feature phones
-
రూ.1,799కే 4జీ ఫోన్!
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలోని నెట్వర్క్ సేవలందించే జియో ‘జియో భారత్ జే1’ పేరుతో 4జీ మొబైల్ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ ఫీచర్ ఫోన్లో జియో టీవీ, జియో సినిమా, జియో పే వంటి యాప్స్ ఇన్స్టాల్ చేసి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కంపెనీ తెలిపింది.2.8 అంగుళాల డిస్ప్లే కలిగిన ఈ ఫోన్ ధర రూ.1799గా నిర్ణయించినట్లు సంస్థ పేర్కొంది. దీన్ని కొనుగోలు చేసినవారికి జియో ప్రత్యేకంగా రిఛార్జ్ ప్లాన్‌ను కూడా అందిస్తుంది. రూ.123 జియో భారత్ ప్లాన్‌తో 14 జీబీ 4జీ డేటా ఇస్తుంది. ప్రస్తుతం ఇతర వినియోగదారులకు ఇదే ప్లాన్ ధర రూ.189గా ఉంది. ఈ ఫోన్ 128జీబీ వరకు ఎస్డీ కార్డు సపోర్ట్ చేస్తుంది. 2,500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.ఇదీ చదవండి: అమెరికా చట్టంతో భారత్‌కు లాభం..!ఫీచర్ ఫోన్ వాడే వినియోగదారులను 4జీ నెట్‌వర్క్‌తో కనెక్ట్ చేయడానికి ఈ మొబైల్ విడుదల చేసినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. జియో..నెట్వర్క్ సేవలందిస్తున్నా మొబైళ్లను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తోంది. జియో రీఛార్జ్ ప్లాన్‌ను కూడా కస్లమర్లకు ఇవ్వొచ్చనే ఆలోచనతో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిసింది. దీనివల్ల కంపెనీ రెవెన్యూ కూడా వృద్ధి చెందుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
పాత ఫోన్లు.. కొత్త సాఫ్ట్వేర్! 90ల నాటి నోకియా ఫోన్లు మళ్లీ కొత్తగా..
90ల నాటి నోకియా ఫీచర్ ఫోన్లు చాలా మందికి గుర్తుండే ఉంటాయి. ముఖ్యంగా అందులో ఉన్న స్నేక్ గేమ్ అంటే అప్పటి పిల్లలకు చాలా ఇష్టం. పెద్దలు కూడా ఈ ఫోన్లు వాడటానికి ఇష్టపడేవారు. అప్పటి ఫోన్లలో కొన్ని మోడళ్లను కొత్త సాఫ్ట్‌వేర్‌తో మళ్లీ మార్కెట్లోకి తీసుకొస్తోంది నోకియా. నోకియా 130, నోకియా 150 మోడల్ ఫీచర్ ఫోన్లను నూతన సాఫ్ట్‌వేర్‌తో తీసుకొస్తున్నట్లు నోకియా తాజాగా ప్రకటించింది. స్మార్ట్ఫోన్లతో విసిగిపోయినవారికి, తమ సమయమంతా వృధా అవుతోందని, వాటికి దూరంగా ఉండాలనుకునేవారికి ఈ ఫీచర్ ఫోన్లు పరిష్కారంగా నిలుస్తాయి. ఇప్పటికే స్మార్ట్ఫోన్లు ఉన్నవారు వీటిని సెకండరీ ఫోన్లుగా వినియోగించవచ్చు. మరో చవక మొబైల్.. అతితక్కువ ధరకే సరికొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల నోకియా 130 స్పెసిఫికేషన్లు నోకియా 130 ఫోన్లో 2.4 అంగుళాల QVGA డిస్ప్లే ఉంటుంది. 1450 mAh రిమూవబుల్ బ్యాటరీ వస్తుంది. ఇందులో కెమెరా ఆప్షన్ ఉండదు. 12 కీల నావిగేషనల్ కీప్యాడ్ ఉంటుంది. అందరికీ ఇష్టమైన స్నేక్ గేమ్ సరికొత్త వెర్షన్ ఇందులో ఉంటుంది. నోకియా 150 స్పెసిఫికేషన్లు ఇందులోనూ 2.4 అంగుళాల QVGA డిస్ప్లే, 1450 mAh రిమూవబుల్ బ్యాటరీ వస్తాయి. ఈ బ్యాటరీ నెల రోజుల స్టాండ్‌బై టైం ఇస్తుంది. పాటలు వినేందుకు ఎఫ్ఎం రేడియో ఉంటుంది. ఇక 0.3 ఎంపీ కెమెరా వస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా డేటాను స్టోర్ చేసుకోవచ్చు. Amazon Great Freedom Festival Sale 2023: లేటెస్ట్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు! గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ షురూ.. -
నోకియా చిన్న ఫోన్ రూ. 1,699లకే.. యూపీఐ పేమెంట్లూ చేసుకోవచ్చు!
Nokia 110 4G/2G: రిలయన్స్ జియో బాటలోనే నోకియా కూడా తక్కువ ధరకు 4జీ ఫీచర్ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇందులో యూపీఐ (UPI) పేమెంట్ ఆప్షన్‌ను ఇన్‌బిల్ట్‌గా ఇవ్వడం విశేషం. నోకియా 110 4జీ (Nokia 110 4G), నోకియా 110 2జీ (Nokia 110 2G) ఫీచర్ ఫోన్లకు సంబంధించిన 2023 మోడల్‌లు తాజాగా విడుదలయ్యాయి. వీటి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం. ఇదీ చదవండి: హాట్ డీల్: రూ.12 వేలకే లేటెస్ట్ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్! స్పెసిఫికేషన్స్ నోకియా 110 4G/2G ఫోన్ల 2023 మోడల్లను 2021 మోడల్‌తో పోలిస్తే చాలా ఆకర్షణీయంగా రూపొందించారు. కొత్త కొత్త రంగుల్లో నూతన ఫోన్లు ప్రీమియంగా కనిపిస్తున్నాయి. నోకియా 110 4జీ ఫోన్ మిడ్నైట్ బ్లూ, ఆర్కిటిక్ పర్పుల్ రంగుల్లో లభిస్తుండగా నోకియా 110 2జీ ఫోన్ చార్కోల్, క్లౌడీ బ్లూ కలర్స్‌లో అందుబాటులో ఉంది. విశేషమేమిటంటే, ఈ కొత్త మోడల్‌ల ఫోన్లలో ఇన్‌బిల్ట్ యూపీఐ పేమెంట్ ఫీచర్ ఇచ్చారు. యూజర్లు ఒక బటన్‌ను నొక్కడం ద్వారా సులభంగా యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు. నోకియా 110 4జీలో బలమైన 1450mAh బ్యాటరీ, నోకియా 110 2జీ ఫోన్లో 1000mAh బ్యాటరీ ఇచ్చారు. రెండు ఫోన్లలోనూ 32జీబీ వరకు స్టోరేజ్‌ను విస్తరించుకోవచ్చు. నోకియా 110 4జీ ధర రూ.2,499, నోకియా 110 2జీ ఫోన్ ధర రూ.1,699లుగా ఉంది. వీటిని నోకియా రిటైల్ స్టోర్లలోనూ, నోకియా అధీకృత, భాగస్వామ్య వెబ్సైట్లలోనూ కొనుగోలు చేయవచ్చు. ఫీచర్స్ 1.8″ QQVGA డిస్ప్లే QVGA రిజల్యూషన్‌తో కూడిన రియర్ కెమెరా 12 రోజుల స్టాండ్‌బై టైమ్, 8 గంటల టాక్ టైమ్ అందించే 1450mAh బ్యాటరీ. ( నోకియా 110 2Gలో 1000mAh బ్యాటరీ) నానో ఆకృతిలో పాలికార్బోనేట్తో తయారు చేసిన బ్యాక్ ప్యానెల్ IP52 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ వైర్లెస్ FM రేడియో S30+ ఆపరేటింగ్ సిస్టమ్ 94.5 గ్రాముల బరువు 50mm x 121.5mm x 14.4mm కొలతలు ఇదీ చదవండి: ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు మాత్రం అదుర్స్! -
5జీ పరుగులు ఒకవైపు.. ‘పాత తరం ఫోన్’ అడుగులు మరొకవైపు: ఏమిటో వింత పరిణామం!
స్మార్ట్ ఫోన్లు ప్రపంచమంతా విస్తరించి ఉన్నాయి. జనాభాలో 83 శాతం మందికిపైగా స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. అంటే 600 కోట్ల మంది చేతుల్లో ఈ స్మార్ట్ ఫోన్ ఉంది. వన్జీ, టూజీ, త్రీజీ, ఫోర్జీ పోయి ఇప్పుడు 5జీ వైపు పరుగులు తీస్తోందీ స్మార్ట్‌ఫోన్. స్మార్ట్ఫోన్ల విజృంభణ ఇంతలా సాగిపోతున్న ప్రస్తుత తరుణంలో ఓ వింత పరిణామం మెల్లమెల్లగా చోటు చేసుకుంటోంది. ఎప్పుడో పాతిక ముప్పై ఏళ్ల క్రితం మనం వదిలేసిన బేసిక్ ఫోన్ అంటే తొలి తరం సెల్ ఫోన్ ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. గత రెండు మూడేళ్ల నుంచి ఈ బేసిక్ ఫోన్ల అమ్మకాలు జోరందుకున్నాయి. బేసిక్ ఫోన్, డంబ్ ఫోన్, ఫీచర్ ఫోన్, బ్రిక్ ఫోన్ (మోటోరోలా తయారుచేసిన తొలి సెల్‌ఫోన్ ‘డైనాటాక్’ ఇటుక సైజులో ఉండేది) అని రకరకాల పేర్లతో పిలిచే తొలితరం సెల్‌ఫోన్ అమ్మకాలు ఇటీవల 100 కోట్ల మార్కుకు చేరుకుంది. బుల్లితెర, ప్రెస్ బటన్లు, క్వెర్టీ కీబోర్డు, స్నేక్ గేమ్, ఓ మాదిరి రేడియోతో ఫోన్ చేయడానికి, మెసేజులు పంపడానికి మాత్రమే ఉపయోగపడే ఇలాంటి డంబ్ ఫోన్ల కోసం గూగుల్‌లో సెర్చ్ చేసే వారి సంఖ్య 2018 నుంచి 2021 మధ్య 89 శాతం పెరిగింది. గత ఏడాది స్మార్ట్ ఫోన్ల విక్రయం 140 కోట్లు ఉండగా బేసిక్ ఫోన్ల అమ్మకం 100 కోట్లకు చేరిందని సాఫ్ట్ వేర్ కంపెనీ ‘సెమ్ రస్’ నివేదిక. బ్రిటన్ లో ప్రతి 10 మందిలో ఒకరి దగ్గర డంబ్ ఫోన్ ఉందని డెలాయిట్ చెబుతోంది. షేర్ మార్కెట్ కింగ్ వారెన్ బఫెట్ ఇటీవల కాలం వరకు సామ్సంగ్ బేసిక్ ఫోన్ ఎస్‌సీహెచ్– 320 వాడేవారు. ఇటీవల ఆయన ఐఫోన్‌కు మారారు. అదీ ఎవరో బహుమతిగా ఇచ్చిందే. ఆపిల్ కంపెనీలో షేర్లు ఉన్న బఫెట్ ఏ రోజూ ఐఫోన్ జోలికి వెళ్లలేదు. డంబ్ ఫోన్ తోనే కాలం గడిపారు. ఇప్పుడు కూడా ఈ ఐఫోన్–11ని కేవలం ఫోన్ లా మాత్రమే వాడతానంటున్నారు. సోషల్ మీడియా సైడ్ ఎఫెక్ట్ లెక్కలేనన్ని ఫీచర్లు, ఆడియో, వీడియో స్ట్రీమింగ్, జీపీఎస్ సౌకర్యం, ఇంటర్నెట్ ద్వారా సమస్త సమాచారం, సదుపాయాలు ప్రతి అవసరానికీ అంది వచ్చే యాప్‌లు ఉన్న స్మార్ట్ ఫోన్ లను వీడి.. చాలామంది మళ్లీ వెనక్కి సాధారణ బేసిక్ ఫోన్ వైపు మళ్లడానికి సోషల్ మీడియా ఓ ప్రధాన కారణం. అనేకానేక సౌకర్యాలను ఇచ్చే స్మార్ట్ ఫోన్స్ మోజులో కొట్టుకుపోయిన వీరంతా ఇప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్ ని గుర్తించి వెనక్కి వెళ్తున్నారు. ‘సోషల్ మీడియా యాప్స్ తో నిండిపోయిన నా ఫోన్‌తో నా రోజంతా గడిచి పోయేది. ఈ స్మార్ట్ ఫోన్‌తో నేనేం కోల్పోయానో అర్థం అయింది. అందుకే ఇప్పుడు పాత డంబ్ ఫోన్ కొన్నాను. నా వ్యక్తిగత జీవితం మళ్ళీ నా చెంతకు వచ్చింది’ అని లండన్‌కు చెందిన 17 ఏళ్ల రాబిన్ వెస్ట్ బీబీసీకి చెప్పింది. ‘ఫోన్ల అసలు అవసరం మరిచిపోయేలా చేసింది స్మార్ట్ ఫోన్. ఫోన్ చేసి నలుగురితో మాట్లాడటం మానేసి సోషల్ మీడియా సమాచారం, కామెంట్లు, లైకులు, షేరింగ్లతో కాలం గడిపేస్తున్నాం’ అని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన టెక్నాలజీ నిపుణులు ప్రొఫెసర్ సాండ్రా వాచర్ అంటున్నారు. ఓ సాధారణ వ్యక్తి ఏడాదిలో 52,925 నిమిషాలు సోషల్ మీడియాలో టైపింగ్ కోసం వెచ్చిస్తున్నట్లు బ్రిటన్‌కు చెందిన కన్సల్టెన్సీ సంస్థ స్టార్లిస్ట్ వెల్లడించింది. అమెరికన్ పౌరుడు ఏడాదికి 109 రోజుల సమయాన్ని యాప్స్, వెబ్స్ చూడడంలో గడిపేస్తున్నాడు. స్మార్ట్ ఫోన్ వ్యసనంగా మారి 39 శాతం యువత నిద్రలేమితో సతమతమవుతున్నట్టు లండన్ కింగ్స్ కాలేజీ సైకాలజీ విభాగం పరిశోధనలో వెళ్లడైంది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేందుకు వారికి బేసిక్ ఫోన్లు మాత్రమే అందిస్తున్నారు. పేదరికమూ ఓ కారణం ఫీచర్ ఫోన్ల వ్యాప్తికి పేదరికం కూడా ఒక కారణం. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో పేదరికంతో మగ్గుతున్న కోట్లాదిమందికి స్మార్ట్ ఫోన్లు కొనుగోలుచేసే శక్తి లేక చవకగా దొరికే బేసిక్ ఫోన్లతో అవసరాలు తీర్చుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా రోజుకి 250 రూపాయలకన్నా తక్కువ ఆదాయం పొందుతున్న వారు 200 కోట్ల మంది ఉన్నారు. ఈ వర్గంలో బేసిక్ ఫోన్ల వాడకం ఎక్కువగా ఉందని కౌంటర్ పాయింట్ అనే పరిశోధనా సంస్థకు చెందిన అసోసియేట్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ చెబుతున్నారు. భారతదేశంలో ఈ డంబ్ ఫోన్లను వాడుతున్న వారు 32 కోట్ల మంది ఉన్నారు. ఈ విషయాన్ని గ్రహించి భారత రిజర్వు బ్యాంకు బేసిక్ ఫోన్ల ద్వారా కూడా ఆన్లైన్ చెల్లింపులకు వీలు కల్పించే ప్రోగ్రాంలను రూపొందించింది. కరెంటు ఎక్కువగా అందుబాటులో లేని గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో బ్యాటరీ రీచార్జింగ్ సౌకర్యం తక్కువగా ఉంటుంది. అలాంటిచోట ఒకసారి బ్యాటరీ చార్జ్ చేస్తే నాలుగైదు రోజులు పనిచేసే బేసిక్ ఫోన్ ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. ::: దొడ్డ శ్రీనివాసరెడ్డి చదవండి👉 మీ స్మార్ట్ ఫోన్ 5జీ నెట్ వర్క్‌కు సపోర్ట్ చేస్తుందా? లేదో? ఇలా చెక్ చేసుకోండి! -
భారత్‌కు శాంసంగ్ భారీ షాక్! ఇకపై ఆ ప్రొడక్ట్‌లు ఉండవట!
ప్రముఖ సౌత్ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ భారత్‌కు భారీ షాకిచ్చింది. ఇకపై ఫీచర్ ఫోన్లను ఇండియాలో అమ్మకూడదని నిర్ణయించింది. అయితే స్మార్ట్ ఫోన్ సేల్స్‌ను కొనసాగించనుంది. శాంసంగ్ ఈ ఏడాది క్యూ1 ఫలితాల్లో దేశీయంగా ప్రీమియం,సూపర్ ప్రీమియం స్మార్ట్ ఫోన్లపై భారీ ఎత్తున అమ్మకాలు జరిపింది. అయినా భారత్‌లో ఫీచర్‌ఫోన్ అమ్మకూడదనే నిర్ణయం ఇతర ఫోన్ తయారీ సంస్థల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. కారణం ఏదైనా ఇకపై భారత్‌లో శాంసంగ్‌కు చెందిన ఫీచర్ ఫోన్లు కనుమరుగు కానున్నాయి. రూ.15వేల లోపు ఫోన్లే సౌత్ కొరియా దిగ్గజం ఫీచర్ ఫోన్ అమ్మకాలు వద్దనుకున్నా..బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లను అమ్మనుంది. ఇందుకోసం శాంసంగ్ మరో రెండు సంస్థలతో సహకారంతో పీఎల్ఐ స్కీం కింద రూ.15వేల లోపు ఉన్న ఫోన్లను తయారు చేయనుంది. దీంతో ఆ సంస్థకు చెందిన రూ.10వేల నుంచి రూ.20 వేల మధ్య ఉన్న ఫోన్ల డిమాండ్ పెరగనుంది. షిప్మెంట్ తగ్గింది ఈ ఏడాది క్యూ1 ఫలితాల్లో భారత్‌లో శాంసంగ్ ఫీచర్ ఫోన్ షిప్మెంట్ తగ్గి 39 శాతంతో సరిపెట్టుకుంది. సప్లయ్ చైన్ సమస్యలు, అధిక రిటైల్ ద్రవ్యోల్బణం కారణంగా కొన్ని సంవత్సరాలుగా ఫీచర్ ఫోన్ షిప్ మెంట్లో ప్రథమ స్థానంలో ఉన్న శాంసంగ్ కేవలం 12శాతంతో మూడో స్థానానికి పడిపోయింది. శాంసంగ్ సరికొత్త రికార్డ్‌లు భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో శాంసంగ్ సరికొత్త రికార్డ్లను నమోదు చేసింది. ఈ ఏడాది మార్చిలో విడుదలైన స్మార్ట్ ఫోన్ మార్కెట్లో శాంసంగ్ సత్తా చాటింది. ఆ సంస్థ దేశీయంగా విడుదల చేసిన ప్రీమియం స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్ 22 సిరీస్ ఫోన్ అమ్మకాలతో నెంబర్ వన్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థగా పేరు సంపాదించింది. సూపర్ ప్రీమియం స్మార్ట్ ఫోన్లు సైతం 81శాతం అమ్మకాలతో యూజర్లను ఆకట్టుకున్నాయి. ప్రీమియం టూ సూపర్ ప్రీమియం ప్రీమియం సెగ్మెంట్లో అంటే ధర రూ.30వేలకు పైగా ఉన్న స్మార్ట్ ఫోన్లు 38శాతంతో అమ్ముడుపోయాయి. మార్చిలో ధర లక్షకు పైగా ఉన్న గెలాక్సీ ఎస్ 22 ఆల్ట్రా సూపర్ ప్రీమియం సెగ్మెంట్లో 81శాతంతో అమ్మకాలు జరిపినట్లు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. చదవండి👉గుడ్‌న్యూస్: అదిరిపోయే డిస్కౌంట్లు, ఐఫోన్ 13పై బంపరాఫర్లు! -
ఫీచర్ ఫోన్లలో యూపీఐ సర్వీసులు
న్యూఢిల్లీ: ఫీచర్ ఫోన్లలోనూ ఏకీకృత చెల్లింపుల విధానాన్ని (యూపీఐ) అందుబాటులోకి తెస్తూ కొత్త సర్వీసును రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ మంగళవారం ఆవిష్కరించారు. దీనితో దాదాపు 40 కోట్ల మంది ఫీచర్ ఫోన్ యూజర్లకు ప్రయోజనం చేకూరుతుంది. సాధారణ మొబైల్ ఫోన్ల ద్వారా కూడా డిజిటల్ ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు వీలు లభిస్తుంది. బహుళ ప్రయోజనకరమైన యూపీఐ విధానం 2016లోనే ప్రవేశపెట్టినా.. ఇప్పటివరకూ ఇది స్మార్ట్ఫోన్లకు మాత్రమే పరిమితమైందని దాస్ తెలిపారు. అట్టడుగు వర్గాలకు, గ్రామీణ ప్రాంతాల వారికి అందుబాటులోకి రాలేదని ఆయన పేర్కొన్నారు. ‘ఇప్పటివరకూ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకు దూరంగా ఉన్న వర్గాలకు యూపీఐ 123పే ప్రయోజనకరంగా ఉంటుంది. అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తెచ్చేందుకు ఇది తోడ్పడుతుంది‘ అని ఫీచర్ ఫోన్లకు యూపీఐ సర్వీసుల ఆవిష్కరణ కార్యక్రమంలో దాస్ చెప్పారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ), బ్యాంకుల అధికారులు ఇందులో పాల్గొన్నారు. 2016లోనే ఫీచర్ ఫోన్ యూజర్ల కోసం కూడా యూఎస్ఎస్డీ కోడ్ ద్వారా పనిచేసే యూపీఐ సర్వీసును అందుబాటులోకి తెచ్చినప్పటికీ అది కష్టతరంగా ఉండటంతో ప్రాచుర్యం పొందలేదు. దీనితో ఎన్పీసీఐ దాన్ని సరికొత్తగా తీర్చిదిద్దింది. ప్రారంభించడం నుంచి ముగించే వరకూ లావాదేవీ ప్రక్రియ మూడు అంచెల్లో జరుగుతుంది కాబట్టి యూపీఐ 123పే అని బ్రాండ్ పేరు పెట్టినట్లు దాస్ తెలిపారు. యూపీఐ లావాదేవీలు వేగంగా వృద్ధి చెందుతున్నాయని, గత ఆర్థిక సంవత్సరంలో వీటి పరిమాణం రూ. 41 లక్షల కోట్లుగా ఉండగా ఈసారి ఇప్పటిదాకా రూ. 76 లక్షల కోట్ల స్థాయికి చేరాయని చెప్పారు. ఫిబ్రవరిలోనే రూ. 8.26 లక్షల కోట్ల విలువ చేసే 453 కోట్ల లావాదేవీలు జరిగాయన్నారు. ‘యూపీఐ ద్వారా లావాదేవీల పరిమాణం రూ. 100 లక్షల కోట్లకు చేరే రోజు ఎంతో దూరంలో లేదు‘ అని దాస్ చెప్పారు. నాలుగు ప్రత్యామ్నాయాలు.. యూపీఐ కింద.. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (ఐవీఆర్) నంబర్, ఫీచర్ ఫోన్లలో యాప్‌లు, మిస్డ్ కాల్, శబ్ద ఆధారిత చెల్లింపుల విధానాల ద్వారా ఫీచర్ ఫోన్ యూజర్లు పలు లావాదేవీలు నిర్వహించవచ్చని ఆర్బీఐ తెలిపింది. కుటుంబ సభ్యులు .. స్నేహితులకు చెల్లింపులు జరిపేందుకు, కరెంటు..నీటి బిల్లులు కట్టేందుకు, వాహనాల కోసం ఫాస్ట్ ట్యాగ్ల రీచార్జి, మొబైల్ బిల్లుల చెల్లింపులు, ఖాతాల్లో బ్యాలెన్స్‌లను తెలుసుకోవడం మొదలైన అవసరాలకు యూపీఐ 123పే ఉపయోగపడుతుంది. మరోవైపు, డిజిటల్ చెల్లింపులకు సంబంధించి ’డిజిసాథీ’ పేరిట ఎన్పీసీఐ ఏర్పాటు చేసిన 24 గీ7 హెల్ప్‌లైన్‌ను కూడా ఆర్బీఐ గవర్నర్ దాస్ ప్రారంభించారు. డిజిటల్ చెల్లింపులపై తమ సందేహాల నివృత్తి, ఫిర్యాదుల పరిష్కారం కోసం యూజర్లు.. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.డిజిసాథీ.కామ్ని సందర్శించవచ్చు లేదా తమ ఫోన్ల నుంచి 14431, 1800 891 3333కి ఫోన్ చేయవచ్చు. -
రూ.1300కే రియల్ మీ డిజో స్టార్ ఫీచర్ ఫోన్స్
ప్రముఖ చైనా తయారీ దిగ్గజం రియల్ మీ డిజో స్టార్ 300, డిజో స్టార్ 500 పేరుతో రెండు ఫీచర్ ఫోన్లను భారతదేశంలో లాంఛ్ చేసింది. ఈ రెండు మోడల్స్ మూడు రంగుల్లో ఒక్కొక్కటి ఒక్కో కాన్ఫిగరేషన్ లో లభిస్తున్నాయి. డిజో స్టార్ 300, డిజో స్టార్ 500 ఫీచర్ ఫోన్లు కీప్యాడ్, చిన్న డిస్ ప్లేలతో వస్తున్నాయి. డిజో అనేది రియల్ మీ సబ్ బ్రాండ్. ఇది మొదట టీడబ్ల్యూఎస్ వైర్ లెస్, నెక్ బ్యాండ్ తరహా ఇయర్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు రెండు ఫీచర్ ఫోన్లను లాంచ్ చేసింది. డిజో స్టార్ 300 ధర రూ.1,299, డిజో స్టార్ 500 ధర రూ.1,799కు లభిస్తున్నాయి. ఈ రెండు ఫోన్లు ఫ్లిప్ కార్ట్, ఆఫ్ లైన్ స్టోర్లను కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. డిజో స్టార్ 300 ఫీచర్స్: 1.77 అంగుళాల క్యూవిజీఏ(160ఎక్స్120 పిక్సెల్స్) డిస్ ప్లే డ్యూయల్ మైక్రో సిమ్ స్లాట్ ఎస్ సీ 6531ఈ ప్రాసెసర్ 32ఎంబీ ర్యామ్, 32ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్(64జీబీ మైక్రో ఎస్ డీ కార్డ్ సపోర్ట్) 0.08 ఎంపీ రిజల్యూషన్ సింగిల్ రియర్ కెమెరా 2,550 ఎమ్ఎహెచ్ బ్యాటరీ డిజో స్టార్ 500 ఫీచర్స్ 2.8 అంగుళాల క్యూవిజీఏ(320ఎక్స్240 పిక్సెల్స్) ఎల్సీడీ డిస్ ప్లే డ్యూయల్ మైక్రో సిమ్ స్లాట్ ఎస్ సీ 6531ఈ ప్రాసెసర్ 32ఎంబీ ర్యామ్, 32ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్(64జీబీ మైక్రో ఎస్ డీ కార్డ్ సపోర్ట్) 0.3 ఎంపీ రిజల్యూషన్ సింగిల్ రియర్ కెమెరా 1,900 ఎమ్ఎహెచ్ బ్యాటరీ -
ఇ‘స్మార్ట్’ ఫోన్లున్నా బేసిక్ మోడళ్లే టాప్
సాక్షి, అమరావతి: రకరకాల ఆకర్షణలతో స్మార్ట్ ఫోన్లు వెల్లువలా వస్తున్నా దేశంలో మాత్రం ఫీచర్ ఫోన్లు (బేసిక్ మోడళ్లు) పైనే ఎక్కువ మంది ఆధారపడుతున్నారు. టెక్నాలజీతో అవసరాలన్నీ తీరిపోయేలా స్మార్ట్ఫోన్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నా ఇప్పటికీ ఫీచర్ ఫోన్లనే చాలామంది నమ్ముకుంటున్నారు. దేశంలో 80 కోట్ల మందికిపైగా మొబైల్ ఫోన్ వినియోగదారులుండగా 45 కోట్ల మంది ఫీచర్ ఫోన్లే వాడుతున్నట్లు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) విశ్లేషణలో తేలింది. 35 కోట్ల మంది మాత్రమే స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. మళ్లీ మొదటికి! మూడేళ్ల క్రితం స్మార్ట్ ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగింది. అయితే గత ఏడాది నుంచి స్మార్ట్ ఫోన్ల వాడకందారులు సైతం మళ్లీ ఫీచర్ ఫోన్లు కొంటున్నట్లు గుర్తించారు. 2018, 19లో స్మార్ట్ ఫోన్ల వినియోగం తగ్గింది. గతంలో స్మార్ట్ ఫోన్ల పట్ల ఆకర్షితులైన వారు కూడా ఫోన్లు మార్చుకునే సమయంలో ఫీచర్ ఫోన్ వైపు మళ్లినట్లు గుర్తించారు. ఎందుకంటే...? ఇంటర్నెట్పై అవగాహన లేకపోవడం, స్మార్ట్ ఫోన్లలో ఫీచర్లు వాడడం తెలియక చాలామంది ఫీచర్ ఫోన్లు వినియోగిస్తున్నారు. కార్మికులు, దిగువ మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఫీచర్ ఫోన్లు వినియోగిస్తున్నారు. ధరలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. ఫీచర్ ఫోన్లు వాడేవారిలో ఎక్కువ మంది రూ.వెయ్యి లోపు వాటినే కొనుగోలు చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల ధర ఎక్కువగా ఉండటం, నిర్వహణ భారంగా మారడం కూడా వీటిపై విముఖతకు కారణం. 2019 చివరి నాటికి దేశంలో 81 కోట్ల మంది మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్నట్లు ఐడీసీ లెక్క తేల్చింది. టెలికాం ఆర్థిక పరిశోధనా విభాగం మాత్రం ఇది 118 కోట్లు దాటినట్లు పేర్కొంటోంది. ఐడీసీ వినియోగదారుల (యూజర్లు) సంఖ్యను లెక్కిస్తుండగా కేంద్ర ప్రభుత్వ విభాగం కనెక్షన్లు లెక్కిస్తుండడం వల్ల వ్యత్యాసం నెలకొన్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. -
జియోఫోన్‌కు పోటీ : తక్కువ ధరకే షావోమి...
టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టించి, ఫీచర్ ఫోన్ మార్కెట్లోనూ తనదైన శైలిలో దూసుకుపోతున్న రిలయన్స్ జియోకు చెక్ పడబోతుంది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి, రిలయన్స్ జియోఫోన్‌కు పోటీగా వచ్చేస్తోంది. షావోమి అత్యంత తక్కువ ధరకు క్విన్ ఏఐ సిరీస్‌లో రెండు ఫీచర్ ఫోన్లను తన స్వదేశంలో లాంచ్ చేసింది. వీటిని భారత్‌లోనూ ప్రవేశపెట్టాలని చూస్తోంది. ఏఐ ఆధారితంగా ఈ ఫీచర్ ఫోన్లు రూపొందాయి. జియో కియా ఓఎస్‌ను వాడితే, షావోమి ఒక స్టెపు ముందుకు వేసి దీనిలో ఆండ్రాయిడ్ ఓఎస్‌ను పొందుపరిచింది. క్విన్ 1, క్విన్ 1 ఎస్ పేరుతో ఈ ఫీచర్ ఫోన్లు వచ్చాయి. ఇవి కేవలం ఫీచర్ ఫోన్లు మాత్రమే కాదు. మరిన్ని స్మార్ట్ ఫీచర్లను వీటిలో షావోమి అందిస్తోంది. 17 రకాల అంతర్జాతీయ భాషలను ఇది సపోర్టు చేస్తోంది. క్విన్ 1 కేవలం 2జీ ఫోన్ కాగ, క్విన్ 1ఎస్ 4జీ ఎల్టీఈ, వాయిస్ఓవర్ ఎల్‌టీఈను సపోర్టు చేస్తుంది. క్విన్ 1 ధర సీఎన్ఐ 199 అంటే సుమారు భారత కరెన్సీలో 1,990 రూపాయలు. క్విన్ 1ఎస్ ధర సీఎన్‌వై 299 అంటే 2,990 రూపాయలు. ఈ రెండు ఫీచర్ ఫోన్లు బ్లాక్ అండ్ వైట్ రంగుల్లో అందుబాటులోకి వస్తున్నాయి. సెప్టెంబర్ 15 నుంచి వీటి షిప్పింగ్స్ ప్రారంభమవుతాయి. స్పెషిఫికేషన్లు... 2.8 అంగుళాల క్యూవీజీఏ డిస్ప్లే కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ క్విన్ 1లో మీడియోటెక్ ఎంటీ6260ఏ చిప్ సెట్, ఏఆర్ఎం7 సీపీయూ కోర్ క్విన్ 1ఎస్‌లో డ్యూయల్ కోర్టెక్స్ ఏ53 కోర్స్‌తో స్ప్రెడ్ట్రమ్ ఎస్సీ9820 చిప్సెట్ క్విన్ 1లో 8 ఎంబీ ర్యామ్, 16 ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్ క్విన్ 1ఎస్‌లో 256 ఎంబీ ర్యామ్, 512 ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్ మైక్రో ఎస్డీ కార్డు ద్వారా విస్తరణ మెమరీ 1480 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్లో కెమెరాలు లేవు ఒకవేళ భారత మార్కెట్లోకి ఈ ఫోన్లు ప్రవేశిస్తే, కచ్చితంగా జియో ఫోన్‌కు గట్టి పోటీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. -
స్మార్ట్‌ఫోన్, ఫీచర్ ఫోన్లపై లావా బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ కంపెనీ లావా, తన అన్ని మేజర్ మోడల్స్‌పై రెండేళ్ల వారెంటీని ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న తన పోర్ట్‌ఫోలియోలోని స్మార్ట్ఫోన్లు, ఫీచర్ ఫోన్లపై ఈ వారెంటీ అందిస్తానని లావా పేర్కొంది. భవిష్యత్తులో లాంచ్ చేయబోయే అన్ని మోడల్స్‌కు ఈ రెండేళ్ల వారెంటీ ఉంటుందని తెలిపింది. భారత మొబైల్ హ్యాండ్సెట్ ఇండస్ట్రీలో ఈ విధంగా వారెంటీ ఆఫర్‌ను ప్రకటించడం ఇదే మొదటిసారి. ఆగస్టు 26 తర్వాత కొనుగోలు చేసిన హ్యాండ్సెట్లకు రెండేళ్ల వారెంటీ యాక్టివేట్ అవుతుంది. యాక్ససరీస్‌పై కూడా ఆరు నెలల ప్రామాణికమైన వారెంటీ క్లాష్ ఉంటుంది. టచ్ ప్యానల్ లేదా ఎల్సీడీ డిస్ప్లేకు ఏడాది పాటు ఈ వారెంటీ కొనసాగుతుంది. ఈ సమయం తమకు ఎంతో అద్భుతమైన క్షణాలని, దేశీయ మొబైల్ హ్యాండ్సెట్ ఇండస్ట్రిలో తమ బలాన్ని మరింత పెంచుకుంటున్నామని రెండేళ్ల వారెంటీ స్కీమ్ లాంచ్ సందర్భంగా లావా ఇంటర్నేషనల్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ గౌరవ్ నిగమ్ చెప్పారు. తన పోర్ట్‌ఫోలియో డివైజ్‌లకు రెండేళ్ల వారెంటీని ప్రకటిస్తున్నామని, దేశీయ మొబైల్ ఫోన్ బ్రాండులో ఇలా ఆఫర్ చేయడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. తమ ఉత్పత్తిని అభివృద్ధి చేసే ప్రతి స్టేజీలో క్వాలిటీ కంట్రోల్‌పై ఎక్కువగా ఫోకస్ చేస్తామని నిగమ్ తెలిపారు. -
ఫీచర్ ఫోన్స్‌లోనూ ట్రూకాలర్
న్యూఢిల్లీ: కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ సంస్థ ట్రూకాలర్ తాజాగా తమ కాలర్ ఐడీ సేవలను ఫీచర్ ఫోన్స్‌లోనూ అందుబాటులోకి తెచ్చింది. అలాగే మొబైల్ ఫోన్ నంబరు ఆధారిత వీడియో కాలింగ్, పేమెంట్ సర్వీసులనూ ప్రవేశపెట్టింది. నెట్ వినియోగించని లేదా ఫీచర్ ఫోన్స్‌నే ఉపయోగిస్తున్న వారికి కాలర్ ఐడీ సర్వీసులు అందించేందుకు ఎయిర్‌టెల్‌తో ట్రూకాలర్ చేతులు కలిపింది. ట్రూకాలర్ యాప్ ఉన్న స్మార్ట్‌ఫోన్స్‌లో కాల్ చేసే వారి పేరు స్క్రీన్‌పై డిస్ప్లే అవుతుంది. అదే ఫీచర్ ఫోన్స్‌లో కాల్ వస్తుండగానే కాలర్ పేరు ఫ్లాష్ ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది. కాగా, పేమెంట్ సర్వీసుల కోసం ఐసీఐసీఐ బ్యాంక్‌తో చేతులు కలిపినట్లు ట్రూకాలర్ తెలిపింది. -
4జీ ఫీచర్ ఫోన్ల కోసం క్వాల్కామ్ చిప్సెట్
న్యూఢిల్లీ: టెలికం పరికరాల తయారీ సంస్థ క్వాల్కామ్ తాజాగా క్వాల్కామ్ 205 చిప్‌సెట్‌ను ఆవిష్కరించింది. ఇది సుమారు రూ. 3,500 మేర ధర ఉండే 4జీ ఫీచర్ ఫోన్స్‌లో తయారీలో ఉపయోగపడనుంది. భారత్, దక్షిణాసియా ప్రాంతాల్లో 4జీ టెక్నాలజీ, ఫీచర్ ఫోన్స్ వినియోగం గణనీయంగా ఉందని క్వాల్కామ్ టెక్నాలజీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జిమ్ కేథీ చెప్పారు. తమ కొత్త చిప్సెట్.. ఫీచర్ ఫోన్స్‌లో 4జీ అనుభూతిని అందించగలిగేలా మొబైల్స్ తయారీ సంస్థలు, ఆపరేటర్లు, కంటెంట్ ప్రొవైడర్లకు ఉపయోగపడగలదని ఆయన వివరించారు. భారత్‌లో 4జీ ఫీచర్ ఫోన్ల విక్రయానికి సంబంధించి రిలయన్స్ జియో, మైక్రోమ్యాక్స్, మెగాఫోన్, ఫ్లెక్స్‌ట్రానిక్స్ తదితర సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు జిమ్ పేర్కొన్నారు. -
‘స్మార్ట్’గా కొనేస్తున్నారు...!
న్యూఢిల్లీ: ఆసియా పసిఫిక్ దేశాల్లో స్మార్ట్ఫోన్ల అమ్మకాలకు సంబంధించి భారత్ జోరు కొనసాగుతోంది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 82 శాతం వృద్ధితో అత్యంత వేగంగా ఎదుగుతున్న స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా భారత్ నిల్చింది. రీసెర్చ్ సంస్థ ఐడీసీ ఈ వివరాలను వెల్లడించింది. మొబైల్ వినియోగదారులు స్మార్ట్ఫోన్లకు అప్‌గ్రేడ్ అవుతుండటం, అలాగే తక్కువ వ్యవధిలోనే పాతవి మార్చేసి కొంగొత్తవి తీసుకుంటూ ఉండటం అమ్మకాల పెరుగుదలకు కారణమని పేర్కొంది. క్రిత సంవత్సరం మూడో త్రైమాసికంతో పోలిస్తే ఈసారి అమ్మకాలు 82 శాతం ఎగిసి 2.33 కోట్లకు చేరాయి. దీంతో వార్షిక ప్రాతిపదికన వరుసగా రెండో త్రైమాసికంలోను 80 శాతం పైగా వృద్ధి సాధించినట్లయిందని ఐడీసీ తెలిపింది. క్యూ3లో మొత్తం మొబైల్ ఫోన్ల మార్కెట్లో స్మార్ట్ ఫోన్ల వాటా 32 శాతంగా నిల్చింది. క్రితం క్యూ3లో ఇది 19 శాతమే. మరోవైపు, ఫ్యాబ్లెట్ల (5.5-6.99 అంగుళాల స్క్రీన్) అమ్మకాలు ఒక మోస్తరు స్థాయికి చేరుకున్నాయని ఐడీసీ ఇండియా రీసెర్చ్ మేనేజర్ కిరణ్ కుమార్ వివరించారు. 4జీ సర్వీసులు వస్తుండటంతో 4.5-5.5 అంగుళాల స్క్రీన్ ఉండే స్మార్ట్ఫోన్లు డిమాండ్ మరింత పెరగగలదని ఆయన వివరించారు. స్మార్ట్‌ఫోన్ యూజర్లు సగటున 12-24 నెలల్లో పాతవి మార్చేసి కొత్తవి కొంటున్నారని పేర్కొన్నారు. 2014లో 5.3 కోట్ల పైగా స్మార్ట్‌ఫోన్స్ విక్రయాలు.. ఇంటర్నెట్పై అవగాహన పెరుగుతుండటం, ఎంట్రీ లెవెల్ ఫోన్ల ధరలు తగ్గుతుండటం వంటి అంశాలతో స్మార్ట్ఫోన్లకు డిమాండ్ ఇంకా పెరుగుతుందని మరో రీసెర్చ్ సంస్థ జీఎఫ్కే తెలిపింది. ఈ ఏడాది దేశీయంగా 5.3 కోట్ల పైగా స్మార్ట్‌ఫోన్స్ అమ్ముడవుతాయని వివరించింది. మొత్తం మొబైల్స్ అమ్మకాలు 20 కోట్లకు చేరతాయని తెలిపింది. విలువ పరంగా చూస్తే మొత్తం మొబైల్ ఫోన్ మార్కెట్ రూ. 75,000 కోట్లు ఉంటుందని, ఇందులో రూ. 52,000 కోట్లు స్మార్ట్ఫోన్లదే ఉంటుందని పేర్కొంది. జనవరి-సెప్టెంబర్ మధ్య కాలంలో 14.7 కోట్ల మొబైల్ ఫోన్స్ అమ్ముడు కాగా.. వీటిలో 3.9 కోట్లు స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఇక విలువపరంగా చూస్తే తొలి తొమ్మిది నెలల్లో మొత్తం మొబైల్ ఫోన్ మార్కెట్ రూ. 57,000 కోట్లు ఉంటే స్మార్ట్ఫోన్ల వాటా రూ. 39,000 కోట్లు. అగ్రస్థానంలో సామ్సంగ్.. ఐడీసీ గణాంకాల ప్రకారం క్యూ3లో మొబైల్స్ తయారీ దిగ్గజం సామ్సంగ్ 24 శాతం వాటాతో స్మార్ట్ఫోన్ల మార్కెట్లో అగ్రస్థానంలో నిల్చింది. మైక్రోమ్యాక్స్ (20శాతం), లావా..కార్బన్ (చెరి 8 శాతం), మోటరోలా (5శాతం) తర్వాత స్థానాలు దక్కించుకున్నాయి. మొత్తం మీద మూడో త్రైమాసికంలో దేశీయంగా హ్యాండ్సెట్స్ అమ్మకాలు 7.25 కోట్ల మేర నమోదయ్యాయి. ఇందులో ఫీచర్ ఫోన్లు 4.92 కోట్లు. వార్షిక ప్రాతిపదికన వీటి మ్మకాలు తొమ్మిది శాతం తగ్గాయి. ఓవరాల్ మార్కెట్లో చూస్తే సామ్సంగ్ 16 శాతం వాటాతో అగ్రస్థానంలోనూ, మైక్రోమ్యాక్స్ (14 శాతం), నోకియా (11 శాతం), లావా (10%), కార్బన్ (8%) వాటాలతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇక జీఎఫ్కే గణాంకాల ప్రకారం జనవరి-సెప్టెంబర్ మధ్య కాలంలో సామ్సంగ్ 34.2 శాతం మార్కెట్ వాటాతో మొదటి స్థానంలో, మైక్రోమ్యాక్స్ (17.9%), నోకియా (16.3%) తదుపరి స్థానాల్లో ఉన్నాయి. -
ఫీచర్ ఫోన్లదే హవా!
విదేశాలనుంచి దిగుమతి చేసుకునే స్మార్ట్ ఫోన్ల విక్రయాలు భారత్‌లో బాగా తగ్గుతున్నాయి. దేశీయంగా మొబైల్ కంపెనీలు తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లను విక్రయించడమే ఇందుకు కారణంగా కనపడుతోంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో త్వరిత గతిన విస్తరిస్తున్న స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఇండియాలో మాత్రం తగ్గుతోంది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో మూడంకెల వృద్ధిని సాధించిన ఇండియా, రెండో త్రైమాసికంలో మాత్రం 84 శాతం వృద్ధి నమోదు చేసింది. రెండో త్రైమాసికంలోకోటి 84 లక్షల ఫోన్లు భారత్‌కు దిగుమతి అయ్యాయని ఐడిసి అనే రీసర్చ్ సంస్ధ తెలిపింది. అదే జనవరి-మార్చి త్రైమాసికంలో మాత్రం స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 186 శాతం పెరిగి కోటి 76 లక్షలుగా నమోదయ్యాయి. ఇందులో కొరియాకు చెందిన శాంసంగ్ 29 శాతం వాటాతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అగ్రగామిగా నిలిచింది. 18 శాతంతో మైక్రోమాక్స్, ఎనిమిది శాతంతో కార్బన్, ఆరు శాతంతో లవా తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ఫీచర్ ఫోన్ల మార్కెట్ ఇప్పటికీ 71 శాతం ఉన్నందు వల్ల దేశంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వృద్ధికి అవకాశాలు హెచ్చుగా ఉన్నట్టు ఆ సంస్థ తన నివేదికలో తెలిపింది. ఇక బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ దిగుమతులుపై చైనా నుంచి వచ్చే హ్యాండ్సెట్స్ భారీగా దెబ్బేస్తున్నాయి. అదీకాక మోజిల్లా లాంటి కంపెనీలు దిగువ స్థాయి మార్కెట్ టార్గెట్‌గా హ్యాండ్సెట్లు విడుదల చేయనుండడం వల్ల రానున్న రోజుల్లో దేశీయ కంపెనీల స్మార్ట్ ఫోన్ విక్రయాలు పెరగనున్నాయి. మొత్తం మీద దేశీయ స్మార్ట్ ఫోన్ దెబ్బకు విదేశీ బ్రాండ్స్ కాస్త వెనక్కి తగ్గే అవకాశం ఉంది. ** -
స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు రయ్..
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల అమ్మకాల జోరు అంతకంతకూ పెరుగుతోంది. ఫీచర్ ఫోన్ల అమ్మకాలు మాత్రం నానాటికీ దిగజారుతున్నాయి. ఈ వివరాలను అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ గార్ట్నర్ వెల్లడించింది. గార్ట్నర్ నివేదిక ప్రకారం... ఈ ఏడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్‌కి స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు 47% వృద్ధితో 22.5 కోట్లకు పెరిగాయి. ఫీచర్ ఫోన్ల అమ్మకాలు ఏకంగా 21శాతం తగ్గి 21 కోట్లకు పడిపోయాయి. ఫీచర్ ఫోన్ల అమ్మకాలను స్మార్ట్ ఫోన్లు అధిగమించడం ఇదే మొదటిసారి మొత్తంమీద 43.5 కోట్ల మొబైల్ ఫోన్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే క్వార్టర్‌తో పోల్చితే అమ్మకాలు 3.6% పెరిగాయి. మొత్తం మొబైల్ సేల్స్‌లో స్మార్ట్ఫోన్ల వాటా 52 %. స్మార్ట్ఫోన్ల అమ్మకాల వృద్ధి అత్యధికంగా(74 శాతం) ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఉంది. లాటిన్ అమెరికా(56 శాతం), తూర్పు యూరప్(31 శాతం)లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. స్మార్ట్ఫోన్ల మార్కెట్లో అగ్రస్థానం శామ్సంగ్ కంపెనీదే. గత ఏప్రిల్-జూన్ క్వార్టర్‌కు 29.7 శాతంగా ఉన్న ఈ కంపెనీ మార్కెట్ వాటా ఈ ఏడాది ఇదే క్వార్టర్‌కి 31.7 శాతానికి పెరిగింది. ఈ కంపెనీ 7.13 కోట్ల స్మార్ట్ఫోన్లను విక్రయించింది. 5.1 శాతం మార్కెట్ వాటా(1.1 కోట్లు)తో ఎల్జీ, 4.7 శాతం మార్కెట్ వాటాతో(1.06 కోట్లు)తో లెనోవొ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మొత్తం మొబైల్ మార్కెట్లోనే శామ్‌సంగ్‌దే అగ్రస్థానం. 10.75 కోట్ల ఫోన్ విక్రయాలతో(24.7% మార్కెట్ వాటా) టాప్‌లో నిలిచింది. తర్వాతి స్థానాల్లో నోకియా(6.09 కోట్లు-14% మార్కెట్ వాటా), యాపిల్(7.3% మార్కెట్ వాటా), ఎల్జీ(3.9% మార్కెట్ వాటా)లు నిలిచాయి. ఇక స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ల విషయంలో ఆండ్రాయిడ్ దూసుకుపోతోంది. 79 శాతం మార్కెట్ వాటాతో ఆండ్రాయిడ్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో మైక్రోసాఫ్ట్, బ్లాక్బెర్రీలు నిలిచాయి.