కరువు రాజకీయం!
Published Sun, Jan 5 2014 4:20 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM
విజయనగరం వ్యవసాయం, న్యూస్‌లైన్: కరువు మండలాల ఎంపికలోనూ కుళ్లు రాజకీయాలు చోటుచేసుకున్నాయి. జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయన తమ్ముడు అప్పలనరసయ్య, మంత్రి బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటిం చడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. చాలా మండలాల్లో దుర్భర పరిస్థితులున్నప్పటికీ ప్రభుత్వం ఐదు మండలాలను మాత్రమే, అందులోనే మంత్రి, ఆయన బంధువులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోన్ని మండలాలను ఎంపిక చేయడం పట్ల పలువురు రైతులు మండిపడుతున్నారు.
మంత్రి బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించగా, అతని సోదరుడు అప్పలనర్సయ్య గజపతినగరం నియోజకవర్గానికి, మేన కోడలు భర్త బడ్డుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శుక్రవారం ప్రభుత్వం కరువు మండలాల జాబితాను ప్రకటించింది. వీటిలో చీపురపల్లి, భోగాపురం, నెల్లిమర్ల, గరివిడి. దత్తిరాజేరు మండలాలు ఉన్నాయి. చీపురుపల్లి, గరివిడి మంత్రి బొత్స నియోజకవర్గానికి చెందిన మండలాలు. నెల్లిమర్ల, భోగాపురం మంత్రి బంధువు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి చెందినవి. దత్తిరాజేరు మండలం మంత్రి సోదరుడు ప్రాతినిధ్యం వహిస్తున్న గజపతినగరం నియోజకవర్గం లోనిది. మంత్రి, ఆయన బంధువులకు చెందిన మండలాలను కరువు మండలాలుగా గుర్తించి మిగిలిన వాటికి వర్తింపజేయలేదు. వాస్తవానికి జిల్లాలోని 19 మండలాల్లో కరువు పరిస్థితులున్నాయి. కానీ ఐదింటిని మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించారు.
ఎంపికకు నిబంధనలు..
20 శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడం, 50 శాతం కంటే తక్కువ దిగుబడి రావడం, 50 శాతం కంటే తక్కువ విస్తీర్ణం సాగైతే కరువు మండలాలుగా గుర్తిస్తారు.
అధికారుల వాదన ఇదీ..
ప్రస్తుతం ఎంపిక చేసిన ఐదు కరువు మండలాలు మూడు పారా మీటర్లలో అర్హత సాధించాయని, అందువల్లే వాటిని ఎంపిక చేశామని చెబుతున్నారు. రెండు పారా మీటర్లలో అర్హత సాధించడం వల్లే మిగిలిన 14 మండలాలను కరువు మండలాలుగా గుర్తించలేదని అధికారులు చెబుతున్నారు.
రైతుల ఆక్రందన పట్టని ప్రభుత్వం
కేవలం ఒక పారామీటరులో అర్హత సాధించలేదన్న నెపంతో 14 మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా గుర్తించలేదు. డెంకాడ, జామి, బొండపల్లి, పూసపాటిరేగ, మెరకముడిదాం, గజపతినగరం, విజయనగరం, ఎల్.కోట, కొత్తవలస, వేపాడ, గంట్యాడ, ఎస్.కోట, గుర్ల, మెంటాడ మండలాల్లో కూడా కరువు పరిస్థితులున్నాయి. కానీ వీటిని మాత్రం ఎంపిక చేయలేదు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడకపోవడం వల్ల 14 మండలాల్లో చాలా వరకు సాగవలేదు. అష్ట కష్టాలు పడి రైతులు నాట్లు వేసినప్పటికీ పొట్ట దశలో వర్షాలు పడకపోవడం పంట చాలా వరకు ఎండిపోయింది. దీంతో ప్రభుత్వం ఆదుకుంటుందని 14 మండలాలకు చెందిన రైతులు గంపెడు ఆశ పెట్టుకున్నారు. వీరి ఆక్రందనను ప్రభుత్వం పట్టించుకోలేదు. రాజకీయ సిఫారసుల ప్రకారం
ఐదు మండలాలను మాత్రమే కరువు
మండలాలుగా గుర్తించారు.
నా పేరు గుల్లిపల్లి సూర్యానారాయణ. మాది ఎల్.కోట మండ లం శ్రీరాంపురం. నాకు రెండు ఎకరాల పొలం ఉంది. వర్షాలు సకాలంలో పడకపోవడంతో పంట చాలా వరకు ఎండిపోయింది. ప్రభుత్వం మా మండలాన్ని కరు వు మండలంగా గుర్తించి ఆదుకుంటుం దని గంపెడు ఆశ పెట్టుకున్నాం. కానీ మా ఆశలను ప్రభుత్వం అడియాసలు చేసింది.
నా పేరు. జి.గుర్రయ్య. మాది మెంటాడ మం డలం చల్లపేట. నాకు న్న ఎకరం పొలంలో వ రి పంట వేశాను. పంట చేతికి అందుతుందనకునే సమయంలో వర్షాలు పడకపోవడం చాలా వరకు పంట దెబ్బతింది. దీంతో 40 శాతం కూడా పంట చేతికి
Advertisement
Advertisement