3న అసెంబ్లీ ముట్టడి | 3th Assembly Obsession | Sakshi
Sakshi News home page

3న అసెంబ్లీ ముట్టడి

Published Tue, Dec 24 2013 3:20 AM | Last Updated on Sat, Sep 2 2017 1:53 AM

3th Assembly Obsession

విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్:  రాష్ట్ర విభజనపై అసెంబ్లీలో ఓటింగ్ జరపాలని డిమాండ్ చేస్తూ విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో జనవరి 3న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నట్లు విశాలాంధ్ర మహాసభ జిల్లా కన్వీనర్ మామిడి అప్పలనాయుడు తెలిపారు. ఈ కార్యక్రమానికి సమైక్యవాదులందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక పంచాయతీరాజ్ చాంబర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పది కోట్ల మంది తెలుగు ప్రజల భవిష్యత్‌కు సంబంధించిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై తప్పనిసరిగా ఓటింగ్ జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తే తీవ్రవాదం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమానికి  అధిక సంఖ్యలో సమైక్యవాదులు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో ఐ. కిశోర్, వినోద్, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement