మహబూబాబాద్ రూరల్: పాముకాటుతో నాలుగేళ్ల చిన్నారి మృతిచెందింది. వరంగల్ జిల్లా మానుకోట మండలం సికింద్రాబాద్ తండాకు చెందిన ధర్మారపు సురేష్-సులోచన పెద్ద కుమార్తె మహాల క్ష్మి(4) గురువారం రాత్రి నానమ్మ పద్మ ఇంటికి వెళ్లింది. ఇంతలో అటువైపుగా వచ్చిన కట్లపాము వచ్చి చిన్నారిని కాటువేసింది. ఇది గమనించిన స్థానికులు చిన్నారిని హుటాహుటిన మానుకోట ఏరియూ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మహాలక్ష్మి మృతిచెందింది.