kid died
-
బడికి పోయినా బతికెటోడు..
పాపం.. ఆ చిన్నారి బడికి పోయినా బతికెటోడు. మాయదారి మృత్యువు మాటువేసి కాటువేసింది. పాఠశాలకు వెళ్లకుండా చిన్నారిని ఏమర్చి తండ్రితో వస్తాయని మారం చేయించింది. ఈ విషయంలో తండ్రితో కూడా సరేననిపించి చివరకు రోడ్డు ప్రమాద రూపంలో అమాంతం బలితీసుకుంది. ఫలితంగా ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. జనగామ: ఎండు మిర్చిని విక్రయించేందుకు తండ్రితో కలిసి వెళ్లిన కొడుకు.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన జనగామ మండలం పెంబర్తి కాకతీయ కళాతోరణం సమీపంలో జరిగింది. ఎస్సై తిరుపతి కథనం ప్రకారం రఘునాథపల్లి మండలం నక్కబొక్కలతండా శివారు సోమయ్య కుంట తండాకు చెందిన గుగులోత్ తిరుపతి, గంగా దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉంది. తిరుపతి తన సొంత ఆటోలో ఎండు మిర్చితో పాటు సీజనల్ వ్యాపారాలు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఊరూరా తిరిగి ఎండు మిర్చి విక్రయించేందుకు బయలుదేరగా.. పెద్ద కుమారుడు ఈశ్వర్ (07) తండ్రితో వెళ్తానని మారం చేయడంతో వెంట తీసుకెళ్లాడు. పటేల్ గూడెంలో ఎండు మిర్చి అమ్ముకుని... పెంబర్తి కాకతీయ కళాతోరణం సమీపంలో ఆలేరు వైపునకు యూటర్న్ చేసుకుంటున్న సమయంలో హైదరాబాద్ నుంచి వస్తున్న కారు.. ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో తండ్రితో కలిసి ముందు సీటులో కూర్చున్న ఈశ్వర్ అక్కడిక్కడే మృతి చెందగా.. తిరుపతికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అదే కారులో ఈశ్వర్‌తో పాటు తిరుపతిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి బాలుడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించగా, తండ్రికి వైద్య పరీక్షలు చేశారు. కాగా, తమ కుమారుడు మృతి చెందాడని తెలియగానే తల్లిదండ్రులు కుప్ప కూలిపోయారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రికి చేరుకోవడంతో రోదనలు మిన్నంటాయి. జిల్లా కేంద్రంలోని అరబిందో స్కూల్లో ఒకటో తరగతి చదువుకుంటున్న ఈశ్వర్.. బడికి వెళ్లినా బతికెటోడేమోనంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. -
భారీ వర్షాలు.. పసిబిడ్డను ఎత్తుకొని రైలు దిగిన తండ్రి, పట్టుతప్పడంతో
ముంబై: మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తోన్న కారణంగా కళ్యాణ్ - ఠాకుర్లి మధ్య ప్రయాణిస్తున్న లోకల్ రైలు వంతెన మీద నిలిపివేశారు. ఇదే సమయంలో నాలుగు నెలల పసికందును పట్టుకుని ఓ తండ్రి రైలు దిగారు. అక్కడే నిలబడి ఆడిస్తూ ఉండగా చేతులు పట్టుతప్పడంతో బిడ్డ వంతెన కింద కాలువలోకి జారిపోయింది. స్థానిక రైల్వే సిబ్బంది చాలాసేపు గాలింపు చర్యలు చేపట్టినా కాలువలో వరద ప్రవాహం వేగంగా ఉండటంతో ఫలితం లేకపోయింది. దేశవ్యాప్తంగా నైరుతి పవనాల ప్రభావంతో ఒక్కసారిగా వర్షాలు విరుచుకు పడుతున్నాయి. ఇప్పటికే ఉత్తరాదిన అనేక ప్రాంతాలు వర్షాల ఉధృతికి జలమయం కాగా ముంబైలో కూడా వర్షాలు తారాస్థాయికి చేరాయి. గత కొద్ది రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు ముంబై అతలాకుతలమైంది. అయినా కూడా జనం జీవనాన్ని యధాతధంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే బుధవారం ముంబైలో ఘోరం జరిగిపోయింది. కళ్యాణ్ - ఠాకుర్లి మధ్య ప్రయాణిస్తోన్న లోకల్ రైలు భారీ వర్షం కారణంగా రెండు గంటల పాటు ఒక వంతెన మీద నిలిచిపోయింది. రైలులోని వారంతా రైలు ఎప్పుడు కదులుతుందా అని సుదీర్ఘంగా నిరీక్షిస్తూ ఉన్నారు.అంతలో ఓ పసిబిడ్డకు అసౌకర్యంగా ఉందనో ఏమో ఆ తండ్రి నాలుగు నెలల పసికందును ఆడించేందుకు రైలు దిగారు. పట్టాలు పక్కన అలా ఆడిస్తూ ఉండగా చేతులు పట్టుతప్పి బిడ్డ జారి కాలువలో పడిపోయింది. వెంటనే బిడ్డ తల్లి కిందకు దిగి.. కళ్ళ ముందు కాలువలో కొట్టుకుపోయిన బిడ్డ కోసం చేసిన ఆర్తనాదం చూపరుల హృదయాలను కలచివేసింది. Tragedy struck as a 4-month-old baby drowned in a nullah after slipping from his father's grasp. The parents had been stranded on a local train between Kalyan and Thakurli &while walking along the tracks, their little one slipped and fell into the nullah. Heartbreaking incident! pic.twitter.com/RAlN2lpPoU — Richa Pinto (@richapintoi) July 19, 2023 ఇది కూడా చదవండి: ఇకపై కుక్కలకు కూడా ఆధార్ కార్డు -
బాపట్లలో విషాదం: చెట్టు మీదే ప్రాణం విడిచిన చిన్నారి
సాక్షి, బాపట్ల: జిల్లాలో ఆదివారం విషాదకర ఘటన చోటు చేసుకుంది. కొరిశపాడు మండలం దైవాల రావూరులో ఆటాడుకుంటూ విద్యుత్ తీగలు తగిలి ఓ చిన్నారి చెట్టు మీదే కన్నుమూశాడు. మరో చిన్నారి ఈ ఘటనలో గాయపడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు ఆదివారం కావటంతో.. స్థానికంగా ఉన్న సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న చెట్టు మీద ఎక్కి ఆడుకుంటున్నారు. ఈ తరుణంలో.. చెట్టు మధ్యలో ఉన్న కరెంటు తీగలు గమనించక ముందుకు వెళ్లారు. దీంతో విద్యుద్ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు ఓ చిన్నారి. ఇక మరో చిన్నారి కరెంట్ షాక్ దెబ్బకు కింద పడిపోయి గాయాలపాలయ్యాడు. మృతి చెందిన చిన్నారి గడ్డం బుజ్జి కుమారుడు అఖిల్ గా స్థానికులు గుర్తించారు. మరొక బాలుడిని చికిత్స నిమిత్తం మేదరమెట్ల లోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రాణం విడిచి చెట్టు మీదే పడి ఉన్న చిన్నారి అఖిల్ మృతదేహం చూసి గ్రామస్తులంతా విలపించారు. -
Cardiac Arrest: నిద్రలో ఉలిక్కిపాటు.. చిన్నారి గుండె ఆగింది!
చిన్నాపెద్దా తేడా లేదు. ఎలాంటి అనారోగ్యమూ ఉన్నట్లు కనిపించదు. కానీ, ఉన్నట్లుండి గుండె ఆగిపోయి ప్రాణాలు పోతున్నాయి. నిత్యం దేశంలో ఏదో ఒక మూల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఉన్నట్లుండి కుప్పకూలి మరణిస్తున్నారని వినడం పరిపాటిగా మారింది. దీనికి కారణాలపై రకరకాల చర్చలు జరుగుతున్నా.. సకాలంలో సమస్యను(చిన్నదైనా సరే) గుర్తించకపోవడమే అసలైన కారణమని అంటున్నారు వైద్య నిపుణులు. తాజాగా.. కర్ణాటకలో పన్నెండేళ్ల చిన్నారి కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూశాడు. కుశాల్‌నగర్‌లో కూడుమంగళూరు గ్రామంలో ఆదివారం వేకువ ఝామున ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. నిద్రలోనే ఉలిక్కిపడి లేచి విలవిలలాడిన చిన్నారి.. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే కన్నుమూశాడు. బాధితుడిని కొప్పాలో ఓ ప్రైవేట్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న కీర్తన్‌గా గుర్తించారు. శనివారం సాయంత్రం ఆడుకుని ఇంటికి వచ్చిన చిన్నారి.. భోజనం చేసి పడుకున్నాడు. అయితే.. నిద్రలో ఉలిక్కిపడి లేచి ఏడ్వడం మొదలుపెట్టాడు. ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే మార్గం మధ్యలోనే ఆ చిన్నారి కన్నుమూశాడు. కీర్తన్ తండ్రి మంజాచారీ.. కొడుకు చదివే స్కూల్లోనే వ్యాన్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పన్నెండేళ్లకే ఆ చిన్నారికి నూరేళ్లు నిండడంతో స్థానికంగా విషాదం అలుముకుంది. Cardiac Arrest: ఇలా చేస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు.. -
అప్పటి వరకు సరదాగా ఆడుకున్నాడు.. అంతలోనే..
సాక్షి, జోగిపేట(అందోల్): అభం శుభం తెలియని ఆ చిన్నారిని ఆడుకుంటున్న ఇంటిగేటే ప్రాణం తీసింది. పోలీసుల కథనం మేరకు.. అందోల్ మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నీరుడి మల్లేశం, మంజుల దంపతులు. వారికి కూతురు, కుమారుడు రోహిత్(5) ఉన్నారు. ఆదివారం రాత్రి బాలుడు సరదాగా ఇంటి గేట్‌ను పట్టుకొని వేలాడుతూ ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో గేట్‌కు బిగించి ఉన్న దిమ్మె ఒక్కసారిగా కూలి అతడి తలపై పడిపోయింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్ల ముందే ఆడుకుంటున్న కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలుడి మృతిపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
బాలుడి మృతి.. తల్లి పైనే అనుమానం...
సాక్షి, పశ్చిమ గోదావరి: చిన్నారి ఎంతగానో ఇష్టపడి తిన్న ఆ చాక్లెట్ అతని ప్రాణాలను తీస్తుందని ఊహించలేదు. అతనితో పాటు ఆ చాక్లెట్స్ తిన్న మరో ఇద్దరు చిన్నారులు కూడా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లారు. ఈ విషాద సంఘటన పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం కోయరాజమండ్రి పంచాయతీ కి చెందిన రావిగూడెం అనే గిరిజన గ్రామంలో చోటు చేసుకుంది ... బాలుడి తల్లి తెలిపిన వివరాలప్రకారం .. కురసం అభయ్ చరణ్ తేజ్ (5) అనే బాలుడు ఎప్పటిలాగే ఆదివారం సాయంత్రం తన ఇంటికి సమీపంలోని ఓ కొట్టు వద్ద నుండి తెచ్చిన చాక్లెట్స్ ని తన స్నేహితులతో కలసి తిన్నాడు. అనంతరం ఇంట్లో వండిన చేపల కూరతో భోజనం చేసి ఆడుకోడానికి బయటకు వెళ్ళాడు కొద్దిసేపటికి ఒక్కసారిగా నోట్లో నుంచి నురగలు వస్తూ పడిపోయాడు, బాలుడు ఏమి మాట్లాడలేని స్థితిలో ఉండటంతో చేపల కూరలో చేప ముల్లు గొంతులో అడ్డుపడిందేమో నని తల్లి అనుమానం వ్యక్తం చేస్తూ స్థానికుల సహాయంతో బుట్టాయగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి సీరియస్ గా ఉండటంతో ఏలూరు ఆస్పత్రికి తీసుకువెళుతుండగా మార్గ మద్యంలో అభయ్ చరణ్ తేజ్ మృతి చెందినట్లుగా తెలిపారు. ఇదిలా ఉండగా అభయ్ చరణ్ తేజ్ చాక్లెట్ తింటూ ఆడుకుంటున్న సమయంలో మాకు పెట్టమని అడిగి తీసుకుని తిన్నామరో ఇద్దరు చిన్నారులు కట్టం సంతోష్(7),మడకం రాహుల్ వర్మ(6) లు కూడా అస్వస్థత కు గురికావడంతో వారిని జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి కి తరలించగా వారు అక్కడ చికిత్సపొందుతున్నారు. తల్లి పైనే స్థానికుల అనుమానం... ఆదివారం సాయంత్రం అభయ్ చరణ్ తేజ్ (5) తిన్న చాక్లెట్ లో ఎలుకల మందు కలిసిందని అది తిన్న బాలుడు మృతి చెందాడని తెలిపారు. దీనిపై బాలుడు తల్లిపైనే వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ధి కాలంగా భార్య భర్తలు ఇద్దరు దూరంగా ఉంటున్నారని,కొడుకు అభయ్ చరణ్ తేజ్ మాత్రం తల్లి వద్దే ఉంటున్నాడని ఈ క్రమంలో కొడుకును అడ్డు తొలగించుకోవడం కోసం తల్లి ఇలా ప్లాన్ చేసిందా అనే అనుమానం కలుగుతుందని స్థానికులు తెలిపారు. గతంలో కూడా ఇలాగే అస్వస్థకు గురి కావడంతో బుట్టాయగూడెం ఆస్పత్రికి తీసుకు వెళ్లగా ప్రాణాపాయం తప్పిందని తిరిగి మళ్ళీ అదే విధంగా జరగడం అనేక అనుమానాలకు తావిస్తోందని వారు తెలుపుతున్నారు. కాలం చెల్లిన చాక్ లెట్స్ అని ప్రచారం జరుగుతుందని ఇందులో నిజం లేదని అదే జరిగితే చాల మంది పిల్లలకు ఇలాగే జరగాలని వారు తెలిపారు. పలు అనుమానాలకు తావిస్తున్న చిన్నారి మరణం అసలు మిస్టరీ వీడాలంటే పోస్ట్ మార్టం నివేదిక రావాల్సి ఉంది. నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న బుట్టాయగూడెం పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్తున్నారు. -
ఆ తల్లికి క్యాబ్ డ్రైవర్ ఐదు గంటల నరకం!
న్యూఢిల్లీ: ఢిల్లీలోని నార్త్-వెస్ట్ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. ఓ క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు అతడు చేసిన మోసానికి తల్లి కళ్లముందే ఓ నాలుగేళ్ల బాలుడు నరకం అనుభవించి, మృతిచెందాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. వాయవ్య ఢిల్లీలోని ముఖర్జీ నగర్ లో ఈకో క్యాబ్ డ్రైవర్ రాహుల్(32) తన కారును నిర్లక్ష్యంగా రివర్స్ తీస్తూ ఇంటి ముందు ఆడుకుంటున్న రోహిత్ కుమార్(4)ను ఢీకొట్టాడు. వెంటనే అక్కడినుంచి తప్పించుకోవాలని ప్రయత్నించగా, స్థానికులు క్యాబ్ డ్రైవర్ ను పట్టుకుని బాబును హాస్పిటల్ కు తీసుకెళ్లాలని హెచ్చరించారు. రోహిత్, ఆమె తల్లి వాసంతి కుమారిని తన క్యాబ్ లో ఎక్కించుకున్నాడు. గంటలు గడుస్తున్నాయి.. కానీ బాబుని ఆస్పత్రిలో చేర్చడం లేదు. యాక్సిడెంట్ తాను చేశానని హాస్పిటల్ లో చెప్పవద్దని, ఎవరికైనా విషయం చెబితే చంపేస్తానని బెదిరించాడు. కుమారుడి ప్రాణం ముఖ్యమనుకున్న ఆ తల్లి అందుకు ఒప్పుకుంది. అయినా ఏదో మూల అనుమానం ఉన్న క్యాబ్ డ్రైవర్ దాదాపు నాలుగు ఆస్పత్రులకు తీసుకెళ్లాడని.. అయితే ప్రతిసారి ఒకే సమాధానం ‘ బాబును ఇక్కడ చేర్చుకోనని చెబుతున్నారు’ అంటూ చెప్పాడు. ఆ సమయంలో కుమారిడితో పాటు తాను కారులో ఉన్నానని వాసంతి తెలిపింది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము ఐదున్నర గంటల వరకు కారులో తిప్పుతూనే ఉన్నాడని, తన బిడ్డ ప్రాణాలు పోతాయని వేడుకున్నా వినలేదని తన ఫిర్యాదులో వాసంతి పేర్కొంది. బాబుతో పాటు తానూ ఐదు గంటల నరకం చూశానని తల్లి వాపోయింది. క్యాబ్ లోనే బాబు చనిపోయిన వెంటనే రోడ్డుపైనే వదిలేసి క్యాబ్ డ్రైవర్ వెళ్లిపోయాడు. శనివారం ఉదయం ఆరు గంటలకు పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి భర్త భవేశ్ కుమార్ కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పింది. భర్తతో కలిసి ఆస్పత్రికి వెళ్లగా అప్పటికే బాలుడు చనిపోయాడని డాక్టర్లు నిర్దారించారు. ’తమ్ముడు ఎక్కడున్నాడని తన మిగతా ముగ్గురు పిల్లలు అడిగితే నేను ఏం చెప్పాలి’ అంటూ రోహిత్ తల్లి వాసంతి కన్నీరుమున్నీరయింది. శనివారం రాత్రి బాలుడి తల్లిదండ్రులు తమకు ఫిర్యాదు చేశారని ఢిల్లీ నార్త్ ఈస్ట్ జోన్ డీసీపీ మిలింద్ దుంబీర్ చెప్పారు. కేసు నమోదు చేశామని, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని డీసీపీ వివరించారు. -
కారు-లారీ ఢీకొని ఒకరు మృతి
-
కారు-లారీ ఢీకొని మహిళ మృతి
హైదరాబాద్: నగర శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ చనిపోగా మరో వ్యక్తికి, ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. హయత్‌నగర్ మండలం వర్డ్ అండ్ డీడీ పాఠశాల సమీపంలో బుధవారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటన వివరాలివీ.. జీడిమెట్లకు చెందిన కె.రవిచంద్ అనే లెక్చరర్ తన భార్య రాధిక(38)కుమార్తె జాహ్నవి(14), కుమారుడు ఆదర్శ్(12)తో కలిసి విజయవాడ నుంచి కారులో వస్తున్నారు. వర్డ్ అండ్ డీడ్ స్కూలు సమీపంలో రాంగ్ రూట్లో రోడ్డు దాటుతున్న లారీని వేగంగా వచ్చిన వారి కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన నలుగురిని వెంటనే సమీపంలోని గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే రాధిక చనిపోయింది. మిగతా వారు చికిత్స పొందుతున్నారు. వారికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
ఆటో కిందపడి బాలుడి మృతి
పాపన్నపేట: ఆటో కిందపడి ఆరేళ్ల బాలుడు మృతిచెందాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొత్తపల్లిలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పుట్టి నాగరాజు(6) ఇంటి ముందు నిలిచి ఉన్న ఆటో వద్ద ఆడుకుంటున్నాడు. ఇది గమనించని డ్రైవర్ ఒక్కసారిగా ఆటోను రివర్స్ తీశాడు. దీంతో బాలుడు ఆటో వెనుక చక్రం కిందపడి మృతిచెందాడు. బాలుడి మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
అనంతలో విషజ్వరాల విజృంభణ:చిన్నారి మృతి
-
నీటితొట్టెలో పడి చిన్నారి మృతి
అశ్వరావుపేట: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తూ నీటితొట్టిలో పడి మృతిచెందింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలం గుర్రాల చెరువు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కంపసాటి పూజిత(3) ఇంటి ముందు ఆడుకుంటు వెళ్లి ప్రమాదవశాత్తు నీటితొట్టెలో పడింది. తల్లిదండ్రులు ఇది గుర్తించకపోవడంతో నీట మునిగి మృతిచెందింది. తల్లిదండ్రులు గమనించేసరికి తమ ముద్దుల కూతురు నీటితొట్టెలో శవమై కనిపించడంతో వారు కన్నీరు మున్నీరవుతున్నారు. -
చిన్నారిని చిదిమేసిన స్కూలు వ్యాన్
నిర్లక్ష్యంగా బండిని రివర్సు చేసిన డ్రైవర్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన హైదరాబాద్: ముక్కుపచ్చలారని చిన్నారిని స్కూలు బస్సు చిదిమేసింది. నాన్న వేలు విడిచి బడిలోకి అడుగు పెట్టీపెట్టగానే డ్రైవర్ నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలి తీసుకుంది. టాటా అంటూ చివరిసారిగా చెప్పిన ముద్దుముద్దు మాటలు అమ్మ చెవిలో రింగుమంటుంటే... బిడ్డను వదిలిన క్షణాల్లోనే ప్రమాద వార్త విని తండ్రి కళ్లల్లో నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధి ప్రసూననగర్‌లో నివసించే రాంరెడ్డి, సుశీల దంపతుల ఇద్దరి సంతానంలో పెద్దవాడు నాలుగేళ్ల జశ్వంత్‌రెడ్డి. న్యూవివేకానందనగర్ ‘విజ్ఞానసుధ ట్యాలెంట్ స్కూల్’లో యూకేజీ చదువుతున్నాడు. వీరి స్వస్థలం ప్రకాశం జిల్లా తుళ్లూరు మండలం తురకపాలెం. కాగా, బాచుపల్లిలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసే రాంరెడ్డి శుక్రవారం జస్వంత్‌ను స్కూల్ వద్ద వదిలి వెళ్లారు. గేటు లోపలకు వెళ్లీవెళ్లగానే ఆవరణలో రివర్స్ చేస్తున్న అదే స్కూలు వ్యాన్ (ఏపీ 28 టీఏ 3437) చిన్నారిని వెనక నుంచి ఢీకొట్టింది. అక్కడ ఉన్నవారంతా కేకలు పెడుతున్నా డ్రైవర్ పట్టించుకోకుండా వ్యాన్‌ను రివర్స్‌లో వేగంగా పోనిచ్చాడు. దీంతో బాలుడి తల, ఛాతికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని సూరారం మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. బడి వద్ద వదిలిన కొద్ది నిమిషాల్లోనే ప్రమాద వార్త విని ఆస్పత్రికి వెళ్లిన రాంరెడ్డి తన బిడ్డ శవాన్ని చూసి షాకయ్యారు. నా కొడుకు లేనిదే బతకలేనంటూ గుండెలవిసేలా రోదించిన తల్లి సొమ్మసిల్లి పడిపోయింది. వారి కడుపు శోకం చూసినవారి కళ్లు చెమర్చాయి. తల్లిదండ్రులు స్కూలు వద్ద ఆందోళనకు దిగారు. వారికి స్థానిక నాయకులు, సంఘాలవారు మద్దతు తెలిపారు. నిలువునా నిర్లక్ష్యం... ఉదయం 8.30 నుంచి 9 గంటల వరకూ విద్యార్థులు క్లాస్ రూముల్లోకి వెళతారు. ఆ సమయంలో ఆవరణలోకి స్కూలు బస్సులను అనుమతించరు. కానీ, పార్కింగ్ చేసేందుకు డ్రైవర్ శ్రీశైలం వ్యాన్‌ను రివర్స్‌లో ఆవరణలోకి తీసుకెళ్లి ప్రమాదానికి కారణమయ్యాడు. పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస్‌రెడ్డి పోలీసుల సమక్షంలో బాలుడి తల్లిదండ్రులకు రూ.5 లక్షల చెక్కును పరిహారంగా అందించారు. డ్రైవర్ శ్రీశైలంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
నొప్పుల నూనె తాగిన చిన్నారి
చికిత్స పొందుతూ మృతి హైదరాబాద్: శీతల పానీయం అనుకుని కోకాకోలా బాటిల్లో ఉన్న ఒంటి నొప్పుల ఆయుర్వేద నూనె తాగిన ఐదేళ్ల చిన్నారి మృత్యువాత పడ్డాడు. ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలివి... కృష్ణా జిల్లా నందిగామ మండలం హనుమంతపాలెంకు చెందిన కారు డ్రైవర్ పి.శ్రీనివాస్ తన ఇద్దరు భార్యలతో నగరంలోని జవహర్‌నగర్‌లో నివాసముంటున్నాడు. మొదటి భార్య ఆదమ్మ ఆధార్ కార్డు కోసం గురువారం సొంత గ్రామానికి వెళ్లగా, రెండో భార్య కవిత తన ఐదేళ్ల కుమారుడు నవీన్‌తో కలసి ఇంటి వద్దే ఉంది. ఆదమ్మ ఒంటి నొప్పుల కోసం తెచ్చుకున్న ఆయుర్వేద నూనెను కోకాకోలా బాటిల్లో పోసివుంచింది. అందుబాటులో ఉన్న ఆ బాటిల్‌ను చూసిన నవీన్ దాన్ని కూల్‌డ్రింక్ అనుకుని తాగాడు. నువ్వు కూడా తాగంటూ... బాటిల్‌ను తల్లికీ ఇచ్చాడు. కంగుతిన్న తల్లి... వెంటనే అతడిని నిలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. చికిత్స పొందుతూ నవీన్ శుక్రవారం మరణించాడు. -
లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. చిన్నారి మృతి
ఉప్పల్: వేగంగా వెళ్తున్న లారీ నాలుగేళ్ల చిన్నారిని ఢీకొట్టింది. దీంతో పాప అక్కడికక్కడే మృతిచెందింది. ఈ సంఘటన నగరంలోని ఉప్పల్ దేవేందర్ నగర్ కాలనీలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానిక కాలనీకి చెందిన చిన్నారి(4) రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా అటుగా వ్చిన ఓ లారీ ఢీకొట్టడంతో మృతిచెందింది. దీంతో స్థానికులు లారీని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. -
సంపులో పడి చిన్నారి మృతి
గుంతకల్లు రూరల్ (అనంతపురం): నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణం డోనెముక్కల రోడ్డులోని ఇందిరమ్మ కాలనీలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఆడుకుంటూ ఇంటి సమీపంలో ఉన్న చర్చి దగ్గరకు వెళ్లిన గోవర్ధన్ (2) అక్కడ నీటి నిల్వ కోసం ఏర్పాటు చేసిన సంపులో పడి మృతి చెందాడు. -
పిడుగుపాటుకి చిన్నారి మృతి
టేకులపల్లి : ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని ముర్రేడువాగులో మేకలు కాసేందుకు వెళ్లిన ముగ్గురు చిన్నారులపై పిడుగుపడింది. ఇందులో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన చిన్నారులను చికిత్స నిమిత్తం కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
కారు ఢీకొని బాలుడి మృతి
-
కారు ఢీకొని బాలుడి మృతి
కట్టంగూర్: రోడ్డు దాటుతున్న ఓ బాలుడ్ని కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలై అతడు ప్రాణాలు విడిచాడు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ శివారులోని పాత పెట్రోల్ బంక్ వద్ద ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. కొంపెల్లి గణేష్ (11) రోడ్డు దాటుతున్న నమయంలో హైదరాబాద్ వైపు వెళుతున్న కారు బాలుడిని వేగంగా వచ్చి ఢీకొంది. తీవ్ర గాయాలైన బాలుడ్ని అదే కారులో ఎక్కించుకుని హైదరాబాద్‌కు తీసుకెళుతుండగా మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ బాలుడి మృతదేహాన్ని కారులోని వారు చిట్యాల మండలం ఎలిమినేడు వరకు తీసుకెళ్లి అక్కడ పడేసి వెళ్లిపోయారు. -
గొంతులో ఇడ్లీ ఇరుక్కుని చిన్నారి మృతి
నర్వ: మురిపెంతో పెట్టిన ఇడ్లీ ముక్క ముద్దులొలికే చిన్నారి ఉసురు తీస్తుందని ఆ కన్నతల్లి ఊహించి ఉండదు. కానీ, జరగరాని ఘోరం జరిగిపోయింది. ఇడ్లీ ముక్క గొంతులో ఇరుక్కుపోవడంతో ఆ చిన్నారి ప్రాణాలు విడిచాడు. మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూరు మండలం అమరచింత పట్టణంలో బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటన చిన్నారి తల్లిదండ్రులతో పాటు స్థానికులను విషాదంలో ముంచివేసింది. వెంకటయ్య, పద్మ దంపతులకు ఐదు నెలల పృథ్వీరాజ్ సంతానం. బుధవారం ఉదయం చిన్నారికి పద్మ ఇడ్లీ తినిపించే ప్రయత్నం చేసింది. ఓ ఇడ్లీ ముక్క నోట్లో పెట్టగా గొంతులో ఇరుక్కుపోవడంతో పసివాడు విలవిలలాడిపోయాడు. చిన్నారిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళుతుండగానే తుది శ్వాస విడిచాడు. -
పాము కాటుతో చిన్నారి మృతి
మహబూబాబాద్ రూరల్: పాముకాటుతో నాలుగేళ్ల చిన్నారి మృతిచెందింది. వరంగల్ జిల్లా మానుకోట మండలం సికింద్రాబాద్ తండాకు చెందిన ధర్మారపు సురేష్-సులోచన పెద్ద కుమార్తె మహాల క్ష్మి(4) గురువారం రాత్రి నానమ్మ పద్మ ఇంటికి వెళ్లింది. ఇంతలో అటువైపుగా వచ్చిన కట్లపాము వచ్చి చిన్నారిని కాటువేసింది. ఇది గమనించిన స్థానికులు చిన్నారిని హుటాహుటిన మానుకోట ఏరియూ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మహాలక్ష్మి మృతిచెందింది. -
ఎలుకలు కొరికాయి కానీ..
శిశువు మృతికి అవే కారణం కాదు * ప్రభుత్వానికి జీజీహెచ్ సూపరింటెండెంట్ నివేదిక * నివేదికలో విభిన్న అంశాలు * పుట్టుకతోనే శిశువుకు అసాధారణ లోపం ఉంది * రెండు సార్లు మాత్రం ఎలుకలు కొరికాయి సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో శిశువుపై దాడి అభియోగం నుంచి ‘ఎలుకలను’ తప్పించే ప్రయత్నం జరిగింది. ఆస్పత్రిలో ఎలుకల సంచారం తీవ్రంగా ఉన్నప్పటికీ అవి కొరికిన కారణంగానే హృదయవిదారకరీతిలో శిశువు మృతిచెందలేదని చెప్పడానికి అధికారులు, ప్రభుత్వ పెద్దలు శతవిధాలా ప్రయత్నించారు. ఆస్పత్రిలో చేరినప్పుడే శిశువు అనేక సమస్యలతో బాధపడుతున్నాడని పేర్కొంటూ నివేదిక సమర్పించారు. మరణానికి ఎలుక లు కొరకడమే కారణం కాకపోవచ్చంటూ గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వేణుగోపాలరావు ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించారు. ఆ శిశువు ఈనెల 17వ తేదీన గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేరాడని, కన్జెనిటల్ అనామలీస్ (పుట్టుకతో వచ్చే అసాధారణ లోపం)తో ఉన్న ఆ శిశువును 18వ తేదీన సర్జరీ వార్డుకు తరలించారని నివేదికలో పేర్కొన్నారు. 20వ తేదీన శస్త్రచికిత్సకు సిద్ధం చేశారని, ఆ శిశువు పరిస్థితి అప్పటికే ప్రమాదకరంగా ఉందని, వెంటిలేటర్‌పై ఉన్నాడని నివేదికలో పేర్కొన్నారు. ఈనెల 23న శిశువు ఎడమచేతికి ఎలుకలు గాయం చేశాయని, ఈ విషయాన్ని ఇన్చార్జి ప్రొఫెసర్ డా.భాస్కరరావుకు సమాచారమిచ్చినట్టు కూడా నివేదికలో పొందుపరిచారు. అనంతరం వార్డును శుభ్రపరిచామని, అయినా ఈనెల 26 తెల్లవారుజామున 4-5గంటల మధ్యలో ఎలుకలు తిరిగి శిశువు ఛాతీపై దాడిచేశాయని పేర్కొన్నారు. ఈ రకంగా ఓవైపు ఎలుకలు కొరికిన గాయాలు ఉన్నాయని చెబుతూనే మరోవైపు కన్జెనిటల్ అనామిలీస్‌తో వచ్చిన ఈ బిడ్డ మృతికి ఎలుకలే కారణం కాకపోయి ఉండొచ్చని నివేదించారు. బుధవారం సాయంత్రం అంటే 26 వ తేదీ రాత్రి బిడ్డ మృతి చెందిన తర్వాత మంత్రులు కామినేని శ్రీనివాస్, నారాయణ తదితరులు ఆస్పత్రిని సందర్శించిన అనంతరం ఎలుకల కథ కంచికి చేరేలా ఈ నివేదిక రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవడం, వివిధ మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వార్తలు రావడం, దీన్ని మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించిన తరుణంలో ఘటన తీవ్రతను, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చాలంటూ నాయకులు ఒత్తిడి తెచ్చినట్టు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఆర్ఎంవో తదితర కిందిస్థాయి సిబ్బందిని సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. వార్డులో మరో 20 మంది చిన్నారులు ఉన్నా ఎవరినీ ఎలుకలు కొరకలేదని, అందువల్ల ఈ శిశువు కూడా ఎలుక కొరికిన కారణంగా మృతి చెంది ఉండకపోవచ్చని నివేదికలో పొందుపరిచారు. మరోవైపు శిశువు తల్లిదండ్రులు ఆస్పత్రి సిబ్బందే తమ బిడ్డ మృతికి కారణమని గొడవ చేశారని కూడా అందులో ప్రస్తావించారు. సూపరింటెండెంట్ అందించిన నివేదిక మేరకు పీడియాట్రిక్ వార్డు డ్యూటీలో ఉన్న సిబ్బంది ⇒ డా.సీహెచ్ భాస్కర్ రావు, ప్రొఫెసర్, ఇన్చార్జి హెచ్ఓడీ ⇒ డా.ఎన్‌జైపాల్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ⇒ సీహెచ్ విజయలక్ష్మి, హెడ్నర్స్ ⇒ ఎం.ఉషా జ్యోతి, స్టాఫ్‌నర్స్ ⇒ వి.విజయ నిర్మల, స్టాఫ్‌నర్స్ ⇒ జి.జయజ్యోతి కుమారి, స్టాఫ్‌నర్స్ -
శిశువు మృతికి ఎలుకలే కారణం కాదు!
పుట్టుకతోనే అసాధారణ లోపం ఉంది ఎలుకల వల్లే మృతిచెందారని అనుకోవడం లేదు 23వ తేదీన ఎడమ చేతికి ఎలుకలు కొరికిన గాట్లు గుర్తింపు 26వ తేదీన తిరిగి ఎలుకలు ఛాతీపై దాడిచేసినట్టు వెల్లడి ప్రభుత్వానికి గుంటూరు ఆస్పత్రి సూపరింటెండెంట్ నివేదిక సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఎలుకలు కొరికి మృతి చెందిన శిశువు కేసు నుంచి బయటపడేందుకు ఇటు వైద్యసిబ్బంది, అటు ప్రభుత్వ పెద్దలు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డా.వేణుగోపాల్‌రావు ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చారు. ఈనెల 17వ తేదీన విజయవాడ నుంచి గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేరారు. కన్జెనిటల్ అనామిలీస్ (పుట్టుకతో వచ్చే అసాధారణ లోపం)తో చేరిన ఈ శిశువును 18వ తేదీన సర్జరీ వార్డుకు తరలించామని, 20వ తేదీన శస్త్ర చికిత్సకు సిద్ధం చేశామని, వెంటిలేటర్‌పై ఉన్న ఆ శిశువు పరిస్థితి అప్పటికే ప్రమాదకరంగా ఉందని పేర్కొన్నారు. ఈనెల 23న శిశువు ఎడమ చేతికి ఎలుకల గాటు పడి ఉందని, ఈ విషయాన్ని ఇన్చార్జీ, ప్రొఫెసర్ డా.భాస్కర్‌రావుకు సమాచారమిచ్చామని కూడా నివేదికలో పొందుపరిచారు. అనంతరం వార్డును శుభ్రపరిచామని, అయినా దురదృష్టవశాత్తు ఈనెల 26వ తేదీ తెల్లవారుజామున 4-5గంటల మధ్యలో ఎలుకలు తిరిగి శిశువు ఛాతిపై దాడిచేశాయని పేర్కొన్నారు. ఓవైపు ఎలుకలు కొరికిన గాయాలు ఉన్నాయని చెబుతూనే మరోవైపు కన్జెనిటల్ అనామిలీస్‌తో వచ్చిన ఈ బిడ్డ మృతికి ఎలుకల గాట్లే కాకపోయి ఉండచ్చునని తెలిపారు. బుధవారం సాయంత్రం అంటే 26వ తేదీ రాత్రి బిడ్డ మృతి చెంది తీవ్రంగా వివాదంగా మారడం, అనంతరం మంత్రులు కామినేని శ్రీనివాస్, పి. నారాయణ తదితరులు ఆస్పత్రిని సందర్శించిన తర్వాత ఎలుకల కథ కంచికి చేరేలా నివేదిక మార్చినట్టు స్పష్టమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవడం, వివిధ మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వార్తలు రావడం, దీన్ని మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించిన తరుణంలో నివేదికను బలహీనపరిచేలా చేసేటట్టు నాయకులే ఒత్తిడి తెచ్చినట్టు స్పష్టమవుతోంది. ఇందులో భాగంగానే తెలివిగా ఆర్ఎంఓ తదితర కిందిస్థాయి సిబ్బందిని సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. వార్డులో మరో 20 మంది చిన్నారులు ఉన్నా ఎవరికీ ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదని, ఈ శిశువు కూడా ఎలుక కారణంగా మృతి చెంది ఉండదని చెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు శిశువు తల్లిదండ్రులు ఆస్పత్రి సిబ్బందే మృతికి కారణమని గొడవ చేశారని వెల్లడించారు. బాక్స్ పీడియాట్రిక్ వార్డు డ్యూటీలో ఉన్న సిబ్బంది వీరే.. డా.సీహెచ్ భాస్కర్ రావు, ప్రొఫెసర్, ఇన్చార్జీ హెచ్ఓడీ డా.ఎన్‌జైపాల్, అసిస్టెంట్ ప్రొఫెసర్ సీహెచ్ విజయలక్ష్మి, హెడ్నర్స్ ఎం.ఉషా జ్యోతి, స్టాఫ్‌నర్స్ వి.విజయ నిర్మల, స్టాఫ్‌నర్స్ జి.జయజ్యోతి కుమారి. -
బకెట్లో పడి చిన్నారి మృతి
మహబూబ్‌నగర్(గోపాల్పేట్): బకెట్లో పడి ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా గోపాల్పేట మండలం నాగాపూర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి, భార్గవి దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు బిట్టు(2)ను మంచం మీద పడుకోబెట్టి ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా ఈ విషాదం జరిగింది. ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తూ మంచం పక్కనే ఉన్న నీళ్ల బకెట్లో పడి మృతి చెందాడు. బాలుడు బకెట్లో పడ్డ సంగతి ఆలస్యంగా తెలియడంతో అప్పటికే ఘోరం జరిగిపోయింది. చిన్నారి బిట్టు మృతితో ఆ ఇంట్లో విషాదం నెలకొంది. -
బంతి కోసం ప్రయత్నం చిన్నారిని బలి చేసింది
జిన్నారం(మెదక్): బకెట్లో పడిన బంతిని తీసుకునేందుకు యత్నించి.. అందులో తలకిందులుగా పడిపోయిన ఏడాదిన్నర చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన మెదక్ జిల్లా జిన్నారం మండలంలో మంగళవారం జరిగింది. మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన కుమార్, రేణుక దంపతుల కుమారుడు శివ. ఏడాదిన్నర వయసున్న ఈ బాలుడు మంగళవారం ఉదయం ఇంటి ఆవరణలో బంతితో ఆడుకుంటున్నాడు. పక్కనే ఉన్న నీళ్ల బకెట్లో బంతి పడిపోయింది. కుటుంబసభ్యులంతా తమ పనుల్లో నిమగ్నమై ఉండగా బంతిని తీసుకునేందుకు బకెట్ లోని బంతిని తీసుకునేందుకు శివ ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తూ చిన్నారి తలకిందులుగా అందులో పడిపోయాడు. అరగంట తర్వాత శివ కోసం కుటుంబసభ్యులు వెతుకుతుండగా బకెట్లో విగత జీవిగా కనిపించాడు. చిన్నారి మృతదేహాం వద్ద తల్లిదండ్రులు విలపించడాన్ని చూసిన చుట్టుపక్కల వారిని ఈ ఘటన కంటతడి పెట్టించింది. -
డెంగీ వ్యాధితో బాలుడి మృతి
కర్నూలు(ఆత్మకూరు): డెంగీ వ్యాధితో ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. మండలంలోని ఇంద్రేశ్వరం గ్రామానికి చెందిన విజయ్(13)మ వారం రోజుల నుంచి డెంగీ వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. -
కారు ఢీకొని చిన్నారి మృతి
ఇటిక్యాల : రోడ్డు దాటుతుండగా ప్రమాదవశాత్తూ కారు ఢీకొని ఓ చిన్నారి మృతిచెందింది. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల మండలం కోదండపురం స్జేజ్ వద్ద మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. -
గుంతలో పడి 11 నెలల చిన్నారి మృతి
కర్నూలు (బేతంచర్ల): మురికి గుంతలో పడి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం కర్నూలు జిల్లా బేతంచర్లలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కమలాబాయి, గోపాల్ బాయిలు దంపతులు. వీరికి 11 నెలల కూతురు అఖిల ప్రియ ఉంది. అయితే వీరు మార్బుల్ పరిశ్రమలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం వీరి కూతురు అఖిల ప్రియ కూడా వీరితో పాటు వచ్చింది. వీరు పరిశ్రమలో పనిచేస్తుండగా చిన్నారి ప్రమాదవశాత్తు గుంతలో పడి మృతి చెందింది. -
బావిలో చిన్నారి మృతదేహం లభ్యం
బెల్లంపల్లి : ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం భీముని మండలం కొత్తపల్లి గ్రామంలో పాడుబడిన బావిలో మూడేళ్ల చిన్నారి మృతదేహం లభ్యమైంది. బావిలో చిన్నారి మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. భీముని పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి చిన్నారి శవాన్ని బావి నుంచి వెలికి తీయించారు. గ్రామస్తులను పాప విషయమై విచారించారు. అయితే పాప వివరాలు తెలియరాలేదు. -
కారు, ఆర్టీసీ బస్సు ఢీ..చిన్నారి మృతి
రంగారెడ్డి(మహేశ్వరం): మహేశ్వరం గేటు వద్ద శ్రీశైలం జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, స్విఫ్ట్ కారు ఢీకొన్నాయి. ఆదివారం సాయంత్రం 5 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో స్విఫ్ట్‌కారులో ప్రయాణిస్తున్న ఎనిమిదేళ్ల చిన్నారి మృతిచెందగా, మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా హైదరాబాద్ నగరవాసులని సమాచారం. -
కశ్మీర్లో మళ్లీ హింస
జమ్మూకశ్మీర్ మరోసారి ఆందోళనలతో అట్టుడికింది. శనివారం బుడ్గాం జిల్లాలోని నర్బల్లో ఆందోళనకారులపై సీఆర్పీఎఫ్ జవాన్లు జరిపిన కాల్పుల్లో ఓ బాలుడు(16) మృతిచెందడం దుమారానికి దారితీసింది. ఈ ఉదంతంలో జవాన్ల తప్పిదం ఉందంటూ పోలీసులు ఆరోపించడంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం కాల్పుల ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. కాల్పులకు సంబంధించి ఇద్దరు పోలీసులను అరెస్ట్ చేశారు. బాలుడి మృతికి నిరసనగా నర్బల్ వరకూ ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నించినజేకేఎల్ఎఫ్ చైర్మన్ యాసిన్ మాలిక్, సామాజికవేత్త స్వామి అగ్నివేశ్లను పోలీసులు కాసేపు అదుపులోకి తీసుకొని విడిచిపెట్టారు. ఆందోళనకారులపై జవాన్ల కాల్పుల్లో బాలుడి మృతి పట్టుకొని కాల్చి చంపారన్న మృతుని కుటుంబ సభ్యులు జవాన్లపై హత్య కేసు నమోదు శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్ల అత్యుత్సాహం ఓ బాలుడిని బలితీసుకుంది. నిరసన ప్రదర్శనలో పాల్గొనడమే శాపమై అతని మరణానికి కారణమైంది. రాష్ట్రంలో గతవారం జరిగిన సైనిక ఆపరేషన్‌లో ఇద్దరు యువకుల మృతి ఉదంతంతోపాటు వేర్పాటువాద నేత మసరత్ ఆలం అరెస్టును నిరసిస్తూ హురియత్ కాన్ఫరెన్స్ శనివారం పిలుపునిచ్చిన బంద్ సందర్భంగా బుడ్గాం జిల్లాలో హింస చోటుచేసుకుంది. జిల్లాలోని నర్బల్ వద్ద వీధుల్లో నిరసనలకు దిగిన ఆందోళనకారులను అదుపు చేసేందుకు సీఆర్పీఎఫ్ జవాన్లు కాల్పులు జరపగా సుహైల్ అహ్మద్ సోఫీ అనే 16 ఏళ్ల బాలుడితోపాటు మరో ఇద్దరు గాయపడ్డారు. దీంతో స్థానికులు వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందాడు. అయితే సీఆర్పీఎఫ్ జవాన్లు ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్’ పాటించలేదంటూ ప్రాథమిక విచారణలో తేల్చిన పోలీసులు ఇందుకు బాధ్యులపై హత్య కేసు నమోదు చేశారు. కాల్పులకు సంబంధించి ఇద్దరు పోలీసులను అరెస్ట్ చేశారు. బాలుడిని ప్రశ్నించేందుకంటూ అదుపులోకి తీసుకున్న జవాన్లు అనంతరం పాయింట్ బ్లాంక్ రేంజ్లోకాల్చి చంపారని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాలుడి మృతి వార్త దావానలంలా వ్యాపించడంతో ఆందోళనకారులు పేట్రేగిపోయారు. భద్రతా దళాలపై రాళ్లు రువ్వడంతోపాటు ఓ పోలీస్ పికెట్‌కు నిప్పుపెట్టారు. టైర్లు కాల్చి రోడ్లకు అడ్డంగా పడేశారు. పలుచోట్ల వాహనాలను ధ్వంసం చేశారు. బారాముల్లా జిల్లాలోని పట్టాన్, ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారాలోనూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. జవాన్ల కాల్పుల ఉదంతాన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం దీనిపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి 15 రోజుల్లోగా బద్గాం జిల్లా మేజిస్ట్రేట్‌కు నివేదిక సమర్పించాల్సిందిగా అదనపు డీసీపీకి ఆదేశాలు జారీ చేసింది. బాలుడి మరణవార్త తెలియడంతో నర్బల్ వరకూ నిరసన ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నించిన జేకేఎల్ఎఫ్ చైర్మన్ యాసిన్ మాలిక్, సామాజికవేత్త స్వామి అగ్నివేశ్లను పోలీసులు అదుపులోకి తీసుకొని అనంతరం వదిలేశారు. రాష్ట్రంలో కశ్మీరీ పండిట్లకు ప్రత్యేక కాలనీల ఏర్పాటు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మాలిక్ శనివారం ప్రారంభించిన 30 గంటల నిరాహారదీక్షకు మద్దతు పలికేందుకు అగ్నివేశ్ శ్రీనగర్ చేరుకున్నారు. అంతకుముందు బంద్ సందర్భంగా పోలీసులు హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ ఉమర్ ఫరూఖ్ సహా మరికొందరు మంది వేర్పాటువాద నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు. హురియత్ ఫ్యాక్షన్ నేతఅలీ షా గిలానీని గురువారం నుంచే హౌస్ అరెస్ట్ చేశారు. బంద్ సందర్భంగా ఆందోళనకారులు, భద్రతా దళాల మధ్య పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో దుకాణ, వాణిజ్య సముదాయాలన్నీ మూతబడ్డాయి. ప్రజా రవాణా కూడా స్తంభించింది. -
ఆర్టీసీ బస్సు ఢీకొని బాలుడు మృతి
కొత్తూరు: మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలంలోని చంద్రాయగూడ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు మృతిచెందాడు. చంద్రాయగూడలో రోడ్డు దాటుతున్న బాలుణ్ని షాద్‌నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివకుమార్(9) అనే బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు. బాలుడి స్వస్థలం రంగారెడ్డి జిల్లా పరిగి మండలం చిట్యాల గ్రామం. కన్నకొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
ప్రాణం తీసిన సరదా
హైదరాబాద్: ఆటవిడుపు కోసమో.. అహ్లాదం కోసమో ఎగిరేసిన గాలిపటం ఓ బాలుడి ప్రాణం తీసింది. ఈ సంఘటన చింతల్ సమీపంలోని మారుతీనగర్‌లో శుక్రవారం జరిగింది. భవానికళ్యాణ్ (9) గాంధీనగర్ లోని ఠాగూర్ హైస్కూల్లో రెండో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌పై గాలిపటం ఎగరవేస్తూ ప్రమాదవశాత్తూ కాలు జారీ కిందపడ్డాడు. ఇది గమనించిన స్థానికులు బాలుడిని వెంటనే అంబులెన్స్ సాయంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. భవానికళ్యాణ్ చికిత్స పొందుతూ రాత్రి 11 గంటలకు మృతిచెందాడు.