దోమల అంతానికి లేజర్‌ ఫిరంగి! | Anand Mahindra Suggests A Solution After Dengue Cases Rise In Mumbai, Shared Video Goes Viral | Sakshi

కొనే ప్రయత్నం చేస్తున్నా: ఆనంద్‌ మహింద్రా!

Aug 24 2024 4:29 PM | Updated on Aug 24 2024 6:07 PM

Anand Mahindra Suggests a Solution After Dengue Cases

భారతదేశంలోని ప్రధాన నగరాల్లో విపరీతమైన వర్షాల కారణంగా దోమలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో డెంగ్యూ కేసులు ఎక్కువవుతున్నాయి. ఈ తరుణంలో ఆనంద్ మహీంద్రా ఇంట్లో దోమలను నాశనం చేసే ఓ చిన్న యంత్రానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఈ యంత్రాన్ని 'ఇంటికి ఐరన్ డోమ్' అని ఆయన పేర్కొన్నారు.

వర్షాల కారణంగా దోమల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ సమయంలో వాటిని నియంత్రించడానికి ఈ యంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చైనీస్ వ్యక్తి కనిపెట్టిన ఈ యంత్రం ఓ చిన్న ఫిరంగి మాదిరిగా ఉంది.

వీడియోలో కనిపించే ఈ చిన్న యంత్రం లేజర్ కిరణాల ద్వారా దోమలను కనిపెట్టి నాశనం చేస్తోంది. నిమిషాల వ్యవధిలోనే ఆ మిషన్ లెక్కకు మించిన దోమలను అంతం చేస్తోంది. ఇలాంటి మిషన్ కొనటానికి ప్రయత్నిస్తున్నట్లు ఆనంద్ మహీంద్రా ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement