obsession
-
‘రక్తపిశాచ’ జబ్బు.. దీని గురించి మీకు తెలుసా!
ఇంగ్లిష్ సినిమాల్లో, కథల్లో డ్రాక్యులాలు రక్తం తాగుతాయి. ఇలాంటి సినిమాలు చూసి, లేదా కథలు చదివి మనం వినోదం పొందుతాం. ఇలా రుధిరాన్ని ఆస్వాదించే కారెక్టర్స్‌ను వాంపైర్స్ అని పిలవడం కూడా మనకు తెలుసు. కానీ వాంపైరిజమ్ అనే కండిషన్ ఉందన్న విషయం మనలో చాలామందికి తెలియదు. ప్రతి మనిషీ తనకు తెలియకుండానే ఒక్కోసారి రక్తాన్ని ఎంతోకొంత రుచి చూస్తాడు. చటుక్కున వేలు తెగినప్పుడు చాలామంది ఆ వేలిని నోట్లో పెట్టుకుంటారు. జరిగే రక్తస్రావాన్ని ఆపేందుకే ఇలా చేస్తారు. అయినప్పటికీ ఇలా తన రక్తాన్ని రుచిచూసే ఆ ప్రక్రియకు ‘‘ఆటో వాంపైరిజమ్’’ అంటారు. ఇది సాధారణం. అయితే కొంతమంది మానసిక రోగుల్లో ఇంకా అసాధారణమైన కండిషన్ ఉంటుంది. చాలా చాలా అరుదైన ఈ కండిషన్ ఉన్నవారికి రక్తం తాగాలనే కోరిక కలుగుతుంది. ఇలా రక్తం తాగాలనే కోరిక పుట్టడాన్ని ‘‘క్లినికల్ వాంపైరిజమ్’’ అంటారు. ఇక మరికొందరిలో ఇది ఓ రుగ్మత స్థాయికి చేరుకుంటుంది. అలాంటి ఓ అత్యంత అరుదైన జబ్బే ‘రెన్‌ఫీల్డ్స్ సిండ్రోమ్’. ఈ జబ్బు ఉన్నవారికి రక్తం తాగాలనే కోరిక కలుగుతుంది. ఇది చాలా చాలా అరుదు కావడంతో దీనికి నిర్దిష్టమైన చికిత్స అంటూ లేకపోయినా... ప్రవర్తనకు సంబంధించిన (బిహేవియరల్) రుగ్మతలకు చికిత్స అందించినట్లే న్యూరోసైకియాట్రిస్టులు దీనికీ చికిత్స అందిస్తారు. చదవండి: ‘యూ బ్లడీ ఫూల్’ అంటూ బాతు నోట తిట్టు! -
‘మనిద్దరం కలిసి చనిపోదాం’
వాషింగ్టన్: ‘మనిద్దరం కలిసి చనిపోదాం.. అమెరికాలో తిరుగుతూ.. చర్చిలు, విమానాశ్రయాల్లో హింసకు పాల్పడదాం’ అంటూ ఓ వ్యక్తి తన స్నేహితురాలికి ఏకంగా 10 వేల సందేశాలు పంపించాడు. వివరాలు.. ఫ్లోరిడాకు చెదిన నికోలస్ సి. నెల్సన్ అనే వ్యక్తికి ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ 5 నుంచి నెల్సన్ సదరు మహిళకు బెదిరింపు, అసభ్యకర సందేశాలు పంపడం ప్రారంభించాడు. 12 రోజుల వ్యవధిలో దాదాపు 10 వేల మెసేజ్‌లు చేశాడు. వాటిలో కొన్ని అసభ్యకరంగా ఉండగా.. మరి కొన్ని ‘మనం కలిసి చనిపోదాం.. అమెరికాలో తిరుగుతూ.. చర్చిలను పేల్చేద్దాం.. విమాన్రాశ్రయంలో దూరి కాల్పులకు పాల్పడదాం’ అనే హింసాత్మక సందేశాలు కూడా ఉన్నాయి. అంతేకాక నెల్సన్ సదరు మహిళకు ఓ విమానాశ్రయం ఫోటో పంపి.. తన మాట నిలబెట్టుకోబోతున్నాను అని పేర్కొన్నాడు. నెల్సన్ ప్రవర్తనతో విసిగిపోయిన సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో వారు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ విషయం గురించి సదరు మహిళ మాట్లాడుతూ.. స్నేహితుల ద్వారా నికోల్సన్‌తో పరిచయం ఏర్పడిందని.. ఇప్పటి వరకూ రెండు మూడు సార్లు మాత్రమే తాను అతడిని చూశానని తెలిపింది. అంతేకాక నెల్సన్ తనకు చేసిన మెసేజ్‌లలో చనిపోతానని పేర్కొనలేదు.. కానీ జైలుకు వెళ్తానని చెప్పేవాడు అని పేర్కొంది. -
బిగుస్తున్న బడుగు పిడికిళ్లు
-శ్రామికుల బతుకులతో బాబు సర్కారు చెలగాటం -వివిధ పథకాలను భ్రష్టు పట్టిస్తున్న దుష్ట విధానాలు -నిరసనగా పోరుపథంలో కదం తొక్కుతున్న కార్మికులు -రేపు కలెక్టరేట్ ముట్టడి మానవ మనుగడకు, పురోగతికి మూలం శ్రమ. సమాజ పరిణామ క్రమంలో మనుషుల మధ్య అంతరాలకు ప్రధాన కారణం సంపద కొంత మంది వద్దే పోగుబడుతుండడంతో అత్యధికులు పేద, మధ్య తరగతులుగా అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. అలాంటి వర్గాలకు ఎంతోకొంత ఊతంగా ప్రజాస్వామిక ప్రభుత్వాలు అమలు చేస్తున్నవే సంక్షేమ పథకాలు. ఆ కోవలోవే అంగన్వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన పథకం, ఆశా వర్కర్ల వ్యవస్థ. అయితే..ఆ కనీస శ్రేయస్సుకు శ్రమించే వ్యవస్థలనూ నిర్వీర్యం చేసి, ఆ వ్యవస్థల్లో పని చేసే శ్రామికుల జీవితాలను చీకటిలోకి నెట్టజూస్తోంది చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం. అలాగే ఎంవీ యాక్ట్‌లో సవరణల పేరుతో లక్షలాదిమంది ట్రాన్స్పోర్ట్ కార్మికులను వేధింపులకు గురిచేసే దిశగా అడుగులు వేస్తోంది. నిధుల మళ్లింపుతో భవన నిర్మాణ కార్మికుల శ్రేయస్సుకు భంగం కలిగిస్తోంది. పారిశుద్ధ్య కార్మికుల జీవితాలనూ ఊబిలోకి నెడుతోంది. సర్కారు కర్కశ వైఖరికి నిరసనగా బడుగుజనం పిడికిళ్లు బిగుసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఏకమవుతున్న శ్రామిక శక్తి ఈ నెల మూడున చలో కలెక్టరేట్ పేరుతో ముట్టడికి పూనుకుంటోంది. ఈ నేపథ్యంలో వారి సమస్యలు, వేదనలు, డిమాండ్లపై ప్రత్యేక కథనం.. -కపిలేశ్వరపురం (మండపేట) వేలాదిమంది స్కీం వర్కర్లు.. జిల్లాలో ఆశ వర్కర్లు 4,000 మంది, సెకండ్ ఏఎన్ఎంలు 700 మంది, టీబీ కంట్రోల్ ప్రోగ్రాం సిబ్బంది 150 మంది, 24 గంటల పీహెచ్‌సీల్లో స్టాఫ్ నర్సులు, కంటింజెంట్ వర్కర్లు 140 మంది, హెచ్ఐవీ రోగులకు సేవలందించే ఏపీ సాక్స్‌లో కౌన్సిలర్లు, స్టాఫ్‌నర్సులుగా 100 మంది, అప్పుడే పుట్టిన శిశువుల సంరక్షణ నిమిత్తం కాకినాడ, రాజమండ్రి, రంపచోడవరంలలోని ఎస్ఎన్ కేర్ యూనిట్స్, ఎన్ఆర్సీలలో స్టాఫ్ నర్సులు, సెక్యూరిటీ గార్డులుగా 100 మంది, ఆయుర్వేదం, యునానీ, హోమియో వైద్య సేవలందించే ఆయుష్ విభాగంలో 100 మంది, ఆర్బీఎస్కే పథకం వైద్యులు, స్టాఫ్‌నర్సులు, ఫిజియో థెరపిస్టులుగా 200 మంది, హెల్త్ మిషన్ కార్యాలయాల్లో ఉద్యోగులుగా పది మంది, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్‌లో 150 మంది, వైద్యాధికారులుగా 200 మంది, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులుగా 8,000 మంది, 5,200 అంగన్వాడీ కేంద్రాలున్న ఐసీడీఎస్‌లో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలుగా 10,500 మంది, మినీ వర్కర్లుగా 200 మంది సేవలందిస్తున్నారు. ప్రీ స్కూల్స్ పేరుతో అంగన్వాడీ కేంద్రాల మూసివేత దిశగా.. చంద్రబాబు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను ఎత్తివేసే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. జిల్లాలోని కేంద్రాల్లో సుమారు 10,500 మంది కార్యకర్తలు, ఆయాలుగా పనిచేస్తున్నారు. తెలంగాణలో కార్యకర్తకు రూ.10 వేలు, ఆయాకు రూ.8 వేలు ఇస్తుండగా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కార్యకర్తకు రూ.7 వేలు, ఆయాకు రూ.4 వేలు వేతనంగా ఇస్తున్నారు. మూడు నెలలుగా జీతాలు, ఐదు నెలలుగా కేంద్రాల అద్దె బిల్లు, ఏడాదిగా పుల్లల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాలను ఎత్తేసి ప్రీ స్కూల్స్‌గా మార్చి కార్యకర్తలు, ఆయాలను క్రమ క్రమంగా తొలగించాలనే కుట్ర జరుగుతోందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో కేంద్రాలను మూసేశారు. రూ.4 వందలతో నెట్టుకొస్తున్న ఆశ వర్కర్లు జిల్లాలో సుమారు నాలుగు వేల మంది వరకూ ఉన్న ఆశ వర్కర్లను గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య, వైద్య సదుపాయాలను దగ్గర చేసేందుకు ఉనికిలోకి తీసుకొచ్చారు. తీరా వీరికి ప్రభుత్వం ఏ విధమైన వేతనాన్నీ ఇవ్వడంలేదు. గర్భిణిని ఆసుపత్రికి తీసుకెళ్ళినప్పుడల్లా కొంత సొమ్ము ముట్ట చెబుతుండటంతో నెలంతా కష్టపడినా వీరికి రూ.నాలుగు వందల నుంచి రూ. వెయ్యి వరకూ కూడా రాని దుస్థితి. తెలంగాణలో వీరికి రూ.ఆరువేల వేతనాన్ని చెల్లిస్తున్నారు. మధ్యాహ్న భోజన నిర్వాహకుల మెడపై వేలాడుతున్న కత్తి ప్రభుత్వం ఇచ్చేది అరకొరే అయినా అప్పు చేసో, అరువు తెచ్చో బడి పిల్లలకు అన్నంపెడుతున్న మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల మెడపై ఏజెన్సీ ఎత్తివేత కత్తి వేలాడుతోంది. పాఠశాలల్లో వంట చేసి వడ్డించే పద్ధతికి బదులు 25,000 మంది పిల్లలకు ఒక కేంద్రంగా డివిజన్ స్థాయిలో వంటశాల ఏర్పాటు చేసి అక్కడే అన్నం వండి పాఠశాలలకు తీసుకెళ్లి వడ్డించే పద్ధతికి చంద్రబాబు తెరతీశారు. అలా చేస్తే జిల్లాలో ఏజెన్సీలను నిర్వహిస్తున్న సుమారు ఎనిమిది వేల మంది ఉపాధిని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీరికి తమిళనాడులో రూ.ఐదు వేల వేతనాన్ని ఇస్తుండగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రూ.750, రాష్ట్ర ప్రభుత్వం రూ.250 వెరసి రూ.వెయ్యి మాత్రమే ఇస్తున్నారు. నిధుల మళ్ళింపుతో సంక్షేమం కుదింపు భవన నిర్మాణానికి మట్టి తీసే కూలి నుంచి పూర్తయ్యాకా రంగు వేసే కార్మికుని వరకూ 33 రకాల పనులు చేసేవారు భవన నిర్మాణ కార్మికుల జాబితాలోకి వస్తారు. జిల్లాలో ఈ పనివారు సుమారు ఐదు లక్షల మంది ఉన్నారు. 318/2011 నంబరుగల కేసులో 2013 నవంబరులో సుప్రీంకోర్డు ఇచ్చిన తీర్పు ప్రకారం కార్మికుల సంక్షేమ బోర్డులోని నిధులు వారి కోసమే ఖర్చు చేయాలని తీర్పు చెప్పినా చంద్రబాబు తన పేరుమీద పథకాలను ప్రవేశపెట్టి, వాటి నిర్వహణ కోసం ఈ నిధులను మళ్ళిస్తున్నారు. దీంతో భవన నిర్మాణ కార్మికులకు చెల్లించాల్సిన క్లెయిమ్స్ పరిష్కారంలో తీవ్ర జాప్యమవుతోంది. మలినం ఎత్తిపోసే వారిపైనా కొరవడ్డ కనికరం.. జిల్లాలో 1100 పంచాయతీలు, ఏడు మున్సిపాలిటీలున్నాయి. వాటి పరిధిలో వేలాది మంది కార్మికులు క్షేత్ర స్థాయిలో విశేష సేలందిస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో సుమారు మూడు వేల మంది కాంట్రాక్టు, టెండరు, ఎన్ఎంఆర్ పద్ధతుల్లో పారిశుద్ధ్య, ట్యాంక్వాచర్, బిల్ కలెక్టరు, ఎలక్ట్రీషియన్లుగా పనిచేస్తున్నారు. వీరు రూ.వెయ్యి నుంచి రూ.ఏడు వేల లోపే జీతంగా అందుకుంటున్నారు. 2016 ఆగస్టులో జారీ చేసిన జీవో :151 ప్రకారం స్వీపర్లకు రూ.12 వేలు, ఇతర కార్మికులకు రూ.17 వేల వరకూ ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇచ్చే కొద్దిపాటి జీతం కూడా నెలలు తరబడి »బకాయిలు పెడుతున్నారు. ఆదాయం ప్రభుత్వానికి.. శిక్షలు డ్రైవర్లకి.. కేంద్ర ప్రభుత్వం మోటారు వెహికల్ చట్టంలో తీసుకొచ్చిన సవరణలు డ్రైవర్ల పాలిట సమ్మెటలుగా మారాయి. ట్రాన్స్‌పోర్టు రంగం ద్వారా సమకూరే రూ. కోట్ల ఆదాయం ప్రభుత్వాలకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు డ్రైవర్లనే బాధ్యుల్ని చేస్తూ శిక్షలను తీవ్రతరం చేయడం ఈ సవరణల్లో స్పష్టంగా ఉంది. దీంతో జిల్లాలోని వేలాది మంది డ్రైవర్లు ఆందోళనలో ఉన్నారు. శ్రామికుల డిమాండ్లు ఇవే.. -వివిధ పథకాల నిర్వహణకు నిధులు కేటాయించి ప్రభుత్వమే నిర్వహణ చేపట్టాలి. -ప్రభుత్వ పథకాల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, క్యాజువల్, డైలీ వేజ్, వర్క్చార్జ్,డ్ పార్ట్ టైం పద్ధతుల్లో పనిచేస్తున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పీఎఫ్, ఈఎస్ఐ, పింఛను సౌకర్యాలన్నీ కల్పించాలి. -పెరిగిన ధరలకు అనుగుణంగా రూ.18 వేల కనీస వేతనం ఇవ్వాలి. -మోటారు వెహికల్ చట్టంలోని ప్రమాదకర సవరణలను ఉపసంహరించుకోవాలి. -చంద్రన్న బీమా పథకానికి మళ్ళించిన రూ.241 కోట్లను భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుకు తిరిగి చెల్లించాలి. -భవన నిర్మాణ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లను సత్వరం పరిష్కరించాలి. -అంగన్వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీల ఎత్తివేత ఆలోచనను మానుకోవాలి. -పారిశ్రామికవాడల్లో పనిచేస్తున్న కార్మికులకు తగిన సదుపాయాలు కల్పించి, శ్రమకు తగిన వేతనం చెల్లించాలి. చాకిరీ ఎక్కువ, జీతం తక్కువ.. వివిధ రంగాల్లో పనిచేస్తున్న శ్రామిక మహిళలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. వారి జీవనోపాధిని దెబ్బతీసే విధంగా చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తోంది. అందుకే చలో కలెక్టరేట్ ఉద్యమం పేరిట కలెక్టరేట్‌ను ముట్టడిస్తున్నాం. -జి.బేబిరాణి, శ్రామిక మహిళ సంఘం రాష్ట్ర నాయకురాలు, కాకినాడ చంద్రన్న పథకానికి మా నిధులు.. చంద్రబాబు తన సొంత పేరుతో రూపొందించిన చంద్రన్న బీమా పథకానికి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు చెందిన నిధులను మళ్ళిస్తున్నారు. ఈన్ని ఆందోళనల ద్వారా ప్రజల్లోకెళ్ళి ప్రభుత్వ విధానాలను ఎండగడతాం. -చెక్కల రాజ్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ -
నజియాభానుది ముమ్మాటికీ హత్యే
కుటుంబ సభ్యుల ఆరోపణ మృతదేహంతో పోలీస్‌స్టేషన్ ముట్టడికి యత్నం అత్తింటివారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ మడకశిర : వివాహిత నజియాభాను (23)ది ఆత్మహత్య కాదని ముమ్మాటికే హత్యేనని పుట్టింటివారు ఆరోపించారు. ఆమె మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతదేహంతో ఆందోళనకు దిగారు. మడకశిరకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ సిరాజ్ కుమార్తె నజియాభానుకు పట్టణంలోనే ఆరేపేటలో నివాసముంటున్న కలీమ్‌తో రెండేళ్ల కిందట వివాహమైంది. కొంతకాలం సంసారం సాఫీగానే సాగింది. ఆ తర్వాత నుంచి భార్యాభర్తల మధ్య కలహాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో నజియాభాను ఆదివారం అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఈ ఘటన అనంతరం భర్త, అత్త,మామలు పరారయ్యారు. అదనపు కట్నం కోసం అత్తింటి వారే హతమార్చి.. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారని నజియాభాను కుటుంబ సభ్యులు, వందలాదిమంది బంధువులు సోమవారం పోస్టుమార్టం గది, గేటు వద్ద ఆందోళన చేశారు. అనంతరం మృతదేహంతో పోలీసుస్టేషన్‌ను ముట్టడించేందుకు వెళుతుండగా ఎస్ఐ మక్బూల్‌బాషా అడ్డుకున్నారు. దీంతో వారు మాత్రమే స్టేషన్‌వద్దకు వెళ్లి ఆందోళన కొనసాగించారు. ఆర్టీసీ డ్రైవర్ సిరాజ్ మాట్లాడుతూ తన కూతురును అదనపు కట్నం కోసం అల్లుడు వేధించేవాడని ఆరోపించారు. వారం క్రితమే ద్విచక్రవానం కొనుగోలుకు రూ.70వేలు ఇచ్చామని, అంతకుముందు రెండు, మూడు దఫాలుగా రూ.80వేల దాకా సర్దుబాటు చేశామని చెప్పారు. కట్నం దాహంతో నిండు ప్రాణాన్ని బలిగొన్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పెనుకొండ డీఎస్పీ సుబ్బారావు మడకశిరకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలి
కోదాడఅర్బన్: ప్రభుత్వ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 30న ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లపు శ్రీనివాస్ కోరారు. ఆదివారం కోదాడ పట్టణంలోని ఎస్టీ బాలుర వసతిగృహంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు నునావత్ రవి, సాయి, నగేష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి ఇంటి ముట్టడి
40 మందిని అరెస్టు చేసి ఠానాకు తరలింపు కరీంనగర్ హెల్త్ : తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని కోరుతూ 34 రోజులుగా సమ్మె చేస్తున్న రెండవ ఏఎన్ఎంలు శనివారం కరీంనగర్‌లోని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇంటిని ముట్టడించారు. స్థానిక కోర్టు చౌరస్తా నుంచి మంత్రి ఇంటి వరకు ర్యాలీగా వెళ్లి బైఠాయించారు. అప్పటికే మంత్రి ఇంటివద్ద బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు ఎన్‌ఎంలను అడ్డుకున్నారు. లోనికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తర్వాత మరికొంత వచ్చి ఆందోళన చేయడానికి ప్రయత్నించగా వారిని కూడా అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. ఈ సందర్భంగా ఏఎన్ఎంలు మాట్లాడుతూ... తమ సమస్యలు పరిష్కరించాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. నెల రోజులు దాటినా కనీసం చర్చలకు కూడా పిలువలేదని విమర్శించారు. పదేళ్లుగా పది వేల వేతనానికి పనిచేస్తున్నామని, పెరుగుతున్న ధరలతో జీవించడం చాలా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు 10వ పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని, హమీ ప్రకారం ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. -
ఎంపీడీవో కార్యాలయం ముట్టడి
కర్నూలు: 2014-15 సంవత్సరానికి గాను ఇన్పుట్ సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని రైతు సంఘం నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం కర్నూలు జిల్లా తుగ్గలిలోని ఎంపీడీవో కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. ఇన్పుట్ సబ్సిడీని వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి రమేష్‌కుమార్, పలువురు నాయకులు, రైతులు పాల్గొన్నారు. -
విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన రైతులు
తుని: తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తేటగుంట విద్యుత్ సబ్‌స్టేషన్‌ను స్థానిక రైతులు శుక్రవారం ముట్టడించారు. నాలుగు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నీరందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా స్పందించకపోవడంతో శుక్రవారం సుమారు 100 మంది రైతులు సబ్ స్టేషన్‌ను ముట్టడించారు. అయితే, సరఫరాను వెంటనే పునరుద్ధరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. -
3న అసెంబ్లీ ముట్టడి
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనపై అసెంబ్లీలో ఓటింగ్ జరపాలని డిమాండ్ చేస్తూ విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో జనవరి 3న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నట్లు విశాలాంధ్ర మహాసభ జిల్లా కన్వీనర్ మామిడి అప్పలనాయుడు తెలిపారు. ఈ కార్యక్రమానికి సమైక్యవాదులందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక పంచాయతీరాజ్ చాంబర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పది కోట్ల మంది తెలుగు ప్రజల భవిష్యత్‌కు సంబంధించిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై తప్పనిసరిగా ఓటింగ్ జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తే తీవ్రవాదం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమానికి అధిక సంఖ్యలో సమైక్యవాదులు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో ఐ. కిశోర్, వినోద్, తదితరులు పాల్గొన్నారు.