కర్నూలు(ఆత్మకూరు): డెంగీ వ్యాధితో ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. మండలంలోని ఇంద్రేశ్వరం గ్రామానికి చెందిన విజయ్(13)మ వారం రోజుల నుంచి డెంగీ వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందాడు.