రూ.1300కే రియల్ మీ డిజో స్టార్ ఫీచర్ ఫోన్స్ | Realme Dizo Star Launched Two Feature Phones in India | Sakshi
Sakshi News home page

రూ.1300కే రియల్ మీ డిజో స్టార్ ఫీచర్ ఫోన్స్

Published Thu, Jul 8 2021 7:23 PM | Last Updated on Thu, Jul 8 2021 7:29 PM

Realme Dizo Star Launched Two Feature Phones in India - Sakshi

ప్రముఖ చైనా తయారీ దిగ్గజం రియల్ మీ డిజో స్టార్ 300, డిజో స్టార్ 500 పేరుతో రెండు ఫీచర్ ఫోన్లను భారతదేశంలో లాంఛ్ చేసింది. ఈ రెండు మోడల్స్ మూడు రంగుల్లో ఒక్కొక్కటి ఒక్కో కాన్ఫిగరేషన్ లో లభిస్తున్నాయి. డిజో స్టార్ 300, డిజో స్టార్ 500 ఫీచర్ ఫోన్లు కీప్యాడ్, చిన్న డిస్ ప్లేలతో వస్తున్నాయి. డిజో అనేది రియల్ మీ సబ్ బ్రాండ్. ఇది మొదట టీడబ్ల్యూఎస్ వైర్ లెస్, నెక్ బ్యాండ్ తరహా ఇయర్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు రెండు ఫీచర్ ఫోన్లను లాంచ్ చేసింది. డిజో స్టార్ 300 ధర రూ.1,299, డిజో స్టార్ 500 ధర రూ.1,799కు లభిస్తున్నాయి. ఈ రెండు ఫోన్లు ఫ్లిప్ కార్ట్, ఆఫ్ లైన్ స్టోర్లను కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.

డిజో స్టార్ 300 ఫీచర్స్:

  • 1.77 అంగుళాల క్యూవిజీఏ(160ఎక్స్120 పిక్సెల్స్) డిస్ ప్లే
  • డ్యూయల్ మైక్రో సిమ్ స్లాట్  
  • ఎస్ సీ 6531ఈ ప్రాసెసర్ 
  • 32ఎంబీ ర్యామ్, 32ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్(64జీబీ మైక్రో ఎస్ డీ కార్డ్ సపోర్ట్) 
  • 0.08 ఎంపీ రిజల్యూషన్ సింగిల్ రియర్ కెమెరా 
  • 2,550 ఎమ్ఎహెచ్ బ్యాటరీ 

డిజో స్టార్ 500 ఫీచర్స్

  • 2.8 అంగుళాల క్యూవిజీఏ(320ఎక్స్240 పిక్సెల్స్) ఎల్సీడీ డిస్ ప్లే
  • డ్యూయల్ మైక్రో సిమ్ స్లాట్  
  • ఎస్ సీ 6531ఈ ప్రాసెసర్ 
  • 32ఎంబీ ర్యామ్, 32ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్(64జీబీ మైక్రో ఎస్ డీ కార్డ్ సపోర్ట్) 
  • 0.3 ఎంపీ రిజల్యూషన్ సింగిల్ రియర్ కెమెరా 
  • 1,900 ఎమ్ఎహెచ్ బ్యాటరీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement