
న్యూఢిల్లీ: హ్యూమన్ మొబైల్ డివైజెస్ (హెచ్‌ఎండీ) తాజాగా రెండు మ్యూజిక్ ఆధారిత ఫీచర్ ఫోన్లను (హెచ్‌ఎండీ 130 మ్యూజిక్, హెచ్‌ఎండీ 150 మ్యూజిక్) ప్రవేశపెట్టింది. వీటిలో 2500 ఎంఏహెచ్ బ్యాటరీ, బ్లూటూత్ 5.0, టైప్ సీ ఫాస్ట్ చార్జింగ్, యూపీఐ పేమెంట్స్ సామర్థ్యాలు మొదలైన ఫీచర్లు ఉన్నాయి.
హెచ్‌ఎండీ 130 ధర రూ. 1,899గా, హెచ్‌ఎండీ 150 ధర రూ. 2,399గా ఉంటుంది. రిటైల్ స్టోర్స్, ఈ–కామర్స్ ప్లాట్‌ఫాంలతో పాటు తమ వెబ్‌సైట్లో ఇవి లభిస్తాయని సంస్థ గ్లోబల్ చైర్మన్ జీన్ ఫ్రాంకోయిస్ బారిల్ తెలిపారు. త్వరలోనే ఎంట్రీ స్థాయి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కూడా ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు.
భారత్‌లో విక్రయిస్తున్న దాదాపు అన్ని ఉత్పత్తులు దేశీయంగా తయారైనవేనని హెచ్‌ఎండీ ఇండియా వీపీ రవి కున్వర్ పేర్కొన్నారు. తమ గ్లోబల్ పోర్ట్‌ఫోలియోలో ఆదాయం, వనరులపరంగా భారత్ కీలక మార్కెట్‌గా ఉంటోందని చెప్పారు. మరోవైపు, ఐపీఎల్ 2025కి సంబంధించి రాజస్థాన్ రాయల్స్‌తో తమ భాగస్వామ్యాన్ని పొడిగించుకున్నట్లు వివరించారు.