తమిళసినిమా: అత్యాచారాలకు వ్యతిరేకించే ఇతివృత్తంతో తెరపై ఆవిష్కరిస్తున్న చిత్రం నరివేట్టై అని ఆ చిత్ర దర్శకుడు ఆకాశ్ సుధాకర్ తెలిపారు. ఈయన హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని చానల్ ఆకాశ్ స్డూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. కథానాయకిగా మహాలక్ష్మి పరిచయం అవుతున్న ఇందులో నెల్లైశివ, బోండామణి, కింగ్‌కాంగ్, కిళిముక్కు రామచంద్రన్ ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు.
శరవణన్ సంగీతాన్ని, చార్లెల్‌తానా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల స్థానిక టీ.నగర్‌లోని ఎంఎం.థియేటర్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యల కోసం తనదైన శైలిలో పోరాడుతున్న ట్రాఫిక్ రామస్వామి అతిథిగా పాల్గొని ఆడియోను ఆవిష్కరించారు. నటులు నిజజీవితంలోనూ నటిస్తున్నారు.
ఆయన మాట్లాడుతూ ఇప్పుడు కొందరు నటులు నిజజీవితంలోనూ నటిస్తున్నారని, తాను సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఒంటరిగా పోరాడుతున్నానని అన్నారు. అలా కాకుండా అందరూ కలిసి పోరాడాలని తాను చాలా కాలంగా ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తున్నట్లు అన్నారు. ఈ నరివేట్టై చిత్రం ఇలాంటి అంశంతోనే రూపొందించినట్లు చెప్పారు. మంచి సందేశంలో కూడిన నరివేట్టై చిత్రం ప్రేక్షకాదరణను పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన అన్నారు.
అనంతరం చిత్ర దర్శక, కథానాయకుడి అశోక్‌సుధాకర్ చిత్ర వివరాలను తెలుపుతూ ఇది అత్యాచారాలను వ్యతిరేకించే ఇతి వృత్తంతో తెరకెక్కిస్తున్న చిత్రం అని తెలిపారు. నలుగురు కామాంధులు ఒక యువతిపై అత్యాచారానికి పాల్పడతారన్నారు. అలాంటి యువతి పరిస్థితి ఏమిటి. ఆ నలుగురు మానవ మృగాలేమయ్యారు? లాంటి ఆసక్తికర అంశాలతో రూపొందించిన చిత్రం నరివేట్టై అని తెలిపారు. చిత్ర షూటింగ్‌ను ఏలగిరి, కృష్ణగిరి, ధర్మవరం, తిరువళ్లూర్, కాంచీపురం, చెన్నై ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు తెలిపారు. ఇం దులో నాలుగు పాటలు చార్లెస్ తానా చక్కని బాణీలతో రూపొందించారని చెప్పారు.