుపు నాదే
-
అందుకే చంద్రబాబును అడ్డుకున్నాం: తిరుపతి ఎస్పీ
-
అందుకే చంద్రబాబును అడ్డుకున్నాం: తిరుపతి ఎస్పీ
సాక్షి, చిత్తూరు : టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తిరుపతిలో చేపట్టబోయే నిరసన ప్రదర్శనకు అనుమతి లేదని తిరుపతి అర్భన్ ఎస్పీ అప్పలనాయుడు పేర్కొన్నారు. ఈ విషయాన్ని చంద్రబాబుకు నిన్ననే తెలియజేశామని అన్నారు. కానీ ఆయన వినకుండా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారని, అందుకే అడ్డుకున్నామని స్పష్టం చేశారు. కాగా తిరుపతిలో చేపట్టనున్న నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు నాయుడు సోమవరాం హైదరాబాద్ నుంచి తిరుపతి ఎయిర్‌పోర్టుకు చేరుకోగా.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎయిర్పోర్ట్ లాంజ్‌లో పోలీసులు ఆయనను అడ్డుకున్న విషయం తెలిసిందే. నిరసన తెలిపేందుకు అనుమతి లేదంటూ నోటీసులు అందజేశారు. అయినప్పటికీ వినని చంద్రబాబు.. లాంజ్‌లోని ఫ్లోర్‌పైనే బైటాయించి నానా హంగామా సృష్టించారు. ఈ మేరకు ఎస్పీ అప్పలనాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబు నిరసన ప్రదర్శనకు అనుమతి లేదని చెప్పినా తిరుపతిలో బస్టాండ్ ఎదురుగా ఉన్న గాంధీజీ విగ్రహం ఎదుట ధర్నాకు పూనుకున్నారని తెలిపారు. బస్టాండ్, రైల్వేస్టేషన్‌కు సమీపంలో గాంధీ విగ్రహం ఉందని, వారు ఎంపిక చేసుకున్న స్థలం భక్తులతో నిండి ఉంటుందన్నారు. అక్కడ ధర్నా చేస్తే తిరుమలకు వెళ్లే భక్తులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నదని చెప్పి టీడీపీ నేతలకు నోటీసులు కూడా ఇచ్చామన్నారు. జన సమీకరణ చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అదే విధంగా ధర్నాలు, ర్యాలీలు ఎన్నికల నియమావళికి, కోవిడ్ నిబంధనలకు విరుద్ధమని చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు. అందుకే చంద్రబాబు నాయుడి ధర్నాకు అనుమతి ఇవ్వలేదన్నారు. 5 వేల మందితో ధర్నా చేస్తున్నట్లు నిన్న రాత్రి లెటర్ ఇచ్చారని, అనుమతి ఇవ్వమని అప్పుడే చెప్పామని పేర్కొన్నారు.చిత్తూరు నడిబొడ్డులో ధర్నాకు అనుమతి కోరారని, సిటీ బయట అయితే చేసుకోవచ్చని చెప్పినట్లు తెలిపారు.అయినా వినకుండా ఈ రోజు ఉదయం కొందరు టీడీపీ నేతలు ధర్నా చేసేందుకు సిద్ధపడ్డారని వారందరినీ ముందస్తుగా అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం అనుమతితో వస్తే అనుమతి ఇస్తామని, పంచాయితీ ఎన్నికల్లో అరాచకాలు జరిగాయని టీడీపీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు. చదవండి: రేణిగుంట ఎయిర్‌పోర్టులో చంద్రబాబు హైడ్రామా బాబుకు చిత్తూరు జిల్లాలో మనుగడ లేదు: పెద్దిరెడ్డి -
ఇనుప గజ్జెల తల్లిని తరిమేదెలా?
ఓ మిత్రుడు ఫోన్ చేసి మరీ ఘోరంగా కరోనాలో కూడా మీరు వెనకబడిపోయారే... అని ఇగటమాడేడు. అది ఇగటమే...వెటకారం కాదు. ఆ మాటకు ముందు నవ్వొచ్చింది గానీ అది పెదవులు దాటి రాలేదు. నిజానికి ఊరందరిదీ ఒకదారి అయితే ఉత్తరాంధ్రాది వేరేదారి.. గతం నుండి వర్తమానందాకా! కానీ కరోనా పుణ్యాన విశాఖపట్నం ఊరందరి దారి పట్టింది, కరోనాని కావలించుకుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం కలిపి ఉత్తరాంధ్రాగా పిలుస్తుంటారా... ఇపుడు విశాఖపట్నం మిగిలిన రెండు జిల్లాలతో జట్టు వొదిలేసింది. ఆశ్చిర్యమేటుందిరా బావూ విశాఖపట్నంల ఇపుడు ఉత్తరాంధ్రా వోళున్నారేటి? ఎప్పుడో తుంబాదుడ్డూ సర్దుకొని వలసలెళిపోనారు. అట్నించి గోదారి, కిష్ణా, నెల్లూరు గిల్లూరు నుంచి కమ్మాలు, రెడ్లు, రాజులు వొచ్చి విశాఖపట్నం నిండా చేరిపోనారు కాదేటి? ఎవుళో తప్పీతగిలీ ఉత్తరాంధ్రోళు విశాఖలో మిగిల్తే ... ఆళు మాత్రం యీళ తోటి విరోధం తెచ్చుకుంతారేటి? తెచ్చుకుంతే బతగ్గలరేటి? అక్కడ రోడ్లంట తిరగ్గలరా? అందిసేత విశాఖపట్నంల మిగిలిన్నోళు మన జట్టొదిలీసి పరాయోళ జట్టుల కలాల మరీ! కలిసినారు. అయితే మరి యీ రెండు జిల్లాల్లో జనాలు వలస పోకుండా అందరూ ఉండిపోయారా? లేదు. ఇక్కడనుంచీ ఏటా కనీసం యాభయి వేలమంది గ్రామాలనొది లేసి వలసపోతున్నారని గణాంకాలే చెప్తున్నాయి. అటు 510 కిలోమీటర్ల అటవీప్రాంతంలో సుమారు 500 రకాల ఔషధమొక్కలు, వీటికి తోడు కొండల్లో బాక్సైట్, గ్రానైట్, రంగురాళ్లు, వజ్రాలు వంటి అనేకానేక ఖనిజాలున్న ఆదివాసీ నేలనుంచి ఆరుగాలం రెక్కలు ముక్కలు చేయగలిగే కష్టజీవులు ఆదివాసీలు కూడా అడవినీ, కొండనీ వొదిలేసి విజయవాడ, హైదరాబాదు మొదలుకొని చెన్నయ్, బెంగళూర్, ఢిల్లీ, కలకత్తా ఉపాధినిచ్చే మహానగరాలెక్కడెక్కడికో వలసపోయేరు. ఇక మత్స్యకారులు కూడా సముద్రజలాల్లోనో, పరప్రాంతంలోనో చిక్కుకొనే వుంటారు. నగర జనకెరటాల హోరులో వారి ఆర్తనాదాలెవరికీ విన్పించవు! కొండలూ, అడవులూ, మారుమూల గూడేలూ, గ్రామాలున్నాయి. అక్కడకు ఏలినవారెప్పటికీ చేరలేరు గానీ యే రోగమయినా తొందరగా చేరుతుంది. ఏటా మలేరియా జ్వరాలకే రాలిపోయే అడవిబిడ్డలెందరో! విశాఖపట్నం నుండి ఇచ్చాపురం దాకా జాతీయరహదారి వెంట వీచే గాలికి రంగూ, రుచీ, వాసనా సృష్టించే కర్మాగారాలుం టాయి. అక్కడి కార్మికులుకి అంటని రోగముం డదు. తాగే నీటికోసం చెరువులూ, గెడ్డలూ ఆధారమైన పల్లెల్లో పలకరించే డయేరియా బంధువులెందరో పల్లెల్లో! కరోనా పుణ్యాన యివేవీ ఎవరికీ కన్పించటంలేదు. కరోనా ఫ్రీ జిల్లాలుగా ఈ రెండు జిల్లాలూ దేశం నోట్లో నానుతున్నాయి. రెండు జిల్లాల కలెక్టర్లనీ, రాజకీయనేతల్నీ పొగడ్తల్తో ముంచెత్తుతున్నారు. నిజమే.. యీ జిల్లాల్లో ముందుజాగ్రత్తలు తీసుకోవడంలో వీరు శ్రధ్ద చూపేరు. మాస్కుల పంపిణీ, మార్కెట్లలో క్యూలు, భౌతికదూరాన్ని పాటించడం, గ్రామవాలంటీర్లను వినియోగించడం, వైద్యసిబ్బందిని నియోగించడం వంటి అనేక చర్యలు అందరికంటే బాగా చేసివుంటారు. ఇవన్నీ యీ రెండుజిల్లాల్లో వలసబోకుండా వుంటోన్న జనాభాకు అందించిన సేవలు! కానీ వలసబోయిన వారి సంగతో..? కొంతమంది లాక్డౌన్ ప్రకటించగానే బయల్దేరి మధ్యదోవలో చిక్కుకున్నారు. వాళ్లను మధ్యలో పోలీసులు ఆపేసి... క్వారంటైన్లలో పెట్టేరు. ఎక్కడెక్కడో దోవల్లో చిక్కుకున్న యీ రెండుజిల్లాల పేద గుండెలెన్నెన్నో...! ఒకపక్క కరోనా ఫ్రీ అంటూ అధికార్లూ, ప్రసారసాధనాలూ ప్రచారం చేస్తుంటే యింకోపక్క కరోనా ఫ్రీకి కారణాలను కొన్ని యూనివర్సిటీలు పరిశోధించినాయనీ... ఈ రెండు జిల్లాలు తినే పిండొడియం, అంబలీ, గంజీ కారణాలంటూ వ్యంగ్యాస్త్రాల ప్రసారాలు! ఇక్కడ ఈ రెండుజిల్లాల్లో వున్నవారితో మాత్రమే గణించి వలసపోయిన అశేషజనాన్ని గణించకపోవడం సమంజ సంగా వుంటుందా? అపార్ట్మెంట్లూ, భవంతులూ, కోలనీలూ చప్పట్లు కొట్టేయి, దీపాలు ఆర్పేయి. కానీ అనేక గృహాల్లో కరోనా కంటే భయంకరమైన ఇనుపగజ్జెల తల్లి తిరుగాడుతోంది. ఈ తల్లిని తరి మేదెలా..? వలసపోయిన బిడ్డల్ని కాపాడేదెలా అని రెండుజిల్లాల గూళ్లల్లో గుండెలు కొట్లాడుతున్నాయి మిత్రమా! అట్టాడ అప్పల్నాయుడు వ్యాసకర్త ఉత్తరాంధ్ర రచయితలు, కళాకారుల వేదిక అధ్యక్షులు ‘ 94400 31961 -
బండారు తనయుడి బరితెగింపు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ బీచ్‌రోడ్డులో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ కుమారుడు అప్పలనాయుడు తాగిన మత్తులో రెచ్చిపోయాడు. మితిమీరిన వేగంతో ఇష్టారాజ్యంగా కారు నడుపుతూ మెడికో విద్యార్థుల బైక్‌ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఆంధ్రా మెడికల్ కళాశాల విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీ సులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... శనివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆంధ్ర మెడికల్ కళాశాల(ఏఎంసీ)లో మొదటి సంవత్సరం చదువుతున్న చంద్రకిరణ్ తన స్నేహితుడు గౌతమ్‌తో కలిసి బైక్‌పై బీచ్‌రోడ్డులో వెళ్తున్నారు. గౌతమ్ బైక్ నడుపుతుండగా, వెనక చంద్రకిరణ్ కుర్చొన్నాడు. బీచ్‌రోడ్డులో ఓ ప్రైవేట్ హోటల్లో రాత్రి ఒంటి గంట సమయం వరకు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ తనయుడు అప్పలనాయుడు తప్పతాగాడు. ఆ మత్తులోనే తన స్నేహితులిద్దరితో కలిసి కారులో బయలుదేరాడు. బీచ్‌రోడ్డులో మితిమీరిన వేగంతో వెళ్తూ చంద్రకిరణ్ బైక్‌ని ఢీకొట్టి.. సమీపంలోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద డివైడర్‌పైకి దూసుకుపోయాడు. దీంతో కారు ముందు భాగం ధ్వంసమైంది. బైక్ మీద నుంచి పడిపోయిన చంద్రకిరణ్ తలకు తీవ్ర గాయాలవడంతో స్థానికులు హుటాహుటిన కేజీహెచ్‌కి తరలించారు. తలకు బలమైన గాయంకాగా ముక్కు నుంచి తీవ్రంగా రక్తం కారుతుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కేజీహెచ్‌లో వైద్యం పొందుతున్నాడు. నెంబరు ప్లేటు మార్చేందుకు యత్నం.. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వెళ్లి ప్రశ్నించగా అప్పలనాయుడు దురుసుగా సమాధానం చెప్పడంతో వారంతా కలిసి దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకుని పోలీసులు ఘటనా స్థలికి చేరుకునే సమయానికి అక్కడి నుంచి స్నేహితులతో కలిసి అప్పలనాయుడు పరారయ్యాడు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న అప్పలనాయుడి కోసం గాలిస్తున్నారు. మరోవైపు తన కారు నెంబర్ బోర్డుని తొలగించేందుకు అప్పలనాయుడు ప్రయతి్నంచాడని స్థానికులు తెలుపుతున్నారు. ప్రమాద సమయంలో ఆ కారుకి ఏపీ 31డీపీ 6666 నంబరు ప్లేటు ఉండగా దాన్ని తొలగించేశారు. దాని స్థానంలో ఏపీ 37 సీవీ 0780 నంబరు ప్లేటు అమర్చేందుకు యతి్నంచగా సాధ్యం కాకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఆదివారం పోలీసులు వాహనాన్ని తరలించే సమయానికి మళ్లీ ఏపీ 31డీపీ 6666 నంబరు ప్లేటు దర్శనమిచ్చింది. మరోవైపు కారు ముందుసీటులో బండరాయి కనిపించడంతోపాటు అస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు చంద్రకిరణ్ ఎవరితోనూ మాట్లాడకపోవడం... అతని స్నేహితుడు గౌతమ్ అనే యువకుడు అక్కడ లేకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోందని పోలీసులు అంటున్నారు. తప్పు చేస్తే చర్యలు తప్పవు తప్పు చేస్తే ఎలాంటి వారిపైనైనా చర్యలు తప్పవని ఎంపీ, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి వి.విజయసాయిరెడ్డి అన్నారు. బీచ్‌రోడ్డులో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శనివారం అర్ధరాత్రి మాజీ మంత్రి బండారు సత్యానారాయణ కుమారుడు అప్పలనాయుడు తప్పతాగి చేసిన రోడ్డు ప్రమాద ఘటనపై ఆయన స్పందించారు. బీచ్‌రోడ్డులో అర్ధరాత్రి దాటిన తర్వాత మద్యం విక్రయాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. గత టీడీపీ ప్రభుత్వంలో రేవ్ పారీ్టలు, డ్రగ్స్ విక్రయాలు ఎక్కువగా జరిగేవని... ప్రస్తుతం వాటన్నింటినీ పోలీసులు పూర్తిగా నిలిపివేసేలా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. దర్యాప్తు చేస్తున్నాం మాకు సమాచారం రావడంతో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లాం. మేము వెళ్లే సరికే ప్రమాదానికి కారణమైన వారు పరారయ్యారు. వారిపై ఐపీసీ సెక్షన్ 337 ప్రకారం బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. దర్యాప్తులో భాగంగా నిందితుల కోసం గాలిస్తున్నాం. – కోరాడ రామారావు, త్రీ టౌన్ సీఐ -
ఆధిపత్య పోరు.. హత్యలకూ వెనకాడరు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను హత్య చేయించేందుకు రెడ్డి అప్పలనాయుడు పన్నిన కుట్ర బట్టబయలు కావడం అధికార పార్టీలో కలకలం రేపుతోంది. టీడీపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న వెంకటాపురం మాజీ సర్పంచ్ అప్పలనాయుడు ఇందుకోసం ఓ రౌడీ ముఠాకు రూ.10 లక్షల సుపారీ ఎరవేసినట్టు పోలీసులు చెబుతున్నారు. దెందులూరు నియోజకవర్గంలో కీలక నేతగా ఎదిగిన రెడ్డి అప్పలనాయుడును రాజకీయంగా దెబ్బతీసేందుకు యత్నిస్తున్న చింతమనేని అతడి ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టడంతో ప్రతీకారంతో రగిలిపోయి కుట్రకు తెరతీశారని పోలీసుల కథనాన్ని బట్టి అవగతమవుతోంది. కుట్రకు దారితీసిన పరిస్థితులివీ అప్పలనాయుడు భార్య అనురాధ ఏలూరు ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఆ పదవిని అనురాధకు, మోరు హైమావతికి చెరో రెండున్నరేళ్ల చొప్పున పంచుతూ ఎన్నికల సందర్భంలో పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. రెండున్నరేళ్ల అనంతరం తన భార్య పదవీ కాలాన్ని ఇంకో ఏడాది పొడిగిం చాలని అప్పలనాయుడు అడగటం, దానికి చింతమనేని నిరాకరించడం తెలిసిందే. దీంతో రెడ్డి అనురాధ ఆ పదవికి రాజీనామా చేశా రు. మోరు హైమావతి ఎంపీపీ అయ్యారు. అనురాధ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని కాంట్రాక్ట్‌లను బినామీ పేర్లతో రెడ్డి అప్పలనాయుడు దక్కించుకున్నట్టు సమాచారం. ఆమె పదవి నుంచి దిగిపోగానే అప్పలనాయుడు నేరుగా చింతమనేని ప్రభాకర్‌పై విమర్శలు చేయడం, దీంతో ఆయన చేసిన పనులకు సంబంధించిన బిల్లులను చింతమనేని నిలుపుదల చేయించడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. పదవి పోవడం, సుమారు రూ.50 లక్షల వరకూ బిల్లులు నిలిచి పోవడంతో.. తమను ఆర్థికంగా ఇబ్బంది పెట్టిన చింతమనేనిని అడ్డు తొలగించుకోవాలనే నిర్ణయానికి అప్పలనాయుడు వచ్చినట్టు టీడీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యేను అంతం చేయడానికి కుట్ర పన్నారనే విషయం తెలిసిన తర్వాత కూడా పోలీసులు వ్యవహరించిన తీరు బాగా లేదని చింతమనేని ప్రభాకర్ అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. ఎమ్మెల్యే బడేటిపై చింతమనేని వర్గం గుర్రు ఇదిలావుంటే.. చింతమనేని హత్యకు కుట్ర పన్నారనే విషయం వెలుగు చూసిన అనంతరం అప్పలనాయుడును ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి వెంటబెట్టుకుని తీసుకువెళ్లి డీఎస్పీకి అప్పగించి రావడంపై చింతమనేని వర్గం గుర్రుగా ఉంది. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందని ఆ వర్గం ప్రశ్ని స్తోంది. ఈ వ్యవహారంపై జిల్లా ఇన్చార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు దెందులూరు నియోజకవర్గ కార్యకర్తలు, నేతలు ఫిర్యాదు చేశారు. చింతమనేని ప్రభాకర్‌కు రక్షణ పెంచాలని కోరారు. మరోవైపు ఏలూరులో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని, పట్టపగలే ఒంటరిగా తిరిగే పరిస్థితి లేకుండా పోయిందని ఆరోపించారు. హత్యా రాజకీయాలకు కేంద్రంగా.. ఏలూరు నగరం కొంతకాలంగా హత్యా రాజకీయాలకు కేంద్రంగా మారింది. చిన్నచిన్న కారణాలకు నేపథ్యంలోనూ హత్యలు జరిగిపోతున్నాయి. అధికార పార్టీకి చెందిన భీమవరపు సురేష్, కొల్లి శంకరరెడ్డి వర్గాలు ఒకరిని మరొకరు చంపుకునేందుకు రెక్కీలు కూడా జరుపుకున్నట్టు పోలీ సుల విచారణలో వెల్లడైంది. వీరిలో కొల్లి శంకరరెడ్డి చింతమనేని హత్యకు కుట్ర పన్నిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. అతనిని శనివారం తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. భీమవరపు సురేష్ ఇక్కడి పోలీసులకు దొరికితే ఈ హత్యల పరంపరకు చెక్ పెట్టినట్టు అవుతుంది. రౌడీయిజాన్ని అణచివేస్తానని పదేపదే చెప్పే ముఖ్యమంత్రి ప్రశాంతతకు మారుపేరైన పశ్చిమ గోదావరి జిల్లాలో ఏకంగా ఎమ్మెల్యే హత్యకు కుట్ర జరగడంపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. రూ.10 లక్షల సుపారీ చింతమనేనిని చంపడానికి నక్కల పండు అనే రౌడీషీటర్‌కు, అతని గ్యాంగ్‌కు రూ.పది లక్షల సుపారీ ఇవ్వడానికి బేరం కుదిరినట్టు పోలీసులు చెబుతున్నారు. తొలుత రాంబార్కి పురంధర్ అనే వ్యక్తి వ్యాపార పరంగా తనకు అడ్డు తగులుతున్న కోమర్తి మధు అనే వ్యాపారిని చంపించేందుకు కుట్ర పన్నినట్టు భోగట్టా. ఇందుకోసం రూ.లక్ష ఇచ్చేందుకు రౌడీ ముఠాతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. అప్పలనాయుడుకు పురంధర్ స్నేహితుడు కావడంతో పనిలో పనిగా రౌడీషీటర్ జుజ్జువరపు జయరాజును కూడా హత్య చేయించేందుకు అప్పలనాయుడు పథకం వేశాడు. వారిద్దరినీ హతమార్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో.. ఎలాగూ అడ్వాన్స్ ఇచ్చాం కదా అనే ఉద్దేశంతో చింతమనేని ప్రభాకర్‌ను హతమార్చే బాధ్యతను అదే ముఠాకు అప్పగించినట్టు సమాచారం. ముఠా సభ్యులు కత్తులను సిద్ధం చేసుకుని చింతమనేని తరచూ వెళ్లే తోట వద్ద ఓ రోజు కాపు కాశారు. ఆ సమయంలో చింతమనేని అటు రాకపోవడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదని సమాచారం. ఇదిలావుంటే.. హత్యకు కుట్ర పన్నిన ముఠా సభ్యుల మధ్య విభేదాలు తలెత్తడంతో అసలు విషయం బయటకు పొక్కిందని చెబుతున్నారు. లేనిపక్షంలో ఏదో ఒక హత్య జరిగి ఉండేదంటున్నారు. -
వైద్య చికిత్సలో ‘పెథాలజీ’ పాత్ర కీలకం
– ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ అప్పలనాయుడు అనంతపురం మెడికల్ : రోగికి వైద్య చికిత్స అందించడంలో ‘పెథాలజీ’ వైద్యుల పాత్ర కీలకమని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ అప్పలనాయుడు పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురం మెడికల్ కళాశాల ఆడిటోరియంలో రాష్ట్ర స్థాయి నిరంతర వైద్య విద్య (సీఎంఈ) సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అప్పలనాయుడు మాట్లాడుతూ రోగ నిర్ధారణలో వస్తున్న విప్లవాత్మక మార్పులను అందరూ అందిపుచ్చుకోవాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలు అధ్యాపకులు, పీజీ విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెథాలజీ వైద్యులను ఒకచోట చేర్చి సదస్సును విజయవంతంగా నిర్వహించడంపై పెథాలజీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ మైరెడ్డి నీరజను అభినందించారు. అనంతరం శాంతిరాం మెడికల్ కళాశాల పెథాలజీ హెచ్ఓడీ డాక్టర్ జానకి, గ్రాంట్ గవర్నమెంట్ మెడికల్ కళాశాల (ముంబయ్) హెచ్ఓడీ డాక్టర్ లాన్జీవర్, ఎంవీజే మెడికల్ కళాశాల (బెంగళూరు) పెథాలజీ హెచ్ఓడీ షమీమ్‌షరీఫ్, రాయల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెథాలజిస్ట్ అన్నపూర్ణ, ఎంఎస్ రామయ్య మెడికల్ కళాశాల గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అవినాశ్ ప్రసంగించారు. కాలేయ, క్లోమ సంబంధిత వ్యాధుల నిర్ధారణలో వస్తున్న మార్పులు, నూతన ఆవిష్కరణలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పెథాలజీ అండ్ మైక్రో బయాలజీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సైలాబాను, సెక్రెటరీ శ్రీకాంత్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాల్ చిట్టినరసమ్మ, సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్, ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ కేశన్న, విశ్రాంత సూపరింటెండెంట్లు రామసుబ్బయ్య, అక్బర్‌సాహెబ్, ఐఎంఏ అధ్యక్షుడు కొండయ్య, కార్యదర్శి వినయ్, కోశాధికారి మనోరంజన్‌రెడ్డి, పెథాలజిస్ట్‌లు, ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు. -
కన్నతండ్రిని చంపిన కొడుకు, కూతురు
చెడు తిరుగుడు మానుకోమని పలు మార్లు చెప్పినా పెడచెవిన పెట్టిన కన్న తండ్రిని కొడుకు, కూతురు కలిసి హతమార్చారు. భార్య పిల్లల బాగోగులను పట్టించుకోకుండా.. వేరే మహిళలతో లైంగీక సంబంధాలు పెట్టుకొని సంపాదించిందంతా వారికే దోచిపెడుతున్నదనే కోపంతో తండ్రిపై దాడి చేశారు. ఈ దాడిలో తండ్రి మృతి చెందాడు. ఈ సంఘటన నగరంలోని కోరామండల్ 47వ వార్డు లేబర్ జంక్షన్లో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న అప్పలనాయుడు(50) కాంట్రాక్ట్ లేబర్‌గా పని చేస్తున్నాడు. ఈక్రమంలో వివాహేతర సంబంధాలు పెట్టుకొని భార్య బిడ్డలను నిర్లక్ష్యం చేశాడు. కొడుకు పైడిబాబు(30), కూతురు మహాల క్ష్మీ(28)లు తీరు మార్చుకోమని పలుసార్లు చెప్పిన లాభం లేకపోవడంతో కోపోద్రిక్తులై సోమవారం అర్ధరాత్రి ఆయనపై దాడి చేశారు. ఈక్రమంలో బండరాయితో తలపై బలంగా మోదడంతో అప్పలనాయుడు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇది..ఓ విషాద గాథ
కాకానీనగర్ వద్ద ప్రమాదంలో మామ, అల్లుడు మృతి అమ్మ.. నాన్నా ఎక్కడంటూ విలపిస్తున్న చిన్నారి అక్కిరెడ్డిపాలెం: ఓ రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని కకావికలం చేసింది. ఆ కుటుంబానికి మగ దిక్కు లేకుండా పోయింది. మామ, అల్లుడు మృతి చెందడం ఆ కుటుంబాన్ని షాక్‌కు గురిచేసింది. ఆస్పత్రి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న కుమార్తె, అమ్మ.. నాన్న ఎక్కడంటూ విలపిస్తున్న మనుమరాలు.. అన్నింటికి మించి తన భర్త, అల్లుడి మృతితో ఆ తల్లి రోదనలు మిన్నంటాయి. ప్రమాద వార్త తెలిసిన వెంటనే వెంకటేశ్వరకాలనీలో విషాద చాయలు అలుముకున్నాయి. కాకానీనగర్ వద్ద ఆదివారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో 65వ వార్డు వెంకటేశ్వరకాలనీకు చెందిన రెడ్డి అప్పలనాయుడు (57), అల్లుడు కంది ఎల్లారావు దుర్మరణం చెందారు. అప్పలనాయుడు కుమార్తె అనిత తీవ్ర గాయాలతో నగరంలో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రమాదంలో ఆమె ఎడమ కాలుకు తీవ్ర గాయాలు కాగా.. శస్త్రచికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. సుందర్ వినాయక్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న అప్పలనాయుడు భెల్‌లో రేడియో గ్రాఫర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అల్లుడు హైదరాబాదులో హెచ్ అండ్ హెచ్ ఫార్మాసూటికల్ ప్రైవేట్ లిమిటెడ్‌లో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఎల్లారావు స్వగ్రామం వాడచీపురుపల్లి. పండగకు వచ్చిన కుమార్తె అనిత, రెండేళ్ల మనుమరాలు భార్గవితో నాలుగు రోజుల పాటు ఆనందంగా గడిపారు. కుమార్తె, మనుమరాలు 10 రోజుల పాటు తల్లిదండ్రుల వద్ద ఉంటాననడంతో అల్లుడు హైదరాబాద్ వెళ్లేందుకు ఆదివారం బయలు దేరాడు. అతన్ని రైలు ఎక్కించడానికి స్టేషన్‌కు మామ, అల్లుడు, కుమార్తెలు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో కారు రూపంలో మృత్యువు కాకానీనగర్ వద్ద వారిద్దరిని కబళించింది. డబ్బు, ల్యాప్‌టాప్ మాయం జరిగిన ప్రమాద సమయంలో వీరి వెంట తీసుకువె ళ్లిన రూ.2.50లక్షల నగదు, ల్యాప్ టాప్ మాయమైందని అప్పలనాయుడు భార్య రెడ్డి సావిత్రి తెలిపారు. విజయవాడలో అల్లుడు స్థలం కొన్నారని, ఆ స్థల యజమానికి డబ్బు అందజేయడానికి బ్యాగులో ఆ సొమ్మును తీసుకెళ్లాడని చెప్పారు. ఆ సొమ్మతో పాటు ల్యాప్‌టాప్ కూడా మాయమైందన్నారు. పోలీసులు వీటి స్వాధీనం చేసుకున్నారా? లేదా ప్రమాదం జరిగిన ప్రాంతంలో వీటిని ఎవరైనా దొంగిలించారా అంటూ భర్త, అల్లుడును తలచుకుంటూ సావిత్రి విలపించారు. పలువురు భెల్ ఉద్యోగులు, యూనియన్ నాయకులు, కార్మికులు, అధికారులు, స్థానిక నాయకులు అప్పలనాయుడు ఇంటికి చేరుకుని అయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత
-
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత
విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం వెదురువాడ సమీపంలో సోమవారం వేకువజామున జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ట్రాక్టర్లో యలమంచిలి వైపు వెళ్తుండగా ఎదురుగా వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో శెట్టి దేముడు(45), కె.అప్పలనాయుడు(38) అక్కడికక్కడే చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ఘటన జరిగిందని భావిస్తున్నారు. -
తెలుగోడి చెవిలో పువ్వు
విజయనగరం మున్సిపాలిటీ : అధికారంలోకి రాక ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తరువాత మరోమాట మార్చుతూ బీజేపీ సర్కారు తెలుగు వారిని మోసం చేస్తోందని విశాలాంధ్ర మహాసభ జిల్లా అధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడిగా ఉన్న ఆంధ్రరాష్ట్రాన్ని విభ జించిన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని హమీలు ఇచ్చి నేడు ఆ హామీలను తుంగలో తొక్కుతున్న కేంద్ర ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ వినూత్న తరహాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్లో విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ప్రధాన మంతి నరేంద్రమోడీ, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాస్కులు ధరించి ఆ మార్గంలో వచ్చి పోయే వారందరికీ చెవిలో పువ్వులు పెడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందుకు ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేస్తామని చెప్పిన నాయకులే నేడు ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చిచెప్పడం తెలుగువారి చెవులో పువ్వులు పెట్టడమేనన్నారు. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో వెనుకబడిందని, ప్రత్యేక హోదాయే రాష్ట్ర భవిష్యత్‌కు శరణ్యమని అన్నారు. రాష్టానికి ప్రత్యేక హోదా కల్పించడంతోనే తెలుగువారి భవిష్యత్ ముడిపడి ఉందని ఇప్పటికైనా మోసపూరిత విధానాలను విడనాడి ప్రత్యేక హోదా కల్పిస్తూ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో విశాలాంధ్ర మహాసభ జిల్లా అధ్యక్షుడు మద్దిల సోంబాబు, సభ్యులు రాంబాబు, పైడినాయుడు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
20 కిలోల గంజాయి పట్టివేత
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా రోలుగుంట మండలంలో 20 కిలోల గంజాయిని పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. పట్టణానికి చెందిన బత్తిని అప్పలనాయుడు 20 కిలోల గంజాయిని ఆటోలో తరలిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు రోలుగుంట మండల శివారులో అతడిని పట్టుకున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. (రోలుగుంట ) -
ప్రే‘ముంచినందుకు’..యావజ్జీవం..
విజయనగరం లీగల్/శృంగవరపు కోట రూరల్: నిన్నే ప్రేమించానన్నాడు. పెళ్లాడతానని ప్రమాణం చేశాడు. కొన్నాళ్లు వివాహేతర సంబంధం నడిపాడు. తీరా పెళ్లి మాట వచ్చేసరికి తనకు ముందే పెళ్లయిందని నంగనాచి కబుర్లు చెప్పాడు. ప్రేమించి ముంచినందుకు చివరకు కటకటాల పాలయ్యాడు. దళిత యువతిని ప్రేమ పేరుతో నమ్మించి వంచించాడన్న కేసు రుజువు కావడంతో ఎస్‌కోట మండల కేంద్రం పెద్ద వీధికి చెందిన పొట్నూరు అప్పలనాయుడుకు జీవిత ఖైదుతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తూ ఎస్సీ,ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కె.వి.రమణాజీరావు మంగళవారం తీర్పు చెప్పారు. పాసిక్యూషన్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు అప్పలనాయుడు ఎస్‌కోట హౌసింగ్ డిపార్టుమెంట్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. బాధితురాలు ఎల్కోట కంప్యూటర్ ప్రెజెంటేషన్ రిసోర్స్ కేంద్రంలో పనిచేస్తోంది. 2006నుంచి అప్పలనాయుడు ఉద్యోగ రీత్యా ఎల్‌కోటకు వస్తుండేవాడు.అదే సమయంలో ఆమెతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. దీంతో ఆమెను పెళ్లి పేరుతో లొంగదీసుకుని వివాహేతర సంబంధం కొనసాగించాడు. రెండుసార్లు అబార్షన్ కూడా చేయించాడు. సుమారు అయిదేళ్ల పాటు వారి సంబంధం, ప్రేమ కొనసాగింది. 2011 సెప్టెంబరులో అప్పలనాయుడును పెళ్లి విషయమై బాధితురాలు నిలదీసింది. దీంతో అప్పలనాయుడు తనకు ఇది వరకే వివాహమైందని, ఇద్దరు పిల్లలున్నారంటూ అసలు విషయం చెప్పాడు. ఈ విషయంపై ఇరువర్గాల పెద్దల మధ్య చర్చలు కూడా జరిగాయి. రెండో భార్యగా ఆమెను స్వీకరిస్తానని అప్పలనాయుడు చెప్పడంతో బాధితురాలు ఇష్టం లేకపోయినా సరేనంది. నెలలు గడుస్తున్నా అప్పలనాయుడు మౌనంగా ఉండడంతో కుటుం బ సభ్యులతో పాటు వెళ్లి అప్పలనాయుడును నిల దీసింది. తమ కుటుంబ సభ్యులు భార్యగా స్వీకరించడానికి ససేమిరా అంటున్నారంటూ డబ్బులిచ్చి ఆమెను వదిలించుకోవాలని చూశాడు. అప్పటికే రెండుసార్లు మోసపోయానని గ్రహించిన ఆమె 2012 అక్టోబరు 25న పోలీసుకలకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు అప్పలనాయుడుపై అత్యాచారం,ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి చట్టంకింద ఎస్‌కోట పోలీసులు కేసులు నమోదు చేశా రు. ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాధారాలతో కేసు రుజువు చేయడంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున నాగమల్లేశ్వరరావు వాదించారు. -
అందివచ్చిన కొడుకు అనంత లోకాలకు..
రాజాం రూరల్: అందివచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కన్నవారు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక శ్రీకాకుళం రోడ్డులోని సన్‌స్కూల్ ఎదురుగా సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో రేగిడి మండలం లచ్చన్నవలస గ్రామానికి చెందిన మీసాల అప్పలనాయుడు (23) మృతి చెందాడు. అప్పలనాయుడు ఇటీవల డిగ్రీ పూర్తి చేసుకొని ఖాళీగా ఉండకుండా వ్యాపారం చేస్తున్న తన మేనమామ అయిన లావేటి సత్యం వద్ద పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే వృత్తిలో భాగంగా శ్రీకాకుళం రోడ్డులోని కామేశ్వరరావు పెట్రోల్‌బంకుకు ద్విచక్ర వాహనంపై వెళ్లి తిరిగి వస్తుండగా ఎదురుగా మితిమీరిన వేగంతో వచ్చిన టాటా ఏస్ వ్యాన్ ఢీకొట్టింది. దీంతో అప్పలనాయుడు తల పగిలిపోయి మెదడు దూరంలో ఎగిరిపడడంతో అక్కడకక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సీఐ అంబేద్కర్ సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించి వ్యాన్‌ను, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహానికి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సామాజిక ఆస్పత్రికి తరలించారు. లచ్చన్నవలసలో విషాదం రేగిడి: అప్పలనాయుడు మృతితో వ్యవసాయ కూలీలైన తల్లిదండ్రులు మీసాల సూరీడమ్మ, కూర్మినాయుడు, సోదరుడు శ్రీహరి, ఇద్దరు అక్కలు తల్లడిల్లిపోయారు. తమను కష్టకాలంలో ఆదుకుంటాడనుకున్న కొడుకును మృత్యువు కబళించిందని కన్నవారు రోదించారు. కాగా అప్పలనాయుడు మృతి చెందాడన్న సమాచారంతో లచ్చన్నవలసలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ప్రచారానికి పదును
నియోజకవర్గ, మండల కేంద్రాల్లో కార్యాలయాల ఏర్పాటు ఎక్కువ ప్రాంతాల్లో పర్యటనకు ఏర్పాట్లు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తున్న అభ్యర్థులు దూసుకుపోతున్న వైఎస్సార్సీపీ విశాఖ రూరల్, న్యూస్‌లైన్: మహా సంగ్రామంలో తొలి అంకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. జిల్లాలో పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు ఖరారయ్యారు. పోటీ విషయంలో స్పష్టత వచ్చింది. ఎన్నికల రిటర్నింగు అధికారులు గుర్తులను కేటాయించారు. ఈమేరకు ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచార సమరానికి గురువారం నుంచి పదును పెడుతున్నారు. ఇందుకు అవసరమైన సరంజామాను ఇప్పటికే సమకూర్చుకున్నారు. పార్టీల గుర్తులతో కూడిన జెండాలు, ప్రచార కరపత్రాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే కొందరు ప్రచారాన్ని ముమ్మరం చేయగా మరికొందరు చాపకింద నీరులా సాగిస్తున్నారు. గ్రామాల్లోని కార్యకర్తలను సమన్వయపరిచేందుకు వీలుగా ప్రధాన పార్టీల అభ్యర్థులు నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ఎన్నికల కార్యాలయాలను ప్రారంభించారు. ఇంకా పది రోజులే గడువున్నందున వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో పర్యటించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ప్రత్యేక వాహనాల్లో వెళ్లి తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను నేరుగా కలి సేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇంటింటికి వెళ్లి కలిసే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ బహుముఖపోటీ నెలకొంది. నర్సీపట్నం అసెంబ్లీ సెగ్మెంటులో మినహా మిగిలిన అన్నింటిలోనూ వైఎస్సార్సీపీతోపాటు, టీడీపీ, కాంగ్రెస్ ఇతర పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉపసంహరణలు ముగిసే సమయానికి నర్సీపట్నం కాంగ్రెస్ అభ్యర్తి అప్పలనాయుడు తన నామినేషన్‌ను అనూహ్యంగా ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఊహించని పరిణామం ఎదురైంది. ఈ దశలో మిగతా పార్టీల కంటే వైఎస్సార్సీపీ అభ్యర్థులు జిల్లాలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఫ్యాన్‌గాలి ఉవ్వెత్తున వీస్తోంది. ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు. టీడీపీ ఇంకా అసమ్మతిసెగలు, నిరసనలు,తిరుగుబాటుదారులతో అవస్థలు పడుతూనే ఉంది.జిల్లా మొత్తానికే ఎన్నికల ప్రచారం జోష్ పెరిగింది. -
కరువు రాజకీయం!
విజయనగరం వ్యవసాయం, న్యూస్‌లైన్: కరువు మండలాల ఎంపికలోనూ కుళ్లు రాజకీయాలు చోటుచేసుకున్నాయి. జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయన తమ్ముడు అప్పలనరసయ్య, మంత్రి బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటిం చడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. చాలా మండలాల్లో దుర్భర పరిస్థితులున్నప్పటికీ ప్రభుత్వం ఐదు మండలాలను మాత్రమే, అందులోనే మంత్రి, ఆయన బంధువులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోన్ని మండలాలను ఎంపిక చేయడం పట్ల పలువురు రైతులు మండిపడుతున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించగా, అతని సోదరుడు అప్పలనర్సయ్య గజపతినగరం నియోజకవర్గానికి, మేన కోడలు భర్త బడ్డుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శుక్రవారం ప్రభుత్వం కరువు మండలాల జాబితాను ప్రకటించింది. వీటిలో చీపురపల్లి, భోగాపురం, నెల్లిమర్ల, గరివిడి. దత్తిరాజేరు మండలాలు ఉన్నాయి. చీపురుపల్లి, గరివిడి మంత్రి బొత్స నియోజకవర్గానికి చెందిన మండలాలు. నెల్లిమర్ల, భోగాపురం మంత్రి బంధువు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి చెందినవి. దత్తిరాజేరు మండలం మంత్రి సోదరుడు ప్రాతినిధ్యం వహిస్తున్న గజపతినగరం నియోజకవర్గం లోనిది. మంత్రి, ఆయన బంధువులకు చెందిన మండలాలను కరువు మండలాలుగా గుర్తించి మిగిలిన వాటికి వర్తింపజేయలేదు. వాస్తవానికి జిల్లాలోని 19 మండలాల్లో కరువు పరిస్థితులున్నాయి. కానీ ఐదింటిని మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించారు. ఎంపికకు నిబంధనలు.. 20 శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడం, 50 శాతం కంటే తక్కువ దిగుబడి రావడం, 50 శాతం కంటే తక్కువ విస్తీర్ణం సాగైతే కరువు మండలాలుగా గుర్తిస్తారు. అధికారుల వాదన ఇదీ.. ప్రస్తుతం ఎంపిక చేసిన ఐదు కరువు మండలాలు మూడు పారా మీటర్లలో అర్హత సాధించాయని, అందువల్లే వాటిని ఎంపిక చేశామని చెబుతున్నారు. రెండు పారా మీటర్లలో అర్హత సాధించడం వల్లే మిగిలిన 14 మండలాలను కరువు మండలాలుగా గుర్తించలేదని అధికారులు చెబుతున్నారు. రైతుల ఆక్రందన పట్టని ప్రభుత్వం కేవలం ఒక పారామీటరులో అర్హత సాధించలేదన్న నెపంతో 14 మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా గుర్తించలేదు. డెంకాడ, జామి, బొండపల్లి, పూసపాటిరేగ, మెరకముడిదాం, గజపతినగరం, విజయనగరం, ఎల్.కోట, కొత్తవలస, వేపాడ, గంట్యాడ, ఎస్.కోట, గుర్ల, మెంటాడ మండలాల్లో కూడా కరువు పరిస్థితులున్నాయి. కానీ వీటిని మాత్రం ఎంపిక చేయలేదు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడకపోవడం వల్ల 14 మండలాల్లో చాలా వరకు సాగవలేదు. అష్ట కష్టాలు పడి రైతులు నాట్లు వేసినప్పటికీ పొట్ట దశలో వర్షాలు పడకపోవడం పంట చాలా వరకు ఎండిపోయింది. దీంతో ప్రభుత్వం ఆదుకుంటుందని 14 మండలాలకు చెందిన రైతులు గంపెడు ఆశ పెట్టుకున్నారు. వీరి ఆక్రందనను ప్రభుత్వం పట్టించుకోలేదు. రాజకీయ సిఫారసుల ప్రకారం ఐదు మండలాలను మాత్రమే కరువు మండలాలుగా గుర్తించారు. నా పేరు గుల్లిపల్లి సూర్యానారాయణ. మాది ఎల్.కోట మండ లం శ్రీరాంపురం. నాకు రెండు ఎకరాల పొలం ఉంది. వర్షాలు సకాలంలో పడకపోవడంతో పంట చాలా వరకు ఎండిపోయింది. ప్రభుత్వం మా మండలాన్ని కరు వు మండలంగా గుర్తించి ఆదుకుంటుం దని గంపెడు ఆశ పెట్టుకున్నాం. కానీ మా ఆశలను ప్రభుత్వం అడియాసలు చేసింది. నా పేరు. జి.గుర్రయ్య. మాది మెంటాడ మం డలం చల్లపేట. నాకు న్న ఎకరం పొలంలో వ రి పంట వేశాను. పంట చేతికి అందుతుందనకునే సమయంలో వర్షాలు పడకపోవడం చాలా వరకు పంట దెబ్బతింది. దీంతో 40 శాతం కూడా పంట చేతికి -
3న అసెంబ్లీ ముట్టడి
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనపై అసెంబ్లీలో ఓటింగ్ జరపాలని డిమాండ్ చేస్తూ విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో జనవరి 3న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నట్లు విశాలాంధ్ర మహాసభ జిల్లా కన్వీనర్ మామిడి అప్పలనాయుడు తెలిపారు. ఈ కార్యక్రమానికి సమైక్యవాదులందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక పంచాయతీరాజ్ చాంబర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పది కోట్ల మంది తెలుగు ప్రజల భవిష్యత్‌కు సంబంధించిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై తప్పనిసరిగా ఓటింగ్ జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తే తీవ్రవాదం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమానికి అధిక సంఖ్యలో సమైక్యవాదులు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో ఐ. కిశోర్, వినోద్, తదితరులు పాల్గొన్నారు. -
ఈ ఏడాదీ అరకు ఉత్సవ్
మునగపాక, న్యూస్‌లైన్ : ఇంట్లో వారు తిరుపతి వెళ్లారు.. యజమాని మాత్రం ఒక్కరే ఇంట్లో ఉన్నారు. మరేం జరిగిందో తెలియదు కానీ ఆయన జాడ లేకుండా పోయింది. ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండడంతోపాటు విలువైన సామగ్రి అదృశ్యమయింది. ఇంటి నిండా కారం చల్లి ఉండడంతో ఏం జరిగిందో ఏమిటోనన్న భయం నెలకొంది. మండల కేంద్రమైన మునగపాకలో ఒక వ్యక్తి అదృశ్యం కావడం, ఇంట్లో వస్తువులు పాటు అపహరణకు గురి కావడంతో కలకలం నెలకొంది. అదృశ్యమైన వ్యక్తి కుటుంబ సభ్యుల, పోలీసుల సమాచారం ప్రకారం.. మునగపాకలోని పల్లపు వీధిలో పొలమరశెట్టి రామచంద్రరావు, అతని భార్య మహలక్షమ్మ నివసిస్తున్నారు. వారికి ఇద్దరు ఆడ పిల్లలు, ఇద్దరు కొడుకులున్నారు. కొడుకులిద్దరూ దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నారు. పెద్ద కొడుకు అప్పలనాయుడు ఇటీవల మునగపాక వచ్చాడు. కుమార్తెలకు వివాహాలు జరిగినా కుటుంబ కలహాల కారణంగా తల్లితండ్రుల వద్దే ఉంటున్నారు. రామచంద్రరావు భార్య మహలక్షమ్మ, అప్పలనాయుడు, కూతుళ్లు ఈ నెల 10న తిరుపతి పయనమయ్యారు. రామచంద్రరావు మాత్రం ఇంటివద్దే ఉండిపోయారు. తిరుపతి నుంచి అప్పలనాయుడు గత మూడు రోజులుగా తండ్రికి ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్విచాఫ్ అనే వస్తూ ఉండడంతో అతడు ఆందోళనతో గ్రామంలోని తన స్నేహితుడు వేగి శివ గణేశ్‌కు ఫోన్ చేసి ఇంటికి వెళ్లి తండ్రి బాగోగులు వాకబు చేయాలని కోరాడు. గణేశ్ మంగళవారం రాత్రి రామచంద్రరావు ఇంటికి వెళ్లి చూడగా వంటగది తలుపు తెరిచి ఉండడంతో చోరీ జరిగినట్లు గమనించి స్థానికులకు సమాచారం అందించాడు. చుట్టుపక్కల వారు వచ్చి, ఇల్లంతా కారం జల్లి ఉండడాన్ని గమనించారు. ఇంట్లో వస్తువులు చెల్లాచెదుైరె నట్లు గుర్తించి పోలీసులకు తెలిపారు. మునగపాక ఎస్ఐ జోగారావు ఆ రాత్రే సంఘటన స్థలానికి చేరుకొని చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఇంటి యజమాని అదృశ్యమైనట్టు గుర్తించారు. గణేశ్ బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వ్యక్తి అదృశ్యం కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వెండి సామగ్రి మాయం రామచంద్రరావు కుటుంబ సభ్యులు బుధవారం మధ్యాహ్నం తిరుపతి నుంచి ఇంటికి చేరుకున్నారు. పోలీసుల సమక్షంలో ఇంట్లో గదులు పరిశీలించగా, ప్రధాన గదిలోని బీరువా తెరిచి ఉన్నట్టు గమనించారు. బీరువాలోని మూడు కిలోల వెండి సామగ్రి, రూ. 10 వేల నగదు, కొన్ని డాక్యుమెంట్లు మాయమయ్యాయని, అదే గదిలోని ఎల్సీడీ టీవీ కూడా కనిపించడం లేదని గుర్తించారు. తిరుపతి వెళ్తూ ఉండడంతో ఇంట్లోని బంగారు నగలను బ్యాంకులోని లాకర్లో భద్రపరిచినట్టు రామచంద్రరావు భార్య మహలక్షమ్మ తెలిపారు. ఈ సంఘటనతో మహలక్షమ్మ, కొడుకు, కూతుళ్లు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికులు ఇంటి వద్ద గుమికూడి ఏం జరిగిందోనని ఆందోళన చెందుతున్నారు.