
సాక్షి, జోగిపేట(అందోల్): అభం శుభం తెలియని ఆ చిన్నారిని ఆడుకుంటున్న ఇంటిగేటే ప్రాణం తీసింది. పోలీసుల కథనం మేరకు.. అందోల్ మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నీరుడి మల్లేశం, మంజుల దంపతులు. వారికి కూతురు, కుమారుడు రోహిత్(5) ఉన్నారు. ఆదివారం రాత్రి బాలుడు సరదాగా ఇంటి గేట్‌ను పట్టుకొని వేలాడుతూ ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో గేట్‌కు బిగించి ఉన్న దిమ్మె ఒక్కసారిగా కూలి అతడి తలపై పడిపోయింది.
దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్ల ముందే ఆడుకుంటున్న కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలుడి మృతిపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment